National Rural Employment Guarantee Act
-
నీరుగారిపోతున్న ఉపాధి హామీ
అనేక రకాల పోరాటాల ఫలితంగా భారతదేశంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టినది యూపీఏ–1 ప్రభుత్వం. అప్పట్లో ఆ పథకాన్ని యూపీఏలోని నయా ఉదార వాద లాబీ తీవ్రంగా వ్యతి రేకించింది. అయినప్పటికీ, ఆ ప్రభుత్వపు మనుగడ వామ పక్షాల మద్దతు మీద ఆధారపడి ఉంది కాబట్టి వామపక్షాలు గట్టిగా పట్టు పట్టడంతో... ప్రభుత్వానికి ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టక తప్పలేదు. మొదటి నుంచీ అమలులో ఈ పథకాన్ని చిన్నచూపు చూస్తూ వచ్చారు. ఒక ఏడాది కాలంలో కేవలం 100 రోజుల పని కల్పించడానికి మాత్రమే గ్యారంటీ ఇచ్చారు. అది కూడా కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే కల్పిస్తామన్నారు. ఈ పరిమితులు ఉన్నప్పటికీ, ఆ పథకం ప్రజలకు ఒక ఆర్థిక హక్కును కల్పించింది. ఉపాధి కల్పించడాన్ని ప్రభుత్వం నిరాక రించడం కుదరదు. ఒక నిర్ణీత కాలంలోపు గనుక ఉపాధిని కల్పించకపోతే ఆ ఉపాధి కోరుకున్న వ్యక్తికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని రోజు రోజుకీ నీరుగారుస్తున్న వైనం చూస్తుంటే, ఈ పథకం మనుగడే ప్రశ్నార్థకం అనిపిస్తున్నది. యూపీఏ–2 హయాం నుండే ఉపాధి హామీ పథ కాన్ని నీరుగార్చడం మొదలైంది. చాలా సంవత్సరాల పాటు బడ్జెట్లలో ఈ పథకానికి కేటాయింపు రూ. 60,000 కోట్ల దగ్గరే ఉండిపోయింది. అంటే పెరిగే ధరలకు అనుగుణంగానైనా కేటాయింపులను పెంచలేదన్నమాట. పార్లమెంటులో పెంపుదల గురించిన ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఉపాధి కోరిన ప్రతీ వారికీ ఈ పథకంలో పని కల్పించాలి గనుక బడ్జెట్లో ఎంత కేటాయించామనేది ప్రాధాన్యం లేని అంశమని, ఎంత మంది ఉపాధి కోరితే అంతమందికీ పని కల్పించేలా వాస్తవ కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వం సమా ధానం చెప్తూ ఉండేది. దాటవేత ధోరణి అనుసరిస్తూ ఉంది. ఇక ఈ విషయంలో మోదీ ప్రభుత్వ ధోరణి సంగతికి వస్తే... ఉపాధి హామీ పథకాన్నే తొలినాళ్ళలో మోదీ వ్యతిరేకించారు. అయితే అధికారంలోకి వచ్చాక దానిని రద్దు చేసే సాహసం చేయలేదు. కానీ అంతకంతకూ తక్కువ కేటాయింపులతో ఆ పథకానికి ఉచ్చు బిగిస్తూ వచ్చారు. 2019–20లో ఆ పథకం కింద అయిన వాస్తవ ఖర్చు రూ. 71,687 కోట్లు. కానీ 2020–21లో కేటాయించింది రూ. 61,500 కోట్లు మాత్రమే. నిజానికి ఆ సంవత్సరంలో లాక్డౌన్ కార ణంగా పట్టణాల్లో పనులు పోయి గ్రామాల బాట పట్టినవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వారందరూ తలదాచుకునే చోటు గాని, చేయడానికి పనిగాని లేక అల్లల్లాడిపోయారు. ఎంతో కొంతమేరకు వారిని ఆదుకున్నది ఉపాధి హామీ పథకం మాత్రమే. దాంతో ఉపాధిహామీ పథకానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రభుత్వం ఆ ఏడాది వాస్తవంగా రూ. 1,11,500 కోట్లు కేటాయించక తప్పలేదు. ఆ మరుసటి ఏడాది, అంటే 2021–22లో మళ్ళీ బడ్జెట్ కేటాయింపు కోత పెట్టి రూ. 73,000 కోట్లకే పరిమితం చేశారు. ఇది ఆ ముందటి ఏడు చేసిన వాస్తవ ఖర్చు కన్నా రూ. 38,500 కోట్లు తక్కువ. అయితే నవంబరు 25న ప్రభుత్వం మరో రూ. 10,000 కోట్లను కేటాయి స్తామని ప్రకటించింది. కానీ ఇది ఏ మూలకూ చాలదు. నవంబరు 25 నాటికే కూలీలకు రూ. 9,888 కోట్లు బకాయిపడింది ప్రభుత్వం. ఇప్పుడు అదనంగా కేటాయించినది ఆ బకాయిలకే సరిపోతుంది. మరి ఏడాది పొడవునా పథకాన్ని కొనసాగించడం ఏ విధంగా సాధ్య పడుతుంది! నిజానికి ప్రభుత్వం ఈ పథకం కింద ఖర్చుపెట్టే నిధుల్లో చాలా వరకు ప్రజల కొనుగోళ్ల ద్వారా జీఎస్టీ రూపంలో చాలావరకు తిరిగి ప్రభుత్వానికే చేరుతున్నదనే సంగతిని గుర్తించాలి. - భూక్య నాగేశ్వరరావు సామాజిక ఉద్యమకారుడు -
దీపికా పదుకొణె ఒక వలస కూలీ!
భోపాల్: బాలీవుడ్ నటి దీపికా పదుకుణె ఒక వలస కూలీ!. మధ్యప్రదేశ్‌లో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆమెకి ఒక జాబ్ కార్డు .. అందులో ఆమె ఫొటో కూడా ఉంది. మధ్యప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలో అధికారుల నిర్వాకం ఇది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం కింద దీపిక ఫొటోతో ఉన్న నకిలీకార్డు వ్యవహారం వెలుగులోకొచ్చింది. సోను శాంతిలాల్ పేరు మీద ఉన్న కార్డులో దీపిక ఫోటో ఉంది. ఆ గ్రామంలో పది మంది వరకు వలస కూలీలు ప్రముఖ బాలీవుడ్ నటుల ఫొటోలతో నకిలీ కార్డుల్ని తీసుకున్నారు. పీపర్‌ఖేడనాక గ్రామంలోని ఈ నకిలీ కార్డుల్ని వినియోగిస్తూ ఉపాధి హామీ పథకం కింద మంజూరయ్యే నగదును పొందుతున్నారు. మనోజ్ దూబే పేరు మీదనున్న నకిలీ కార్డు ద్వారా ప్రతీ నెల రూ.30 వేలు తీసుకుంటున్నట్టుగా జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇలా నకిలీ కార్డులతో లక్షల నగదు స్వాహా చేసినట్టుగా వెల్లడించారు. అయితే ఈ కార్డుల్లో పేరున్న వారు అసలు ఆ కార్డులు ఎవరో చేశారో తమకు తెలీదని సోను శాంతిలాల్ భర్త చెప్పారు. ఈ కార్డుల కింద ఎవరు ప్రతీ నెల డబ్బులు తీసుకుంటున్నారనే దానిపై జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. -
‘ఉపాధి’ కూలీల వేతనం ఏపీలోనే ఎక్కువ
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం పనులు దేశమంతటా జరుగుతున్నాయి.. కానీ, మన రాష్ట్రంలో ఈ పథకంలో పనిచేసే కూలీలకు ఒకరు ఒక రోజుకు పనిచేసినందుకు దేశంలోనే అత్యధికంగా సరాసరిన రూ.229.72 చొప్పున కూలి చెల్లిస్తున్నారు. ఈ పథకాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్న పది పెద్ద రాష్ట్రాల్లో కూలీకి రోజుకు రూ.164ల నుంచి రూ.200ల మధ్య వేతనాలు దక్కుతుండటం గమనార్హం. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే రోజు వారీ చేసిన పనికి కూలీగా కనిష్టంగా రూ.30ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.630 కోట్లు అదనపు లబ్ధి పొందినట్టు అధికారులు చెబుతున్నారు. ► కూలీలు రోజు వారీ చేసిన పని మొత్తానికి ప్రభుత్వం నిర్ధారించిన ధరల ప్రకారం విలువ కట్టి, దానిని ఆ పని చేసిన కూలీలకు సమంగా పంచే ప్రక్రియ రాష్ట్రంలో అమలు అవుతోంది. ఈ ప్రకారం మన రాష్టంలో కూలీలు రోజుకు సరాసరి రూ.229.72 చొప్పున ప్రయోజనం పొందుతున్నారు. ► తమిళనాడులో సగటున రోజుకు దక్కుతున్న కూలీ రూ.188.81. తెలంగాణలో రూ.165.55లే. రాష్ట్రంలో శ్రమశక్తి సంఘాల విధానంలో పని కల్పించడంతో ఎక్కువ కూలీదక్కడానికి వీలు పడుతోంది. ఉపాధి సిబ్బంది, సంఘాల సభ్యుల సమావేశాల్లో సమస్యలు చర్చించుకోవడం వల్ల ఈ పథకాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందినీ ఈ పథకంలో భాగస్వాములను చేయడంతో కూలీలకు వారి ఇంటికి సమీపంలోనే పని కల్పించేందుకు దోహదపడుతోంది. కరోనా పరిస్థితుల్లోనూ వేతనాన్ని వెంటనే చెల్లించటంతో కూలీలు పనులు చేయడానికి ఆసక్తి చూపారు. కరోనా సమయంలో మా పచారీ కొట్టు మూసివేయాల్సి వచ్చింది. చెన్నైలో ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తున్న మా అమ్మాయి ఉద్యోగమూ పోయింది. ఈ సమయంలో ఇద్దరం ఊళ్లోనే ఉపాధి పనులకు వెళ్లాం. ఏ వారం చేసిన పనికి డబ్బులు ఆ వారమే బ్యాంకులో పడ్డాయి. ఒక్కొక్కరికి రూ.పది వేల పైనే వచ్చాయి. – మద్దాల లక్ష్మీ, మేడేపల్లి, వేలేరుపల్లి మండలం, ప.గోదావరి మా అరటికాయల వ్యాపారం లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. ఆ సమయంలో భార్య, పాపతో కలిసి ఉపాధి పనులకు వెళ్లాం. ఆ డబ్బులకు మరికొంత కలిపి రెండు ఆవులు కొన్నాం. లాక్డౌన్ ఎత్తేశాక మళ్లీ అరటికాయలు అమ్ముతున్నా. – లోచెర్ల రామారావు, బొండపల్లి, గరివిడి మండలం, విజయనగరం జిల్లా -
ఏపీలో రూ.8,000 కోట్లతో ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే ఆర్థిక ఏడాదిలో నిరుపేద కూలీలకు రూ.8,000 కోట్ల మేర పనులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో 2021-22 ఉపాధి హామీ లేబర్ బడ్జెట్ రూపకల్పనకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కూలీలకు ఏడాది మొత్తంలో 30 కోట్ల పనిదినాలు కల్పించేలా గ్రామాలు, జిల్లాలవారీగా నెలవారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ప్రతి గ్రామంలో లేబర్ బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ఆరంభమైంది. నవంబరు 15వతేదీలోగా వీటిని సిద్ధం చేసి అదే నెల 30వతేదీ కల్లా గ్రామ పంచాయతీల అనుమతి తీసుకుంటారు. డిసెంబరు నెలాఖరు కల్లా గ్రామాల వారీగా ప్రణాళికలను కలెక్టర్లు ఆమోదిస్తారు. ఉపాధి హామీ లేబర్ బడ్జెట్ రూపకల్పనకు ప్రస్తుతం అధికారులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వారం పది రోజుల్లో గ్రామ స్థాయి వరకు శిక్షణ పూర్తి కానుంది. సచివాలయాల భాగస్వామ్యం.. ‘గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి’ ప్రణాళికలు అనే నినాదంతో ఉపాధి హామీ లేబర్ బడ్జెట్ రూపకల్పనలో గ్రామ సచివాలయాల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యలను చేసింది. వలంటీర్లతో పాటు గ్రామ సచివాలయంలో పనిచేసే వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, మత్స్య సహాయకుల సహాయంతో ఉపాధి హామీ ద్వారా చేపట్టే అవకాశం ఉన్న పనులను గుర్తిస్తారు. వ్యవసాయం, అనుబంధ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ చిన్న నదుల పునరుజ్జీవం, చెరువుల్లో పూడికతీత, హార్టికల్చర్, ప్లాంటేషన్, సేద్యపు నీటి కుంటలు, గిరిజన ప్రాంతాల్లో ఆర్వోఎఫ్ఆర్ భూముల సమగ్ర అభివృద్ధి తదితర పనులను వచ్చే ఆర్ధిక సంవత్సరంలో పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించారు. (చదవండి: ఆపద సమయంలో ప్రభుత్వాస్పత్రులే అండ..!) ప్రజలకు ఉపకరించే స్థిరాస్తి కల్పన పనులు గుర్తించాలి ఏడాది పొడవునా కూలీలకు నిరంతరాయంగా పనులు కల్పించేందుకు తగినన్ని పనులను లేబర్ బడ్జెట్ ప్లానింగ్ సమయంలో గుర్తించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. 2021-22 ఉపాధి హామీ లేబర్ బడ్జెట్ తయారీ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమాలను మంగళవారం ఆయన విజయవాడలో ప్రారంభించారు. రెండు రోజుల పాటు వీటిని నిర్వహించనున్నారు. ప్రాంతం, సీజన్‌ను బట్టి ఉపాధి హామీ పనులను ఎంపిక చేయాలని సూచించారు. ప్రజలకు ఉపకరించే స్థిరాస్తుల కల్పన పనులను చేపట్టాలన్నారు. వినూత్న పనులకు ప్రణాళికలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 2021- 22లో పేదలకు 30 కోట్ల పనుల కల్పించాలంటే 45 కోట్ల పనిదినాలకు సరిపడా పనులను గుర్తించాలన్నారు. ప్రణాళిక సమయంలోనే జాబ్ కార్డులు లేని కూలీలను గుర్తించి జారీ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్లు శివప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: పోర్టబులిటీ.. ‘వలస’పాలిట పెన్నిధి) -
రికార్డు స్థాయిలో ఉపాధి
సాక్షి, హైదరాబాద్: కరోనా సృష్టించిన విధ్వంసం బడుగు జీవులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై.. పొట్ట చేత పట్టుకొని పట్టణ బాట పట్టిన వలస జీవులు తిరిగి పల్లెలకు తిరిగివచ్చేలా చేసింది. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రిటైల్ తదితర రంగాలు కుదేలు కావడంతో ఉపాధి కోల్పో యి సొంతూరుకు చేరుకున్న సామాన్యులకు ‘ఉపాధి హామీ’లభించింది. చేతినిండా పని కల్పించింది. వ్యవసాయ పనులు ముగింపు దశకు చేరుకోవడం, లాక్డౌన్ కారణంగా మిగతా పనులు బంద్ కావడంతో ఉపాధి పనులకు డిమాండ్ పెరిగింది. (చదవండి:సహజీవనం చేయాల్సిందే) రికార్డు స్థాయిలో.. ఉపాధి హామీ పనులు ఈ ఏడాది రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి 16 లక్షల మంది కూలీలు పనిచేయగా.. ఈసారి ఏకంగా 23 లక్షల మంది పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌తో కొన్నాళ్లు పనులకు బ్రేక్ పడినా గత నెలాఖరు నుంచి జోరందుకున్నాయి. కరోనా నేపథ్యంలో మార్చి నెలాఖరులో కేంద్రం ఉపాధి హామీలను తాత్కాలికంగా నిలిపేసింది. గుంపులు గుంపులుగా పనిచేసే వీలుండటంతో వైరస్ ప్రబలే అవకాశముందని భావించిన కేంద్రం.. కొన్నాళ్లు ఆపేసింది. ఆ తర్వాత ఉపాధి పనుల నిర్వహణకు లాక్డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడమే కాకుండా కూలి మొత్తాన్ని కూడా పెంచింది. రోజువారీ కూలిని వివిధ అలవెన్స్‌తో కలిపి రూ.237 చేసింది. తొలుత కరోనా భయంతో పనులు చేసేందుకు కూలీలు వెనుకడుగు వేశారు. ఈ నేపథ్యంలోనే గత నెల మొదటివారంలో పనులకు వచ్చే కూలీల సంఖ్య 10 వేలు కూడా దాటలేదు. అయితే పంచాయతీ కార్యదర్శులు, మేట్లు అవగాహన కల్పించడం, జాగ్రత్తలు తీసుకోవడంతో క్రమేణా కూలీల సంఖ్య పెరిగింది. వ్యవసాయ పనులు చివరి దశకు చేరడం, లాక్‌డౌన్‌తో ఇతర పనులన్నీ బంద్ కావడంతో గ్రామాల్లోని కూలీలు ఉపాధి పనుల బాట పట్టారు. దీంతో పక్షం రోజుల క్రితం 12.51 లక్షలున్న కూలీల సంఖ్య.. తాజాగా 23 లక్షలకు చేరువైంది. గ్రామాల్లో జాబ్ కార్డుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇన్నాళ్లూ వలస వెళ్లిన గ్రామీణులు తిరిగి రావడం.. ఉపాధి పనులు చేసేందుకు ముందుకు వస్తుండటంతో ప్రభుత్వం కొత్త జాబ్ కార్డులు జారీ చేస్తోంది. (చదవండి: ఇక పరీక్షల్లేకుండానే..!) -
డ్వామాలో భారీగా బదిలీలు
సాక్షి, సంగారెడ్డి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కీలక పాత్ర పోషిస్తున్న క్షేత్రస్థాయి కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు మూడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ బదిలీల్లో ఉద్యోగుల పనితీరు, నైపుణ్యం, సాధించిన ఫలితాలకు పెద్దపీట వేయనున్నారు. జిల్లా గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పరిధిలో 44 మంది అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ అధికారులు(ఏపీఓ), 43 మంది ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు(ఈసీ), 198 మంది టెక్నికల్ అసిస్టెంట్లు(టీఏ), 74 మంది కంప్యూటర్ ఆపరేటర్లు(సీఓ) నిర్ణీతకాల ఉద్యోగులు(ఎఫ్‌టీఈ)గా కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధి పనుల నిర్వహణకు వీరే బాధ్యులు. ఏళ్ల తరబడి ఒకే చోట ఉండటం, సొంత మండలాల్లో పనిచేస్తుండడం ద్వారా స్థానికంగా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ బదిలీలను చేపట్టింది. ఈ నెల 17 నుంచి వచ్చే 11 వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. నవంబర్ 4 నుంచి 11 వరకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. బదిలీల్లో తొలి ప్రాధాన్యత మహిళలు, ఆ తర్వాత వికలాంగులకు, ఇతరులకు ఇస్తారు. అయితే, నైపుణ్యం, ఇతర అంశాలపై సాదించిన పాయింట్ల స్కోరే కీలకం కానుంది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డ్వామా పీడీ కన్వీనర్‌గా, డీఆర్డీఏ పీడీ, కలెక్టర్ నామినేట్ చేసిన సీనియర్ అధికారి సభ్యులుగా ఉండే కమిటీ ఈ బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనుంది. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరెవరికి బదిలీలు ? సొంత మండలాల్లో విధులు నిర్వహిస్తున్నా, ఒకే మండలంలో మూడేళ్లకు పై బడి కొనసాగుతున్నా, ఉపాధికి ప్రాధాన్యత ఉన్న మండలాల్లో పనిచేస్తూ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయినా, ప్రాధాన్యత మండలాల్లో పనిచేస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆశించిన ఫలితాలు సాదించకపోయినా..తప్పనిసరి బదిలీకి గురి కావాల్సిందే. ఏపీఓ, ఈసీలకు మాత్రమే సొంత మండలం నుంచి బదిలీ చేయనున్నారు. ఏడాది సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు సొంత విజ్ఞప్తిపై బదిలీని కోరడానికి అర్హులు. ఏడాది సర్వీసు పూర్తిచేసుకుంటే స్పౌజ్(జీవిత సహచరి) కేటగిరీ కింద బదిలీకి దరకాస్తు చేసుకోవచ్చు. పనితీరే ప్రామాణికం బదిలీల జాబితాలో ఉన్న ఉద్యోగులకు 9 రకాల పాయింట్లు కేటాయిస్తారు. ఎక్కువ పాయింట్లు సాధించిన ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత లభించనుంది. కూలీలకు పనికల్పన, కుటుంబాలకు 100 రోజుల పనికల్పన విషయంలో ప్రతిభ ఆధారంగా 4, 3, 2,1 పాయింట్లను కేటాయిస్తారు. శ్రమశక్తి సంఘాల డిమాండుకు అనుగుణంగా పనికల్పనలో చూపిన నైపుణ్యానికీ స్కోర్లు వేస్తారు. 100 శాతం పనికల్పిస్తే 4 పాయింట్లు, 80 శాతానికి 3 పాయింట్లు, 75 శాతానికి 2 పాయింట్లు, 70 శాతానికి 1 పాయింట్‌ను పొందుతారు. సకాంలో ఈ-మస్టర్లను డిటైల్డ్‌గా పంపిస్తే 4 పాయింట్లు వస్తాయి. లేకుంటే ఎలాంటి పాయింట్లు ఉండవు.