![Anushka Ranjan Aditya Seal exchange garlands in Grand Wedding - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/22/Anushka.jpg.webp?itok=ChuQh8Nx)
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన బాలీవుడ్ లవ్‌బర్డ్స్ ఆదిత్య సీల్, అనుష్క రంజన్ ఎట్టకేలకు మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. గ్రాండ్‌గా మెహందీ, సంగీత్ ఇలా స్టార్-స్టడెడ్ ఈవెంట్స్‌లో వాణి కపూర్, అతియా శెట్టి, రవీనా టాండన్, భూమి పెడ్నేకర్, అలియా భట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే అలియా తన డ్యాన్స్‌లతో అదరగొట్టింది
ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఎరుపు లెహంగాలో అనుష్క, ఆదిత్య మెటాలిక్ బ్లాక్ షేర్వానీలో అదరగొట్టారు. ఇక వధూవరులుగా అనుష్క, ఆదిత్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దండలు మార్చుకునే సమయంలో భావోద్వేగానికి లోనైన అనుష్క కళ్లు ఆదిత్య తుడవడం అక్కడున్నవారందరిలో ఆనందాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment