ఇడ్లీ మీద నెయ్యి వేసుకునే అలవాటు మంచిదేనా? ఇలా తింటే బరువు పెరుగుతారా? అని చాలామంది మదిలే మెదిలే సందేహం. అయితే ఇలా ఇడ్లీ మీద నెయ్యి రాసుకుని తినే అలవాటు మంచిదే అంటున్నారు నిపుణులు. అలాగే ఇలా తింటే బరువు పెరుగుతారా అనే సందేహం కూడా వాస్తవమే అని చెబుతున్నారు. మరి తినోచ్చా ?లేదా అంటే..
నెయ్యి వేసుకుని తింటే కచ్చితంగా బరువు పెరుగుతారు. అయితే ఇడ్లీ, నెయ్యి ఆరోగ్యకరమైనవే. కాబట్టి ఆరోగ్యంగా బరువు పెరగడం, వ్యాయామంతో ఫిట్‌నెస్ సాధించడమే హెల్దీ లైఫ్ స్టైల్. ఇడ్లీలో కేలరీలు, ప్రోటీన్, ఫ్యాట్ తక్కువ, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో 120 నుంచి 130 కేలరీలు, అరవై శాతం సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కార్బొహైడ్రేట్‌లు, ప్రోటీన్‌లు తక్కువ.
ఇడ్లీలో నెయ్యి వేసుకుని తిన్నప్పుడు నెయ్యి మోతాదును బట్టి మూడు వందల నుంచి ఆరు వందల కేలరీలు అందుతాయి. నెయ్యి కావాలి! కొవ్వులో కరిగే ఎ,డి,ఇ,కె విటమిన్‌ల కోసం దేహానికి నెయ్యి అవసరమే. అలాగే దేహంలో వాపులను నివారించే కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్‌ను దేహం సరిగ్గా పీల్చుకోవడానికి కూడా నెయ్యి ఉండాలి. ఇడ్లీ మీద నెయ్యి వేసుకుని తినడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి లేదా రెండు టీ స్పూన్‌లకు పరిమితం చేస్తే మంచిది. అలాగే రోజువారీ డైట్‌లో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండేలా చూసుకుంటూ రోజు మొత్తంలో ఆహారంలో ఎన్ని కేలరీలు చేరుతున్నాయో గమనించుకోవాలి.
--సుజాత స్టీఫెన్ ఆర్.డి. న్యూట్రిషనిస్ట్
Comments
Please login to add a commentAdd a comment