డ్రీమ్‌ వెడ్డింగ్‌: భారతీయ దుస్తులతో అమెరికాలో ఘనంగా, ఫోటోలు వైరల్‌ | Indian Californian Bride Wedding In USA Flew India To Get Wedding Dress | Sakshi
Sakshi News home page

డ్రీమ్‌ వెడ్డింగ్‌: భారతీయ దుస్తులతో అమెరికాలో ఘనంగా, ఫోటోలు వైరల్‌

Published Wed, Sep 18 2024 1:39 PM | Last Updated on Wed, Sep 18 2024 5:13 PM

Indian Californian Bride Wedding In USA Flew India To Get Wedding Dress

నేటి తరానికి పెళ్లంటే ఆకాశమంత  పందిరి,  భూదేవి అంత పీట. అత్యంత విలాసవంతంగా తమ పెళ్లి జరగాలి అనేది ఒక డ్రీమ్‌. ఎంత ఖర్చైనా సరే మెహిందీ, సంగీత్‌లు, బారాత్‌లు, ఖరీదైన డిజైనర్‌ దుస్తులు, డైమండ్‌ నగలు, వంద రకాల వంటలు ఉండాల్సిందే. వరుడు, మురారి సినిమాల్లో లాగా అంగరంగ వైభంగా తమ పెళ్లి జరగాలని ముందునుంచే కలలు కంటారు.  ఈ క్రమంలో భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా వధువు సినిమా తరహాలోనే పెళ్లి చేసుకుంది. ఈ జీవితకాల వేడుక చాలా ‍స్పెషల్‌గా ఉండాలని ప్లాన్‌ చేసుకుని మరీ ప్రియుడిని పెళ్లాడింది. నెట్టింట సందడి చేస్తున్న ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన నితాషా పటేల్  అచ్చం బాలీవుడ్‌ పెళ్లి సందడిలా తన పెళ్లిని జరిపించుకుంది. అంతేకాదు తన గ్రాండ్‌ వెడ్డింగ్‌ కోసం  డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్‌ చేసిన ప్రత్యేకమైన దుస్తులకోసం ఇండియాకు వచ్చింది.  

నితాషా పటేల్, కృష్ణ గగ్లానీ  ఇద్దరు ఆన్‌లైన్  డేటింగ్‌ యాప్‌ ద్వారా  కలుసుకున్నారు. ప్రొఫైల్‌తో నితాషా కాలిఫోర్నియాకు బదులుగా ఆమె తన బేస్ లొకేషన్ లండన్‌ అని రాయడంతో తొలుత ఇద్దరి మధ్య  కొంత అపార్థాలకు దారి తీసింది.  కానీ అన్నీ సర్దుబాటు చేసుకుని  నాలుగు నెలలపాటు  కాల్స్‌, మెసేజెస్‌ ద్వారా మాట్లాడుకున్నారు. ఆ తరువాత లండన్‌లో ఇద్దరూ కలుసుకున్నారు.  అనంతరం కాలిఫోర్నియాకు వచ్చిన కృష్ణ రెండు నెలలు అక్కడే  ఉన్నాడు. ఇలా ఒక ఏడాది డేటింగ్ తర్వాత, కృష్ణ  నితాషాకు ప్రపోజ్ చేశాడు. చివరికి పెళ్లి ముహూర్తం కూడా  పెట్టేసుకున్నారు.

నితాషా పటేల్, కృష్ణ గగ్లానీ తన పెళ్లికి హల్దీ, మెహందీ వేడుకలు ఘనంగా ఉండాలని భావించారు. ముఖ్యంగా నితాషా  తన వివాహ ఈవెంట్‌లకు బాలీవుడ్ టచ్ ఉండాలని కోరుకుంది. నితాషా, తన తల్లితో కలిసి,  ఇండియాలోని ముంబైలో ఉనన ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా స్టోర్‌ని సందర్శించి, తన డ్రెసెస్‌ సెలెక్ట్‌ చేసుకుంది. 

 

పెళ్లిలో ఐవరీ హ్యూడ్ త్రీ పీస్ పలాజో సెట్‌లో,  డైమండ్‌ హె లేయర్డ్ డైమండ్ నెక్లెస్, చెవిపోగులు , బ్రాస్‌లెట్‌తో సింపుల్ బ్యూటీగా మెరిసింది. మరోవైపు, వరుడు కృష్ణ తన వధువును క్రీమ్-హ్యూడ్ కుర్తా సెట్‌,రోలెక్స్ వాచ్, కార్టియర్ రింగ్‌తో  కొత్త పెళ్లికళతో ఆకట్టుకున్నాడు.

నితాషా, కృష్ణ  గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్
గ్రాండ్‌ వెడ్డింగ్‌ తరువాత  రిసెప్షన్‌ను కూడా అంతే గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఐవరీ కలర్‌ నెక్‌లైన్‌ సీక్విన్ లెహంగా, షీర్ సీక్విన్ దుపట్టాతోపాటు  డైమండ్  డైమండ్ నెక్లెస్‌తో హైలైట్‌గా నిలిచింది వధువు నితాషా. ఇక వరుడు కృష్ణ తెల్లటి చొక్కా, సిల్క్ బౌటీ,మోనోగ్రామ్ కఫ్‌లింక్‌ల, బ్లాక్‌ టక్సేడోలో అందంగా కనిపించాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement