కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ వాడటం, కొన్ని రకాల వ్యాధులతో బాధపడటం వల్ల నోటిలో పుళ్లు ఏర్పడుతుంటాయి. కొందరికి ఊరికినే కూడా అప్పుడప్పుడు నోటిపూత వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఏమైనా తాగినా, తిన్నా చాలా బాధగా ఉంటుంది. మౌత్ అల్సర్స్ నుంచి ఉపశమనం పొందడానికి తేనె చక్కటి మార్గం. నోట్లో కణజాలాలు చిట్లిపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది కాబట్టి.. తేనెను పూయడం వలన కొత్త కణజాలాలు తిరిగి ఏర్పడడానికి ఇది దోహదం చేస్తుంది. తేనెలో పసుపు కలిపి పేస్ట్ లా చేసుకుని రాసినప్పుడు కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది.
మొక్కజొన్న కంకి ఒలిచేటప్పుడు వచ్చే సిల్క్ దారాల్లాంటి కార్న్ సిల్క్‌ను వృథాగా పడేస్తారు. కానీ అవి కిడ్నీ రాళ్లను బయటకు పంపడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. వాటిని నీటిలో ఉడికించి చల్లారాక వడగట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో కొత్తగా రాళ్లు ఏర్పడవు. ఇది మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో కార్న్ హెయిర్ ఉపయోగపడుతుంది.
కొబ్బరి నీళ్లను తరచూ తాగడం, కొబ్బరి నూనెను పూయడం, అలానే ఎండు కొబ్బరిని తినడం వల్ల కూడా నోటిపూత తగ్గుతుంది. ఎందుంకటే కొబ్బరి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఫలితం గా నోటిపూత త్వరగా మాని΄ోతుంది.
పాలపదార్ధాలైన నెయ్యి, మజ్జిగ వంటి పదార్ధాలు కూడా నోటిపూత నుంచి ఉపశమనం కల్పిస్తాయి. ఎక్కడైతే నోటిపూత గాయాలున్నాయో అక్కడ నేయి రాయడం, రోజుకు రెండుమూడుసార్లు గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఎంతో ఉపశమనం గా ఉంటుంది.
తులసి ఆకులు కూడా నోటిపూతకు మంచి ఔషధం. రోజుకు నాలుగైదు సార్లు తులసాకులు నమలడం వల్ల నోటిపూత తొందరగా తగ్గి΄ోతుంది.
చిన్న ఐస్ ముక్కతో పుండు ఉన్న చోట మర్దనా చేయడం, లవంగం నమలడం కూడా నోటిపూతను తగ్గిస్తాయి.
ఇవి చదవండి: Beauty Tips: కాలానుగుణంగా.. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..?
Comments
Please login to add a commentAdd a comment