మన భారతీయ వంటకాల్లో చాలావరకు నెయ్యి ఉపయోగిస్తామన్న విషయం తెలిసిందే. వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని కాస్త నెయ్యి కలుపుకొని తింటే ఆ రుచే వేరు కదా. స్వీట్ల దగ్గర్నుంచి ఘుమఘుమలాడే బిర్యానీల వరకు చాలా వంటకాల్లో నెయ్యిని వాడుతుంటాం. ప్రతిరోజూ నెయ్యి తీసుకుంటే బరువు పెరగతామని చాలామంది అనుకుంటారు. కానీ ఇది ఒట్టి అపోహ మాత్రమే. శీతాకాలంలో నెయ్యి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
►నెయ్యిలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.నెయ్యి ప్రేగులలోని ఆమ్ల pH స్థాయిని తగ్గించి చిన్న పేగును శుద్ధిచేస్తుంది. దాంతో పాటు మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది.
► నెయ్యి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. నెయ్యి మన డైట్‌లో చేర్చుకుంటే.. చలికాలంలో తరచుగా ఇబ్బంది పెట్టే బలుబు, దగ్గు, ఫ్లూ, అలర్జీల నుంచి రక్షణ లభిస్తుంది
► ఇందులో విటమిన్లుఎ, ఇ, డి, కె.. వంటి కొవ్వుల్ని కరిగించుకునే విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ యాసిడ్స్, లినోలిక్, బ్యుటిరిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. నిరోధకత శక్తి మెరుగుపడుతుంది.
► చలికాలంలో నెయ్యి తినడం వల్ల శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది. శరీరంలోనిని అంతర్గత ఉష్ణాన్ని క్రమబద్ధీకరించి ఉంచేందుకు నెయ్యి సహకరిస్తుంది. నెయ్యికి స్మోకింగ్ పాయింట్ అధికంగా ఉంటుంది.
► పసుపు, మిరియాలతో కలిపి నెయ్యిని తీసుకుంటే వాపును తగ్గించడంతో పాటు ఒత్తిడి తొలిగి నిద్రలేమిని అధిగమించవచ్చు.
►హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను కాపాడుతుంది.
► క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు నెయ్యిలో ఉంటాయి. దీంతో రోజూ నెయ్యి తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
► కంటి సంబంధిత వ్యాధితో భాధపడే వారు నెయ్యి ని ఆహారంతో పాటు తీసుకుంటే ఆ సమస్యల నుండి బయటపడవచ్చు.ఎందుకంటే ఇందులో మిటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది.
► నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనే భావన చాలా మందిలో ఉంది.అయితే నిజానికి నెయ్యి చెడు కొలెస్ట్రాల్ పెంచదు..మంచి కొలెస్ట్రాల్‌ను మాత్రమే పెంచుతుంది.దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
అందానికి నెయ్యి
- నెయ్యి కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికీ మేలు చేస్తుంది. ఇది న్యాచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. నెయ్యిని చర్మానికి అప్లై చేస్తే.. చర్మం మృదువుగా ఉంటుంది.
- నెయ్యి తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అంతేకాదు, ప్రతిరోజూ నెయ్యిని తీసుకుంటే ముఖం కాంతిమంతంగా తయారవుతుంది.
- ఇలాంటి వారు రాత్రి పడుకొనే ముందు నెయ్యితో పెదాలపై నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే పెదాల రంగు మెరుగవ్వడమే కాకుండా మృదువుగా మారతాయి.
- నెయ్యి చర్మంలో కొల్లాజెన్ అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. ఇది చర్మ ప్రకాశాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment