బడికి వెళ్లని ‘బాల్యం’ | 'Childhood' never gone to school | Sakshi
Sakshi News home page

బడికి వెళ్లని ‘బాల్యం’

Published Thu, Nov 24 2016 8:56 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

బడికి వెళ్లని ‘బాల్యం’ - Sakshi

బడికి వెళ్లని ‘బాల్యం’

పొట్ట చేతపట్టుకొని కర్నూలు నుంచి వందల సంఖ్యలో వ్యవసాయ కూలీలు తాడికొండ, మేడికొండూరు మండలాల్లోని పలు గ్రామాలకు వచ్చారు. వీరంతా పిల్లా పాపలతో తరలివచ్చారు. వీరు పొలాల్లోనే తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్నారు. నిర్బంధ విద్యాహక్కు చట్టం అమలు కాగితాల్లోనే తప్ప.. ఇటువంటి వలస కూలీల పిల్లల విషయంలో ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవు.  తల్లిదండ్రులతో పాటు ఊరూరా తిరిగే వీరు కూడా చదువు సంధ్యల్లేక కాస్త వయసు రాగానే పొలం పనులకే వెళుతూ తల్లిదండ్రుల బాటే పట్టక తప్పదు. దీంతో వీరికి నిరక్షరాస్యత తరతరాల వారసత్వంగా సంక్రమిస్తుంటుంది.  - తాడికొండ రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement