Trendy Toaster: నిమిషాల్లో టోస్ట్‌ చేసుకోవచ్చు.. ధర రూ.3,733! | Trendy Toaster: How It Works Price And Check Other Details | Sakshi
Sakshi News home page

Trendy Toaster: ఎన్నో రుచులను నిమిషాల్లో టోస్ట్‌ చేసుకోవచ్చు.. ధర రూ.3,733!

Published Sun, Mar 27 2022 12:32 PM | Last Updated on Sun, Mar 27 2022 12:36 PM

Trendy Toaster: How It Works Price And Check Other Details - Sakshi

బిజీ షెడ్యూల్‌లో వండి, వేయించే వంటకాలకంటే.. ఏ బటరో, సాసో పూసుకుని తినే టోస్టర్‌ రుచులే బెటరనిపిస్తుంది. అలాంటి వారి కోసం ఈ మేకర్‌. ఇందులో బ్రెడ్‌ టోస్ట్, బేగెల్స్, మఫిన్స్, బన్స్‌ (పెద్దగా ఉంటే మధ్యకు కట్‌ చేసుకుని పెట్టుకోవాలి).. ఇలా ఎన్నో రుచులను నిమిషాల్లో టోస్ట్‌ చేసుకోవచ్చు.

బేగెల్‌ లేదా మఫిన్, రీ–హీట్, డిఫ్రాస్ట్‌.. వంటి పలు ఆప్షన్స్‌తో పాటు 7 స్థాయిల్లో టెంపరేచర్‌ పెంచుకునేందుకు ప్రత్యేకమైన రెగ్యులేటర్‌ కూడా ఉంటుంది. దాంతో ఇందులో ప్రతి ఐటమ్‌ని ఏడు షేడ్స్‌లో టోస్ట్‌ చేసుకోవచ్చు. డివైజ్‌ కింద భాగంలో ఒక ట్రే ఉంటుంది.

దానిలోకి చేరిన వ్యర్థాలను తొలగించి, దీన్ని శుభ్రం చేసుకోవడం కూడా తేలికే. ఈ స్టయిలిష్‌ టోస్టర్‌.. కౌంటర్‌ టాప్‌లో స్థలాన్ని ఆదా చేస్తుంది. ఇదే మోడల్‌లో లైట్‌ ఎల్లోతో పాటు లైట్‌ గ్రీన్, బ్లాక్, సిల్వర్‌ కలర్‌ డివైజ్‌లు మార్కెట్‌లో బాగా అమ్ముడుపోతున్నాయి.
ధర 49 డాలర్లు- (రూ.3,733) 
చదవండి: Electric Citrus Juicer: ఇంట్లోనే ఇలా జ్యూస్‌ చేసుకోండి.. దీని ధర రూ.8,909!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement