అనంత్‌ అంబానీ - రాధిక హల్దీ : హాట్‌ టాపిక్‌గా సల్మాన్‌ ఖాన్‌ వాచ్‌ | Salman Khan Flaunts An Aquanaut Luce Rainbow Watch At Anant Ambani's Haldi | Sakshi
Sakshi News home page

అనంత్‌ అంబానీ - రాధిక హల్దీ : హాట్‌ టాపిక్‌గా సల్మాన్‌ ఖాన్‌ వాచ్‌

Published Wed, Jul 10 2024 10:33 AM | Last Updated on Wed, Jul 10 2024 12:27 PM

Salman Khan Flaunts An Aquanaut Luce Rainbow Watch At Anant Ambani's Haldi

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ  చిన్నకుమారుడు అనంత్‌  అంబానీ  ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో  సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు సందడి చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో స్టయిల్‌తో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. తాజాగా అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌  ప్ రీవెడ్డింగ్‌ బాష్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ధరించిన వాచ్‌ హాట్‌ టాపిక్‌గానిలిచింది.

అనంత్ అంబానీకి ఎంగేజ్‌మెంట్‌మొదలు, తొలి, రెండో క్రూయిజ్ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌, ఇలా ప్రతీవేడుకలోనూ సల్మాన్‌ హాజరు తప్పకుండా ఉండాల్సిందే. ఇటీవల అనంత్‌-రాధిక సంగీత్‌లో కూడా  అనంత్‌తో కలిసి స్టెప్పులేశారు. 

ఇక హల్దీ  వేడుకలో సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్‌తో పాటు ఆల్-బ్లాక్ లుక్‌తో అలరించాడు. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన  డైమండ్స్​ పొదిగిన వాచ్ అందర్నీ ఆకర్షించింది. అయితే సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచెస్‌ ధరించడం కొత్తేం కాదు. కోట్ల విలువ  చేసే లగ్జరీ వాచెస్‌ కలెక్షన్‌ విలవ కోట్ల రూపాయకుపైమాటే. తాజాగా  లగ్జరీ బ్రాండ్‌ పాటెక్ ఫిలిప్ రెయిన్​ బో (Patek Philippe Rainbow Watch) కి చెందిన వాచ్  ధరించాడు. ఆక్వానాట్ లూస్ రెయిన్‌బో మినిట్ రిపీటర్ హాట్ జ్యూయిలరీ వాచ్  సుమారు 130 వజ్రాలతో పొదిగి ఉందట. దీని ధర దాదాపు రూ. 23.54 కోట్లు ఉంటుందని అంచనా.

కాగాజూలై 12న అనంత్‌, రాధిక వివాహ వేడుక మూడు రోజుల పాటు ఘనంగా జరగ బోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement