జీలకర్రను దాదాపు అన్ని వంటల్లో ఉపయోగిస్తారు. దీనివల్ల రుచి మాత్రమే కాదు, రోగనిరోధక శక్తి సైతం పెరుగుతుంది. అయితే జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్రలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కలోంజీ విత్తనాలు అని కూడా అంటారు. మరి నల్ల జీలకర్ర వల్ల కలిగే ఉపయోగాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.
►నల్ల జీలకర్ర జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పొట్టలో రసాయనాలు విడుదలయ్యేందుకు సహాయపడుతూ, మలబద్దకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగనివ్వకుండా నివారిస్తూ, లావు, ఉబ్బసం వంటి సమస్యలను అదుపు చేస్తుంది.
► నల్ల జీలకర్రతో తయారు చేసిన నూనెని నుదిటి పైన రుద్దుకోవడం వళ్ళ తలనొప్పి దూరం అవ్వడమే కాకుండా, ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
► నల్ల జీలకర్ర నూనె పంటికి సంబంధించిన సమస్యలను, చిగుళ్ళకి సంబంధించిన సమస్యలను, బలహీనమైన పంటి నొప్పిని తగ్గిస్తుంది,కేవలం కొన్ని నూనె చుక్కలను జల్లడంతో నొప్పి తగ్గుతుంది. నల్ల జిలకరలో థైమోక్విన్ అనే కెమికల్ ఉంటుంది అది మీ చిగుళ్లను ఆరోగ్యగా ఉంచుతుంది.
► వయసు పైబడిన వారిలో మతిమరుపు సమస్య కనిపిస్తుంటుంది. అలాంటి వాళ్లు ఖాళీ కడుపుతో నల్ల జీలకర్రను తీసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుంది.
► నల్ల జీలకర్ర నూనెలో ఉండే ప్రోటీన్స్,ఫాటీ ఆసిడ్స్ బ్లడ్ సర్క్యూలేషన్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె, నల్ల జీలకర్ర నూనెను కలిపి తలకు రాసుకుంటే జుట్టు పెరిగి ధ్రుడంగా తయారవుతుందని, అంతేగాక చుండ్రును కూడా తగ్గిస్తుందని తేలింది.
► మెటబాలింజను మెరుగుపర్చడంలో నల్లజీలకర్ర తోడ్పడుతుంది. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది.
► ఆడవాళ్లకు నెలసరి ఇబ్బందులను దూరం చేస్తుంది. పీరియడ్స్ టైంలో వచ్చే కడుపునొప్పిని తగ్గిస్తుంది.
► కళ్లు ఎర్రగా మారడం, నీరు ఎక్కువగా రావడం వంటి కంటి సమస్యలను నివారించి కంటిచూపును మెరుగుపరుస్తుంది
► షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తూ టైప్-2 డయాబెటిస్‌ని అదుపు చేస్తుంది. నల్ల జీలకర్ర నూనెని బ్లాక్ టీతో కలిపి కాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
► శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంతో పాటు గుండెకి సంబంధించిన సమస్యలను ఇది తగ్గిస్తుంది.
► పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఆస్థమా ఒక సాధారణ జబ్బు గా మారింది.నల్ల జీలకర్ర నూనె, తేనె, గోరు వెచ్చని నీటిలో కలిపి రోజు తీసుకుంటే ఆస్థమా ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
► నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. ఇవి బ్రెస్ట్ కాన్సర్, సెర్వికల్ కాన్సర్, లంగ్ కాన్సర్, పాంక్రియాటిక్ కాన్సర్ లను నివారిస్తాయి.
► నిమ్మరసం,నల్ల జీలకర్ర నూనెను కలిపి రోజుకు రెండు సార్లు మొహానికి అప్లై చేస్తే మొటిమలు తగ్గుతాయి.
► నల్ల జీలకర్ర, తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
నల్ల జీలకర్ర ఎలా తీసుకోవాలి?
పొడి అయితే రోజు మధ్యాహ్నం అలాగే రాత్రి తిన్న తరువాత అర టీ స్పూన్ తీసుకోవాలి. టాబ్లెట్ అయితే రోజుకు 2 టాబ్లెట్స్ మధ్యాహ్నం అలాగే రాత్రి తిన్న తరువాత తీసుకోవాలి. నూనె రూపంలొ తీసుకుంటే రోజుకి అర టీ స్పూన్ మధ్యాహ్నం అలాగే రాత్రి తిన్న తరువాత తీసుకోవాలి.
-నవీన్ నడిమింటి,
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment