
అమరావతి: టీడీపీ ప్రభుత్వం మరో కొత్త ప్లాన్ వేసిందంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను తీసుకెళ్లడానికి రాజధాని రైతుల పేరుతో సర్కారు వేసిన ప్లాన్ అని ఎమ్మెల్యే ఆర్కే విమర్శించారు. రాజధానికి రైతుల నుంచి భూములు సేకరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రభుత్వం భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. రైతుల ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో వారికే తెలియదని ఆయన పేర్కొన్నారు.
రాజధాని రైతుల పేరుతో వారిని సింగపూర్ తీసుకెళ్లడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. రైతుల దగ్గర భూములకు సంబంధించిన పాస్‌బుక్‌లు మాత్రమే ఉంటాయి. వారి వద్ద పాస్‌పోర్టులు ఉండవనే విషాయాన్ని సీఎం గ్రహించాలని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.