గనిలోనే సింగరేణి కార్మికుడు మృతి | Worker killed in Singareni mine | Sakshi
Sakshi News home page

గనిలోనే సింగరేణి కార్మికుడు మృతి

Published Tue, Jul 19 2016 5:26 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

Worker killed in  Singareni mine

కరీంనగర్ జిల్లా రామగుండంలోని సింగరేణి బొగ్గుగనిలో ఒక కార్మికుడు చనిపోయాడు. గోదావరిఖనిలోని జీఎంకాలనీలోనివాసం ఉండే మింగబోయిన అనిల్‌కుమార్(22) గత నెల క్రితమే కార్మికుడిగా ఉద్యోగం పొందాడు. అతడు మంగళవారం రామగుండం డివిజన్-2 పరిధిలోని జీడీకే 7 ఎల్‌ఈపీ గనిలోమొదటిషిఫ్టులో పనిలోకి దిగాడు.

 

పని ప్రదేశంలో ప్రాణవాయువు అందక అనిల్ అక్కడే పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన తోటి కార్మికులు అతడిని గని బయటకు తెచ్చి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, అతడి మృతికి యాజమాన్యమే కారణమంటూ కార్మిక సంఘాలు గనిపైనే ఆందోళనకు దిగాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement