pease
-
శాంతమే సౌఖ్యం..
తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్షాకవచంగా నిలుస్తుందని సుమతీ శతకకారుని సుధామయ ప్రబోధం.. శాంతం అనేది మానవులు అలవోకగా, అలవాటుగా అలంకరించుకోవలసిన గొప్ప ఆభరణం. క్రోధం కలిగినపుడు మనలో ప్రజ్వరిల్లే తక్షణ ఆవేశానికి లోను కాకుండా మదిని శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం. శాంతాన్ని ఆశ్రయించిన అతికొద్ది నిమిషాల్లోనే మనలోని వివేకం మేలుకొంటుంది.జంతుజాలానికీ, మనకూ ఉన్న భేదమే శాంతాన్ని కలిగించే వివేకం. జంతుకోటికి శాంతం వహించడం అంత సాధ్యం కాదు. వాటికి పక్కనే ఉన్న జంతువులతో తేడా వస్తే, ముందుగా గుర్తుకు వచ్చేది పోరాటం. తమను బాధపెట్టిన జంతువు బలాన్ని బేరీజు వేసుకుంటాయి. వాటితో పోరాటానికి సిద్ధమవుతాయి. అదే జంతువు బలం ఎక్కువైతే, అప్పటికప్పుడే పలాయనం చిత్తగిస్తాయి. వాటికి ఉన్న వివేకసంపద పరిమితి అంతే. కానీ, జంతుకోటికి భిన్నంగా జనించి, సమస్త జీవకోటిలోనూ అత్యంత తెలివైనవాడైన మానవుడు కోపంతోనూ, క్రోధంతోనూ చరించరాదు. బహుళ ప్రయోజనకరమైన శాంతాన్ని అన్నివేళలా ఆశ్రయించాలి. రంగస్థలంమీద పాత్రధారులు నవరసాలను పోషించి, అలరిస్తారు. అవి వరుసగా– శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, భీభత్సం, రౌద్రం, శాంతం. ఈ రసాల్లో హృదయానికి ఎటువంటి ఉద్వేగాన్ని కలగనీయకుండా అలరించే ఏకైక రసం శాంతరసం. రంగస్థలం మీద కొందరే పాత్రధారులుంటారు. జీవన రంగస్థలం మీద మానవులంతా పాత్రధారులే. అంటే, ఒకరితో ఒకరు ఏదో ఒక పనిమీద సంభాషించుకుంటూ ఉంటారు, కార్యకలాపాలను నెరపుతూ ఉంటారు. అటువంటి కార్యాలకు జయాన్ని సిద్ధింపజేయడంలో శాంతం ప్రధానపాత్ర పోషిస్తుంది. అనవసరంగా కేకలు పెడుతూ, హడావుడి చేసే మనిషి దగ్గరకు చేరడానికి ఎవరూ ఇష్టపడరు. ప్రశాంత చిత్తంతో, శాంతంతో మాట్లాడే వారి దగ్గరకు అందరూ చేరతారు. తీయగా మాట్లాడే అటువంటి వ్యక్తులకు ఏ రంగంలోనైనా జయాన్ని సాధించే అవకాశమూ మిగిలినవారితో పోలిస్తే బాగా ఎక్కువే..!! శాంతికరమైన వ్యవహారశైలి సొంతమైన వీరు జీవితంలో ఎంతగానో సుఖిస్తారు, వారితో చరించేవారినీ ఆనందపరుస్తారు. అత్యుత్తమమైన శాంత గుణానికున్న ప్రత్యేకతను తేటపరుస్తూ,‘‘శాంతములేక సౌఖ్యము లేదు’’ అన్నాడు వాగ్గేయకారుడు త్యాగయ్య.అయితే.. మనం ఆలోచించవలసిన ప్రశ్న ఒకటుంది. మనిషికి శాంతమనేది ఏ రకంగా లభిస్తుంది? కొంతమందికి అందమైన భార్య, ప్రయోజకులైన సంతానం, కావలసినంత సంపద.. ఈ విధంగా అన్నీ అమరినట్లే ఉంటాయి. కానీ, జీవితంలో మాత్రం నిరంతరం వారికి ఏదో అసంతృప్తి, అశాంతి..!! దానికి కారణం ఒక్కటే.. తాను కోరుకునే వస్తువులు, లేదా సుఖాల మీద అంతులేని వ్యామోహం నీడలా వెన్నాడడమే..!! మనిషిని సర్వకాల సర్వావస్థల్లో శాంతపరచేది తృప్తి మాత్రమే..!!ఆనందకరమైన మానవ జీవనానికి నిత్య వసంతాన్ని నింపే ఆమని.. శాంతమనే సంజీవని..పరిస్థితులవల్ల వచ్చిన ఉద్వేగాలకూ, ఉద్రేకాలకూ లోను కాకుండా స్వభావానికి దగ్గరగా ఉండడమే శాంతంగా వర్తించడమనే నిర్వచనం చెప్పుకోవచ్చు’’ ఇదీ ఓ ఆంగ్ల సిద్ధాంతకర్త వాక్కు. వినగానే, ఒకింత కఠినమైన సూత్రంగా ఈ వాక్యం అనిపించినా, అంతర్లీనమైన భావం మాత్రం సర్వకాల సర్వావస్థల్లో శాంతియుతంగా మానవులను ప్రవర్తించమన్నట్లుగా, శాంతంగా ఎదుటివారితో వర్తించమన్నట్లుగా భావించాలి.ఇంద్రియాలను జయించినవాడికైనా, సకల శాస్త్రాలను క్షుణ్ణంగా చదివినవాడికైనా శాంతగుణం అవసరమే. ధన కనక వస్తు వాహనాలెన్ని ఉన్నా, భోగభాగ్యాల్లో తేలియాడామని తలపోసినా, మనిషి ప్రశాంతచిత్తుడు కాకపోతే, అతనికి కలిగే ‘ప్రయోజనం సున్నా’. ఇది వాస్తవం. స్వప్రయోజనాల కోసమో, పదవుల కోసమో వెంపర్లాడుతూ పంచకళ్యాణిలా పరుగెత్తే ఆశలతో సతతమూ నలిగిపోయే వాళ్లకు శాంతమనేది ఒక అందని ద్రాక్ష. జీవితకాలంలో వాళ్లు ఎప్పుడూ స్థిమితంగా ఉండరు. మరొకరిని ఉండనివ్వరు. ఏదో ఒక రూపంలో అసహనం, అశాంతి వాళ్లకు చుట్టంలా చుట్టుకుని ఉంటుంది. పక్కవాళ్లకూ వీళ్ళ సాహచర్యం ఒకింత భరింపరానిదిగానే ఉంటుంది. – వెంకట్ గరికపాటి‘‘వ్యాఖ్యాన విశారద’’ -
యుద్దం ముగిసిపోలేదు: జెలెన్స్కీ
Zelenskyy said sought concrete results: రష్యా ఉక్రెయిన్‌పై నెలరోజులకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అదీగాక ఇంతవరకు రష్యా శాంతి చర్చలు పాల్గొంటునే మరోవైపు నుంచి దాడులు కొనసాగిస్తూనే ఉంది. కానీ మంగళవారం టర్కీలో జరిగిన శాంతిచర్చల్లో కాస్త పురోగతి కనిపించింది. రష్యా కూడా కాస్త సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా కైవ్, చెర్నిహివ్ చుట్టూ సైనిక బలగాలను ఉపసంహరించుకుంటానని వాగ్దానం చేసింది. అయితే తాము వాటిని పూర్తిగా విశ్వసించలేమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ అన్నారు. ఎందుకంటే గత 34 రోజులుగా సాగుతున్న ఈ యుధంలో తాము భయంకరమైన విధ్వంసాన్ని చవిచూశాం. డాన్‌బాస్‌లో గత ఎనిమిదేళ్లగా సాగుతున్న యుద్ధంలో తాము చాలా విషయాలు తెలుసుకున్నాం అని అన్నారు. అయినా ఉక్రెనియన్లు ఏమి అమాయకులు కారని ఇక్కడతో యుద్ధం ముగిసిపోయిందని తాము భావించట్లేదని చెప్పారు. అయితే ఈ ముఖామఖి చర్చలో సానూకూల సంకేతాలే వచ్చినట్లు తెలిపారు. మరోవైపు యూఎస్ ఉక్రెయిన్‌ని తటస్థ వైఖరిని అవలంభిస్తాం అన్న ప్రతిపాదనతో ముప్పు ముగిసిపోయినట్లు కాదు అని హెచ్చరిస్తోంది. ఇంకోవైపు ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలపై భారీ దాడి జరగకుండా చూడటానికి మనమందరం సిద్ధంగా ఉండాలి ఉక్రెయిన్ అధికారి జాన్ కిర్బీ పిలుపునిచ్చారు. రష్యా ఉక్రెయిన్ వేర్పాటువాద ప్రాంతాలైన డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల దిశగా తమ బలగాలను మళ్లీంచి దాడి చేసే అవకాశం ఉందని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. (చదవండి: రష్యన్ బలగాలు వెనక్కి.. దానర్థం కాల్పుల విరమణ కాదు: రష్యా ట్విస్ట్) -
ఊదలు వంటలు
ఊదల కట్లెట్ కావలసినవి: ఊదల పిండి – ఒక కప్పు కంద ముక్కలు – పావు కప్పు బఠాణీ – పావు కప్పు జీలకర్ర పొడి – ఒక టీ స్పూను ధనియాల పొడి – ఒక టీ స్పూను వాము – ఒక టీ స్పూను మిరియాల పొడి – అర టీ స్పూను మిరప కారం – అర టీ స్పూనుకొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు అల్లం + వెల్లుల్లి ముద్ద – రెండు టీ స్పూన్లు జీడి పప్పు పలుకులు – 10 ఉప్పు – తగినంత నెయ్యి – కాల్చటానికి తగినంత నువ్వుల పొడి – రెండు టేబుల్ స్పూన్లు నిమ్మ రసం – ఒక టీ స్పూను తయారీ: కంద ముక్కలు, బఠాణీలను విడివిడిగా ఉడికించి, చేతితో మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి కాగాక ఊదల పిండి వేసి దోరగా వేయించి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో ఊదల పిండి, మెత్తగా మెదిపిన కంద, బఠాణీ ముద్ద వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి ముద్ద, మిరప కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము, కొత్తిమీర తరుగు, ఉప్పు, నిమ్మ రసం ఒకదాని తరవాత ఒకటి వేసి కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, కట్లెట్లాగ ఒత్తి, నువ్వుల పొడిలో ముంచి పక్కన ఉంచాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న కట్లెట్లను పెనం మీద వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. జీడి పప్పులతో అలంకరించి వేడివేడిగా అందించాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? ఊదలు(Banyard Millet) నియాసిన్ (Niacin)mg (B3) 1.5 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.08 థయామిన్ (Thiamine) mg (B1) 0.31 కెరోటిన్ (Carotene)ug 0 ఐరన్ (Iron)mg 2.9 కాల్షియం (Calcium)g 0.02 ఫాస్పరస్ (Phosphorous)g 0.28 ప్రొటీన్ (Protein)g 6.2 ఖనిజాలు (Minerals) g 4.4 పిండిపదార్థం (Carbo Hydrate) g 65.5 పీచు పదార్థం (Fiber) g 10.0 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 6.55 ఊదల పిజ్జా కావలసినవి: ఊదలు – అర కప్పు, – గోధుమ పిండి – అర కప్పుబేకింగ్ పౌడర్ – అర టీ స్పూను, ఉప్పు – తగినంతనెయ్యి / నూనె – 2 టీ స్పూన్లుటాపింగ్ కోసం ఉల్లి తరుగు + క్యాప్సికమ్ తరుగు + టొమాటో తరుగు+ మష్రూమ్ తరుగు – అర కప్పు, స్వీట్ కార్న్ గింజలు – ఒక టేబుల్ స్పూను టొమాటో సాస్ – పావు కప్పు, మొజెల్లా చీజ్ – తగినంత తయారీ: ఊదలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలసేపు నానబెట్టాక, నీళ్లు ఒంపేయాలి. ఊదలను గ్రైండర్లో వేసి మెత్తటి పిండిలా రుబ్బి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గోధుమ పిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్ జత చేసి బాగా కలిపి సుమారు ఆరు గంటలపాటు పులియబెట్టాలి. స్టౌ మీద పాన్‌ను వేడి చేయాలి. కొద్దిగా నూనె వేసి కాగాక, పులియబెట్టిన పిండిని ఒక గరిటెడు తీసుకుని పెనం మీద వేసి రెండు వైపులా కాలిస్తే, పిజ్జా బేస్ సిద్ధమైనట్లే. 180 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర అవెన్‌ను ఐదు నిమిషాల పాటు వేడి చేయాలి. బేకింగ్ ట్రేలో అల్యూమినియం ఫాయిల్ పేపర్ వేసి తయారుచేసి ఉంచుకున్న పిజ్జా బేస్‌ను ట్రేలో ఉంచాలి. టొమాటో సాస్, మొజెల్లా చీజ్, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు, మష్రూమ్ తరుగు, స్వీట్ కార్న్ గింజలు ఒకదాని మీద ఒకటి వేయాలి. సుమారు పది నిమిషాలు దీనిని బేక్ చేసి బయటకు తీయాలి. వేడివేడిగా అందించాలి. ఊదల పుదీనా అన్నం కావలసినవి: ఊదలు – ఒక కప్పు, నీళ్లు – 2 కప్పులు, ఉప్పు – తగినంత బిర్యానీ ఆకు – 1, నెయ్యి / నూనె – 2 టీ స్పూన్లు, ఉల్లి తరుగు – పావు కప్పు, క్యారట్ తరుగు – ఒక కప్పు టొమాటో తరుగు – అర కప్పు, కరివేపాకు – 2 రెమ్మలు పుదీనా – ఒక కప్పు, కొత్తిమీర – పావు కప్పు, తరిగిన పచ్చి మిర్చి – 2 లవంగాలు – 2, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను చొప్పున తయారీ: ఊదలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి. స్టౌ మీద కుకర్‌లో ఊదలు, నీళ్లు, ఉప్పు, బిర్యానీ ఆకు వేసి కుకర్ మూత పెట్టాలి. మంటను కొద్దిగా తగ్గించి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పుదీనా ఆకును శుభ్రంగా కడిగి, కొద్దిగా నీళ్లు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక లవంగాలు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాలి. టొమాటో తరుగు, క్యారట్ తరుగు, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. పుదీనా ముద్ద వేసి బాగా కలిపి, కొద్దిసేపు ఉడికించాలి. చివరగా ఉప్పు వేసి కలియబెట్టి దింపేయాలి. ఒక పెద్ద పాత్రలో ఉడికించిన ఊదలు, వేయించి ఉంచుకున్న పుదీనా మిశ్రమం వేసి బాగా కలియబెట్టాలి. కొత్తిమీరతో అలంకరించాలి. రైతాతో వడ్డించాలి. ఊదల ఇండియానా కావలసినవి: ఊదలు – ఒక కప్పుకూరగాయ ముక్కలు – ఒక కప్పు (క్యారట్, బీన్స్, క్యాలీఫ్లవర్, పచ్చి బఠాణీ అన్నీ కలిపి)ఉప్పు – తగినంతతరిగిన పచ్చి మిర్చి – 5నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు కరివేపాకు పొడి – 2 టీ స్పూన్లుకొత్తిమీర – తగినంతఇంగువ – పావు టీ స్పూనుజీలకర్ర – ఒక టీ స్పూనునీళ్లు – అర కప్పు తయారీ: ఊదలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంట సేపు నానబెట్టాలి. స్టౌ మీద కుకర్‌లో నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. కూరగాయ ముక్కలు, తరిగిన పచ్చి మిర్చి జత చేసి మరోమారు కలియబెట్టాలి. కరివేపాకు పొడి వేసి బాగా కలపాలి. ఊదలలో నీటిని ఒంపేయాలి. మరుగుతున్న నీళ్లలో ఊదలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత ఉంచాలి. రెండు విజిల్స్ వచ్చాక దింపేయాలి. మూత తీశాక కొద్దిగా నెయ్యి, కొత్తిమీర వేసి వేడివేడిగా వడ్డించాలి. -
నోబెల్ నామినీల్లో శ్రీశ్రీ రవిశంకర్?
బెంగుళూరు: ప్రపంచ నోబెల్ శాంతి బహుమతి ఈసారి భారతీయులకు వరించనుందా అంటే అవునని ఊహాగానాలు వస్తున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ఈ అవార్డుకు భారత్ నుంచి అర్హుడని, ఈ ఏడాది నామినీల్లో ఆయన పేరు ఉండనుందని థామ్సన్ రాయిటర్స్ సంస్థ పేర్కొంది. కొలంబియాలో శాంతి స్థాపనకు ఆయన ఎంతగానో కృషి చేశారని కొనియాడింది. అయితే, దీనిపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి తెలిపారు. కొలంబియాలో శాంతిని నెలకొల్పేందుకు 2012 నుంచి ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రవిశంకర్ శాంతి సేవలకుగాను దేశ అత్యున్నత పౌరపురస్కారంతో ఆ ప్రభుత్వం సత్కరించింది. 2015లో క్యూబాలో పర్యటించినపుడు చర్చల ద్వారా కొలంబియా తిరుగుబాటు దళాల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఆయన కృషి చేశారు. మొత్తం 150 దేశాల్లో ఆయన సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆయన సేవలను గుర్తించి జనవరిలో భారతప్రభుత్వం ఇప్పటికే దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ను కూడా అందించిన విషయం తెలిసిందే.