కరీంనగర్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కరీంనగర్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్లకు చెందిన కోమటిపల్లి శ్రీనివాస్(18) కరీంనగర్‌లోని గణేష్‌నగర్‌లో ఓ గది అద్దెకు తీసుకుని ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు ప్రిపేరవుతున్నాడు. ఆదివారం రాత్రి తన గదిలోనే ఉరి వేసుకున్నాడు. సోమవారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.