n Convention Center
-
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్.. టాలీవుడ్ స్టార్ హీరోనే యజమాని!
మెగా ఇంట పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఇటలీలోని టుస్కానీలో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే రామ్ చరణ్- ఉపాసన, అల్లు అర్జున్ దంపతులు ముందుగానే ఇటలీ బయలుదేరి వెళ్లారు. ఇటీవలే షాపింగ్ పూర్తి చేసుకున్న కాబోయే వధూవరులు సైతం ఇటలీ ఫ్లైటెక్కారు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా అక్టోబర్ 30న కాక్టేల్ పార్టీతో పెళ్లి వేడుకలు మొదలు పెట్టి 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. నవంబర్ 1న పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. (ఇది చదవండి: 'అంతా నా వల్లే అంటున్నారు'.. డైరెక్టర్ పోస్ట్ వైరల్!) అయితే ఇటలీ పెళ్లి వేడుక తర్వాత హైదరాబాద్‌లో ఇండస్ట్రీలోని ప్రముఖులు, సన్నిహితులకు గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేశారు. నవంబర్ ఐదో తేదీన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో తర్వాత రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫంక్షన్లో దాదాపు 3 వేలకు పైగా అతిథులు పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే గ్రాండ్ రిసెప్షన్ జరగనున్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోకు చెందినదిగా తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున ఈ సెంటర్‌కు యజమానిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త నల్లా ప్రీతమ్ రెడ్డితో కలిసి ఆయన దీన్ని నిర్మించారు. ఈ కన్వెన్షన్ సెంటర్‌కు వీరిద్దరు భాగస్వాములుగా ఉన్నారు. అయితే గతంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై పలు వివాదాలు తలెత్తాయి. (ఇది చదవండి: వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి షెడ్యూల్ ఇదే.. వేడుకలకు ఆమె దూరం) -
ఫ్యాషన్ బ్యూటీ
-
సిటీ కుర్రాడు.. జపాన్ అమ్మాయి
వేదమంత్రాలు, తలంబ్రాలు, ఏడడుగుల సాక్షిగా.. ఒక్కటవుతున్న వీరి పేర్లు ఉత్తమ్‌కుమార్, మినాకో కనేమోటో. అబ్బాయిది నగరంలోని బోయిన్పల్లి కాగా, అమ్మాయిది జపాన్. రెండేళ్ల క్రితం ఇద్దరూ జపాన్‌లో ఒకే కంపెనీ పనిచేస్తున్న సమయంలో ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో సోమవారం ముషీరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో తెలుగు సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. – ముషీరాబాద్ -
ప్రారంభమైన ఎన్ కన్వెన్షన్ సెంటర్ సర్వే
హైదరాబాద్ : ఎన్ కన్వెన్షన్ సెంటర్ సర్వే శుక్రవారం ప్రారంభమైంది. తమ్మిడికుంట చెరువు చేరుకున్న ఇరిగేషన్ అధికారులు చెరువు ఎఫ్టీఎల్ను నిర్ధారించనున్నారు. దాదాపు రెండున్నర నెలల క్రితం ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను అక్రమ నిర్మాణంగా జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొనడం తెలిసిందే. సెంటర్ నిర్వాహకులు హైకోర్టుకు వెళ్లడం... జీహెచ్ఎంసీ నిబంధనలు, చట్టం మేరకు అధికారులు చర్యలు తీసుకోవచ్చునని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తదుపరి చర్యల కోసం జీహెచ్ఎంసీ అధికారులు అడ్వొకేట్ జనరల్(ఏజీ) సలహా కోరారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎఫ్టీఎల్ పరిధిలో లేదని దాని యాజమాన్యం వాదిస్తున్నందున వారి సమక్షంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మరోమారు సర్వే చేయించి ఎఫ్టీఎల్ నిర్ధారించాల్సిందిగా ఏజీ సూచించారు. ఆ మేరకు చర్యలకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. అందుకనుగుణంగా ఎన్ కన్వెన్షన్ యాజమాన్యానికి నోటీసులిచ్చి... వారి సమక్షంలో ఎఫ్టీఎల్ నిర్ధారించనున్నారు. అనంతరం అంశాల వారీగా ఉల్లంఘనలను తెలియజేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
ఎన్ కన్వెన్షన్‌కు నోటీసులు
హైదరాబాద్: పముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎంతమేర ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్నది నిర్ధారించేందుకు మరోమారు తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ను నిర్ధారించనున్నారు. దాదాపు రెండున్నర నెలల క్రితం ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను అక్రమ నిర్మాణంగా జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొనడం తెలిసిందే. సెంటర్ నిర్వాహకులు హైకోర్టుకు వెళ్లడం... జీహెచ్ఎంసీ నిబంధనలు, చట్టం మేరకు అధికారులు చర్యలు తీసుకోవచ్చునని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తదుపరి చర్యల కోసం జీహెచ్ఎంసీ అధికారులు అడ్వొకేట్ జనరల్(ఏజీ) సలహా కోరారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎఫ్టీఎల్ పరిధిలో లేదని దాని యాజమాన్యం వాదిస్తున్నందున వారి సమక్షంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మరోమారు సర్వే చేయించి ఎఫ్టీఎల్ నిర్ధారించాల్సిందిగా ఏజీ సూచించారు. ఆ మేరకు చర్యలకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. అందుకనుగుణంగా ఎన్ కన్వెన్షన్ యాజమాన్యానికి నోటీసులిచ్చి... వారి సమక్షంలో ఎఫ్టీఎల్ నిర్ధారించనున్నారు. అనంతరం అంశాల వారీగా ఉల్లంఘనలను తెలియజేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తమ్మిడికుంట చెరువు తిరిగి సర్వే కోసం ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలకు లేఖలు రాస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. -
ఎన్ కన్వెన్షన్ సెంటర్ భవనాల తొలగింపు
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని తుమ్మిడికుంట చెరువుకు చెందిన కొంత భూమిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ భవనాలను యాజమాన్యమే తొలగిస్తోంది. ఈ సెంటర్ ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందినదన్న విషయం తెలిసిందే. ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో నిర్మించిన ఈ భవనాల అంశం హైకోర్టు పరిధిలో ఉంది. తుమ్మిడికుంట చెరువును ఆనుకుని ఉన్న ఈ భారీ ఫంక్షన్ హాలు చెరువుకు సంబంధించి 25 మీటర్ల మేర ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు సర్వే చేసి తేల్చారు. వాస్తవానికి చెరువు ఫుల్ట్యాంక్ లెవెల్‌తో పాటు, బఫర్ జోన్‌గా మరో 30 మీటర్లు కూడా ఉంటుంది. అయితే, చెరువు గట్టునే ఉన్న ఈ సెంటర్ హాలులో 25 మీటర్లు ఫుల్ట్యాంక్ లెవెల్లో ఉందని అధికారులు చెబుతున్నారు. తమ్మిడి చెరువు ఎఫ్టీఎల్లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్‌లోని 2 ఎకరాలు ఎన్ కన్వెన్షన్‌లో ఉన్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఖానామెట్ సర్వేనంబర్ 11/2, 11/36లలో తమ్మిడిచెరువుకు చెందిన స్థలాన్ని చదునుచేసి కన్వెన్షన్ నిర్మాణాలు చేపట్టారని అధికారులు తెలిపారు. తుమ్మిడికుంట చెరువు భూమిని ఆక్రమించి తాము ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్టు రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేయడాన్ని సవాల్‌చేస్తూ నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు స్టే మంజూరు చేసింది. ఆ తరువాత ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకోకూడదని ప్రభుత్వానికి తెలిపింది. సర్వే చేసేటట్లయితే ముందస్తుగా యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని, ఏ చర్యలు తీసుకుంటారో స్పష్టంగా చెప్పాలని ఆదేశించారు. ప్రభుత్వం కూడా చట్టపరంగా నడుచుకోవాలని, చట్టాన్ని అతిక్రమించకూడదని స్పష్టంగా సూచించారు ఈ నేపధ్యంలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఎన్ కన్వెన్షన్ భవనాలను యాజమాన్యమే స్వయంగా తొలగించుకుంటుంది. దీంతో ఈ సమస్య సమసిపోయే అవకాశం ఉంది. -
శేఖర్ చంద్ర మ్యారేజ్ రిసెప్షన్ ఫోటోలు
టాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర వివాహం మాధురితో ఇటీవల జరిగింది. వారి వివాహాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. శేఖర్ చంద్ర దంపతులతో ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు నూతన దంపతులకు ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు ఆశీస్సులు శేఖర్ చంద్ర దంపతులతో సినీ గేయ రచయిత భాస్కరభట్ల రిసెప్షన్ కు హాజరైన వారిలో హీరో నిఖిల్, నిర్మాత స్రవంతి రవికిషోర్, దర్శకుడు వంశీ, యువ సినీ గాయకులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.