వాము ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్న వామును పలు చికిత్సల్లో వాడతారు. సుగంధ లక్షణాలు కలిగి ఉన్న వాము వంటల్లో రుచిని రెట్టింపు చేస్తుంది. అందుకే వీటిని చాలా రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా దీన్ని పలు చికిత్సల్లోనూ వాడతారు. వాము గింజలతోనే కాదు, ఆకులతోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా..
►జీర్ణ సమస్యలు,అజీర్తి, గ్యాస్,కడుపు ఉబ్బరం సమస్యలు, మలబద్దకం వంటి సమస్యలను దూరం చేసే శక్తి వాము ఆకుల్లో ఉంది.
►వాము ఆకులను నమిలితే జీర్ణ సమస్యల నుంచి త్వరగా బయట పడొచ్చు. గ్యాస్ట్రిక్ జ్యూస్‌లను విడుదల చేయడంలో వాము ఆకు ఉపయోగపడుతుంది.
► చిన్న పిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
► వాము ఆకులో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన శరీరంపై గాయాలను,మచ్చలను తగ్గిస్తుంది.
► చిన్నపిల్లల్లో వచ్చే కడుపునొప్పికి వాము ఆకు బెస్ట్ మెడిసిన్.
► ప్రతి రోజు భోజనం పూర్తయ్యాక వాము ఆకును తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆకలి తక్కువ ఉన్నవారిలో ఆకలి పుడుతుంది.
► చిన్న పిల్లలకు వాము ఆకు రసంలో తేనే కలిపి ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.
► తలనొప్పి నివారణకు కూడా వాము ఆకు ఔషధంలా పనిచేస్తుంది. వాము ఆకుల్ని నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దితే తలనొప్పి తగ్గుతుంది.
► ఏవైనా పురుగులు, కీటకాలు కుట్టినప్పుడు వాము ఆకుల్ని ఆ ప్రాంతంలో రుద్దినా విషం బయటకు వచ్చేస్తుంది.
► వాము ఆకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు.. జుట్టు సమస్యల్ని దూరం చేస్తుంది. అలాగే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా వాము ఆకులు హెల్ప్ చేస్తాయి.
► ఈ వాముని ఔషధంగానే కాదు ఆహారపదార్ధాల్లో కూడా ఉపయోగించవచ్చు. వాము ఆకుతో బజ్జీలు వేసుకొని తినవచ్చు.. వాము ఆకుతో పెరుగు పచ్చడి చేసుకుని తింటే రుచికరంగా ఉండడంతో పాటు అజీర్తి సమస్యలు కూడా దూరమవుతాయి.
► వాము ఆకును నమలడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా కూడా దూరం అవుతుంది. నోరు రిఫ్రెష్గా ఉంటుంది. నోటి దుర్వాసనను దూరం చేస్తుంది
► వామాకులో ఎ, బి, సి విటమిన్లు, అమినో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం ఉన్నందున ఇది మంచి పోషకాహారం.
► వామాకు నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
► వాము ఆకులతో తయారుచేసిన టీ ని ప్రతిరోజు తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి సులభంగా విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ ని ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment