mother corpse
-
తల్లి శవాన్ని పక్కనే పెట్టుకొని 10 రోజులపాటు ఇంట్లోనే..
తల్లి శవాన్ని పక్కనే పెట్టుకొని 10 రోజులపాటు ఇంట్లోనే గడిపింది ఓ కూతురు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం అందించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హెచ్ఏఎల్ ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన సునీత పదేళ్ల కిత్రం తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. లక్నోలోని ఇందిరా నగర్లో 26 ఏళ్ల కూతురు అంకితా దీక్షిత్‌తో నివాసముంటోంది. కొన్నేళ్లుగా సునీత క్యాన్సర్ వ్యాధితో పోరాడుతోంది. ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజుల క్రితం సునితా మరణించింది. అయితే తన తల్లి మరణించిన విషయాన్ని అంకిత ఎవ్వరికీ చెప్పలేదు. తల్లి శవాన్ని ఇంట్లోనే పెట్టుకొని 10 రోజులు గడిపింది. రెండు రోజులుగా సునీత ఇంట్లోంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా.. లొపలి నంచి మెయిన్ డోర్ లాక్ చేసి ఉంది. ఇంట్లో నుంచి మాత్రం యువతి గొంతు వినిపించింది. ఎంత ప్రయత్నించినా యువతి డోర్ తీయకపోవడంతో పోలీసులే బలవంతంగా తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోకి వెళ్లగానే అక్కడ ఉన్న దృశ్యాలను చూసి లక్నో పోలీసులు కంగుతున్నారు. చదవండి: నా కూతురి మృతిపై అనుమానాలు ఉన్నాయి: తండ్రి ఒక గదిలో కుళ్లిపోయిన స్థిలో తల్లి మృతదేహం ఉండగా .. కూతురు అంకిత మరో గదిలో ఉండటం గమనించారు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే అంకిత మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులకు తెలిసింది. అందుకే తల్లి మరణించినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేదని పేర్కొన్నారు.పదిరోజుల క్రితమే మహిళ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, తదుపరి విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకైతే సునీత ఎలా చనిపోయిందనే విషయంపై క్లారిటీ లేదు. -
వలస కష్టం కాటేసింది పసివాడిని వీడేసింది
న్యూఢిల్లీ: పాపం పుణ్యం, ప్రపంచమార్గం ఏదీ తెలియని ఓ పసివాడు, రైల్వే ప్లాట్‌ఫాంపై విగతజీవిగా పడివున్న తల్లి శవంపై కప్పిన గుడ్డతో ఆడుకుంటోన్న దృశ్యం సోషల్ మీడియాలో నెటిజన్లను కన్నీళ్ళు పెట్టించింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్ ఫ్లాట్‌ఫాంపై ఓ తల్లి మృతదేహంపై కప్పి ఉంచిన వస్త్రంతో ఆడుకుంటూ, తల్లిని నిద్రలేపే యత్నం చేస్తోన్న ఓ పసివాడి దృశ్యం దేశంలో వలసకార్మికుల కష్టాలను కళ్ళకు కట్టింది. ఎంత తట్టినా లేవని తల్లి తన కోసం లేచిరాకపోతుందా..తనను ఒడిచేర్చుకోకపోతుందా అని ఆ పసివాడు పదే పదే తల్లిని లేపేందుకు చేస్తోన్న ప్రయత్నం స్టేషన్‌లోని ప్రయాణికుల హృదయాలను కలచివేసింది. రైళ్ళ రాకపోకలపై మైకులో అనౌన్స్మెంట్ కొనసాగుతుండగా.. తల్లిపై అస్తవ్యస్తంగా కప్పి ఉంచిన వస్త్రంతో అమాయకంగా ఆడుకుంటోన్న ఈ వీడియోని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ యాదవ్ ట్వీట్ చేయడంతో ఇది వైరల్ అయ్యింది. -
తల్లి శవాన్ని ఇంట్లో 9 నెలలు ఉంచుకుని..
కోల్‌కతా: బెంగాల్లో మరో దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. నదియా జిల్లాలోని సింహట్ గ్రామంలో ఇద్దరు సోదరులు మరణించిన తల్లికి అంత్యక్రియలు చేయకుండా, ఆమె శవాన్ని దాదాపు 9 నెలల పాటు ఇంట్లోనే పెట్టుకుని నివసించారు. చాలా రోజులుగా ఆమె కనిపించకపోవడంతో సందేహించిన స్థానికులు బలవంతంగా ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, బెడ్‌పై అస్థిపంజరం కనిపించింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఇద్దరు సోదరులు అరుణ్ సాహా (65), అజిత్ సాహా (55)లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారించగా, జూన్ 16న తమ తల్లి మరణించినట్టు కొడుకులు చెప్పారు. వాతావరణ పరిస్థితుల కారణంగా తల్లి శవాన్ని అంత్యక్రియలు చేయడానికి తీసుకెళ్లలేదని తెలిపారు. అన్నదమ్ములు ఇరుగుపొరుగు వారితో కలిసేవారు కాదని, ఎవరితో మాట్లాడకుండా సమాజానికి దూరంగా ఉండేవారని స్థానికులు చెప్పారు. అంతేగాక వారి ఇల్లు ఊరికి కాస్త దూరంగా ఉండటంతో వృద్ధురాలు మరణించిన విషయం స్థానికులు వెంటనే తెలుసుకోలేకపోయారు. అన్నదమ్ములకు మానసిక సమస్యలు ఉండవచ్చని పోలీసు అధికారులు సందేహం వ్యక్తం చేశారు. వృద్ధురాలి అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్ పరీక్షలకు తరలించారు. గతేడాది కోల్‌కతాలో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది.