అనంత్‌ అంబానీ గ్రాండ్‌ వెడ్డింగ్‌ : ఆలిమ్ హకీం స్టయిల్స్‌ మామూలుగా లేవుగా! | Aalim Hakim Hairdresser Makeover To Ambanis And Their Guests | Sakshi
Sakshi News home page

అనంత్‌ అంబానీ గ్రాండ్‌ వెడ్డింగ్‌ : ఆలిమ్ హకీం స్టయిల్స్‌ మామూలుగా లేవుగా!

Published Fri, Jul 12 2024 2:18 PM | Last Updated on Fri, Jul 12 2024 3:44 PM

Aalim Hakim Hairdresser Makeover To  Ambanis And Their Guests

అంబానీ ఇంట పెళ్లి వేడుకలో హెయిర్‌ స్టయిలిస్ట్‌ ఆలిమ్ సందడి

ఆలిమ్ హకీం మేజిక్‌ మేకోవర్‌తో మైమర్చిపోతున్న సెలబ్రిటీలు

హెయిర్ డ్రెస్సర్ అనగానే సెలబ్రిటీలకు  గుర్తొచ్చే పేరు ఆలిమ్ హకీమ్. ఆలీం చెయ్యేస్తే మాస్‌.. క్లాస్‌ ..అదిరే లుక్స్‌.. గుర్తు పట్టలేనంత అందంగా తీర్చిదిద్దేంత ప్రతిభ అతని సొంతం. అందుకే సెలబ్రిటీలు, స్టార్లు, గొప్ప గొప్ప బిజినెస్‌ మేన్‌లు సెలబ్రిటీ హెయిర్ స్టయిలిష్ట్‌ ఆలిమ్ హకీమ్. తాజాగా అంబానీ పెళ్లి ఇంట సందడిలో మేజిక్‌ చేస్తున్నాడు.

బాలీవుడ్ ,టాలీవుడ్ , క్రికెట్, బిజినెస్  ఇలా రంగం ఏదైనా టాప్‌ సెలబ్రిటీలు ఆలిమ్ హకీమ్   కస్టమర్లు. తన హెయిర్ స్టైల్‌తో స్టైలిష్ లుక్స్‌ ఇచ్చి అందర్నీ ఆకట్టుకుంటాడు. మహేష్ బాబు,రణవీర్‌ సింగ్‌, ధోని, కోహ్లీ లాంటి స్టార్ల లుక్‌ను అదుర్స్‌ అనిపించేలా తీర్చిదిద్దిన ఘన ఆయ సొంతం. తాజాగా  రిలయన్స్‌ కుచెందిన కాబోయే వరుడు అనంత్‌ అంబానీకి రూపును అందంగా తీర్చిదిద్ది మరోసారి వార్తల్లోకి వచ్చాడు.

రిలయన్స్‌ ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అనంత్‌-రాధిక మర్చంట్‌ వివాహ వేడుకల్లో ఆలిమ్ హకీమ్ హెయిర్‌ స్టయిలిస్ట్‌గా తన సత్తా చాటాడు. వరుడు అనంత్‌ అంబానీ, అలాగే ముఖేష్‌ అంబానీ పెద్దకుమారుడు ఆకాష్‌ లుక్‌ను అద్భుతంగా మార్చేశాడు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో ఆలిమ్ హకీమ్‌ అంబానీకి  ఫేడ్ కట్‌తో ఎలా సరికొత్త రూపాన్ని ఇచ్చాడో  షేర్‌ చేశాడు.

అంతేనా కాబోయే వరుడు అనంత్ అంబానీకి కూడా అలీమ్ అద్భుతమైన మేకోవర్ ఇచ్చాడు. అనంత్ పొడవాటి గిరజాల జుట్టును కత్తిరించకుండా మేకోవర్‌ చేయడం హైలైట్‌గా నిలిచింది. అలాగే పెళ్లికి వచ్చిన అతిథుల కేశాలను అందంగా తీర్చిదిద్దుతున్నాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement