మద్యం వ్యాపారుల నయా ట్రెండ్
మందుబాబులకు కాంబో
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో గిరాకీ తగ్గిన మద్యం వ్యాపారులు సరికొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. రూ.500, వెయ్యి నోటుతో మద్యం దుకాణాలకు వస్తున్న వారిని ఆకర్షించేందుకు సరికొత్త కాంబో ఆఫర్‌ను అందిస్తున్నారు. ఉదాహరణకు రూ.500 నోటుతో వచ్చేవారికి అరసీసా ప్రీమియం బ్రాండు మందు (375ఎంఎల్), ఒక లీటరు వాటర్ బాటిల్, మరో లీటరు సోడా అందిస్తుండటం గమనార్హం. ఇక రూ.వెయ్యి నోటుతో వచ్చినవారికీ బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు.
వీరికి ఫుల్‌బాటిల్‌తోపాటు రెండు లీటర్ల నీళ్ల బాటిల్, ఒక లీటరు సోడా, తినేందుకు స్నాక్స్ చేతిలో పెట్టడం గమనార్హం. మహానగరం పరిధిలో 500 మద్యం దుకాణాలు, 570 వరకు బార్లున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో వీటికి గిరాకీ ఇటీవల సుమారు 50 శాతం మేర పడిపోరుుంది. పలు దుకాణాల్లో క్రెడిట్, డెబిట్ కార్డులతో మద్యం సరఫరా చేస్తున్నారు. ఇక దినసరి కూలీలు, చిరుద్యోగులు కొనుగోలు చేసే చీప్‌లిక్కర్ గిరాకీ అమాంతం పడిపోయినట్లు పలువురు వ్యాపారులు చెబుతున్నారు.