గుంటూరు: రైతులకు అండగా నిలిచేందుకు తమ పార్టీ సన్నద్దంగానే ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతులు, కూలీల పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో నూతన రాజధాని నిర్మాణం చేపట్టనున్న గ్రామాలలో కమిటీ గురువారం పర్యటించింది.
ఉండవల్లి, ఉద్దండరాయుని పాలెం, లింగాయపాలెం గ్రామాల్లో కమిటీ సభ్యులు పర్యటించారు. పోలీసు బాధిత రైతులతో మాట్లాడారు. రైతులు, కూలీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి పార్థసారధి, మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ముస్తఫా, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్, కోన రఘుపతి తదితరులు గ్రామాల్లో పర్యటించిన వారిలో ఉన్నారు.
'రైతులు, కూలీలపై అక్రమ కేసులు ఎత్తేయాలి'
Published Thu, Jan 8 2015 3:40 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement