ఊదలు వంటలు | Udhalu cooking special story | Sakshi
Sakshi News home page

ఊదలు వంటలు

Published Sun, Dec 30 2018 12:49 AM | Last Updated on Sun, Dec 30 2018 12:49 AM

Udhalu cooking special story - Sakshi

ఊదల కట్‌లెట్‌
కావలసినవి:  ఊదల పిండి – ఒక కప్పు కంద ముక్కలు – పావు కప్పు బఠాణీ – పావు కప్పు  జీలకర్ర పొడి – ఒక టీ స్పూను ధనియాల పొడి – ఒక టీ స్పూను వాము – ఒక టీ స్పూను మిరియాల పొడి – అర టీ స్పూను మిరప కారం – అర టీ స్పూనుకొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు అల్లం + వెల్లుల్లి ముద్ద – రెండు టీ స్పూన్లు జీడి పప్పు పలుకులు – 10 ఉప్పు – తగినంత నెయ్యి – కాల్చటానికి తగినంత నువ్వుల పొడి – రెండు టేబుల్‌ స్పూన్లు నిమ్మ రసం – ఒక టీ స్పూను

తయారీ: కంద ముక్కలు, బఠాణీలను విడివిడిగా ఉడికించి, చేతితో మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి కాగాక ఊదల పిండి వేసి దోరగా వేయించి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో ఊదల పిండి, మెత్తగా మెదిపిన కంద, బఠాణీ ముద్ద వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి ముద్ద, మిరప కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము, కొత్తిమీర తరుగు, ఉప్పు, నిమ్మ రసం ఒకదాని తరవాత ఒకటి వేసి కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, కట్‌లెట్‌లాగ ఒత్తి, నువ్వుల పొడిలో ముంచి పక్కన ఉంచాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న కట్‌లెట్‌లను పెనం మీద వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. జీడి పప్పులతో అలంకరించి వేడివేడిగా అందించాలి.

100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?
ఊదలు(Banyard Millet)  
నియాసిన్‌ (Niacin)mg (B3)    1.5
రిబోఫ్లావిన్‌ (Rivoflavin)mg (B2)     0.08
థయామిన్‌ (Thiamine) mg (B1)    0.31
కెరోటిన్‌ (Carotene)ug        0
ఐరన్‌  (Iron)mg        2.9
కాల్షియం (Calcium)g        0.02
ఫాస్పరస్‌ (Phosphorous)g    0.28
ప్రొటీన్‌ (Protein)g        6.2
ఖనిజాలు  (Minerals) g        4.4
పిండిపదార్థం (Carbo Hydrate) g    65.5
పీచు పదార్థం  (Fiber) g        10.0
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio)    6.55

ఊదల పిజ్జా
కావలసినవి:  ఊదలు – అర కప్పు, – గోధుమ పిండి – అర కప్పుబేకింగ్‌ పౌడర్‌ – అర టీ స్పూను, ఉప్పు – తగినంతనెయ్యి / నూనె – 2 టీ స్పూన్లుటాపింగ్‌ కోసం
ఉల్లి తరుగు + క్యాప్సికమ్‌ తరుగు + టొమాటో తరుగు+ మష్రూమ్‌ తరుగు – అర కప్పు, స్వీట్‌ కార్న్‌ గింజలు – ఒక టేబుల్‌ స్పూను
టొమాటో సాస్‌ – పావు కప్పు, మొజెల్లా చీజ్‌ – తగినంత

తయారీ: ఊదలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలసేపు నానబెట్టాక, నీళ్లు ఒంపేయాలి. ఊదలను గ్రైండర్‌లో వేసి మెత్తటి పిండిలా రుబ్బి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గోధుమ పిండి, ఉప్పు, బేకింగ్‌ పౌడర్‌ జత చేసి బాగా కలిపి సుమారు ఆరు గంటలపాటు పులియబెట్టాలి. స్టౌ మీద పాన్‌ను వేడి చేయాలి. కొద్దిగా నూనె వేసి కాగాక, పులియబెట్టిన పిండిని ఒక గరిటెడు తీసుకుని పెనం మీద వేసి రెండు వైపులా కాలిస్తే, పిజ్జా బేస్‌ సిద్ధమైనట్లే. 180 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర అవెన్‌ను ఐదు నిమిషాల పాటు వేడి చేయాలి. బేకింగ్‌ ట్రేలో అల్యూమినియం ఫాయిల్‌ పేపర్‌ వేసి తయారుచేసి ఉంచుకున్న పిజ్జా బేస్‌ను ట్రేలో ఉంచాలి. టొమాటో సాస్, మొజెల్లా చీజ్, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్‌ తరుగు, మష్రూమ్‌ తరుగు, స్వీట్‌ కార్న్‌ గింజలు ఒకదాని మీద ఒకటి వేయాలి. సుమారు పది నిమిషాలు దీనిని బేక్‌ చేసి బయటకు తీయాలి. వేడివేడిగా అందించాలి.

ఊదల పుదీనా అన్నం
కావలసినవి:  ఊదలు – ఒక కప్పు, నీళ్లు – 2 కప్పులు, ఉప్పు – తగినంత  బిర్యానీ ఆకు – 1, నెయ్యి / నూనె – 2 టీ స్పూన్లు,  ఉల్లి తరుగు – పావు కప్పు, క్యారట్‌ తరుగు – ఒక కప్పు
టొమాటో తరుగు – అర కప్పు, కరివేపాకు – 2 రెమ్మలు పుదీనా – ఒక కప్పు, కొత్తిమీర – పావు కప్పు, తరిగిన పచ్చి మిర్చి – 2
లవంగాలు – 2, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను చొప్పున

తయారీ: ఊదలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి. స్టౌ మీద కుకర్‌లో ఊదలు, నీళ్లు, ఉప్పు, బిర్యానీ ఆకు వేసి కుకర్‌ మూత పెట్టాలి. మంటను కొద్దిగా తగ్గించి రెండు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. పుదీనా ఆకును శుభ్రంగా కడిగి, కొద్దిగా నీళ్లు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక లవంగాలు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాలి. టొమాటో తరుగు, క్యారట్‌ తరుగు, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. పుదీనా ముద్ద వేసి బాగా కలిపి, కొద్దిసేపు ఉడికించాలి. చివరగా ఉప్పు వేసి కలియబెట్టి దింపేయాలి. ఒక పెద్ద పాత్రలో ఉడికించిన ఊదలు, వేయించి ఉంచుకున్న పుదీనా మిశ్రమం వేసి బాగా కలియబెట్టాలి. కొత్తిమీరతో అలంకరించాలి.  రైతాతో వడ్డించాలి.

ఊదల ఇండియానా
కావలసినవి: ఊదలు – ఒక కప్పుకూరగాయ ముక్కలు – ఒక కప్పు (క్యారట్, బీన్స్, క్యాలీఫ్లవర్, పచ్చి బఠాణీ అన్నీ కలిపి)ఉప్పు – తగినంతతరిగిన పచ్చి మిర్చి – 5నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు కరివేపాకు పొడి – 2 టీ స్పూన్లుకొత్తిమీర – తగినంతఇంగువ – పావు టీ స్పూనుజీలకర్ర – ఒక టీ స్పూనునీళ్లు – అర కప్పు

తయారీ: ఊదలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంట సేపు నానబెట్టాలి. స్టౌ మీద కుకర్‌లో నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. కూరగాయ ముక్కలు, తరిగిన పచ్చి మిర్చి జత చేసి మరోమారు కలియబెట్టాలి. కరివేపాకు పొడి వేసి బాగా కలపాలి. ఊదలలో నీటిని ఒంపేయాలి. మరుగుతున్న నీళ్లలో ఊదలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత ఉంచాలి. రెండు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి. మూత తీశాక కొద్దిగా నెయ్యి, కొత్తిమీర వేసి వేడివేడిగా వడ్డించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement