కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం మోతె శివారులో బాంబు పేలి ఓ కార్మికుడు మృతి చెందగా, మరో కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. శుక్రవారం ఉదయం గుట్ట వద్ద రాళ్లు పగులగొట్టే పనిలో ఉండగా... సాపెల్లి శ్రీనివాస్ అనే కార్మికుడి చేతిలో ఉన్న బాంబు అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందగా, పక్కనే ఉన్న అశోక్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం అతడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బాంబు పేలి కార్మికుడు మృతి
Published Fri, Jun 3 2016 9:50 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM
Advertisement
Advertisement