పొట్టకూటి కోసం వరంగల్ జిల్లా హసన్‌పర్తి నుంచి కరీంనగర్ జిల్లా కమలాపురం మండలం అంబాల గ్రామానికి వలస వచ్చిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంచార వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న శ్రీనివాస్(42) బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతిగా మద్యం సేవించే అలవాటు ఉండటంతో పాటు ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.
కరీంనగర్‌లో వలస కూలీ ఆత్మహత్య
Published Thu, Apr 7 2016 12:02 PM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM
Advertisement
Advertisement