వెన్న కావాలంటే పాలు ఉండాల్సిందే అంటారు ఎవ్వరైనా.. అయితే వెన్న కోసం పాలు ఏ మాత్రం అవసరం లేదంటోంది కాలిఫోర్నియాకు చెందిన 'సావోర్' (Savor) కంపెనీ. ఇంతకీ ఇది నిజమైన వెన్నెనా? తినడానికి పనికొస్తోందా? దీన్ని ఎలా తయారు చేశారనే ఆసక్తికర విషయాలు ఇక్కడ చూసేద్దాం..
కాలిఫోర్నియాకు చెందిన సావోర్ కంపెనీ పాలు లేదా మరే ఇతర పాల ఉత్పత్తులను ఉపయోగించకుండా వెన్నని సృష్టించే ప్రక్రియను అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ టెక్ దిగ్గజం, బిలినీయర్ బిల్ గేట్స్ మద్దతుతో నడుస్తున్నట్లు సమాచారం.
సావోర్.. వెన్నను కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో వెన్నను సృష్టిస్తోంది. ఇది సాధారణ వెన్న మాదిరిగానే అదే రుచిని కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ కంపెనీ ఐస్‌క్రీమ్, చీజ్, పాలతో సహా పలు ఉత్పత్తులకు పాల రహిత ప్రత్యామ్నాయాలను రూపొందించడానికి ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వెన్నను తయారు చేసింది.
సాంప్రదాయ పాల వనరులపై ఆధారపడకుండా, వాయువులను ఉపయోగించి కొవ్వు అణువులను అభివృద్ధి చేయడానికి కంపెనీ థర్మోకెమికల్ ప్రక్రియను ఉపయోగిస్తుంది. గ్రీన్‌హౌస్ వాయువులు పశు పరిశ్రమ నుంచి సుమారు 14.5 శాతం వెలువడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలని సూచించింది.
పశు పరిశ్రమ నుంచి వచ్చే ఉద్గారాలను తగ్గించడానికి సరైన మార్గం.. మాంసం, పాల ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే. దీనిని దృష్టిలో ఉంచుకుని సావర్ పాల అవసరం లేకుండానే వెన్నను విజయవంతంగా తయారు చేసింది.
నిజమైన వెన్నలో కేజీకి 16.9 కేజీ కార్బన్ డై ఆక్సైడ్‌కు సమానమైన కార్బన్ ఉంటుంది. పాల అవసరం లేకుండా చేసిన వెన్న కేజీకి 0.8 గ్రామ్స్ CO2 కంటే తక్కువ కార్బన్ పాదముద్రను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ వెన్న రుచి చాలా బాగుందని బిల్‌గేట్స్ ఓ వీడియోలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment