వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్‌.. టాలీవుడ్ స్టార్ హీరోనే యజమాని! | Varun Tej and Lavanya Tripathi to host wedding reception at N Convention Center | Sakshi
Sakshi News home page

Varun Tej and Lavanya Reception: వరుణ్ - లావణ్య రిసెప్షన్‌.. టాలీవుడ్ స్టార్ హీరోనే యజమాని!

Published Sun, Oct 29 2023 3:38 PM | Last Updated on Sun, Oct 29 2023 4:02 PM

Varun Tej and Lavanya Tripathi to host wedding reception at N Convention Center - Sakshi

మెగా ఇంట పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఇటలీలోని టుస్కానీలో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే రామ్ చరణ్- ఉపాసన, అల్లు ‍అర్జున్ దంపతులు ముందుగానే ఇటలీ బయలుదేరి వెళ్లారు. ఇటీవలే షాపింగ్ పూర్తి చేసుకున్న కాబోయే వధూవరులు సైతం ఇటలీ ఫ్లైటెక్కారు. ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా అక్టోబర్‌ 30న కాక్‌టేల్‌ పార్టీతో పెళ్లి వేడుకలు మొదలు పెట్టి 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. నవంబర్‌ 1న పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు.

(ఇది చదవండి: 'అంతా నా వల్లే అంటున్నారు'.. డైరెక్టర్ పోస్ట్ వైరల్!)

అయితే ఇటలీ పెళ్లి వేడుక తర్వాత హైదరాబాద్‌లో ఇండస్ట్రీలోని ప్రముఖులు, సన్నిహితులకు గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేశారు. నవంబర్‌ ఐదో తేదీన మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో  తర్వాత రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫంక్షన్‌లో దాదాపు 3 వేలకు పైగా అతిథులు పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 

అయితే గ్రాండ్ రిసెప్షన్‌ జరగనున్న ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోకు చెందినదిగా తెలుస్తోంది. ప్రస్తుతం  బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-7 హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున ఈ సెంటర్‌కు యజమానిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త నల్లా ప్రీతమ్‌ రెడ్డితో కలిసి ఆయన దీన్ని నిర్మించారు. ఈ కన్వెన్షన్ సెంటర్‌కు వీరిద్దరు భాగస్వాములుగా ఉన్నారు. అయితే గతంలో ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణంపై పలు వివాదాలు తలెత్తాయి. 

(ఇది చదవండి: వరుణ్ తేజ్​- లావణ్య పెళ్లి షెడ్యూల్‌ ఇదే.. వేడుకలకు ఆమె దూరం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement