అనంత్‌ - రాధిక పెళ్లి సందడి : మరోసారి మెస్మరైజ్‌ చేసిన రాధిక | Radhika Merchant as Marathi Mulgi in Grand Griha Shanti Puja | Sakshi
Sakshi News home page

అనంత్‌ - రాధిక పెళ్లి సందడి : మరోసారి మెస్మరైజ్‌ చేసిన రాధిక

Published Mon, Jul 8 2024 12:26 PM | Last Updated on Mon, Jul 8 2024 1:29 PM

 Radhika Merchant as Marathi Mulgi in Grand Griha Shanti Puja

 కుటుంబ సభ్యులు, సోదరి అంజలితో కలిసి  రాధిక  గృహశాంతి పూజ

రిలయన్స్‌ వారసుడు, ముఖేష్‌, నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ వేడుకల్లో భాగంగా గృహ శాంతి పూజలో అనంత్‌ కాబోయే భార్య రాధిక పాల్గొంది. ఈ సందర్భంగా ముగ్ధ మనోహర రూపంలో మరోసారి ఆకట్టుకుంది. మరాఠీ ముల్గిగా అద్భుతంగా  కనిపించింది రాధిక.

జూలై 12, 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో  అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ సందర్బంగా ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జోరందుకున్నాయి.  ఇటీవల అంబానీ ఫ్యామిలీ మామేరా వేడుకను ఘనంగా నిర్వహించగా,  ఇపుడు రాధిక కుటుంబం గృహ శాంతి పూజను నిర్వహించింది.  ఈ పూజలో రాధిక తన తల్లి, సోదరి అంజలి మర్చంట్‌తో కలిసి కార్యక్రమాలు నిర్వహించింది.  ఈ సందర్బంగా రాధిక  ఫ్యాషన్‌ దుస్తులు, ఆభరణాలు విశేషంగా నిలిచాయి.

 

జరీ వర్క్‌తో తొమ్మిది గజాల కాంచీపురం సంప్రదాయపట్టు వైట్‌ శారీని దక్షిణ భారత శైలిలో చుట్టుకుంది. ఎరుపు రంగు బ్లౌజ్‌తో పెళ్లి కూతురిలా అందంగా కనిపించింది. దీనికి తగ్గట్టుగా, డైమండ్ నెక్లెస్, సరిపోలే జత చెవిపోగులతో కళకళలాడింది.

కాగా ఇప్పటికే రెండు సార్లు ప్రీవెడ్డింగ్‌  వేడుకలను అంగరంగ  వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.  కనీవినీ ఎరుగని రీతిలో అనంత్‌-రాధిక  వివాహ వేడుక మూడు రోజుల పాటు జరగబోతోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement