నాకిప్పుడు 45 ఏళ్లు. ప్రొలాప్స్ ఉందని డయాగ్నసిస్ చేశారు. నాకు ప్రసవం చాలా కష్టమైంది. నా ఈ సమస్యకు అదే కారణమా? నాకు సర్జరీ అంటే భయం. సర్జరీ కాకుండా ఆల్టర్నేటివ్ ట్రీట్‌మెంట్ ఏదైనా ఉందా? – వేముల సూర్యకళ, సిరిసిల్ల
ప్రొలాప్స్ అంటే గర్భసంచి కిందకు జారటం. సాధారణంగా కండరాల బలహీనత, ప్రసవమప్పుడు ఎదురయ్యే ఇబ్బందుల వల్ల పెల్విక్ మజిల్స్, లిగమెంట్స్ వదులు అవుతాయి. కొంతమందికి జన్యుపరమైన కారణాలూ ఉండొచ్చు. హార్మోన్స్ చేంజెస్ కూడా కారణం కావచ్చు. అదేపనిగా దగ్గు వస్తున్నా, మలబద్ధకం ఉన్నా గర్భసంచి జారొచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు దగ్గినా, తుమ్మినా యూరిన్ లీక్ కావడం, బ్యాక్ పెయిన్ ఉంటాయి. కాళ్లు లాగుతున్నట్లనిపిస్తుంది.
ప్రొలాప్స్ తొలిదశలోనే డిటెక్ట్ అయితే ట్రీట్‌మెంట్ ఈజీ అవుతుంది. లిగమెంట్స్ స్ట్రెంతెనింగ్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్, అధిక బరువుంటే బరువు తగ్గడం, పౌష్టికాహారం వంటివాటితో మేనేజ్ చేయొచ్చు. ఫిజియోథెరపీ టీమ్ సపోర్ట్ తీసుకోవాలి. ప్రొలాప్స్ తర్వాత స్టేటెజెస్‌లో ఎక్సర్‌సైజెస్‌తోనే సమస్యను పరిష్కరించలేం. తర్వాత స్టేజెస్‌లో ప్రాలాప్స్‌కి బెస్ట్ ట్రీట్‌మెంట్ అంటే సర్జరీయే. అయితే సర్జరీని వద్దనుకుంటే ఖజీnజ ్క్ఛటట్చటyని సూచిస్తారు.
ఇది సిలికాన్ లేదా ఠిజీny∙మెటీరియల్‌తో తయారవుతుంది. దీన్ని పేషంటే స్వయంగా వెజైనాలో ఇన్‌సర్ట్ చేసుకోవచ్చు. ఆ డివైజ్.. జారిన గర్భసంచిని పైకి ఎత్తిపెడుతుంది. పేషంట్‌ని చెక్ చేసి, తగిన సైజ్ Ring Pressaryని డాక్టర్ సూచిస్తారు. ఇది రౌండ్‌గా ఉంటుంది. దీన్ని చేతితో పట్టుకుని కంప్రెస్ చేయొచ్చు. లూబ్రికెంట్ జెల్లీతో ఇన్‌సర్ట్ చేసుకోవాలి. క్లినిక్‌లో డాక్టర్ పర్యవేక్షణలో చేయాలి. ఇన్‌సర్ట్ చేసుకున్నాక. కాసేపు నడిచి.. యూరిన్ పాస్ చేశాక.. సౌకర్యంగా అనిపిస్తే Pressaryతోనే ఇంటికి పంపిస్తారు.
45 రోజులకు ఒకసారి వచ్చి.. చెక్ చేయించుకోవాలి. ఆరునెలలకు ఒకసారి కొత్త Pressaryని మార్చుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి దీన్ని ఎన్ని రోజులు వాడాలనేది డాక్టర్ చెబుతారు. అయితే దీనివల్ల వెజైనాలో విపరీతంగా నొప్పి వస్తున్నా.. మూత్ర విసర్జనప్పుడు ఇబ్బంది పడుతున్నా.. వెజైనల్ డిశ్చార్జ్ ఉన్నా, దుర్వాసన వేస్తున్నా, బ్లీడింగ్ అవుతున్నా, వెజైనాలో అల్సర్స్ ఫామ్ అయినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్‌స్టేట్రీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment