డ్రైఫ్రూట్స్ వెడ్డింగ్ కార్డు.. బంగారపు పట్టు చీర
డ్రైఫ్రూట్స్ వెడ్డింగ్ కార్డు.. బంగారపు పట్టు చీర
Published Thu, Nov 24 2016 12:06 PM | Last Updated on Sun, Sep 2 2018 4:41 PM
హైదరాబాద్: మైనింగ్ దిగ్గజం గాలి జనార్థన్ రెడ్డి కుమార్తె వివాహం మరువక ముందే అంత స్థాయిలో కాకపోయినా కాస్తా అటు..ఇటు హైదరాబాద్ లో గురువారం మరో వివాహం ఘనంగా జరగనుంది. ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రేణుక శక్తి సెక్యురిటీ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ యజమాని గుర్రం శంకర్ కుమారుడు గుర్రం గణేష్ వివాహం బోయినపల్లిలోని అశోక గార్డెన్స్ లో వైభవంగా నిర్వహించనున్నారు. వీవీఐపీల కోసం ప్రత్యేకంగా 4 వేల వెడ్డింగ్ కార్డులను ఢిల్లీలో ముద్రించారు.
అచ్చం గాలి వెడ్డింగ్ బాక్స్ టైప్ లో ఉండే కార్డు తెరవగానే పెళ్లి వివరాలు, ఆ తర్వాత రిసెప్షన్ వివరాలు పొందుపరిచారు. చివరలో నాలుగు రకాల డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లు దర్శనమిస్తాయి. వధూవరులు ధరించే కోటు, చీర ఢిల్లీలోని కాలీ బజార్ లో ప్రముఖ డిజైనర్లు తీర్చిదిద్దారు. పెళ్లి కుమార్తె చీరకు బంగారు కోటింగ్ తో నగసీలు దిద్దుతున్నారు. రాజకీయ సినీ తారలతో పాటు దాదాపు 15 నుంచి 20 వేల మంది హాజరయ్యే ఈ వేడుకకు ఆ స్థాయిలో వంటకాలను సిద్ధం చేస్తున్నారు.
Advertisement
Advertisement