santhi
-
అనంత్ - రాధిక పెళ్లి సందడి : మరోసారి మెస్మరైజ్ చేసిన రాధిక
రిలయన్స్ వారసుడు, ముఖేష్, నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ వేడుకల్లో భాగంగా గృహ శాంతి పూజలో అనంత్ కాబోయే భార్య రాధిక పాల్గొంది. ఈ సందర్భంగా ముగ్ధ మనోహర రూపంలో మరోసారి ఆకట్టుకుంది. మరాఠీ ముల్గిగా అద్భుతంగా కనిపించింది రాధిక.జూలై 12, 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ సందర్బంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు జోరందుకున్నాయి. ఇటీవల అంబానీ ఫ్యామిలీ మామేరా వేడుకను ఘనంగా నిర్వహించగా, ఇపుడు రాధిక కుటుంబం గృహ శాంతి పూజను నిర్వహించింది. ఈ పూజలో రాధిక తన తల్లి, సోదరి అంజలి మర్చంట్‌తో కలిసి కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్బంగా రాధిక ఫ్యాషన్ దుస్తులు, ఆభరణాలు విశేషంగా నిలిచాయి. View this post on Instagram A post shared by Nikitaa🌻 (@nikitaawaghela_) జరీ వర్క్‌తో తొమ్మిది గజాల కాంచీపురం సంప్రదాయపట్టు వైట్ శారీని దక్షిణ భారత శైలిలో చుట్టుకుంది. ఎరుపు రంగు బ్లౌజ్‌తో పెళ్లి కూతురిలా అందంగా కనిపించింది. దీనికి తగ్గట్టుగా, డైమండ్ నెక్లెస్, సరిపోలే జత చెవిపోగులతో కళకళలాడింది.కాగా ఇప్పటికే రెండు సార్లు ప్రీవెడ్డింగ్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో అనంత్-రాధిక వివాహ వేడుక మూడు రోజుల పాటు జరగబోతోంది. -
నిన్న కళాశాల.. నేడు చెరసాల
సాక్షి ప్రతినిధి, చెన్నై: నిన్నటి వరకు కళాశాలలో ఓ ప్రొఫెసర్‌గా విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ప్రస్తుతం ప్రియురాలి అనుమానాస్పద కేసులో అరెస్టయి జైలు పక్షిగా మారిపోయాడు. తెలుగు అధ్యాపకురాలు హరిశాంతి అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి డీజీ వైష్ణవీ కళాశాల ప్రాఫెసర్ నటరాజ్‌ను పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తిరువళ్లూరు జిల్లా కారంబాక్కం తాలూకా ఎల్ల యమ్మన్ ఆలయం వీధికి చెందిన హరిశాంతి (32) ఉన్నత విద్యావంతురాలు. మద్రాసు యూనివర్సిటీ తెలుగు విభాగంలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు పొందిన హరిశాంతి చెన్నై పెరంబూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగుటీచర్గా పనిచేసేవారు. మద్రాసు యూనివర్సిటీలో తోటి విద్యార్థి నటరాజ్‌తో ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆ తరువాత ప్రేమగా మారినట్లు సమాచారం. పీహెచ్డీ పట్టా అందుకున్న తరువాత హరిశాంతి, నటరాజ్ ఇద్దరూ చెన్నై అన్నానగర్ ఆర్చ్ సమీపం, అరుబాక్కంలోని డీజీ వైష్ణవీ కళాశాలలో తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరారు. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. అయితే 2016లో నటరాజ్ మరో యువతిని పెళ్లిచేసుకోగా ఇద్దరు బిడ్డల తండ్రి కూడా అయ్యాడు. ఈ బాధతోనే మరో కారణం చేతనో హరిశాంతి డీజీ వైష్ణవీ కళాశాల ఉద్యోగాన్ని మానివేసి పెరంబూరులోని ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకురాలిగా చేరింది. అయినా తరచూ కళాశాలకు రాకపోకలు సాగిస్తుండేది. యథాప్రకారం ఈ నెల 17న సాయంత్రం డీజీ వైష్ణవీ కళాశాలకు వచ్చిన హరిశాంతి తెలుగుశాఖ గదిలో ఉరివేసుకుని వేలాతుండగా మరుసటి రోజు ఉదయం కళాశాల సిబ్బంది గుర్తించారు. ఆమె చేతి మణికట్టు పదునైన వస్తువుతో కోసినట్లుగా కూడా ఉంది. ఆరుంబాక్కం పోలీసులు ఆమె మృతదేహాన్ని కీల్పాక్ పోస్టుమార్టానికి పంపారు. ప్రొఫెసర్ నటరాజ్‌తో స్నేహం, ప్రేమ విఫలం, ఆత్మహత్యకు దారితీసిన కారణాలను హరిశాంతి తన సెల్‌ఫోన్ వాట్సాప్‌లో నమోదు చేసినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. హరిశాంతిని ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగంపై నటరాజ్‌ను గురువారం రాత్రి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. -
తరగతిలో ఫ్యాన్‌కు టీచర్ మృతదేహం
సాక్షి, చెన్నై: ప్రైవేటు కళాశాల తరగతి గదిలో తెలుగు టీచర్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం బుధవారం కలకలం రేపింది. ఆమె చేతి మణికట్టు భాగంలో కత్తి గాటు ఉండడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కారంబాక్కం తాలుకా ఎల్లయమ్మన్ ఆలయం వీధికి చెందిన హరి శాంతి(32) మద్రాసు వర్సిటీ తెలుగు విభాగంలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. పేద తెలుగు కుటుంబం నుంచి చెన్నైకు వచ్చిన ఆమె స్థానికంగా ఖాళీ సమయాల్లో చిన్నాచితక పనులు కూడా చేసుకుంటూ చదువును కొనసాగించారు. అలాగే పూందమల్లి హైరోడ్డులోని డీజీ వైష్ణవ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కొంత కాలం పని చేశారు. ప్రస్తుతం పెరంబూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం డీజీ వైష్ణవ కళాశాల తెలుగు విభాగం తరగతి గదిలో ఆమె మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడం చర్చనీయాంశం అయింది. అనుమానాస్పదం.. డీజీ వైష్ణవ కళాశాల నుంచి ఐదేళ్ల క్రితం ఆమె బయటకు వచ్చేశారు. అయినా తరచూ ఆ కళాశాలకు వెళ్తూ రావడంతో సెక్యూరిటీ సిబ్బందికి సుపరిచితురాలిగా మారారు. మంగళవారం కళాశాలకు వెళ్లిన హరిశాంతి తిరిగి బయటకు రాలేదు. బుధవారం ఉదయం కళాశాల మొదటి అంతస్తులోని తెలుగు విభాగం తరగతి గదిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించడంతో పారిశుద్ధ్య సిబ్బంది సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు. అరుంబాక్కం పోలీసులకు తెలపడంతో పులియాంతోపు డిప్యూటీ కమిషనర్ రాజేష్ ఖన్నా, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు, అరుంబాక్కం ఇన్స్పెక్టర్ శంకర్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. మృతదేహాన్ని కిందకు దించి పరిశీలించగా ఆమె ఎడమ చేతి మణికట్టుకు కత్తి, బ్లేడుతో కోసినట్టుగా గాటు కనిపించింది. దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్థానికంగా ఉన్న తెలుగు వారు విచారం వ్యక్తం చేశారు. మద్రాసు వర్సిటీలో చదువుకుంటున్న సమయంలో, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, టీచర్‌గా చేస్తున్న కాలంలో అనేక వేదికలపై హరి శాంతి కనిపించే వారు కావడంతో ఎక్కువ మంది తెలుగు వారికి ఆమె సుపరిచితురాలు. అదే సమయంలో ఆత్మహత్య చేసుకునేంత పిరికిది హరి శాంతి కాదని పలువురు సన్నిహితులు పేర్కొంటున్నారు. నటరాజ్‌తో పరిచయంపై ఆరా..... డీజీ వైష్ణవ కళాశాల నుంచి బయటకు వచ్చి టీచర్‌గా పనిచేస్తున్నా, తాను గతంలో పనిచేసిన కళాశాలకు పదే పదే హరిశాంతి వచ్చి వెళ్తుండడం ఆలోచించ దగ్గ విషయం. ఇక్కడ పనిచేస్తున్న నటరాజ్ అనే ప్రొఫెసర్‌తో ఆమెకు ఉన్న పరిచయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మంగళవారం కూడా ఆమె నటరాజ్‌ను కలవడానికే వచ్చినా, తిరిగి వెళ్లక పోవడం అనుమానాలకు దారి తీస్తున్నాయి. లోనికి వచ్చిన వ్యక్తి బయటకు వెళ్లారా..? లేదా అని తెలుసుకోని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుండడంతో పోలీసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తరగతి గది సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాకం ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె మరణ సమాచారాన్ని అందుకున్న కుటుంబీకులు చెన్నైకు చేరుకుని కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. -
కార్మిక సమస్యలు మంత్రికి పట్టవా!
► అసోసియేషన్ దీక్షకు సంఘీభావం తెలిపిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ►డీఎంఎఫ్‌ను రద్దు చేయాలంటూ బైక్ ర్యాలీ ►ఐదో రోజుకు చేరుకున్న దీక్షలు టెక్కలి : వెనుక బడిన జిల్లాకు తగిన గుర్తింపు తీసుకువచ్చిన గ్రానైట్ పరిశ్రమలపై ప్రభుత్వం అదనపు చార్జీలు విధించి ఆయా పరిశ్రమలు పూర్తిగా నిర్వీర్యం చేసి కార్మికులంతా రోడ్డున పడుతుంటే కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు స్పందించకపోవడం శోచనీయమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. గ్రానైట్ పరిశ్రమలు పూర్తిగా నష్టపోయే విధంగా ప్రభుత్వం అమలు చేసిన జీవో నంబర్ 100, 36లను రద్దు చేసి అదనపు చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ టెక్కలి మైన్స కార్యాలయం వద్ద గ్రానైట్ అసోషియేషన్ ప్రతినిధులు, కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నారుు. దీక్షలకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, నియోజకవర్గ అదనపు సమన్వయకర్త పేరాడ తిలక్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ జిల్లాలో ఎంతో మంది వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్ పరిశ్రమలపై అదనపు చార్జీల విధించడం సమంజసం కాదన్నారు. ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలను ఆదుకోకుండా వాటిపై అధిక చార్జీలు విధించి పరిశ్రమలు మూతపడే విధంగా కుట్రలు చేయడం దారుణమన్నారు. కొద్ది రోజులుగా గ్రానైట్ పరిశ్రమల యజమానులు సీఎంతో సహా సంబంధిత మంత్రుల వద్దకు కాళ్లరిగేలా తిరుగుతుంటే జిల్లాకు చెందిన కార్మిక మంత్రి కనీసం దృష్టి సారించకపోవడం అన్యాయమన్నారు. గ్రానైట్ యజమానులు, కార్మికులు చేస్తున్న ఈ ఉద్యమాలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, వీరి సమస్యలను తమ అధినేత జగన్ దృష్టికి తీసుకు వెళ్తామని రెడ్డి శాంతి భరోసా ఇచ్చారు. తిలక్ మాట్లాడుతూ పరిశ్రమలు మూతపడే విధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీకి చెందిన గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధి చింతాడ గణపతి మాట్లాడుతూ పరిశ్రమలను బతికించుకోవాలంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలన్నారు. అంతకు ముందు గ్రానైట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఉత్తరాంధ్ర అధ్యక్షుడు కోత మురళీధర్, ప్రతినిధులు శ్రీనివాస్, రామకృష్ణ, సి.హెచ్.రావ్, వెంకటాచలపతి, పార్థు తదితరుల ఆధ్వర్యంలో కార్మికులంతా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. డీఎంఎఫ్ చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని నినదించారు. -
‘శాంతి మానవత ఉద్యమం’ పోస్టర్ ఆవిష్కరణ
విజయవాడ(గాంధీనగర్) : జమాఅతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘శాంతి మానవత ఉద్యమం’ వాల్‌పోస్టర్ శుక్రవారం ఆవిష్కరించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శాంతి, మానవతా ఉద్యమాన్ని ఆగస్టు 21న ప్రారంభించినట్లు చెప్పారు. సెప్టెంబర్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ఉద్యమంలో భాగంగా వివిధ మత, సామాజిక వర్గాల సభ్యులతో గ్రామ స్థాయి వరకు ‘సద్బావనా’ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో శాంతి మానవతా ఉద్యమం కన్వీనర్ ముహమ్మద్ అక్బర్ బాషా, జమాఅతె ఇస్లామీ హింద్ బాధ్యులు అబ్దుల్ ఖదీర్, ముజాహిద్ ఉమ్రి, మహెబూబ్ జానీ, కె ఎం ఖాన్, పింకిసింగ్, పి రాజశేఖర్, జయరాజ్, ఫారూఖ్ షుబ్లీ, మునీర్ అహ్మద్, సయ్యద్ రషీద్, ముహ్మద్ అలి పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని రెడ్డికాలనీలో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సూరంపుడి శాంతి(28) పదే ళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన శాంతి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..!
పాతపట్నం : పాతపట్నం మేజర్ పంచాయతీకి చెందిన వికలాంగులు మజ్జి చంద్రరావు, డోల శాంతిలు పెద్దలు సాక్షిగా శుక్రవారం ఒక్కటయ్యారు. కోటగుడి కాలనీకి చెందిన మజ్జి చంద్రరావు పుట్టుక తోనే అంధుడు. శివశంకర్ కాలనీ ఐదోలైన్లో ఉంటున్న డోల శాంతి పొట్టిమనిషి. వీరద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో గ్రామానికి చెందిన పెద్దలు కొంచాడ వీరభద్రరావు, శాసనపూరి మహేశ్వరావు, సవిరిగాన ప్రదీప్, జె.సోమేశ్వరావు, తిడ్డిమి శ్రీనువాసరావు, మిశ్రో తదితరులు స్థానిక వేంకటేశ్వర ఆలయంలో వీరి పెళ్లి జరిపారు. -
తల్లిని హింసిస్తే గుప్త నిధులు!
అనంతపురం: తల్లిని హింసిస్తే గుప్త నిధులు దొరుకుతాయని జ్యోతిష్యుడు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మారు రామాంజనమ్మ కుటుంబ సభ్యులు. దీంతో రామాంజనమ్మను చిత్ర హింసలకు గురి చేశారు. దాంతో ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. రామాంజనమ్మపై పరిస్థితిని చూసి ఆస్పత్రి వైద్యులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం చెర్లోపల్లిలో భార్యభర్తలు రామాంజనమ్మ, చెండ్రారాయుడు నివసిస్తున్నారు. వారికి శాంతి అనే కుమార్తె ఉంది. అయితే ఇటీవల చెండ్రారాయుడు, ఆమె కుమార్తె శాంతి జ్యోతిష్యుడ్ని సంప్రదించగా... తల్లిని హింసిస్తే గుప్త నిధులు దొరుకుతాయని చెప్పాడు. ఈ నేపథ్యంలో తండ్రీకూతురు ఇంటికి చేరుకుని రామాంజనమ్మను చిత్ర హింసలకు గురి చేశారు. దాంతో ఆమె పరిస్థితి విషమించింది. స్థానికులు ఆ విషయాన్ని గమనించి... ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తండ్రికూతురును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
టీడీపీ నాయకుల వీరంగం
నగరిలో ఉద్రిక్తత మున్సిపల్ కార్యాలయంలో సీసీ కెమెరాల ధ్వంసం చైర్‌పర్సన్‌కు గాయూలు, వైఎస్సార్సీపీ ధర్నా డీ ఎస్పీ హామీతో ఆందోళన విరమణ నగరి: నగరి పట్టణంలో సోమవారం టీడీపీ నాయకులు వీరంగం సృష్టిం చారు. మున్సిపల్ కార్యాలయంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకున్న టీడీపీ వర్గీయులు తీవ్రస్థాయిలో రెచ్చిపోయూరు. కార్యాలయంలో అధికారులు, సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. అక్కడే ఉన్న మహిళా కౌన్సిలర్లు పుష్ప, గౌరీ చైర్‌పర్సన్‌కు సమాచారం అందించారు. దాంతో మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి, ఆమె భర్త మాజీ చైర్మన్ కేజే కుమార్‌తో కలిసి మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కెమెరాల ధ్వంసం విషయమై విచారిస్తుండగా ఆమెతోనూ ఘర్షణకుదిగి గాయపరిచారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్దే ఇరుపార్టీల వారు అధిక సంఖ్యలో గుమికూడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మా రింది. పలువురు వ్యాపారులు దుకాణాలు మూసేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న నగరి, పుత్తూరు సీఐలు నాగరాజ్, సాయినాథ్‌లు అధిక సంఖ్యలో పోలీసుల బలగాలను రప్పించారు. ఇరువర్గాలవారిని దూరంగా పంపి పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. అరుుతే తమకు పోలీసులపై నమ్మకం లేదని, న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు చైర్‌పర్సన్‌తో కలిసి బైఠాయించి ధర్నా చేశారు. కన్నీళ్లు పెట్టుకున్న చైర్పర్సన్ చైర్పర్సన్ అయిన తనకే మున్సిపల్ కార్యాలయంలో రక్షణ లేకుండా పోయిందని శాంతి కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి తోడ్పడాల్సిన తెలుగుదేశం పార్టీవారు ఇలా ప్రవర్తించడం అత్యంత బాధాకరమన్నారు. రాజ్యాంగంలో మహిళలకు పదవులు కల్పించారు కానీ వారికి రక్షణ కల్పించే విషయంలో చట్టాలు లేవన్నారు. తనతో పాటు మహి ళా కౌన్సిలర్లు పుష్ప, గౌరీపై కూడా దాడికి పాల్పడిన వారిలో టీడీపీకి చెం దిన అమృతరాజ్, మైకెల్రాజ్లే ముఖ్యులన్నారు. వారు పథకం ప్రకారమే దాడికి పాల్పడ్డారని, వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. దాడికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నాగభూషణరావు హామీ ఇచ్చిన అనంతరం చైర్పర్సన్ శాంతిని వైద్యం కోసం నగరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఏఎస్పీ శేఖర్, డీఎస్పీ నాగభూషణ్రావులకు ఫిర్యాదు చేశారు -
స్నేహితుడితో కలిసి భర్త దారుణ హత్య..
కిరాతకురాలు నాగోలు: మద్యంలో నిద్రమాత్రలు కలిపింది..స్నేహితుడితో కలిసి భర్తను దారుణంగా హత్యచేసింది. తల, మొండెం వేరు చేసింది. తల, కాళ్లు, చేతులు ఒక సంచిలో.. మొండెంను మరో మూటలో కట్టి మూసినదిలో పడేసిందో కిరాతకురాలు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ హత్య వివరాలను మంగళవారం ఎల్బీనగర్ ఎస్ఐ విజయ్ విలేకరులకు తెలిపారు. నల్లగొండ జిల్లా దేవరకొండ గాజీనగర్కు చెందిన నైనావత్ చంద్రం (42), శాంతి (30) భార్యాభర్తలు. వీరికి నిఖిల్ (13), అంకిత్ (6) సంతానం. చంద్రం దేవరకొండ సమీపం కొండమల్లెలో కుటుంబాన్ని ఉంచి జిల్లేలగూడలో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. కాగా, నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం సరంపేటకు చెందిన రమావత్ గోపాల్ (30) వికలాంగుడు. బీటెక్ మధ్యలో ఆపేశాడు. ఈ ఏడాది మార్చిలో ఆటో కొని డ్రైవర్‌గా చంద్రంను నియమించుకున్నాడు. గోపాల్ తరచూ చంద్రం ఇంటికి వచ్చి వెళ్లే క్రమంలో శాంతితో గోపాల్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి చంద్రం భార్యను నిలదీశాడు. భర్తతో గొడవపడిన శాంతి చిన్నకుమారుడు అంకిత్‌ను తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. తర్వాత నాగోలు కృషినగర్ కు మకాం మార్చి గోపాల్‌తో కలిసి ఉంటోంది. ఇటీవల చిన్న కుమారుడు అంకిత్‌కు ఫిట్స్ రావడంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. వైద్యులు మెదడు సంబంధిత వ్యాధి సోకిందని బతకడం కష్టమని చెప్పారు. అంకిత్ చనిపోతే తనమీదికి వస్తుందని గ్రహించిన ఆమె భర్తకు ఫోన్ చేసి కొడుకు పరిస్థితిని వివరించింది. తప్పు చేశానని మన్నించమని బతిమిలాడింది. దీంతో ఆమెతో కలిసి ఉండేందుకు చంద్రం అంగీకరించాడు. జిల్లెలగూడ నుంచి కృషినగర్కు వచ్చాడు. ఇంట్లో గోపాల్, శాంతి కలిసి ఉంటున్న విషయం తెలుసుకుని శాంతిని నిలదీశాడు. గోపాల్ పేరుతో ఉన్న ఆటోను తన పేరుకు మార్పు చేయాలని భార్యను వేధించాడు. దీంతో భర్తను తుదముట్టించాలని గోపాల్‌తో కలిసి పన్నాగం పన్నింది. పథకం ప్రకారం ఆగస్టు 7న గోపాల్ కొత్తపేటలో రెండు కత్తులను కొన్నాడు. రాత్రికి ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశారు. పిల్లలను భవనంపై పడుకోబెట్టారు. చంద్రంకు మద్యం, చికెన్ ఇతర ఏర్పాట్లు చేశారు. మద్యంలో నిద్రమత్తు మాత్రలు కలిపి ఇచ్చారు. దీంతో నిద్రమత్తులో ఉన్న చంద్రంపై కత్తులతో దాడిచేశారు. తలను నరికి చేతులు, కాళ్లను వేరు చేశారు. తల, కాళ్లు, చేతులను ఒక మూట గట్టారు. మొండెం మరో సంచిలో, దుస్తులు, ఇతర సామగ్రిని మరో మూటలో కట్టి రాత్రి 2 గంటల సమయంలో నాగోలు బ్రిడ్జి సమీపంలో మూసీలో పడేశారు. తిరిగి వచ్చి రక్తం మరకలను శుభ్రం చేశారు. అక్కడ ఇళ్లు ఖాళీ చేసి కృషినగర్లోనే మరో ఇంట్లోకి మకాం మార్చారు. ఇదిలా ఉండగా సమగ్ర సర్వే నిమిత్తం ఆగస్టు 19న శాంతి సొంతూరికి వెళ్లింది. అన్నరాలేదేమని చంద్రం సోదరుడు శ్రీనివాస్ అడిగాడు. మా కంటే రెండు రోజులు ముందే ఊరికి బయలుదేరాడని అని చెప్పింది. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. అన్న ఆచూకీ తెలియకపోవడంతో శ్రీనివాస్ ఆరా తీశాడు. గోపాల్, శాంతిల మధ్య వివాహేతర సంబంధంతో జరిగిన గొడవ విషయాన్ని తెలుసుకున్నాడు. ఈనెల 18న గోపాల్, వదిన శాంతిలపై దేవరకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వారిని అదుపులోనికి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. సోమవారం దేవరకొండ పోలీసులు గోపాల్‌ను తీసుకుని వెళ్లి హత్య జరిగిన స్థలం, మృతదేహాన్ని పడేసిన స్థలాన్ని పరిశీలించారు. కత్తులను స్వాధీనం చేసుకున్నారు. దేవరకొండ పోలీసుల అదుపులో నిందితులు గోపాల్, శాంతి ఉన్నట్టు ఎల్బీనగర్ ఎస్ఐ విజయ్ తెలిపారు. మృతదేహాన్ని వెతికిస్తామని ఆయన పేర్కొన్నారు.