Liquor Stores
-
ఇక ప్రీమియం మద్యం స్టోర్స్ దందా
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం దందాకు పూర్తిస్థాయిలో తెగించింది. ఇప్పటికే టీడీపీ నేతల సిండికేట్‌కు 3,396 ప్రైవేట్ మద్యం దుకాణాలను కట్టబెట్టిన ప్రభుత్వం తాజాగా కొత్త సంవత్సరం కానుకగా రాష్ట్రంలో ప్రీమియం మద్యం స్టోర్స్‌కు షట్టర్స్ తెరవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రీమియం మద్యం స్టోర్స్ విధానాన్ని మంగళవారం ప్రకటించింది. ఆ మేరకు ఎక్సైజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. టీడీపీ ప్రభుత్వం సెప్టెంబర్ లో ప్రకటించిన మద్యం విధానానికి తానే తూట్లు పొడుస్తూ మరింతగా ప్రీమియం మద్యం దందాకు తలుపులు బార్లా తెరవడం గమనార్హం. నగర, పట్టణ ప్రాంతాల్లో 12 ప్రీమియం మద్యం స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తన మద్యం విధానంలో తెలిపింది. కానీ.. మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం ప్రీమియం మద్యం స్టోర్స్ సంఖ్యను ప్రకటించక పోవడం గమనార్హం. పైగా ఎక్సైజ్ కమిషనర్ అన్ని అంశాలను పరిశీలించి ఎప్పుడు.. ఎన్ని ప్రీమియం మద్యం స్టోర్స్ అవసరమని భావిస్తే అన్ని స్టోర్స్ ఏర్పాటు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే పరిమితి లేకుండా ప్రీమియం మద్యం స్టోర్స్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. టీడీపీ కూటమి పెద్దలు రాష్ట్రంలో ఎప్పడు.. ఏ ప్రాంతంలో ప్రీమియం మద్యం స్టోర్స్ ఏర్పాటు చేయాలని భావిస్తే.. తదనుగుణంగా ఎక్సైజ్ శాఖ అనుమతి జారీ చేసేందుకు సదా సిద్ధంగా ఉంటుందన్నది అసలు లోగుట్టు. ఐదేళ్ల కాల పరిమితితో ప్రీమియం మద్యం స్టోర్స్‌కు ప్రభుత్వం లైసెన్సులు కేటాయిస్తుంది. వేలం ప్రక్రియ ద్వారా లైసెన్సులు కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అందుకు ఒక్కో స్టోర్‌కు రూ.15 లక్షలు నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దరఖాస్తులు ఆన్లైన్, హైబ్రీడ్, ఆఫ్‌లైన్ విధానంలో స్వీకరిస్తారు. ప్రీమియం మద్యం స్టోర్ లైసెన్స్ దక్కించుకున్న వారు ఏడాదికి ఎక్సైజ్ శాఖకు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఆర్ఈటీ)గా రూ.కోటి చెల్లించాల్సి ఉంటుంది. ఆర్ఈటీ ఏటా 20 శాతం పెరుగుతుందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో వీటికి విడిగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో ప్రీమియం మద్యం స్టోర్స్ ప్రారంభం కానున్నాయి. -
‘ఎల్లో’ సిండికేట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి తెర తీసిన నేపథ్యంలో ‘‘ముఖ్య’’నేత కనుసన్నల్లో జరుగుతున్న దుకాణాల కేటాయింపుల్లో టీడీపీ సిండికేట్‌కు రాచబాట పరుస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు. మద్యం షాపుల ఏర్పాటుకు ‘‘ఆఫ్‌లైన్’’ ద్వారా వేల సంఖ్యలో అందుతున్న దరఖాస్తులు సిండికేట్ దందాకు పక్కా నిదర్శనంగా నిలుస్తోంది. ఆన్లైన్ ద్వారా అక్కడక్కడా అరకొరగా వచ్చిన దరఖాస్తులను సైతం సిబ్బంది ద్వారా కాగితాలపై నింపడం మద్యం అక్రమాలకు పరాకాష్ట. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 20 –30 దరఖాస్తులు వస్తాయి. మారుమూల ప్రాంతాల్లోనూ కనీసం పది దరఖాస్తులు అందుతాయి. అలాంటిది మరో నాలుగు రోజుల్లో గడువు ముగుస్తున్నా ఒక్కో దుకాణానికి కనీసం మూడు దరఖాస్తులు కూడా రాకపోవటాన్ని బట్టి టీడీపీ మద్యం సిండికేట్ ఏ స్థాయిలో శాసిస్తోందో వెల్లడవుతోంది. రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలకుగానూ ఇప్పటివరకు 8,274 దరఖాస్తులు మాత్రమే అందడం.. అది కూడా దాదాపుగా అంతా ఆఫ్‌లైన్‌లోనే రావడం గమనార్హం. ప్రైవేట్ మద్యం దుకాణాల ద్వారా టీడీపీ సిండికేట్ దోపిడీకి కూటమి ప్రభుత్వం రాచబాట పరిచింది. టీడీపీ సిండికేట్ మినహా ఇతరులెవరూ దరఖాస్తు చేయకుండా అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖ ద్వారా ఎత్తుగడ వేసింది. కేవలం ఎక్సైజ్ శాఖ కార్యాలయాలకు వచ్చి సమర్పించే దరఖాస్తులకే ప్రాధాన్యమిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు సాంకేతిక అడ్డంకులు సృష్టిస్తూ టీడీపీ సిండికేట్‌కు కొమ్ముకాస్తోంది. ఇతరులు ఎక్సైజ్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసేందుకు యత్నిస్తే బెదిరించి వెనక్కి పంపుతున్నారు.సిండికేట్.. ఆన్‘లైన్’రాష్ట్రంలో 3,396 ప్రైవేట్ మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం ఎక్సైజ్ శాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఈ నెల 1 నుంచి 10వతేదీ వరకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా ఎక్సైజ్ కార్యాలయాలకు వెళ్లి నేరుగా దరఖాస్తు (ఆఫ్‌లైన్) చేసుకోవడంతోపాటు ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చని పేర్కొంది. మొదటి రోజైన మంగళవారం 200 దరఖాస్తులు అందగా ఆశ్చర్యకరంగా కేవలం రెండు మాత్రమే ఆన్లైన్లో రావడం గమనార్హం. తాజాగా ఆదివారం నాటికి మొత్తం 8,274 దరఖాస్తులు రాగా వీటిలో 6,520 ఆఫ్‌లైన్‌లోనే స్వీకరించడం గమనార్హం. 1,754 దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్లో అందాయి.ఎక్సైజ్ కార్యాలయాల్లో తిష్టమద్యం దుకాణాల లైసెన్సులన్నీ గంపగుత్తగా టీడీపీ సిండికేట్‌కే దక్కాలని ప్రభుత్వ పెద్దలు ఎక్సైజ్ అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆన్లైన్ దరఖాస్తులకు ఎక్సైజ్ శాఖ సాంకేతికంగా మోకాలడ్డుతోంది. ఎంతోమంది ఆన్లైన్ ద్వారా మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యపడటం లేదు. సాంకేతిక కారణాలు, సర్వర్ డౌన్ అంటూ దరఖాస్తులు అప్లోడ్ కావడం లేదని చెబుతున్నారు. ఎక్సైజ్ అధికారులను సంప్రదిస్తే కనీస స్పందన లేదని పేర్కొంటున్నారు. ఇదే అదునుగా టీడీపీ సిండికేట్ సభ్యులు నేరుగా ఎక్సైజ్ శాఖ కార్యాలయాలకు వచ్చి ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేస్తున్నారు. వారంతా ఎక్సైజ్ కార్యాలయాల్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు తిష్ట వేస్తున్నారు. ఇతరులు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటున్నారు. తమను కాదని దరఖాస్తు చేసినా లైసెన్సులు రావని, లాటరీ ద్వారా ఎంపిక అన్నది పూర్తిగా బోగస్ అని తేల్చి చెబుతున్నారు.దాడులు.. కేసుల బెదిరింపులుఆఫ్లైన్లో దరఖాస్తు చేస్తామని మొండికేస్తున్న వారిని టీడీపీ సిండికేట్ తీవ్ర బెదిరింపులకు గురి చేస్తోంది. ‘మమ్మల్ని కాదని దరఖాస్తు చేస్తే ఊళ్లో వ్యాపారం చేయగలవా? నీకు మద్యం దుకాణం కోసం షాపు ఎవరు అద్దెకు ఇస్తారో చూస్తాం. సొంత దుకాణంలో పెడితే ఎక్సైజ్ అధికారులతో దాడులు చేయిస్తాం. అక్రమ కేసులు బనాయిస్తాం.. ’ అని ఎక్సైజ్ అధికారుల సమక్షంలోనే హెచ్చరిస్తున్నారు. సిండికేట్‌కు సంబంధం లేని వ్యక్తులు దరఖాస్తు చేస్తే ఫోన్ నంబర్లు సేకరించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇతరులు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసేందుకు వెనుకాడుతున్నారు. మద్యం దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను ఎక్సైజ్ శాఖ ఏ రోజుకు ఆ రోజు అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. తద్వారా పారదర్శకతకు పాతరేస్తూ ఏకపక్షంగా టీడీపీ సిండికేట్‌కు దుకాణాల లైసెన్సులు కట్టబెట్టేందుకు సహకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగుల నిరసన
-
పురందేశ్వరి ‘సిండికేట్’ రాజకీయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యం సిండి‘కేట్ల’ను తరిమికొట్టారు. మద్యపాన నియంత్రణకు గట్టి చర్యలు చేపట్టారు. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను, అడుగడుగునా వెలసిన బెల్టు షాపులను తుదముట్టించి సిండికేట్ల నడుం విరగ్గొట్టారు. ఇప్పుడు మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. వాటి సంఖ్యను కూడా భారీగా తగ్గించింది. దీంతో రాష్ట్ర ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్య పరంగా పీల్చి పిప్పిచేస్తున్న మద్యం సిండికేట్లు కుదేలయ్యాయి. ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించి, మద్యం సిండికేట్ల ప్రయోజనాలే పరమార్థంగా పనిచేసే ఈ విపక్షాలు, పత్రికలకు ఈ పరిణామం కంటగింపుగా మారింది. తమకు ఆదాయాన్ని పంచే మద్యం సిండికేట్ల కోసం అవి రంగంలోకి దిగాయి. కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పైన దుష్ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో దుష్ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి. మద్యం సిండికేట్లకు కొమ్ముకాసిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి అరెస్టయ్యారు. దీంతో మద్యం సిండికేట్ల బాధ్యతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నెత్తిన ఎత్తుకున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా ఆమె మాటలు, చర్యలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన పురందేశ్వరి ఆ పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెడుతూ.. కుటుంబం, మద్యం సిండికేట్ల కోసం పనిచేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మద్యం దుకాణాలు, డిస్టిలరీల విషయంలో ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని రాజకీయ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో డిస్టిలరీలన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వాల్లో ఏర్పాటయినవే. 20 డిస్టిలరీల్లో 12 చంద్రబాబు సీఎంగా ఉండగా అనుమతిచ్చినవే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజారోగ్యం దృష్ట్యా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ వాస్తవాలను విస్మరించి, పురందేశ్వరి అసత్య ప్రచారానికి దిగారు. ఇది కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమేనన్నది సుస్పష్టం. బీజేపీ సిద్ధాంతానికి తిలోదకాలు నేషన్ ఫస్ట్–పార్టీ నెక్ట్స్–సెల్ఫ్ లాస్ట్ (దేశం తొలి ప్రాధాన్యత–పార్టీ మలి ప్రాధాన్యత–వ్యక్తిగత ప్రయోజనాలు ఆఖరు) అనేది బీజేపీ సిద్ధాంతం. కానీ, ఆ పార్టీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బీజేపీ సిద్ధాంతానికి తిలోదకాలిచ్చారు. పార్టీ కంటే సొంత కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చేలా ఆమె చర్యలు ఉన్నాయని బీజేపీ నేతల్లోనే చర్చ సాగుతోంది. ఆమె రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ ప్రయోజనాలకంటే కుటుంబ ప్రయోజనాల కోసమే కార్యక్రమాలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ మోదీకి, బీజేపీకి దగ్గరయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే పురందేశ్వరి ఎన్టీఆర్ నాణెం ముద్రణ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి, అ కార్యక్రమంలో చంద్రêబును, బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఆహ్వానించి, వారి మధ్య సయోధ్యకు ప్రయత్నించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్‌పైనా ఇదే తీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంపూర్ణ మద్య నిషేధం విధించడంతో మద్యం సిండికేట్లకు అడ్డుకట్ట పడింది. ఈ సిండికేట్లకు మద్దతుగా అప్పట్లో చంద్రబాబు తదితరులు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, ఆయన ప్రభుత్వాన్ని కూలదోశారు. ఆ వెంటనే చంద్రబాబు సీఎం పీఠమెక్కారు. సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచారు. మళ్లీ సిండికేట్ల రాజ్యం వచ్చింది. ఇబ్బడిముబ్బడిగా మద్యం దుకాణాలు వెలిశాయి. వీధికో బెల్టు షాపు వచ్చింది. వేయి తలల మద్య రక్కసి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని చిదిమేసింది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో, ఆ తర్వాత చంద్రబాబు పీఠాన్ని అధిష్టించడంలో దగ్గుబాటి పురందేశ్వరికి కూడా∙భాగస్వామ్యం ఉందని అప్పట్లో టీడీపీ వర్గాలే చెప్పాయి. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో ఆమె ఎక్కడా దానిని వ్యతిరేకించలేదని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వెన్నుపోటు రాజకీయం, సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడవడంలో చంద్రబాబుకు సహకరించిన కొన్ని పత్రికలే ఇప్పుడు రాష్ట్రంలో మద్యపాన నియంత్రణ చర్యలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వంపైనా అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఆ పత్రికల కథనాలను అనుసరిస్తూ పురందేశ్వరి ఇప్పుడు ఏకంగా సీఎం జగన్మోహన్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసే స్థాయికి వచ్చారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. చంద్రబాబు అవినీతిపై ప్రధాని మోదీ ఆరోపణలు చేసినా.. రాష్ట్రానికి 2014–19 మధ్య సీఎంగా పనిచేసిన చంద్రబాబు అవినీతిపై స్వయంగా ప్రధాని మోదీనే అనేక ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పట్లో వచ్చిన అనేక ఆరోపణల్లో ఒకటైన స్కిల్ స్కామ్‌లో సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేయగానే, ఆ అరెస్టును తప్పు పడుతూ టీడీపీ నాయకులకంటే ముందే పురందేశ్వరి సామాజిక మా«ధ్యమాల్లో ఖండించారు. రెండు రోజుల క్రితం లోకేశ్ ఢిల్లీలో అమిత్ షాను కలిస్తే.. ఆ భేటీ వివరాలు, ఫొటోలను కూడా లోకేశ్కంటే అరగంట ముందే పురందేశ్వరి ట్వీట్ చేశారు. ఇరువురి భేటీ వివరాలను పురందేశ్వరి సూచన మేరకు బీజేపీ రాష్ట్ర మీడియా విభాగం మీడియా ప్రతినిధులకూ వెంటనే తెలియజేసింది. అవినీతిపరుడని స్వయంగా ప్రధానే ఆరోపించిన చంద్రబాబు విషయంలో పురందేశ్వరి ఇలా వ్యవహరిస్తే బీజేపీ దెబ్బతినడం ఖాయమని ఆ పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బీజేపీని బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాల్సిన పురందేశ్వరి కీలక ఎన్నికల సమయంలో టీడీపీ ఆడే డ్రామాలో పావుగా మారారని, వచ్చిన అవకాశాలను కూడా∙చేజేతులా నిర్వీర్యం చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేతలు ధ్వజమెత్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలందరూ పూర్తి నైరాశ్యంలో ఉన్నారని, వారిలో కొందరు బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని పురందేశ్వరి వినియోగించుకోకపోగా, టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారా.. అనే అనుమానం కలిగేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. -
మద్యం అమ్మకాలు బంద్
కర్నూలు : గణేష్ నిమజ్జన వేడుకలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయించాలన్న కలెక్టర్ ఆదేశాల మేరకు ఎకై ్సజ్ అధికారులు చర్యలు చేపట్టారు. వెల్దుర్తి, ఎమ్మిగనూరులో ఈనెల 20వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 22 తేది ఉదయం 10 గంటల వరకు, ఆదోని, గూడూరులో 21వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 23వ తేదీ ఉదయం 10 గంటల వరకు, కర్నూలులో 25వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 27వ తేదీ ఉదయం 10 గంటల వరకు బార్లు, మద్యం దుకాణాల్లో విక్రయాలు జరగకుండా సీజ్ చేయనున్నట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. -
మద్యం దుకాణాలను ప్రైవేటుపరం చేసే ఉద్దేశమే లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. దశలవారీగా మద్యం నియంత్రణకు కట్టుబడే ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణను ప్రైవేటు వ్యక్తుల నుంచి తొలగించిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రభుత్వ నిర్వహణలో మద్యం దుకాణాలు ఉండటం ద్వారానే దశలవారీ మద్యం నియంత్రణ సాధించగలమన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని పునరుద్ఘాటించింది. రాష్ట్రంలో మద్యం దుకాణాలను తిరిగి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురించిన కథనాలు పూర్తిగా అవాస్తవమని బేవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి శనివారం స్పష్టం చేశారు. సెబీలో నమోదు చేసుకుని నిబంధనల మేరకే బాండ్ల జారీకి బేవరేజస్ కార్పొరేషన్ సన్నద్ధమవుతున్న తరుణంలో సంస్థ ఆర్థిక అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దశలవారీగా మద్యం నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. ఆ చర్యలు ఇలా.. ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉంటే అనర్థాలే ► మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉంటే అనేక అనర్థాలకు దారి తీస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వేళాపాళా లేకుండా మద్యం దుకాణాలను నిర్వహిస్తారు. ఈ విషయాన్ని గుర్తించే ప్రభుత్వం 2019 అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలను అధీనంలోకి తీసుకుంది. ► మద్యం నియంత్రణ చర్యల్లో భాగంగా అప్పటివరకు ఉన్న 4,380 మద్యం దుకాణాలను 2,934 దుకాణాలకు తగ్గించింది. ► మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ ఈ ఏడాది సెబీలో నమోదు చేసుకుని డిబెంచర్లు జారీ చేసింది. సెబీ నిబంధనల మేరకు పారదర్శకంగా ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తోంది. ఆర్థిక నిపుణుల సూచనలతో పూర్తి ఆర్థిక క్రమశిక్షణతో బేవరేజస్ కార్పొరేషన్ లావాదేవీలు నిర్వహిస్తోంది. ► ఇటీవల కొన్ని వర్గాలు, పత్రికలు ప్రభుత్వ పనితీరుపై పనిగట్టుకుని దుష్ప్రచారం సాగిస్తున్నాయి. అందులో భాగంగానే రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో విష పదార్థాల అవశేషాలు ఉన్నాయనే అసత్య ప్రచారాన్ని పదే పదే చేస్తున్నాయి. అందుకోసమే చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబొరేటరీలో కొన్ని తప్పుడు పరీక్షలు చేయించి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయి. ► కానీ రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో ప్రమాదకర అవశేషాలు ఉన్నట్టు తాము నివేదిక ఇవ్వలేదని ఎస్జీఎస్ ల్యాబొరేటరీ స్పష్టం చేసింది. కేవలం బేవరేజస్ కార్పొరేషన్ బాండ్లు జారీ చేస్తున్న తరుణంలో ఆర్థిక అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకే ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారు. ► అదే రీతిలో ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనుందని తాజాగా అసత్య ప్రచారాన్ని తెరపైకి తెచ్చి తప్పుడు ఊహాగానాలను వ్యాప్తిలోకి తెచ్చారు. ఇది శోచనీయం. -
గోవా మద్యం విక్రయ ముఠా గుట్టురట్టు
నెల్లూరు (క్రైమ్): గోవా మద్యం బాటిళ్లకు ఏపీ మద్యం లేబుల్స్‌ను అతికించి.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న ముఠా గుట్టును నెల్లూరు సెబ్ అధికారులు రట్టు చేశారు. 8 మందిని అరెస్టు చేసి.. రూ.23 లక్షల విలువ చేసే గోవా మద్యాన్ని, ఓ కారు, నకిలీ లేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు, సెబ్ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీలక్ష్మితో కలిసి మంగళవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నెల్లూరు హరనాథపురంలో నివాసం ఉంటున్న చీమల విజయభాస్కర్‌రెడ్డి తన స్నేహితులతో కలిసి ఈ నెల 22న గోవా నుంచి తారు ట్యాంకర్లో భారీగా మద్యం సీసాలను నెల్లూరు నగరానికి తీసుకొచ్చారు. బాటిళ్లకు గోవా లేబుల్స్‌ను తొలగించి ఏపీ మద్యం నకిలీ లేబుల్స్‌ను అతికించి అనంతసాగరం, చిలకలమర్రితో పాటు మరో రెండు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందటంతో సెబ్ అధికారులు ఈ నెల 28న మాగుంట లేఅవుట్లో వాహన తనిఖీలు నిర్వహించి, ఓ కారులో 793 క్వార్టర్ బాటిళ్ల గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దర్ని అరెస్ట్ చేశారు. విచారణలో వారిచ్చిన సమాచారం మేరకు నిందితుల ఇళ్లపై దాడులు నిర్వహించి 17,808 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8 మందిని అరెస్టు చేయగా.. మరో 6 మంది పరారీలో ఉన్నారు. -
అలా అని ఏ చట్టం చెబుతోంది?
సాక్షి, అమరావతి : మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు తప్పనిసరని ఏ చట్ట నిబంధనలు చెబుతున్నాయో తమ ముందుంచాలని హైకోర్టు పిటిషనర్‌ను ఆదేశించింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్, ఆన్లైన్ చెల్లింపులను ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా, చీరాలకు చెందిన దాసరి ఇమ్మాన్యుయెల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వంకాయలపాటి నాగ ప్రవీణ్ వాదనలు వినిపిస్తూ, డిజిటల్ చెల్లింపుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం చట్ట నిబంధనలు తీసుకొచ్చిందన్నారు. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, మద్యం తాగడానికి వచ్చే పేదలకు డిజిటల్ చెల్లింపులు అడ్డంకిగా మారుతాయని, ఇది వారి హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యం ద్వారా మద్యం తాగే పేదల వెంట ఎందుకు పడ్డారని ధర్మాసనం సరదాగా పిటిషనర్‌ను ప్రశ్నించింది. డిజిటల్ చెల్లింపుల విషయంలో చట్ట నిబంధనలను తమ ముందుంచాలంది. తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేసింది. -
రిజర్వేషన్లు కల్పించాలని చట్టంలో ఎక్కడుంది? : తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మద్యం దుకాణాల కేటాయింపును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కులాల ఆధారంగా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కేటాయించాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించింది. ఈ మేరకు వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. కులాల ఆధారంగా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి వీల్లేదని అభిప్రాయపడింది. విద్య, ఉద్యోగ రంగాల్లో మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోందని పేర్కొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు మద్యం దుకాణాలు కేటాయించేలా ఆదేశించాలంటూ తెలంగాణ రిపబ్లిక్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు 15.45 శాతం, ఎస్టీలు 9.08 శాతం ఉన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. ఇదే ప్రాతిపదికన మద్యం దుకాణాల్లో అంతే శాతం రిజర్వేషన్ కేటాయించేలా ఆదేశించాలని కోరారు. ‘మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు ప్రభుత్వం ఉదారంగా కల్పించింది. రాజ్యాంగంలో, చట్టంలో ఎక్కడా రిజర్వేషన్లు ఇవ్వాలని లేదు. రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమే. ఇలా రిజర్వేషన్లు కల్పించడానికి వీల్లేదు’అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా, గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకు మద్యం దుకాణాలను కేటాయించడాన్ని సవాల్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన భూక్యా మంగీలాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది. -
మద్యం టెండర్.. ఆదాయం వండర్
సాక్షి, హైదరాబాద్: ఈసారి మద్యం టెండర్లో గతంలో ఎప్పుడూలేనంతగా ఖజానాకు కాసులు రాలాయి. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకుగాను నిర్వహించిన టెండర్లలో మొత్తం 67,849 దరఖాస్తులు వచ్చాయని ఎౖక్సైజ్ శాఖ వెల్లడించింది. ఇందులో దాదాపు 10 శాతం ఒక్క ఖమ్మం జిల్లా నుంచే రావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల ద్వారా రూ.1,357 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలుగా ఉంది. ఈసారి షాపుల సంఖ్య పెరగడంతో దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. గత టెండర్ల సమయంలో దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి రూ.975 కోట్ల ఆదాయం రాగా, ఈసారి దాదాపు రూ.400 కోట్లు ఎక్కువగా వచ్చింది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఆయా జిల్లాల్లో కలెక్టర్లు శనివారం ఈ దరఖాస్తులకు డ్రా తీసేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. గత రెండేళ్లతో పోలిస్తే రాష్ట్రంలోని కొన్ని షాపులకు దరఖాస్తులు తక్కువగా వచ్చాయని ఎక్సైజ్ శాఖ తేల్చింది. ఇక్కడి వ్యాపారులు సిండికేట్ అయి తక్కువ దరఖాస్తులు వేశారనే అంచనాతో ఆయా షాపుల పరిధిలో ఏం జరిగిందన్న దానిపై స్థానిక ఎక్సైజ్ అధికారులతో విచారణ జరిపించాలని కమిషనర్ నిర్ణయించారు. విచారణ తర్వాతే ఆయా షాపులకు డ్రా తీసే కార్యక్రమం ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. -
సరిహద్దు వైన్స్‌కు భారీ గిరాకీ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఏపీ సరిహద్దు జిల్లాల్లోని మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారులు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దృష్ట్యా ఇక్కడ వ్యాపారం ‘మూడు బాటిళ్లు, ఆరు కాటన్లు’గా ఉంటుందని సదరు వ్యాపారులు లాభమోహాల్లో, ఊహల్లో తేలిపోతున్నారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా కొందరు నేతలు కూడా రంగంలోకి దిగి తమ బినామీలతో దరఖాస్తులు దాఖలు చేయిస్తున్నారు. పాత వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సరిహద్దు జిల్లాలవారీగా.. ఖమ్మం 122, భద్రాద్రి కొత్తగూడెం 88, నల్లగొండ 155, సూర్యాపేట 99 మద్యం షాపులున్నాయి. పాతవ్యాపారుల్లో కొత్త ఉత్సాహం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, తల్లాడ, ముదిగొండ, చింతకాని, బోనకల్, ఎర్రుపాలెం మండలాలతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెర్వు, చింతలపాలెం, హాలియా, నాగార్జునసాగర్, మిర్యాలగూడ ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను సొంతం చేసుకునేందుకు పాత వ్యాపారులు కొత్తకొత్తగా పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా అన్రిజర్వ్డ్ దుకాణాలకు ఈ ప్రాంతాల్లో భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. ఈ జిల్లాల్లోని పాత వ్యాపారులతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్‌కు చెందిన కొం దరు బడానేతలు కూడా తమ బినామీలతో దరఖాస్తు చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దుకాణం దక్కించుకుంటే రెండేళ్ల కాల పరిమితి వరకు వ్యాపారం చేసుకోవచ్చు. రెండేళ్ల చివరినాటికి రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఎన్నికలు రానుండటం కూడా దరఖాస్తులు ఎక్కువగా నమోదు కావడానికి మరో కారణంగా చెప్పొచ్చు. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 1,280కుపైగా దరఖాస్తులు వచ్చా యి. ఇందులో సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలవే అధికం. రిజర్వ్డ్ దుకాణాలకు పోటాపోటీ ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో రిజర్వ్డ్ దుకాణాలకు పోటాపోటీగా దరఖాస్తులు వస్తున్నాయి. రిజర్వ్ అయిన దుకాణాలకు సంబంధించి ఎవరికీ బినామీలుగా ఉండకుండా తామే దరఖాస్తులు దాఖలు చేయాలని ఆ కేటగిరీకి చెందిన నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ నేత తమ సామాజికవర్గానికి చెందిన ముఖ్యులతో సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. అదే సామాజికవర్గానికి చెందిన, మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్నవారిని పిలిచి చర్చించినట్లు సమాచారం. ఎవరికీ బినామీలుగా ఉండకుండా తమకు రిజర్వ్ అయిన దుకాణాలకు తమ కేటగిరీవారే దరఖాస్తు చేసేలా ముందుకు వెళ్లాలని సదరు నేత సూచించినట్లు తెలిసింది. రిజర్వ్డ్ కేటగిరీలోనైనా దుకాణాలను దక్కించుకుంటే వచ్చే ఎన్నికల్లో మద్యం అమ్మకాల ద్వారా భారీగా సొమ్ము చేసుకోవచ్చని భావిస్తున్నారు. భాగస్వామిగా ఇతరులకు.. ఈసారి వైన్స్‌ల్లో కొన్నింటిని గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఈ కేటగిరీలవారు అవసరమైతే ఇతర కులాలవారినీ వ్యాపార భాగస్వాములుగా చేర్చుకోవచ్చని ఈ నెల 8న జారీ చేసిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఎక్సైజ్ కమిషనర్ పూర్తిస్థాయి విచారణ జరిపి భాగస్వామికి అర్హతలున్నాయని భావించిన తర్వాతే అనుమతిస్తారు. భాగస్వామి రిటైల్ షాపు ఎక్సైజ్ ట్యాక్స్‌లో 3 శాతం లేదా రూ.3 లక్షల్లో ఏది ఎక్కువగా ఉంటే ఆ ఫీజు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇలా భాగస్వామిగా చేరేందుకు కూడా కొందరు పాత వ్యాపారులు రిజర్వ్ కేటగిరీ వారితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్ 1 వద్ద దరఖాస్తులు దాఖలు చేసేందుకు సోమవారం రాత్రి వేచి ఉన్న ఔత్సాహికులు -
మద్యం దుకాణాల్లో స్టాక్ ఆడిట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు, డిపోలలో స్టాక్ ఆడిట్ చేయాలని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ నిర్ణయించింది. ప్రతి నెలా ఈ స్టాక్ ఆడిట్ నిర్వహిస్తారు. అందుకోసం మూడు సంస్థలను ఎంపిక చేశారు. డిపోలను ఓ సంస్థ ఆడిట్ చేస్తే.. మిగిలిన రెండు సంస్థలు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో ఆడిట్ నిర్వహిస్తాయి. బేవరేజస్ సంస్థల నుంచి డిపోలకు వస్తున్న నిల్వలు, అక్కడ నుంచి మద్యం దుకాణాలకు సరఫరా అవుతున్న వాటిని సెంట్రల్ డిపో నుంచే ఆడిట్ చేస్తారు. మిగిలిన రెండు సంస్థలు రాష్ట్రంలోని 2,975 ప్రభుత్వ మద్యం దుకాణాలకు వెళ్లి స్టాక్ ఆడిట్ నిర్వహిస్తాయి. ఆ దుకాణాలకు సరఫరా అవుతున్న మద్యం, అక్కడి విక్రయాలు, ఇంకా అందుబాటులో ఉన్న నిల్వలను తనిఖీ చేస్తాయి. రికార్డులను పరిశీలిస్తాయి. ఈ విధంగా మద్యం డిపోలు, దుకాణాల్లోని స్టాక్ ఆడిట్ మొత్తాన్ని పరిశీలించి విక్రయాలు సక్రమంగా సాగుతున్నాయా? అవకతవకలు జరుగుతున్నాయా? అనే విషయాలను పరిశీలించి నివేదిక సమర్పిస్తారు. అవకతవకలను గుర్తిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. -
మద్యం షాపుల్లో అక్రమాలకు చెక్
సాక్షి, అమరావతి: మద్యం దుకాణాల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ(ఎక్సైజ్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇటీవల ఏపీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. మద్యం దుకాణాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను జిల్లా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తారు. తద్వారా మద్యం దుకాణాల్లో విక్రయాలు సజావుగా జరుగుతున్నాయా, లేదా అనే విషయాన్ని జిల్లా కంట్రోల్ రూమ్‌ల నుంచి పర్యవేక్షిస్తారు. విక్రయాల్లో ఏదైనా అవకతవకలు జరిగితే ఆ విషయం సీసీ కెమెరాల ద్వారా తెలిసిపోతుంది. మద్యం బాటిల్స్ లేబుల్స్‌ను తప్పనిసరిగా స్కాన్ చేయాల్సి ఉంటుంది. అలాగే దుకాణాల్లో మద్యం విక్రయించే వ్యక్తుల నుంచి రెండు సెక్యూరిటీలను తీసుకోనున్నారు. ఒకవేళ ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు జరిగితే.. విక్రయించే వ్యక్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మద్యం దుకాణాల్లోని లావాదేవీలను ప్రతి నెలా ప్రత్యేకంగా ఆడిట్ నిర్వహిస్తారు. సంబంధిత నోడల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ క్రమం తప్పకుండా దుకాణాలను తనిఖీ చేయాలి. ఏమైనా అక్రమాలు జరిగితే తెలియజేసేందుకు వీలుగా మద్యం దుకాణాల వద్ద స్థానిక ఎక్సైజ్ అధికారి ఫోన్ నంబర్‌ను తప్పనిసరిగా ఉంచాలి. మద్యం విక్రయించే వ్యక్తులు ఎవ్వరైనా తప్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానం వస్తే.. వారిని బదిలీ చేయనున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం దశల వారీ మద్య నియంత్రణలో భాగంగా ఇప్పటికే 33 శాతం మద్యం దుకాణాలను తగ్గించింది. 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేసింది. అలాగే పర్మిట్టు రూమ్‌లను రద్దు చేసింది. ప్రత్యేకంగా మద్యం అక్రమాలను అరికట్టేందుకు, మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. అక్రమ మద్యం వ్యవహారాలను నిరోధించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే అక్రమ మద్యం వ్యవహారాలకు సంబంధించి 15 వేల కేసులు నమోదు చేశారు. తాజాగా మద్యం దుకాణాల్లోనూ ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది. -
ఏపీలో మూతపడ్డ 13శాతం మద్యం దుకాణాలు
-
13% మద్యం దుకాణాల మూసివేత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించడంలో భాగంగా మరో కీలక అడుగు పడింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న మద్యం షాపులను తగ్గించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సోమవారం నుంచి మరో 13 శాతం మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో ఏడాదిలోనే ప్రభు త్వం 33 శాతం మద్యం షాపులను తగ్గించి నట్లైంది. టీడీపీ హయాంలో ఉన్న 4,380 మద్యం షాపులు ఇపుడు 2,934కు తగ్గిపోయా యి. అంటే ఏడాది కాలంలో 1,446 షాపు లను తగ్గించారు. మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగే షాపులను, అద్దెలు ఎక్కువగా ఉన్న షాపు లను ప్రభుత్వం మూసివేయడం గమనార్హం. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా మూత ► వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా 43 వేల బెల్టు షాపులను తొలగించిన సంగతి తెలిసిందే. మద్యం వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలను తీసుకుంది. ► గతేడాది ఆగస్టులో 20 శాతం మద్యం షాపులను తగ్గించారు. అప్పట్లో 4,380 మద్యం షాపులుండగా 20 శాతం మేర (880) తగ్గించడంతో 3,500 దుకాణాలకు పరిమితమయ్యాయి. అయితే వీటిలో 3,469 దుకాణాలే పనిచేస్తున్నాయి. ► తాజాగా మరో 13 శాతం(535) మద్యం షాపులను తగ్గించడంతో ఏడాదిలోనే మొత్తం 33 శాతం తగ్గించినట్లైంది. తద్వారా ఇక 2,934 మద్యం దుకాణాలే మిగిలాయి. ► అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 91 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. -
మరో 13% మద్యం షాపులు మూత
సాక్షి, అమరావతి: దశలవారీ మద్యపాన నియంత్రణలో భాగంగా రాష్టప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు మరిన్ని కఠిన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల సంఖ్యను ఈ నెలాఖరు నాటికి 13 శాతం తగ్గిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఆగస్టులో 20 శాతం షాపులను తొలగించిన ప్రభుత్వం.. ఏడాదిలోపే మరో 13 శాతం షాపులను తొలగించేందుకు తాజా ఉత్తర్వులిచ్చింది. గతంతో పోలిస్తే.. ఈ నిర్ణయం వల్ల కేవలం 10 నెలల్లోనే 33 శాతం షాపులను తగ్గించినట్లవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,500 మద్యం దుకాణాలు ఉండగా.. తాజా నిర్ణయంతో ఈ నెలాఖరు నాటికి ఆ సంఖ్య 2,934 తగ్గనుంది. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 వేల బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించిన సంగతి తెలిసిందే. మద్యం వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సారాకు అడ్డుకట్ట మరోవైపు నాటు సారాను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. తయారీదారులపై నిఘా పెట్టి తరచూ దాడులు జరిపిస్తోంది. సారా అధికంగా తయారు చేసే 147 ‘ఏ’ కేటగిరీ గ్రామాలను గుర్తించి విస్తృత తనిఖీలు చేయిస్తోంది. సారాను అరికట్టేందుకు వార్డు వలంటీర్లు, గ్రామ మహిళా మిత్ర, మహిళా రక్షక్‌ల సేవలను వినియోగిస్తోంది. దీంతోపాటు పొరుగు పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. నియంత్రణకు తీసుకున్న చర్యలివీ.. ► మద్యం దుకాణాల వద్ద గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 4,380 పర్మి ట్ రూమ్‌ల రద్దు. ఒక వ్యక్తి గరిష్టంగా మ ద్యం లేదా బీరును కేవలం మూడు బాటి ల్స్ వరకు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం. అంతకు మించి కొనుగోలు చేసినా.. అమ్మినా చట్టపరమైన చర్యలకు ఆదేశం. ► మద్యం అమ్మకాలను తగ్గించేందుకు విక్రయ వేళల కుదింపు. గతంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు జరిపేవారు. ప్రస్తుతం ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే విక్రయాలకు అనుమతి. ► మద్యం వినియోగాన్ని గణనీయంగా తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న షాపుల సంఖ్య 4,380 నుంచి 3,500కు తగ్గిస్తూ గతేడాది ఆగస్టులో నిర్ణయం. ► అక్రమ అమ్మకాలను నియంత్రించే చర్యల్లో భాగంగా ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ లిమిటెడ్, స్వయంగా రిటైల్ అవుట్ లెట్స్ ద్వారా మద్యం అమ్మకాలు. ► మరోవైపు వినియోగాన్ని తగ్గించేందుకు ధరలను పెంచుతూ నిర్ణయం. మద్యం కొనాలంటేనే భయపడేలా.. షాక్ కొట్టే విధంగా ధరల పెంపుదల. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్ల సంఖ్యలో 40 శాతం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న 840 బార్లు 530కి తగ్గాయి. మద్యం వినియోగాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటు. మద్యపానం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించడం, మద్యం మహమ్మారి కుటుంబాలను ఏ విధంగా నాశనం చేస్తుందో తెలియజెప్పే ప్రచార కార్యక్రమాలకు చర్యలు. ► మద్యం వినియోగాన్ని దశలవారీగా తగ్గించడానికి తీసుకున్న అన్ని చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయి. 2019 అక్టోబర్ నుంచి 2020 మార్చి వరకు మద్యం అమ్మకాలు 24 శాతం, బీరు అమ్మకాలు 55 శాతం తగ్గాయి. -
ఆధార్ ఉంటేనే మద్యం
సాక్షి, అమరావతి: వ్యసనపరులు మద్యం జోలికెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ధరలను భారీగా పెంచి మద్యాన్ని దూరం చేసే ప్రక్రియ మొదలైంది. దీంతోపాటు కొనుగోళ్లపై పలు నిబంధనలు విధించారు. నగరాలు/పట్టణాల్లో ఆధార్ కార్డు చూపిస్తేనే మద్యం విక్రయాలు జరపనున్నారు. రెడ్జోన్లు, కంటైన్మెంట్ క్లస్టర్ల నుంచి వచ్చే వారిని గుర్తించేందుకు ఆధార్ కార్డు చూపాలనే నిబంధన విధించారు. గొడుగులు, మాస్కులు ధరించకుంటే మద్యం విక్రయించరాదనే ఆంక్షలు విధించారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల దగ్గర క్యూ లైన్లు తగ్గిపోయాయి. కొన్ని చోట్ల దుకాణాలు వెలవెలబోయాయి. చదవండి: మద్యం ఇక హోం డెలివరీ..! ► రాష్ట్రంలో మొత్తం 3,463 మద్యం షాపులుండగా 2,330 దుకాణాలను మాత్రమే తెరిచారు. ► 663 మద్యం దుకాణాలు కంటైన్మెంట్ క్లస్టర్ల పరిధిలో ఉండటంతో వీటిని తెరవలేదు. సాంకేతిక కారణాలతో మరో 18 షాపులను తెరవలేదు. ప్రజల ఆందోళనలతో 16 షాపులను, శాంతి భద్రతల సమస్యల కారణంగా 69, ఇతర కారణాలతో 284 మద్యం షాపులను మూసివేశారు. స్టాకు లేకపోవడంతో 83 షాపులు తెరుచుకోలేదు. ఏటా 25 శాతం పెంచుతాం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే రాష్ట్రంలో మద్యం విక్రయాలకు అనుమతులిచ్చినట్లు డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి దశలవారీగా రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేసి తీరుతారన్నారు. ఇందులో భాగంగానే మద్యం జోలికి వెళ్లాలంటే షాక్ కొట్టేలా ధరలను 75 శాతం పెంచామన్నారు. ఏటా 20 శాతం మద్యం షాపులను తొలగిస్తూ వస్తున్నామని వెల్లడించారు. వీటితో పాటు ఏటా 25 శాతం మద్యం ధరలు పెంచుతామన్నారు. -
మద్యం దుకాణాల వద్ద కట్టడి చేయండి
సాక్షి, అమరావతి: మద్యం దుకాణాలు వద్ద ఐదుగురికి మించి వినియోగదారులు గుమికూడకుండా కట్టడి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై సోమవారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మద్యం దుకాణాల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా చూడాలని, ఒకవేళ ఎక్కువమంది గుమికూడితే తలుపులు మూసివేసి వారిని చెదరగొట్టాలని స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటిస్తేనే అమ్మకాలు జరపాలన్నారు. ఈ విషయంలో ఎక్సైజ్, పోలీస్ అధికారులు చర్యలు తీసుకునేలా కలెక్టర్లు చూడాలన్నారు. ఇంకా ఏం చెప్పారంటే.. ► వ్యవసాయ, నిర్మాణ, పారిశ్రామిక రంగాల పనులు పూర్తయిన లేదా నిలిచిపోయిన కార్మికులు సొంత జిల్లాలు/రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంపించేందుకు ఏర్పాట్లు చేయాలి. ► దూరప్రాంతాల్లో స్థిరపడిన కార్మికులను లాక్డౌన్ నేపథ్యంలో వారి స్వస్థలాలకు తరలించటం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ► తరలించిన వలస కార్మికులను ఉంచేందుకు ప్రతి గ్రామంలో 10 పడకలతో ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి. ► కంటైన్మెంట్ జోన్లకు వెలుపల సాధారణ కార్యకలాపాలు మొదలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. ► కేసుల పాజిటివిటీ రేషియో, ఫెటాలిటీ రేషియో, వారం రోజుల వ్యవధిలో డబ్లింగ్ రేట్ ఇండికేటర్లపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. ► కాన్ఫరెన్స్‌లో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మద్యం అమ్మకాలు షురూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో భారీగా ధరలు పెంచిన ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు, కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తూ సోమవారం నుంచి విక్రయాలకు అనుమతించడంతో 2,345 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. చాలా రోజుల తరువాత దుకాణాలు తెరవడంతో తొలిరోజు మద్యం దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. కొన్నిచోట్ల మధ్యాహ్నం 2 గంటలకు షాపులు తెరిచారు. మద్యం షాపుల సీల్ తెరిచేందుకు కలెక్టర్ అనుమతి ఇవ్వాల్సి ఉండటం, కంటైన్మెంట్ క్లస్టర్ల జాబితాలు అందకపోవడంతో కొంత ఆలస్యమైంది. రెడ్జోన్లలో దుకాణాలు బంద్ ► రాష్ట్రంలో మొత్తం 3,468 మద్యం షాపులుండగా కంటైన్మెంట్ క్లస్టర్లను మినహాయించి మిగిలిన చోట్ల 2,345 దుకాణాలు తెరిచారు. మద్యం షాపులను రెడ్‌జోన్‌లో కూడా తెరవవచ్చని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలో వీటిని తెరవలేదు. ► విజయవాడతోపాటు ప్రకాశం జిల్లాలో ఒక్క మద్యం షాపు కూడా తెరవలేదు. ప్రకాశం జిల్లాలోని మద్యం గోడౌన్లు కంటైన్మెంట్ క్లస్టర్లలో ఉండటంతో ఎక్సైజ్ శాఖ షాపులను తెరవలేదు. విజయవాడలో కంటైన్మెంట్ క్లస్టర్ల జాబితా అందకపోవడం వల్ల తెరవలేదు. ► గత 45 రోజుల నుంచి రాష్ట్రంలో మద్యం దొరకపోవడంతో సోమవారం మద్యం ప్రియులు ఒక్కసారిగా షాపుల వద్దకు చేరుకున్నారు. మద్యం దుకాణాల ముందు భారీ ఎత్తున క్యూ కట్టారు. భౌతిక దూరం పాటిస్తూ క్యూలలో నిలుచుని తమ వంతు కోసం నిరీక్షించారు. అయితే కొన్నిచోట్ల భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించారు. ► మద్యం ధరలు పెంచినా కొన్ని దుకాణాల్లో మధ్యాహ్నానికల్లా సరుకు ఖాళీ అయింది. మద్యం షాపుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, వలంటీర్లు విధులు నిర్వహించారు. ఎక్కువ చోట్ల భౌతిక దూరం పాటించినప్పటికీ కొన్నిచోట్ల మొదటిరోజు కావడం మూలాన మాత్రం ఉల్లంఘనలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లా కవిటి సినిమా హాలు రోడ్డులో మద్యం దుకాణం వద్ద క్యూ లైన్ పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం కోసం.. ► కొందరు తమిళనాడు వాసులు ఏపీ సరిహద్దు ప్రాంతానికి చేరుకుని మద్యం కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడంతో షాపుల్ని మూసివేసి వారిని వెనక్కి పంపించారు. నెల్లూరు జిల్లా జీవీ పాలెం, రామాపురం, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో మద్యం దుకాణాల వద్దకు పొరుగు రాష్ట్రం నుంచి ప్రజలు రావడంతో అమ్మకాలు నిలిపివేశారు. ► ఏపీ–తెలంగాణ సరిహద్దులో ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఎటపాకలో కూడా మద్యం దుకాణాల వద్దకు భద్రాచలం వాసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో షాపులను మూసివేశారు. ► గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని మాచవరం, పిల్లుట్ల ప్రాంతాల్లో మద్యం అమ్మకాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఓ ప్రాంతం వారు మరో ప్రాంతానికి రావడంతో ఘర్షణ నెలకొంది. భారీగా పెరిగిన మద్యం ధరలు అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కింద మద్యం ధరలను భారీగా పెంచారు. మద్యపానాన్ని నీరుగార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీయూష్ కుమార్ సోమవారం జీవో జారీ చేశారు. -
గుడుంబా గుప్పు.. పల్లెకు ముప్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబా గుప్పుమంటోంది. లాక్డౌన్ వేళ గ్రామీణ ప్రాంతాల్లో సారా బట్టీల మంటలు రాజుకుంటున్నాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలే చెబుతున్నాయి. మార్చి 22న జనతా కర్ఫ్యూ నాటి నుంచి సోమవారం వరకు 1,600 గుడుంబా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో గుడుంబా ‘కాగిన’ సమయంలో ఒక్క నెలలో ఎన్ని కేసులు నమోదయ్యాయో ఈ 40 రోజుల్లో అన్నే కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అందుబాటులో లేకపోవడంతో మళ్లీ గుడుంబా వైపు అడుగులు పడుతుండగా, దాన్ని ఎలా కట్టడి చేయాలో తెలియక ఎక్సైజ్ యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. కేసుల్లేని జిల్లా లేదు.. లాక్డౌన్ అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసివేశారు. అయినా పట్టణ ప్రాంతాల్లో ఎలాగోలా మందు లభ్యమవుతుండగా, పల్లెల్లో సరుకు దొరకట్లేదు. దీంతో అనివార్యంగా మళ్లీ గ్రామాల్లోని ప్రజలు గుడుంబా వైపు చూస్తున్నట్టు ఎక్సైజ్ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 23 నుంచి ఏప్రిల్ 26 వరకు 1,600 గుడుంబా కేసులు నమోదయ్యాయి. మొత్తం 7,019 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోగా, 1.15 లక్షల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 20వేల లీటర్లు, వరంగల్‌లో 17వేలు, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 15వేల చొప్పున, రంగారెడ్డిలో 8వేలు, నల్లగొండలో 7వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ గుడుంబా కేసులు నమోదయ్యాయి. తయారీకి కారణాలనేకం.. రాష్ట్రంలో మళ్లీ గుడుంబా గుప్పుమనడానికి చాలా కారణాలున్నాయి. మద్యం అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణం కాగా, లాక్డౌన్ సమయలో పనుల్లేకపోవడం మరో కారణమని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. గుడుంబాను నిర్మూలించగలిగాం కానీ గుడుంబా కాసే పద్ధతులు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మర్చిపోలేదని వారు చెబుతున్నారు. చాలాకాలంగా గుడుంబాపై ఆధారపడి జీవించిన వర్గాలు మళ్లీ అటువైపు ఆకర్షితులయ్యేలా పరిస్థితులు మారాయని అంటున్నారు. లాక్డౌన్ సమయంలో రాత్రిపూట పూర్తిగా కర్ఫ్యూ ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా కాస్తున్నారని చెబుతున్నారు. వీటన్నిటికితోడు నిత్యావసర వస్తువుల్లో భాగంగా బెల్లం, పటిక, పండ్లు అందుబాటులో ఉండడం కూడా గుడుంబా తయారీదారులకు కలిసివస్తోంది. అక్కడ పేట్రేగితే అంతే సంగతులు రాష్ట్రంలో చాలాకాలంగా గుడుంబాకు ఆలవాలమైన ప్రాంతాలున్నాయి. వీటిని ఎక్సైజ్ శాఖ హాట్స్పాట్లుగా గుర్తించింది. హైదరాబాద్‌లోని ధూల్‌పేట సహా దేవరకొండ, హుజూర్నగర్, సూర్యాపేట, తుంగతుర్తి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, గద్వాల, అచ్చంపేట, సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్దిపేట, జహీరాబాద్, వికారాబాద్, ఆమనగల్, షాద్‌నగర్, ఎల్లారెడ్డిపేట, ఆర్మూరు, భీంగల్, దోమకొండ, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, అక్కడ మళ్లీ గుడుంబా బట్టీలు రాజుకుంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనని ఆబ్కారీ అధికారులంటున్నారు. ఈ ప్రాంతాల్లో గుడుంబా వినియోగం పెరిగితే ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుందని, మళ్లీ కోలుకోడానికి చాలా సమయం పడుతుందని అంటున్నారు. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుం దోననే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది. ఆ గుర్తింపు మాయం! వాస్తవానికి, లాక్‌డౌన్‌కు ముందు తెలంగాణ గుడుంబారహిత రాష్ట్రంగా గుర్తింపు పొందింది. 2017లో గుడుంబాపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టిన ఎక్సైజ్ యంత్రాంగం ఏడాదిపాటు అహోరాత్రులు శ్రమించి 2018 నాటికి రాష్ట్రంలో గుడుంబా ఆనవాళ్లు లేకుండా చేసింది. ఏడాది పాటు ఆ శాఖ చేసిన కష్టమంతా ఈ 40 రోజుల్లో గుడుంబా బట్టీల పాలైంది. మద్యానికి అలవాటు పడ్డ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇప్పుడు మళ్లీ నాటుసారా బాట పట్టారని, మళ్లీ రాజుకున్న సారా బట్టీ మంటలను ఆర్పడం ఇప్పట్లో సాధ్యం కాదని ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు. బెల్లం నానబెట్టిన డ్రమ్ములు స్వాధీనం లాక్డౌన్ నేపథ్యంలో వైన్స్ షాపులు మూతపడగా గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో గుడుంబా తయారీ ఊపందుకుంది. అయితే, ఎక్సైజ్ అధికారుల తనిఖీలు ముమ్మరం కావడంతో సమీపంలోని అటవీ ప్రాంతాలను ఎంచుకొని ఇలా డ్రమ్ముల్లో బెల్లాన్ని నానబెట్టి గుడుంబా తయారు చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలంలో మంగళవారం అధికారులు జరిపిన తనిఖీల్లో ఈ డ్రమ్ములు బయటపడ్డాయి. ఎక్సైజ్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని పారబోశారు. – ఖానాపురం -
తెరుచుకోనున్న మద్యం షాపులు
గువాహటి: లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ అస్సాం రాష్ట్రంలో సోమవారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. అలాగే బాట్లింగ్ ప్లాంట్లు, డిస్టిలరీలు, బ్రూవరీలు కూడా పని చేస్తాయి. మద్యం దుకాణాలను రోజుకు 7 గంటలు మాత్రమే తెరిచి ఉంచాలని అస్సాం ఎక్సైజ్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను అందరూ తప్పనిసరిగా పాటించాలని తేల్చిచెప్పింది. అస్సాంలో ఇకపై ప్రభుత్వం అనుమతించిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లిక్కర్ షాపులు తెరిచి ఉంటాయి. -
లిక్కర్ షాపులు తెరవండి : నటుడి విజ్ఞప్తి
సాక్షి, ముంబై : కరోనావైరస్ ప్రపంచమంతా పంజా విసురుతోంది. ఈ మహమ్మారి వల్ల దేశదేశాలే స్తంభించిపోయాయి. భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో నిత్యావసర వస్తువులు తప్ప ఏవి ప్రజలకు అందుబాటులో లేకుండాపోయాయి. జనాలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. ఇక కరోనా మహమ్మారి మందుబాబుల గ్లాసుపై కూడా కొట్టింది. తాగడానికి మద్యం లేక మందుబాబులు విలవిలలాడిపోతున్నారు. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఓ పెగ్గు దొరికితే చాలన్నట్లు ఎదురు చూస్తున్నారు. రోజుకి కనీసం రెండు గంటలు అయినా లిక్కర్ స్టోర్స్ తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారికి నేనున్నానంటూ మద్దతుగా నిలిచాడు బాలీవుడ్ సినియర్ నటుడు రిషి కపూర్. ప్రతి రోజు సాయంత్రం లిక్కర్ షాపులు తెరవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ‘ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నుండి డబ్బు అవసరం. అందుకోసం కొంత కాలం లైసెన్స్ పొందిన మద్యం దుకాణాలని సాయంత్రం సమయంలో తెరవాలి. ఈ విషయంలో నన్ను తప్పుగా అర్థం చేసుకొని తిట్టొద్దు. మనిషి ఇంట్లో అనిశ్చితి, నిరాశతో ఉంటాడు. ఇలాంటి సమయంలో పోలీసులు, వైద్యులు, పౌరులకి మద్యం అవసరం. బ్లాక్‌లో అయిన మద్యం అమ్మే ఏర్పాట్లు చేయండి’ అని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కాగా రిషి కపూర్ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ ఉన్నతంగా ఆలోచించండి రిషీజీ. లాక్డౌన్ నేపథ్యంలో కొంతమంది నిత్యవసర వస్తువులు లేకుండా బాధ పడుతున్నారు. టీవీల్లో వార్తలు చూసైనా దేశంలో నెలకొన్న వాస్తవిక పరిస్థితులను తెలుసుకోండి. ప్రభుత్వానికి మీరు ఇంత అపరిపక్వ సూచన ఇస్తారా? మీ లాంటి ధనవంతులు ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తారు’ అని ఓ నెటిజన్ మండిపడగా.. మందుబాబుల కుటుంబాల గురించి ఆలోచించారా? మద్యం తాగి కుటుంబంలోని మహిళలపై దాడి చేస్తే ఎలా? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లాక్డౌన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాల్సిందిపోయి మద్యం గురించి మాట్లాడుతారా? అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. Think. Government should for sometime in the evening open all licensed liquor stores. Don’t get me wrong. Man will be at home only what with all this depression, uncertainty around. Cops,doctors,civilians etc... need some release. Black mein to sell ho hi raha hai. ( cont. 2) — Rishi Kapoor (@chintskap) March 28, 2020 -
మద్యం.. షాక్ తథ్యం
సాక్షి, అమరావతి: దశలవారీ మద్య నియంత్రణ, నిషేధంలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బార్లలో 40 శాతం మూసేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మద్యం ముట్టుకుంటే షాక్ కొడుతుందన్న భావన ఉండాలని, అప్పుడే చాలా మంది దానికి దూరం అవుతారని సీఎం వ్యాఖ్యానించారు. నూతన బార్ల విధానం, తదుపరి చర్యలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు తీసుకున్న, ఇకపై తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించారు. బార్ల సంఖ్యను కుదించడంపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో 38 స్టార్ హోటళ్లు, 4 పబ్బులతో సహా మిగతా మొత్తం 839 మంది బార్ల నిర్వహణకు లైసెన్స్‌లు తీసుకున్నారని అధికారులు వివరించారు. ఆతిథ్య రంగానికి సంబంధించిన స్టార్ హోటళ్లు, పబ్బులు మినహాయిస్తే 797 బార్లు నడుస్తున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో సగానికి పైగా బార్ల సంఖ్యను తగ్గించాలని సీఎం సూచించగా.. మద్యం పాలసీలో భాగంగా ఇప్పటికే 20 శాతం దుకాణాలను తగ్గించామని (4,380 దుకాణాలు 3,500కు కుదింపు), మద్య నియంత్రణ కార్యక్రమాన్ని దశల వారీగా చేపడుతున్నందున బార్ల సంఖ్యను కూడా దశల వారీగా తగ్గించుకుంటూపోతే బాగుంటుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చివరకు 797 బార్లలో 40 శాతం తగ్గించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 797లో 40 శాతం అంటే 319 బార్లు మూసివేయనున్నారు. ప్రస్తుత బార్ల విధానాన్ని రద్దు చేసి, నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పుడున్న బార్ల సంఖ్యలో 40 శాతం తగ్గించి, మిగిలిన బార్లకు నూతన విధానం ప్రకారం కొత్తగా లైసెన్స్‌లు జారీ చేస్తారు. లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించాలని నూతన విధానంలో చేర్చనున్నారు. అప్లికేషన్, లైసెన్స్ ఫీజులు భారీగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంతిమంగా మద్య నిషేధం దిశగా అడుగులు వేయాలన్న మౌలిక లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని సూచించారు. మద్యం సరఫరా వేళల కుదింపు.. ధరల పెంపు బార్ల సంఖ్యను కుదించడంతోపాటు మద్యం సరఫరా వేళలను కూడా కుదించాలని సమావేశంలో నిర్ణయించారు. గత సమీక్షా సమావేశాల్లో ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని బార్లలో మద్యం సరఫరా సమాయాన్ని రెండు గంటలు కుదించామని (ఉదయం, రాత్రి గంట చొప్పున) అధికారులు వివరించారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే మద్యం సరఫరాను అనుమతిస్తామని, రాత్రి 11 గంటల వరకు ఆహారాన్ని అనుమతిస్తామని చెప్పారు. స్టార్ హోటళ్లలో మాత్రం ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు మద్యం విక్రయించడానికి అనుమతి ఉంటుందన్నారు. బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టానికి పదును నాటు సారా తయారీ, మద్యం స్మగ్లింగ్, కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలన్నారు. ఆరు నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలన్నారు. బార్ యజమానులు నియమాలను ఉల్లంఘిస్తే లైసెన్స్ ఫీజుకు 5 రెట్లు జరిమానా విధించాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమాలకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానాతో పాటు 2 ఏళ్ల జైలు శిక్ష విధించే నిర్ణయంపై కూడా చట్ట సవరణకు బిల్లు తీసుకురావాలని చెప్పారు. మద్యం, ఇసుక స్మగ్లింగ్‌లను అరికట్టడానికి చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రాత్రిళ్లు కూడా పనిచేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఉండాలని సీఎం ఆదేశించారు. జనవరి 1 నుంచి కొత్త మద్యం విధానం రాష్ట్రంలో కొత్త మద్యం విధానాన్ని జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి తెస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. నూతన మద్యం విధానంపై సీఎం సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 40 శాతం బార్లను తగ్గించాక, మిగిలిన బార్లకు నూతన విధానం ప్రకారం రాజకీయ ఒత్తిడులకు తావులేని రీతిలో అనుమతులు ఇస్తామని తెలిపారు. -
ఆ బార్లు 'ఏటీఎంలు'!
గుంటూరు నగరంలో గుంటూరు–విజయవాడ రాష్ట్ర రహదారి పక్కనే ఉన్న ఓ బార్లో అర్ధరాత్రి దాటినా అమ్మకాలు జరుగుతాయి. పార్సిల్ సేల్స్ పేరిట మద్యాన్ని బయటకు తరలించి, అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడే డైల్యూషన్స్, బ్రాండ్ మిక్సింగ్ జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తోంది. గుంటూరులో అర్ధరాత్రి దాటినా మద్యం ఎక్కడ దొరుకుతుందంటే ఈ బార్ గురించే మందుబాబులు ఠక్కున చెబుతారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మద్యం విక్రయాల సమయాన్ని కుదించారు. పర్మిట్ రూములను ఎత్తేశారు. లిక్కర్, బీరు బాటిళ్లు మూడుకు మించి కొనుగోలు చేసేందుకు అవకాశం లేదు. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని.. ప్రజారోగ్యం, శాంతిభద్రతలే ముఖ్యమని భావించిన ప్రభుత్వం తొలి ఏడాది మద్యం దుకాణాల సంఖ్యను 20 శాతం తగ్గించింది. మిగిలిన 3,500 దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. నిబంధనల ప్రకారమే విక్రయాలు సాగిస్తోంది. గతంలో మాదిరిగా ఎల్లవేళగా మద్యం దొరకడం లేదు. దీంతో మద్యం సిండికేట్లు బార్లపై దృష్టి పెట్టాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలను రాత్రి 8 గంటలకు మూసేస్తున్నారు. తర్వాత మద్యం దొరకదు. ఇదే అదనుగా బార్ల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. మందుబాబుల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో 840 బార్లలో యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. పార్సిల్ సేల్స్ పేరిట బయటకు.. మద్యం సీసాలను బయటకు అమ్మకూడదనేది బార్ల లైసెన్సులో ప్రధాన నిబంధన. బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు పార్శిల్ సేల్స్ పేరుతో అధిక ధరలకు బయటకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే పనిచేస్తాయి. బార్లలో రాత్రి 11 గంటల వరకు మద్యం సరఫరా చేస్తారు. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా ఫుడ్ సర్వింగ్ పేరుతో అమ్మకాలు సాగుతున్నాయి. రెస్టారెంట్‌కు అన్ని అనుమతులు ఉంటేనే బార్ లైసెన్సు ఇస్తారు. రెస్టారెంట్ కూడా మున్సిపాలిటీ/కార్పొరేషన్ నిర్దేశించిన విధంగా నిర్మించాలి. దీనికి ట్రేడ్ లైసెన్సు ఉండాలి. ఇవేవీ లేకుండా బార్ నిర్వాహకులు రెస్టారెంట్ ఫుడ్ అమ్మకాల కంటే మద్యం విక్రయాలపైనే దృష్టి పెడుతున్నారు. వేళాపాళా లేకుండా ఇష్టం వచ్చిన ధరలకు అమ్మకాలు జరుపుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం మద్యం దుకాణాలు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోవడంతో సిండికేట్లు బార్లను ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. బార్లలో మద్యాన్ని లూజు సేల్స్‌గా అమ్ముకోవచ్చు. దీంతో కొత్త దందాకు తెరతీశారు. మద్యంలో నీళ్లు కలిపి జనానికి అంటగడుతున్నారు. విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నారు. బ్రాండ్ మిక్సింగ్ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే బార్లపై కేసులు ‘‘రాష్ట్రంలో బార్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం వాస్తవమే. ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగం దాడులు చేసి, కేసులు నమోదు చేస్తోంది. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే బార్ల లైసెన్సులను రద్దు చేస్తాం. బార్లలో నిబంధనల ఉల్లంఘనల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించే ఎక్సైజ్ అధికారులపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’’ – ఎం.ఎం.నాయక్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ -
తొలిరోజే 233 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణకుగాను నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే స్పందన లభించింది. దసరా పండుగ మరుసటి రోజే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 233 దరఖాస్తులు వచ్చా యి. పండుగ ప్రభావం ఉన్నా ఆశావహులు అప్పుడే స్పందించడంతో ఈసారి దరఖాస్తులు వెల్లువలా వస్తాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. తొలి రోజు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్వయంగా పరిశీలించారు. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో బుధవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రిటైల్ వైన్ షాప్‌ల అప్లికేషన్లను స్వీకరించే ఏర్పాట్లపై చర్చించారు. రిటైల్ షాప్‌ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు దరఖాస్తులను స్వీకరించే విధానంపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో 34 రిటైల్ అప్లికేషన్ల సెంటర్లలో చేసిన ఏర్పాట్లు, మౌలిక వసతులపై డిప్యూటీ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడారు. ఆబ్కారీ భవన్లో ఉన్న కమాండ్ కంట్రోల్‌ను మంత్రి పరిశీలించారు. సమీక్షలో హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి, శీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
9న మద్యం దుకాణాల టెండర్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణకు ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం నవంబర్ 1న కొత్త మద్యం దుకాణాల నిర్వహణకు ఈ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దీని ప్రకారం ఈ నెల 9 నుంచి 16 వరకు కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 13వ తేదీ ఆదివారం దరఖాస్తులు తీసుకోరు. జిల్లా ఆబ్కారీ శాఖ కార్యాల యాలతోపాటు హైదరాబాద్, నాంపల్లిలోని ఆబ్కారీ కార్యాలయంలోని రెండో ఫ్లోర్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 18న డ్రా ద్వారా షాపులు కేటాయించనున్నారు. ఈ నెల 30లోపు కొత్త మద్యం దుకాణాల యజమానులకు లైసెన్స్‌లు అందజేసి నవంబర్ 1 నుంచి కొత్త యాజమాన్యాల ఆధ్వర్యంలో మద్యం విక్రయిస్తారు. -
గ్రామ సచివాలయం.. మహాత్ముడి కలల రూపం
కరప నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలన్న తపనతోనే గ్రామ సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా గ్రామ సచివాలయాల వ్యవస్థను తూర్పు గోదావరి జిల్లా కరప మండల కేంద్రంలో బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సచివాలయ పైలాన్‌ను ఆవిష్కరించారు. సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. విధులు, బాధ్యతలపై వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభలో మాట్లాడారు. కేవలం 4 నెలల్లోనే అక్షరాలా 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరిగి ఉండదని అన్నారు. ఇదొక గొప్ప రికార్డు అని చెప్పారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రజలపై అధికారం, అజమాయిషీ చెలాయించడానికి పెట్టలేదని అన్నారు. తన(ముఖ్యమంత్రి) దగ్గర్నుంచి వలంటీర్ల దాకా అంతా ప్రజలకు సేవకులేనని స్పష్టం చేశారు. కరప సభలో ముఖ్యమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘గాంధీజీ పేరు వినగానే గుర్తుకొచ్చే పదాలు అహింస, సత్యాగ్రహం. భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని, గ్రామాలు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. అభివృద్ధి ఫలాలు, పరిపాలనను పల్లెల్లో ప్రతి గడప దగ్గరికీ చేర్చాలనే లక్ష్యంతో దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా మన రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ప్రతి 2,000 జనాభాకు 10 నుంచి 12 మంది ప్రభుత్వ ఉద్యోగులను కొత్తగా నియమించాం. పరిపాలనలో అవినీతి, వివక్షకు తావులేకుండా చేయడానికే ఈ గ్రామ సచివాలయాలు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించాం. గ్రామ సచివాయాల్లో దాదాపుగా 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 1వ తేదీకల్లా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. గ్రామ సచివాలయాల్లో అన్ని వసతులు, పరికరాలను అక్టోబరు, నవంబరు మాసాల్లోనే ఏర్పాటు చేస్తాం. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపించేలా సేవలందిస్తామని సగర్వంగా తెలియజేస్తున్నా. వలంటీర్లకు స్మార్ట్‌ఫోన్ అందజేస్తాం. వారు గ్రామ సచివాలయంతో అనుసంధానమై పనిచేస్తారు. ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి సేవలందిస్తారు. వివక్ష, అవినీతికి తావులేకుండా సేవలు 3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో గ్రామాల పరిస్థితులను దగ్గరి నుంచి గమనించా. కనీస సదుపాయాలు కూడా లేకపోవడం గుర్తించా. రేషన్ కార్డు, పెన్షన్, ఇంటి స్థలం, ఇల్లు, మరుగుదొడ్డి.. ఏది కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితిని స్వయంగా చూశాను. ఎక్కడ చూసినా అవినీతి, వివక్షే తాండవించేది. జన్మభూమి కమిటీల ఆగడాలను గమనించా. ప్రజలు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పనులు కావడం లేదని పాదయాత్రలో తెలిసింది. ఇలాంటి పరిస్థితులను మార్చాలి, ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేర్చాలన్న తాపత్రయం నుంచి పుట్టుకొచ్చినవే గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర వ్యవస్థ. ఇకపై ప్రభుత్వ సేవలు వివక్ష, అవినీతికి తావులేకుండా నేరుగా ప్రజలకే అందుతాయి. కరపలోని గ్రామ సచివాలయంలో ఉద్యోగులతో సీఎం వైఎస్ జగన్ ప్రతి ప్రభుత్వ పథకం మన ఇంటి దగ్గరికే.. గ్రామ సచివాలయం పక్కనే ఒక దుకాణం ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం ధ్రువీకరించిన నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తాం. అలాగే ఒక వర్క్‌షాప్ కూడా ఏర్పాటు చేస్తాం. వ్యవసాయానికి సంబంధించిన అత్యుత్తమ విధానాలు, సహజ పద్ధతుల్లో సాగు వంటి వాటిపై రైతులకు శిక్షణ ఇస్తాం. ఆక్వా ప్రాంత గ్రామాల్లో ఆక్వా రంగానికి సంబంధించిన వర్క్‌షాప్ కూడా ఉంటుంది. నవరత్నాలతో సహా ప్రతి ప్రభుత్వ పథకం మన ఇంటి దగ్గరికే వస్తుంది. నేరుగా మన తలుపులు తట్టి పథకాలను డోర్ డెలివరీ చేస్తారు. ఇకపై ఎవరూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన పనిలేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలెవరూ వివక్షకు లోనయ్యే పరిస్థితి ఉండదు. జనవరి 1వ తేదీ వచ్చేసరికి అర్హత ఉన్న వారందరికీ కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తాం. ఇవన్నీ 72 గంటల్లోనే ఇచ్చేటట్టు చేస్తాం. కరపలో మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి, వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు పెద్దిరెడ్డి, విశ్వరూప్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు ఒక్క ఫోన్‌కాల్ చేస్తే చాలు... గత ప్రభుత్వం చేసిన తప్పులను చూశాం, అలాంటివి మన ప్రభుత్వంలో జరగకుండా గ్రామ సచివాలయం, వలంటీర్ వ్యవస్థలు తీసుకొచ్చాం. మనం నిజాయతీగా పనిచేయాలి. మొన్నటి ఎన్నికల్లో మనకు ఓటు వేయని వారు కూడా వచ్చే ఎన్నికల్లో మనకు ఓటేసేలా మన పరిపాలన ఉండాలి. ప్రజల్లో ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. ప్రజల సౌకర్యార్థం ‘1902’ టోల్‌ఫ్రీ నంబర్‌తో కాల్‌సెంటర్ పెట్టాం. ఈ నంబర్ నేరుగా సీఎం పేషీకే కనెక్టై ఉంటుంది. వలంటీర్లు ఎవరైనా వివక్ష చూపినా, అవినీతికి పాల్పడినా ఒక్క ఫోన్‌కాల్ చేస్తే చాలు ప్రభుత్వం అందుబాటులోకి వస్తుంది. ప్రజలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. గ్రామ వలంటీర్లుగా ఉన్న, సచివాలయాల్లో పని చేస్తున్న నా సొంత తమ్ముళ్లకు, నా సొంత చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా.. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. కరపలో జరిగిన సభకు హాజరైన సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, ప్రజలు పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులు.. నాడు, నేడు మన రాష్ట్రంలో ప్రతి కుటుంబ బాగును కోరుకుంటూ ఈ నాలుగు నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించాం. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థ ద్వారా అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తాం. ప్రభుత్వానికి మూడేళ్ల సమయం ఇవ్వండి. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మారుస్తాం. ఇందులో గ్రామ సచివాలయ వ్యవస్థ, వలంటీర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తారు. రాష్ట్రంలో దాదాపు 44,000 స్కూళ్లు ఉన్నాయి. సంవత్సరానికి 15,000 స్కూళ్ల చొప్పున ఫొటో తీస్తాం. ఆయా పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, మళ్లీ ఫొటో తీస్తాం. ఆ రెండింటిని నాడు, నేడు అని గ్రామ సచివాలయంలోని డిస్ప్లే బోర్డుల్లో పెడతాం. తేడా ఏమిటో మీరే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) మండల స్థాయిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు.. ఇలా అన్నింటిలోనూ మార్పు తీసుకురావాలి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు సర్కారు హయాంలో ప్రభుత్వ హాస్పిటళ్లు ఎంత దుర్భరంగా ఉండేవో మీకు తెలుసు. సంవత్సరానికి ఇన్ని హాస్పిటళ్లని తీసుకుంటాం. వాటిని ఫొటో తీస్తాం. అభివృద్ధి చేసిన తర్వాత మళ్లీ ఫొటో తీసి, మార్పు ఏమిటో ప్రజలకే చూపిస్తాం. రైతన్నలకు జగన్ అనే నేను తోడుగా ఉంటా.. పిల్లల చదువులు, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. జనవరి 26వ తేదీ వచ్చేసరికి ‘అమ్మఒడి’కి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చదువురాని వారు 33 శాతం మంది ఉన్నారు. అందరూ అక్షరాస్యులు కావాలి. తల్లులు తమ పిల్లలను బడికి పంపితే చాలు ‘అమ్మఒడి’ పథకం కింద సంవత్సరానికి రూ.15,000 చొప్పున ఇచ్చి ప్రోత్సహిస్తాం. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు నేరుగా ఆ తల్లుల ఇళ్ల దగ్గరకు వెళ్లి, వాళ్ల చేతుల్లో ఈ సొమ్ము పెట్టి, పిల్లలను బడిబాట పట్టించే కార్యక్రమం చేస్తారు. రైతన్నలకు అండగా నిలిచేందుకు గ్రామ సచివాలయాలు, వలంటీర్లను తీసుకొచ్చాం. అక్టోబరు 15వ తేదీ వచ్చేసరికే ప్రతి రైతన్నకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జగన్ అనే నేను తోడుగా ఉంటాను. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతన్న చేతిలో రూ.12,500 పెడతాం. ఆటో, ట్యాక్సీ నడుపుకునే, సొంత టాక్సీ ఉన్న ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకు జగన్ తోడుగా ఉంటాడు. ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇచ్చిన మాట ప్రకారం అక్షరాలా 1.72 లక్షల మందికి రూ.10,000 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసే కార్యక్రమం ప్రారంభిస్తాం. తూర్పు గోదావరి జిల్లా కరపలో జరిగిన సభలో గ్రామ సచివాలయాల ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితరులు మద్యంపై ఇక సమరమే రాష్ట్రంలో ఇంతకు ముందు మద్యం దుకాణాలు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. అక్షరాలా 4,580 షాపులు ఉండేవి. వాటికి అనుసంధానంగా 43,000 బెల్టుషాపులు గతంలో మనకు కనిపించేది. గ్రామాల్లో మంచినీరు ఉండేదో లేదో గానీ మద్యం దుకాణాలు మాత్రం ఎక్కడపడితే అక్కడ దర్శనమిచ్చేవి. మహాత్మాగాంధీని స్ఫూర్తిని తీసుకుని ఏ గ్రామంలోనూ మద్యం బెల్టుషాపులు లేకుండా రద్దు చేసిన ప్రభుత్వం మాది అని సగర్వంగా చెబుతున్నా. ఈ బెల్టుషాపులు మళ్లీ పుట్టుకురాకుండా చేయడానికి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపే కార్యక్రమం చేస్తోంది. గతంలో 4580 మద్యం దుకాణాలు ఉండగా, ఈ రోజు వాటిని 3,450కి తగ్గించాం. అంటే 20 శాతం షాపులు తగ్గించాం. ఇంతకుముందు మద్యం షాపులు ఉన్న దారిలో నడవాలంటే అక్కాచెల్లెమ్మలు భయపడే పరిస్థితి ఉండేది. అందుకే పర్మిట్ రూంలు పూర్తిగా రద్దు చేశాం. గతంలో రాత్రి 10 అయినా, 11 గంటలు అయినా మద్యం అందుబాటులో ఉండేది. ఆ పరిస్థితిని మార్చాం. మద్యం దుకాణాలను 11 గంటలకు తెరిచి, రాత్రి 8 అయ్యేసరికి పూర్తిగా మూసేయ్యాలని ఆదేశించాం. అంతేకాదు మద్యంపై పోరాటం చేస్తూ ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ సచివాలయంలో అక్కాచెల్లెమ్మళ్లను పోలీసులుగా తీసుకొచ్చాం. వారిపై పెద్ద బాధ్యత పెట్టాం. గ్రామాల్లో ఎక్కడైనా లిక్కర్ అనేది కనిపించినా, ఎవరైనా మద్యం అమ్ముతున్నా ఒక్క ఫోన్ కొట్టండి చాలు ప్రభుత్వం కదులుతుందని తెలియజేయడానికి ఆ అక్కాచెల్లెమ్మలకు పోలీసులుగా గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చాం. మద్యం నియంత్రణకు వారు కృషి చేస్తారు. ప్రజల బాటను ప్రభుత్వం వీడదు రైతులకు, రైతుకూలీ కుటుంబాలకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. పేద పిల్లల చదువులకు భరోసాగా, వైద్యానికి హామీగా ప్రభుత్వం ఉంటుంది. పేదలకు దాదాపుగా ఉగాది నాటికల్లా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తాం. అక్కాచెల్లెమ్మల పేరుతోనే వాటిని రిజిస్ట్రేషన్ చేస్తాం. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో ఏకంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని తీసుకొచ్చాం. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా, దేశం మొత్తం మనవైపు చూసేలా ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వానిదే. ప్రజల బాటను ప్రభుత్వం ఎన్నటికీ వీడదు. ప్రజల బాగు కోసమే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం. వాటిని పూర్తిగా ఉపయోగించుకోవాలి’’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్‌ను వదిలేద్దాం.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిజ్ఞ చేయించారు. ఒకసారి వినియోగించి వదిలేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్‌ను విడిచిపెట్టి జ్యూట్, క్లాత్‌తో తయారయ్యే సంచులను వాడుకోవడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు సైతం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు వంగా గీత, చింతా అనూరాధ, మార్గాని భరత్‌రామ్, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, సీఎం ప్రొగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ మద్యం షాపులకు శ్రీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 470 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 504 మద్యం దుకాణాలు ప్రారంభించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ షాపులు ఏర్పాటుచేసే ప్రదేశాలపై అభ్యంతరాలు, వర్షాల కారణంగా 34 షాపులను ప్రారంభించలేదు. రెండు, మూడు రోజుల్లో వీటిని ప్రారంభించేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రారంభమైన మద్యం షాపుల ఎదుట ఎమ్మార్పీ బోర్డులు, సమయ పాలన వివరాలు, మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం వంటి నినాదాలతో బ్యానర్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు.. ఈ నెలాఖరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం వ్యాపారం పూర్తిగా నిలిచిపోనుంది. అక్టోబర్ 1 నుంచి మొత్తం 3,500 మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవనున్నాయి. ప్రస్తుతమున్న 4,380 మద్యం షాపుల్లో 20 శాతం దుకాణాలను తగ్గించి 3,500 షాపులు మాత్రమే ఇకపై నడపాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బెల్టు షాపులపై ఎక్సైజ్‌శాఖ ఉక్కుపాదం మోపి మూడు నెలల్లో 2,500 కేసులు నమోదు చేసింది. ఒకొక్కరికి గరిష్టంగా మూడు బాటిళ్లే.. కాగా, ప్రభుత్వ మద్యం షాపుల్లో ఇకపై ఒకొక్కరికి మూడు మద్యం బాటిళ్లు మాత్రమే విక్రయించనున్నారు. ఇప్పటి వరకు ఆరు మద్యం బాటిళ్ల వరకు విక్రయించేందుకు అనుమతి ఉండగా, దీనిని సగానికి తగ్గించేందుకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. మరోవైపు.. మద్యాన్ని ప్రజలకు దూరం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను సైతం ముమ్మరం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. -
మద్యనిషేధంలో మరో ముందడుగు
-
మద్యనిషేధంలో మరో ముందడుగు
సాక్షి, అమరావతి : అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యనిషేధం అమలు చేస్తామని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే ఆ హామీ అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే బెల్టు షాపులను పూర్తిస్థాయిలో నియంత్రించి, సమయపాలనను కట్టుదిట్టంగా అమలుచేస్తున్న సర్కారు.. అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో మద్యం షాపులను నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని సైతం సవరించారు. ఇందులో భాగంగా ఇప్పుడు సెప్టెంబర్ 1 ఆదివారం నుంచి ప్రయోగాత్మకంగా 503 మద్యం షాపుల నిర్వహణకు సర్కారు శ్రీకారం చుడుతోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలను నిర్వహించడం ద్వారానే దశల వారీ మద్యనిషేధం సాధ్యమని ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారనడానికి గత మూడు నెలల పాలనలో తీసుకున్న నిర్ణయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడని సర్కార్ కాగా, మద్యాన్ని ఆదాయ వనరుగా చూడని సర్కారు ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు అనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో మాదిరి మద్యం విక్రయాలకు టార్గెట్లు పెట్టలేదు.. ఆదాయం తగ్గడానికి వీల్లేదని, వీలైనంత ఎక్కువ మద్యం తాగించాలనే చాటుమాటు ఆదేశాలు కూడా ఇవ్వలేదు. ఫలితంగా మద్యం ఆదాయం తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం జూలై వరకు ఎక్సైజ్ రెవెన్యూ కింద రూ.2,635.14 కోట్ల ఆదాయం వస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం జూలై వరకు రూ.2,184.17 కోట్లు వచ్చింది. అంటే.. రూ.450.97 కోట్లు తగ్గిపోయింది. దశల వారీ మద్య నిషేధం అమలు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే, గత ఆర్థిక సంవత్సరం జూలై వరకు 125లక్షల కేసుల వరకు మద్యం విక్రయాలు జరిగితే.. ఈ ఆర్థిక సంవత్సరం జూలై వరకు 113 లక్షల కేసులే అమ్ముడయ్యాయి. లైసెన్సు ఫీజుల ఆదాయంలోనూ తగ్గుదల ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 777 మద్యం దుకాణాల యజమానులు తమ లైసెన్సులను రెన్యువల్ చేసుకోలేదు. దీంతో లైసెన్సు ఫీజు ద్వారా వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం జూలై వరకు లైసెన్సు ఫీజు ద్వారా రూ.508.44 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఆర్థిక సంవత్సరం జూలై వరకు లైసెన్సు ఫీజు ద్వారా కేవలం రూ.146.69 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతోపాటు 20 శాతం మేర మద్యం దుకాణాలను తగ్గించేస్తున్నారు. అంటే.. 4,380 వరకు ఉన్న మద్యం దుకాణాలను అక్టోబర్ 1 నుంచి 3,500కు తగ్గించేస్తున్నారు. అంతేకాక.. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి మద్యం దుకాణాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ఇప్పటివరకు ఒక్కో వ్యక్తికి ఆరు బాటిళ్ల వరకు విక్రయించుకునేలా ఉన్న నిబంధనను సైతం సవరించి మూడు బాటిళ్లకు పరిమితం చేస్తున్నారు. ఇలా క్రమంగా వీలైనంత మేర పేదలకు, మధ్య తరగతి వారికి మద్యం అందుబాటులో లేకుండా చేస్తానని.. వాటి ధరలను షాక్ కొట్టేలాగ పెంచుతామని ఎన్నికల ముందే వైఎస్ జగన్ ప్రకటించిన హామీ కార్యరూపం దాలుస్తోంది. ఇందులో భాగంగా మద్యం ధరలను కూడా పెంచేందుకు వీలుగా అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ధరలకూ రెక్కలు కాగా, ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.5 నుంచి రూ.40 వరకు పెంచాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్‌ను కూడా పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ పెంపుదల ఆదాయం కోసం కాదని.. పేదలు, మధ్య తరగతి ప్రజలను మద్యం నుంచి దూరంగా ఉంచేందుకేనని అధికార వర్గాలు స్పష్టంచేశాయి. ఎటువంటి రాజకీయ జోక్యం లేకపోవడంతో పాటు ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉండటంతో ఇప్పటికే బెల్టుషాపులు లేకుండా చేయగలిగామని, అంతేకాక.. నిర్ధారించిన సమయానికి మద్యం దుకాణాలు మూసివేస్తున్నారని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కాగా.. మద్యం నియంత్రణ, నిషేధంలో భాగంగా డీఎడిక్షన్ కేంద్రాలకు నిధులను రూ.500 కోట్లకు కూడా పెంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించడంవల్ల కొత్తగా 16వేల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. -
పైలెట్ ప్రాజెక్టుగా 503 మద్యం దుకాణాలు
-
మద్యం స్మగ్లింగ్‌కు చెక్
బెల్టు షాపుల తొలగింపుతో మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. 2018 – 2019లో 125 లక్షల కేసుల లిక్కర్ విక్రయం జరిగితే.. బెల్టు షాపుల తొలగింపు తర్వాత ఈ ఏడాది జూలై వరకు 12 లక్షల కేసుల మద్యం వినియోగం తగ్గింది. అలాగే 4,380 మద్యం దుకాణాలను 3,500కు తగ్గిస్తున్నాం. సాక్షి, అమరావతి: మద్య నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్ఫోర్స్మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మద్యం స్మగ్లింగ్ జరక్కుండా, నాటు సారా తయారీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మద్యం వల్ల వచ్చే అనర్థాల గురించి పాఠ్య ప్రణాళికల్లోనూ పొందుపరచాలని సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు మద్య నియంత్రణ, నిషేధంపై శిక్షణ ఇవ్వాలన్నారు. మద్య నిషేధం అమలుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను వినియోగించు కోవాలన్నారు. దశల వారీ మద్య నిషేధానికి అన్ని చర్యలూ తీసుకోవాలని చెప్పారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదని, దీనిపై అధ్యయనం చేసి ఒక విధానాన్ని తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం ఒక మార్గదర్శక ప్రణాళికను రూపొందించాలన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా 503 మద్యం దుకాణాలు వచ్చే నెల 1వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం 503 మద్యం దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మద్యం దుకాణాలు సర్కారు ఆధ్వర్యంలోనే పని చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తద్వారా 16 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. దశల వారీగా మద్య నిషేధం, నియంత్రణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు. మద్యం వినియోగం గణనీయంగా తగ్గిపోతోందని, ఇందుకు ప్రధాన కారణం బెల్టు షాపుల తొలగింపేనని పేర్కొన్నారు. 2018 – 2019లో 125 లక్షల కేసుల లిక్కర్ విక్రయం జరిగిందని, బెల్టు షాపుల తొలగింపు తర్వాత ఈ ఏడాది జూలై వరకు 12 లక్షల కేసుల మద్యం వినియోగం తగ్గిందన్నారు. ప్రైవేట్ దుకాణాల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తున్నామని, 4,380 మద్యం దుకాణాలను 3,500కు తగ్గిస్తున్నామని చెప్పారు. మొత్తం 20 శాతం దుకాణాలు తగ్గిపోనున్నాయని అధికారులు వివరించారు. మద్య నియంత్రణ, నిషేధానికి, డీ ఎడిక్షన్ కేంద్రాలకు నిధులు రూ.500 కోట్లకు పెంచుతున్నామన్నారు. జీఎస్టీ, వాహన రంగం ఆదాయంలో తగ్గుదల వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖల ఉన్నతాధికారులు శాఖల వారీగా ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు. వాణిజ్య పన్నుల్లో 14 శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3 శాతానికి తగ్గిందని, గడచిన నాలుగు నెలల్లో ఆదాయంలో అనుకున్నంత మేర వృద్ధి లేదన్నారు. స్టీల్ రేట్లు తగ్గడం వల్ల కూడా ఆదాయంపై ప్రభావం చూపుతోందని చెప్పారు. సిమెంట్ ధర తగ్గడం వల్ల, దాని మీద వచ్చే పన్నులు తగ్గుతున్నాయని వివరించారు. వాహన రంగంలో మందగమనం వల్ల జీఎస్టీ తగ్గిందని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆదాయం మెరుగు పడుతుందని ఆశాభావంతో ఉన్నామని, జీఎస్టీ పరిహారం కింద వచ్చే నెల మొదటి వారంలో రూ.597 కోట్లు వస్తాయని అధికారులు సీఎంకు వివరించారు. -
ఇంటికెళ్లి తాగాల్సిందే..!
సాక్షి, బొబ్బిలి (విజయనగరం): పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్న మద్యం మహమ్మారిపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు ఇప్పటికే బెల్ట్‌దుకాణాలపై చర్యలు చేపట్టారు. ఇప్పుడు మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌లు రద్దు వంటి కొత్త ఆలోచనలతో దశల వారీ మద్య నిషేధం దిశగా అడుగులేస్తున్నారు. కొత్త విధానంలో దుకాణం వద్ద మద్యంతాగేందుకు అవకాశం ఉండదు. ఇకపై మద్యం కొనుగోలు చేసి ఇంటికెళ్లి తాగాల్సిందే. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా... అనవసర ప్రచారాల ఖర్చుల కోసం ఇంటికో ఉద్యోగం హామీని వదిలేసి ఇంటింటికీ మద్యం సరఫరాలా చేసిన గత ప్రభుత్వానికి భిన్నంగా కొత్త రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఆదాయమే పరమావధిగా కాకుండా పేద, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమమమే లక్ష్యంగా చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మద్యం రక్కసిని దశల వారీగా దూరం చేసేందుకు ఒక్కో ప్రణాళికా రచిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను కొన్నాళ్లపాటు నడిపి దుకాణాల సంఖ్యను దశలవారీగా తగ్గించేందుకు గతంలోనే ప్రకటించింది. ఇప్పుడు మరో ముందడుగు వేసి మద్యం దుకాణాల వద్ద ఇన్నాళ్లూ ఉన్న పర్మిట్ రూమ్‌ల విధానాన్ని రద్దు చేయనుంది. అక్టోబర్ 1 నుంచి అమలు కానున్న కొత్త మద్యం పాలసీలో ఈ విధానాన్ని తెరపైకి తేనున్నారు. దీంతో మద్యం తాగేందుకు షాపుకెళ్లి డబ్బులు కట్టి అక్కడే తాగేసి ఇంటికెళ్లే పరిస్థితులు మారనున్నాయి. మద్యం కొనుగోలు చేసి ఇంటికెళ్లాల్సిందే! లేదా బారుకెళ్లి అదనంగా చెల్లించుకుని కిక్కు ఎక్కించుకోవాల్సిందే! జిల్లాలో మద్యం దుకాణాలు: 210 మద్యం దుకాణాల వద్ద ఉన్న పర్మిట్ రూమ్‌లు: 201 ఇటీవల మూతపడిన దుకాణాలు: 9 నడుస్తున్నవి: 201 బార్లు: 28 ప్రతీ నెలా మద్యం అమ్మకాలు: రూ.60 కోట్లు (సుమారు) ప్రస్తుతం అన్ని షాపుల్లోనూ పర్మిట్ రూమ్‌లు.. జిల్లా వ్యాప్తంగా 210 మద్యం దుకాణాలున్నాయి. మరో 28 బార్లున్నాయి. వీటి ద్వారా ప్రతీ నెలా సుమారు 60 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతోంది. ప్రతీ రోజూ రూ.2 నుంచి 4 కోట్ల మద్యం విక్రయాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే గత నెల 30తో పాత మద్యం పాలసీ విధానం ముగిసింది. కొత్త మద్యం పాలసీ విధానం వెంటనే అమల్లోకి రావాలి. కానీ ప్రభుత్వం మద్యం దశల వారీ నిషేధం హామీ వెనుక మూడు నెలల పాటు లైసెన్స్‌లను పొడిగించింది. ఈ లైసెన్సులను మూడు నెలల పాటు రెన్యువల్ చేసుకోవాలని ఇచ్చిన ప్రకటనలో జిల్లాలో 9 షాపులు ముందుకు రాలేదు. బెల్ట్‌షాపుల నిషేధం, పక్కా పాలసీ అమలు వంటి నిర్ణయాల కారణంగా ఆయా షాపుల యజమానులు ముందుకు రాలేదు. ఇప్పుడు కొత్తగా పర్మిట్‌రూమ్‌లను రద్దు చేయనుండటంతో మద్యం విక్రయాలు మరింత తగ్గే అవకాశముంది. పర్మిట్ రూమ్‌లు ఉండవు! కొత్త మద్యం పాలసీపై మంగళవారం ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. అందులో కొత్త పాలసీలోని ప్రణాళికలు, ఇతర సూచనలూ చెబుతారు. అందరి ఎస్హెచ్ఓలతో సమావేశం నిర్వహించి కొత్త విధానంపై సిబ్బందికి కూడా అవగాహన కల్పిస్తాం. కొత్త విధానంలో పర్మిట్ రూమ్‌లు ఉండవు. కావాల్సిన వారు మద్యం కొనుగోలు చేసి ఇంటికెళ్లి తాగాల్సిందే. – వై.బి.భాస్కర రావు, డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, విజయనగరం -
ఆ 750 మద్యం దుకాణాలను ప్రారంభించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సెప్టెంబర్ చివరి వరకు కొనసాగించుకునేలా అవకాశమిచ్చినా లైసెన్సు రెన్యువల్ చేసుకోని 750 మద్యం షాపుల్ని వెంటనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేలా ఏర్పాట్లు చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎం.ఎం.నాయక్ అధికారుల్ని ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెన్యువల్ చేసుకోని షాపుల్ని వెంటనే ప్రారంభిస్తే.. ప్రభుత్వమే మద్యం షాపుల్ని ఎలా నిర్వహించాలో, ఇబ్బందులు, వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని అన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను అక్టోబర్ నుంచి ఏర్పాటు చేస్తుండటంతో పొడిగించిన లైసెన్సులను రెన్యువల్ చేసుకునేందుకు మద్యం వ్యాపారులు సుముఖత చూపలేదు. రాష్ట్రవ్యాప్తంగా 4,380 మద్యం షాపులుంటే 750 షాపులు లైసెన్సులను రెన్యువల్ చేసుకోలేదు. వీటిలో 130 మద్యం దుకాణాల్ని ఆగస్టు మొదటి వారం నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) ఆధ్వర్యంలో నిర్వహించేందుకు తొలుత నిర్ణయించారు. అయితే.. ఎక్సైజ్ అధికారులకు అనుభవం ఉంటుందని.. రెన్యువల్ చేసుకోని అన్ని మద్యం షాపుల్ని నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన విధివిధానాలను పంపిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో నోడల్ అధికారులుగా జిల్లా సంయుక్త కలెక్టర్లను నియమించడంతో జేసీలతో నోటిఫికేషన్ జారీ చేయించేలా ఎక్సైజ్ అధికారులు చొరవ చూపించాలని సూచించారు. త్వరలో అన్ని జిల్లాల్లో ప్రారంభమయ్యే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు అవసరమైన సిబ్బందిని, వీరిని నియమించే కాంట్రాక్టు ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఆయా జిల్లాల్లో సంయుక్త కలెక్టర్లు (జేసీలు) నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. -
ప్రభుత్వ మద్యం షాపులకు ప్రతిపాదనలు సిద్ధం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్టోబరు నుంచి ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఒక్కో షాపునకు ఆస్తుల కల్పన, నిర్వహణకయ్యే ఖర్చు మొత్తం కలిపి గ్రామీణ ప్రాంతంలో రూ.లక్షన్నర నుంచి రూ.2.50 లక్షల వరకు, పట్టణ/నగర ప్రాంతాల్లో రూ.3 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక్కో షాపులో ఫ్యాన్లు, టేబుళ్లు, ఫ్రిజ్ (బాటిల్ కూలర్), ర్యాకులు, గ్రిల్స్, స్కానర్, సీసీ కెమెరాలతో పాటు కంప్యూటర్ బిల్లింగ్‌కు ఏర్పాట్లుచేయాలని.. ఇందుకు రూ.లక్షన్నర దాటుతుందని తేల్చారు. అద్దె, సిబ్బంది జీతభత్యాలు కలిపి నెలకు మరో రూ.లక్ష వరకు ఖర్చవుతుందని ఎక్సైజ్ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. గ్రామీణ, నగర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే షాపు 150 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలని.. రాష్ట్ర, జాతీయ రహదారులకు, గుడి, బడికి దూరంగా ఉండాలని నిర్దేశించారు. కాంట్రాక్టు పద్ధతిలో సిబ్బంది భర్తీ కాగా, ఒక్కో మద్యం షాపులో సూపర్వైజరు, ఇద్దరు సేల్స్మెన్లు, ఓ సెక్యూరిటీ గార్డును నియమించనున్నారు. కాంట్రాక్టు పద్ధతిన ఈ పోస్టులకు సిబ్బందిని ఎంపికచేస్తారు. ఈ పోస్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలుచేయడంతోపాటు స్థానికులకు 75 శాతం ఉద్యోగాల నిబంధన అమలుచేయనున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనల నివేదికను త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందించనున్నట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ఆగస్టు నుంచి ప్రతి జిల్లాలో పది ప్రభుత్వ మద్యం షాపుల్ని ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. జేసీ ఆధ్వర్యంలో కమిటీకి బాధ్యతలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లోకి సిబ్బందిని ఎంపికచేసే బాధ్యతల్ని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిపో మేనేజరులతో కూడిన కమిటీకి అప్పగించనున్నారు. నోటిఫికేషన్ జారీచేసి సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిన ఎంపిక చేస్తారు. అలాగే, మద్యం డిపో నుంచి షాపునకు సరుకు చేరవేసేందుకు సరఫరాదారుల్ని (ట్రాన్స్పోర్టర్లు) కూడా టెండర్ల ద్వారా ఈ కమిటీయే ఎంపిక చేస్తుంది. మద్యం డిపో నుంచి షాపునకు సరుకు లోడింగ్, అన్లోడింగ్ బాధ్యతలు మొత్తం సరఫరాదారే చూసుకోవాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుత విధానం ప్రకారం మద్యం షాపులు నిర్వహించే ప్రైవేటు వ్యక్తులు ముందుగానే ఆయా డిపోలకు డీడీలు చెల్లించి సరుకు పొందుతున్నారు. కానీ, కొత్త విధానం ద్వారా ఏపీఎస్‌బీసీఎల్ ఆధ్వర్యంలో షాపులు నిర్వహిస్తున్నందున డిపో నుంచి అప్పు (క్రెడిట్) విధానంలోనే సరుకు తెచ్చి అమ్మకాల తర్వాత డిపోకు డబ్బు చెల్లిస్తారు. అయితే ఏ రోజుకా రోజు బ్యాంకులో డబ్బు జమచేయాలా? లేదా బ్యాంకు సిబ్బంది క్యాష్ పికప్ చేసుకోవాలా? అన్న విధానంపై ఇంకా స్పష్టతలేదు. బ్యాంకు సేవలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేయాలనే అంశంపై ఎక్సైజ్ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సూపర్వైజర్కు నెలకు రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకు, సేల్స్మెన్లకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం చెల్లిస్తారు. అకౌంట్స్ చూడాల్సి ఉన్నందున సూపర్వైజర్కు డిగ్రీ విద్యార్హతగా, సేల్స్‌మెన్‌కు ఇంటర్/పది విద్యార్హతగా నిర్ణయించారు. లాభాపేక్ష లేకుండా సర్కారు ఈ షాపులను నిర్వహిస్తుంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం నుంచి సిబ్బందికి జీతాలు చెల్లిస్తారు. ప్రభుత్వ ఉద్దేశమిదే.. ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులు మద్యం షాపులు దక్కించుకుని మాఫియాగా ఏర్పడి విచ్చలవిడిగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా బెల్టు షాపుల్ని ఏర్పాటుచేసి ప్రజల్ని వ్యసనపరులుగా మార్చేస్తున్నారు. బ్రాండ్ మిక్సింగ్‌కు పాల్పడి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే మద్యం షాపుల్ని నిర్వహిస్తే ఈ తరహా ఉల్లంఘనలు ఏమీ ఉండవు. అలాగే, బెల్టు షాపుల్ని సమూలంగా నిర్మూలించేందుకు అవకాశం ఏర్పడడమేగాక సీఎం హామీ మేరకు దశల వారీగా మద్యపాన నిషేధానికి అవకాశం ఏర్పడుతుంది. -
వీధి వీధికో బీరు పార్లర్!
సాక్షి, అమరావతి: మద్యం మహమ్మారి మత్తులో యువత జోగుతోందని ప్రజా సంఘాల, మద్య వ్యతిరేక పోరాట కమిటీ నేతలు గగ్గోలు పెడుతున్నా..పట్టించుకోని ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికే అత్యధిక ప్రాధాన్యత నిస్తుండడం పలు విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకం ఆరోగ్యాన్ని కొల్లగొడుతున్న 4,380 మద్యం షాపులు, 800 బార్లు సరిపోవన్నట్లు.. ఎక్కడపడితే అక్కడ..ఎప్పుడు పడితే అప్పుడు తాగేందుకు మద్యం ప్రియులకోసం మైక్రో బ్రూవరీ బార్లను ఏర్పాటు చేసేందుకు సర్కారు తలుపులు బార్లా తెరిచింది. బీరు, వైన్ అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఈ ర్యాంకును అధిగమించేందుకు ఏపీలో బీరు అమ్మకాలు పెరిగేలా ఈ మైక్రో బ్రూవరీలను సర్కారు ఏర్పాటు చేయనుందని సమాచారం. ఈ మైక్రో బ్రూవరీ బార్లలో రెడీ టూ డ్రింక్ పేరిట బీరు, వైన్ అమ్మకాలు చేపట్టనుంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్టణంలో ఈ మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసింది. ఈ తరహా మైక్రో బ్రూవరీ బార్లను రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేసి మద్యం ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఖజానా నింపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయనుంది. అయితే ఇంతవరకు మైక్రో బ్రూవరీలపై నిబంధనలు (గైడ్ లైన్స్) రూపొందించకుండానే విజయవాడ, విశాఖలలో మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేయడం విమర్శల పాలవుతోంది. రాయలసీమ మంత్రి తనయుడి ఒత్తిడితోనే.. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ మంత్రి తనయుడు ఎక్సైజ్ శాఖలోనూ తలదూర్చి చక్రం తిప్పుతున్నారు. విజయవాడ నగరంలో సదరు మంత్రి తనయుడు సొంతంగా మైక్రో బ్రూవరీ ఏర్పాటు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. పాశ్చాత్య పోకడగా సాగుతున్న ఈ పార్లర్లో బీరు అమ్మకాల పర్యవేక్షణ చేసేందుకు ఎక్సైజ్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ మైక్రో బ్రూవరీల అనుమతుల ముసుగులో నూతన బార్లకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. -
ఎక్సైజ్ పాలసీ ఖరారు
-
ఎక్సైజ్ పాలసీ ఖరారు
మద్యం దుకాణాలకు ఈనెల 13న నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు మద్యం కొత్త పాలసీ ఖరారైంది. రాష్ట్రంలో గతంలో ఉన్న ఆరు శ్లాబులను నాలుగు శ్లాబులకు కుదించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. గతంలో రూ. 50 వేలు ఉన్న దరఖాస్తు ఫీజును అర్బన్ ప్రాంతంలో రూ. లక్షకు పెంచారు. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు పంపిన ప్రతిపాదనలకు సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర వేశారు. దీంతో అధికారులు మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 13న నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. అదే రోజు నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తుల స్వీకరణ చివరి గడువు ఈనెల 19గా నిర్ణయించారు. 22వ తేదీన మద్యం దుకాణాల లైసెన్సులకు డ్రా నిర్వహిస్తారు. డ్రా నిర్వహణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. పాత పాలసీలో ఆరు స్లాబులుగా ఉన్న లైసెన్సు ఫీజును నాలుగు స్లాబులకు కుదించారు. మేజర్ గ్రామ పంచాయతీ, మండల కేంద్రంలో గతంలో రూ. 39.5 లక్షలు, రూ. 40.8 లక్షలుగా ఉన్న రెండు శ్లాబులను కలిపేసి రూ. 45 లక్షలతో ఒక శ్లాబు చేశారు. గతంలో 2 లక్షల నుంచి 3 లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లోని మద్యం షాపులకు రూ. 50 లక్షలు, రూ. 60 లక్షల శ్లాబులు ఉండగా, ఆ రెండింటిని కలిపి రూ. 55 లక్షలతో ఒకే శ్లాబు చేశారు. 3 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు గతంలో రూ. 81.6 లక్షల స్లాబు ఉండేది. తాజాగా పర్మిట్ రూమ్‌తో కలిపి ఈ శ్లాబును రూ. 85 లక్షలకు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో రూ. 1.08 కోట్లు ఉండగా, ఈసారి దానిని పర్మిట్ రూమ్‌తో కలిపి రూ. 1.10 కోట్లుగా నిర్ధారించారు. రెండేళ్ల లీజు కాలాన్ని ఎప్పటిలాగే కొనసాగించనున్నారు. -
మద్యం దుకాణాలు వర్థిల్లు గాక! రహదారులనే రద్దు చేస్తాం.
జాతీయ, రాష్ట్ర రహదారులను స్థానిక రహదారులుగా మార్పు: మంత్రి జవహర్ సాక్షి, అమరావతి: జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన మద్యం దుకాణాలుండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, జనం ఇబ్బం దులెదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు ఆందోళ న వ్యక్తం చేసింది. రోడ్డు పక్కనే మద్యం దొరుకుతుండడంతో డ్రైవర్లు అక్కడే సేవించి, వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగు తున్నాయంది. అందుకే జాతీయ రహదారులకు 500 మీటర్లు, రాష్ట్ర రహదారు లకు 200 మీటర్ల లోపు ఎక్కడా మద్యం దుకాణాలు ఉండరాదని అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏపీ ప్రభు త్వం సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేస్తోంది. మద్యం దుకాణాలను జాతీయ, రాష్ట్ర రహదారులపై యథాతథంగా కొనసాగించ డానికి వీలుగా ఆయా రోడ్లనే రద్దు చేస్తామని చెబుతోంది. జాతీయ, రాష్ట్ర రహదారులను స్థానిక రహదారులుగా మార్చేస్తోంది. సాక్షా త్తూ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కేఎస్ జవహర్ ఈ విషయం వెల్లడించడం గమనార్హం. సర్కారు నిర్ణయంతో రహదారుల పై నిత్యం మద్యం జాతర ఎప్పటì æలాగే కొనసాగనుంది. ఇప్పటికే జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకున్నవారు ప్రధాన రహదారుల పైకి రావడానికి వీలుగా ప్రభుత్వం పలు వెసులుబాట్లు ప్రకటించింది. షిఫ్టింగ్ ఫీజుల ను ఎత్తివేస్తామంది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో అనుమతులు ఇచ్చేస్తామని ప్రకటిం చింది. జాతీయ రహదారులను డీనోటిఫై చేయడం ద్వారా మద్యం దుకాణాలను యథాతథంగా నిర్వహించుకునేలా చర్యలు తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ కేఎస్ జవహర్ తెలిపారు. ఇలా డీనోటిఫై చేసుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని, తాము ఎక్కడా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. మంత్రి జవహర్ గురువారం వెలగపూడి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి లైసెన్స్‌లు పొందిన వాళ్లు కూడా తిరిగి ప్రధాన రహదారులపైకి రానున్నట్లు వెల్లడించారు. పారదర్శకంగా షాపుల మంజూరు మద్యం దుకాణాల ఏర్పాటుపై మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జనావాసాల మధ్య లిక్కర్ షాపుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు 9951314101 నంబర్‌కు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చని సూచించారు. 5 రోజుల్లో రూ.120 కోట్ల నష్టం జాతీయ రహదారులను డీనోటిఫై చేస్తూ అందాల్సిన ఉత్తర్వులు ఆలస్యం కావడంతో చాలామంది యజమానులు ఇంకా మద్యం షాపులు ప్రారంభించలేదని, దీనివల్ల ప్రభుత్వం ఐదు రోజుల్లో రూ.120 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు మంత్రి జవహర్ వెల్లడించారు. ఎక్సైజ్ అధికారులపై సీఎం ఆగ్రహం మద్యం దుకాణాలు పూర్తిగా తెరుచుకోక పోవడం వల్ల ఒకపక్క ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుం డడమే కాకుండా, జనావాసాల మధ్య షాపుల ఏర్పాటు పై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆందోళ నలు చేస్తుండడంతో ఎక్సైజ్ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి చాలా రోజులైనా దానికి అనుగుణంగా జూలై 1 కల్లా కొత్త షాపులను ప్రారంభించేలా చేయడంలో అధికారులు విఫలం కావడం పై ఆయన మండిపడినట్లు తెలిసింది. -
‘హైవే మద్యం’పై నిషేధం
నేటి నుంచే అమల్లోకి - 500 మీటర్ల లోపున్న దుకాణాలు మూసేయాలన్న సుప్రీం కోర్టు - తెలంగాణలో సెప్టెంబర్ 30, ఏపీలో జూన్ 30 వరకు గడువు - సిక్కిం, హిమాచల్, మేఘాలయలకు మినహాయింపు - తీర్పు సమీక్షించాలన్న లిక్కర్ అసోసియేషన్ వినతి తిరస్కరణ - బిహార్‌లో మద్యం నిల్వల ఖాళీకి మే 31 తుది గడువు న్యూఢిల్లీ: జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలని శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 15, 2016కు ముందు లైసెన్సులు తీసుకున్న (తెలంగాణ, ఏపీతో సహా పలురాష్ట్రాలకు) వారికి మాత్రం కొంత గడువిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం.. మద్యం దుకాణాలతోపాటు బార్లు, పబ్బులు, రెస్టారెంట్లను ఏప్రిల్1 నుంచి మూసేయాలని స్పష్టం చేసింది. ఘోరమైన రోడ్డు ప్రమాదాలకు హైవేల పక్కన మద్యం అందుబాటులో ఉండటమే కారణమని అభిప్రాయపడింది. అయితే.. సిక్కిం, మేఘాలయా, హిమాచల్ ప్రదేశ్‌లకు ‘500 మీటర్ల’ నిబంధననుంచి మినహాయింపునిచ్చింది. ఈ రాష్ట్రాల్లో హైవేలకు 220 మీటర్ల దూరంలో మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చని జస్టిస్ డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ఈ ధర్మాసనం ఆదేశించింది. మార్చి 31 తర్వాత హైవేలకు ఆనుకుని ఉన్న మద్యం అమ్మకాల కేంద్రాల లైసెన్సులను కొనసాగించకూడదని పేర్కొంది. డిసెంబర్ 15, 2016కు ముందు లైసెన్సులు పొందిన కేంద్రాలకు తెలంగాణలో సెప్టెంబర్ 30 వరకు, ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 30 వరకు మాత్రమే దుకాణాలు నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. కోర్టు తీర్పును సమీక్షించాలంటూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేరళ, పంజాబ్, తెలంగాణ మద్యం అమ్మకందారుల అసోసియేషన్ల వినతినీ, 500 మీటర్ల నిబంధన నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలన్న అటార్నీ జనరల్ రోహత్గీ వినతిని కోర్టుతోసిపుచ్చింది. మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా ఏటా 1.42 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారన్న పిల్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాఖండ్‌పై స్టే ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల్లో పూర్తిగా మద్యపానం నిషేధించాలన్న ఆ రాష్ట్ర హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. హిమాలయ పర్వతాల్లో పవిత్రమైన చార్ధామ్ యాత్ర జరిగే మూడు జిల్లాల్లో (రుద్రప్రయాగ్, చమోలీ, ఉత్తరకాశీ) మద్యం అమ్మకాలను 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తిగా నిషేధించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ ప్రాంతాల్లో యువత ఎక్కువగా మద్యానికి బానిసలుగా మారుతున్నట్లు ఆధారాలున్నందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గురుద్వారాల వద్ద పొగాకు అమ్మకాలపైనా నియంత్రణ విధించాలంది. మద్యం అమ్మకాల విషయాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. బిహార్‌లో మద్యం తయారీ సంస్థలకున్న స్టాక్ (నిల్వలు)ను మే 31 లోగా ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు (జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ల ధర్మాసనం) ఆదేశించింది. బిహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్నందున.. తయారీ, నిల్వలను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. -
మద్యం దుకాణాలపై తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలు పెట్టవద్దన్న తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. నేడు తీర్పును వెలువరించనుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట 500 మీటర్ల లోపున మద్యం షాపుల్ని నిషేధించామని జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస ఎల్.నాగేశ్వర రావుల ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. మద్యం షాపులు తరలించమని కోరడమంటే రాష్ట్రాల మద్యం పాలసీని ప్రభావితం చేయడం కాదని, జాతీయ రహదారుల వెంట మద్యం దుకాణాల దూరానికి సంబంధించిన అంశం మాత్రమేనని ధర్మాసనం పేర్కొంది. జాతీయ రహదారులపై తాగి నడపడానికి స్వేచ్ఛ లేదని స్పష్టం చేసింది. -
మద్యం దుకాణాలకు తగ్గిన దరఖాస్తులు
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: జిల్లాలోని 239 మద్యం దుకాణాలకు 5,323 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ దరఖాస్తులు, రిజిస్ట్రేషన్ ఫీజు రూపేణా రూ.22.80 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. కానీ గతసారితో పోల్చితే ఆదాయం పెరిగినా దరఖాస్తుల సంఖ్య మాత్రం తగ్గిపోయింది. గతంలో 6,267 దరఖాస్తులు వచ్చాయి. రెండేళ్ల కాలపరిమితితో అనుమతి కోసం మద్యం దుకాణాలకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ మేరకు గురువారం సాయంత్రం 5 గంటలతో దరఖాస్తుల దాఖలుకు గడువు ముగిసింది. కానీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో మరో మూడు గంటల పాటు గడువు పొడిగించారు. ఎట్టకేలకు 5,323 దరఖాస్తులు దాఖలయ్యాయి. వాటి పరిశీలన కూడా గురువారం అర్ధరాత్రి వరకూ కొనసాగింది. రాత్రి 10 గంటల సమయానికి 3,783 దరఖాస్తులకు ఎంట్రీపాస్ లభించింది. మిగిలిన 1,540 దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. జిల్లాలో కొన్నిచోట్ల మద్యం దుకాణాలకు టెండర్లు వేయవద్దంటూ అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు కొంతమంది ఎక్సైజ్ అధికారులు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం వేలం ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడానికి తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి శ్రీకాకుళంలోని వైఎస్సార్ కల్యాణమండలంలో లాటరీ ద్వారా వేలం పాట నిర్వహించనున్నారు. -
మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల
► ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ► జిల్లాలో 401 షాపులకు 31న లాటరీ సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని 401 మద్యం దుకాణాలకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలిసారిగా ఆన్లైన్ విధానంలో శుక్రవారం నుంచే దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సీహెచ్ గోపాలకృష్ణ వెల్లడించారు. తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆన్లైన్ ప్రక్రియ హెచ్‌టీటీపీ://202.56. 199.158 నెట్ అడ్రస్ ద్వారా ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ అప్లికేషన్‌ను 30వ తేదీ అర్ధరాత్రి 12గంటలలోపు సంబంధిత ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు అందజేసి ధ్రువీకరణ పత్రం పొందాలన్నారు. 31వ తేదీన బాలాజీ నగర్‌లోని కేపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో లాటరీ తీస్తామని డీసీ తెలిపారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు ఉన్న 95 మద్యం దుకా ణాలకు లైసెన్స్ కాల పరిమితి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2019 జూన్ 30 వరకూ ఉంటుందన్నారు. జాతీయ రహదారులకు దూరంగా ఉన్న 306 షాపులకు జూలై ఒకటి నుంచి 2019 జూన్ 30 వరకూ ఉంటుందని ఆయన వివరించారు. నగరం నుంచి వెళుతున్న జాతీయ రహదారి వెంబడి ఉన్న 38 మద్యం దుకాణదారులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నందున ప్రస్తుతానికి వారిని అక్కడి నుంచి తొలగించలేమని, ఆనందపురం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వాటికి నోటీసులు జారీ చేశామని డీసీ చెప్పారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఎస్వీవీఎన్ బాబ్జిరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుదారులకు సూచనలు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత వచ్చే ఫారం ఎ3(బి), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఫారం –ఆర్1, ఎంట్రీపాస్ ఫారం ఇ1లను జతపరిచి సంబంధిత ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు అందజేయాలి. దరఖాస్తు రుసుముగా రూ.5 వేలు చెల్లించాలి. రిజిస్ట్రేషన్ రుసుముగా మండలాల్లో రూ.50 వేలు, మున్సిపాలిటీల్లో రూ.75వేలు, మున్సిపల్ కార్పొరేషన్లో రూ.లక్ష వసూలు చేస్తారు. ఇది తిరిగి ఇవ్వరు. ఇక మిగతా నిబంధనలు ఎప్పటిలానే ఉన్నాయి. ఆధార్, పాన్ కార్డు తప్పనిసరి. లైసెన్స్ ఫీజు ఈ ఏడాది కొత్త మద్యం పాలసీ ప్రకారం లైసెన్సు ఫీజులు భారీగా తగ్గించారు. అయితే తగ్గిన మొత్తాన్ని ఎక్సైజ్ డ్యూటీ పేరుతో తిరిగి వసూలు చేయనున్నారు. కార్పొరేషన్ లిమిట్స్‌కు ఐదు కిలోమీటర్లు, మున్సిపాలిటీ లిమిట్స్‌కు రెండు కిలోమీటర్ల దూరం పరిధిలో ఉన్న షాపులకు కార్పొరేషన్, మున్సిపాటిలీలకు వర్తించే ఫీజులే వర్తిస్తాయి. లాటరీ ద్వారా లైసెన్సు పొందిన వారు వెంటనే ఏడాది లైసెన్సు ఫీజు, పర్మిట్ రూమ్ దరఖాస్తు ఫీజు రూ.10వేలు, పర్మిట్ రూమ్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50వేలు లాటరీ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లో చెల్లించాలి. ఒక షాపునకు ఒక్కరే దరఖాస్తు చేయాలి. అంతేకాదు లాటరీ ప్రక్రియకు పిలిచినప్పుడు దరఖాస్తుదారుడు ఆ ప్రదేశంలో లేకపోతే షాపు ఇవ్వరు. లైసెన్స్‌దారుడు నిర్దేశించిన పరిధిలో అవకాశం లేకపోతే, ఏదో ఒక చోట దుకాణం పెట్టుకునే వెసులుబాటు కల్పించింది. -
రెండో మద్యం డిపో ప్రారంభానికి బాలారిష్టాలు
హమాలీల నియామకం విషయంలో వివాదం వెనుదిరిగిన మద్యం లారీలు పండగ అనంతరం సన్నాహాలు నెల్లూరు(క్రైమ్): గూడూరు ఎక్సైజ్ జిల్లాలో రెండో మద్యం డిపో నిర్మాణం పూర్తయింది. ఈనెల మొదటివారంలో ప్రారంభించాల్సి ఉంది. అయితే హమాలీల నియామక విషయంలో వివాదం చెలరేగడంతో ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో డిపోకు వచ్చిన 30 లారీల మద్యం దేవరపాలెం ఐఎంఎల్ డిపోకు తరలింది. జిల్లాలో 336 మద్యం దుకాణాలు 42 బార్లు ఉన్నాయి. వీటన్నింటికీ నెల్లూరు ఎౖMð్సజ్ జిల్లా పరిధిలోని దేవరపాలెం ఐఎంఎల్ డిపో నుంచే మద్యం, బీరు సరఫరా అవుతోంది. గూడూరు సబ్‌డివిజన్ పరిధిలోని తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడి నుంచే మద్యం ఏన్నోఏళ్లుగా తీసుకెళుతున్నారు. కొంతకాలంగా ఖర్చు అధికమవుతుండటం వ్యాపారులకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గూడూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలోని ఓజిలిలో రెండో మద్యం డిపో ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 141 మద్యం దుకాణాలకు సరఫరా గూడూరు జిల్లాలోని 141 మద్యం దుకాణాలకు, నాలుగుబార్లకు ఓజిలి నుంచే మద్యం సరఫరా అవుతోంది. దీంతో వ్యాపారుల్లో ఆనందం నెలకొంది. ఈ నెల మొదటివారంలో ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేశారు. 30 లారీల మద్యాన్ని సైతం తెప్పించారు. అయితే హమాలీల నియామక విషయంలో నెలకొన్న వివాదంతో ప్రారంభానికి బ్రేక్ పడింది. దీంతో మద్యాన్ని దేవరపాలెంలోని డిపోకు తరలించారు. డిపోలో పనిచేసేందుకు çసుమారు 80మంది లోడింగ్, అన్లోడింగ్ చేసేందుకు హమాలీలు అవసరం. హమాలీల నియామకాల్లో 80శాతం స్థానికులకు, 20శాతం స్థానికేతరులకు అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలో హమాలీల నియామక బాధ్యతలు జేసీ చేపట్టారు. పదోతరగతి ఉత్తీర్ణులై, 40 ఏళ్లలోపు వారినే నియమించేందుకు చర్యలు చేపట్టారు. స్థానికేతరులకు ఎలాంటి పరిస్థితుల్లో అవకాశం కల్పించరాదని, తమనే నియమించాలని, అధికారపార్టీ నేతలు సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండా నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో డిపో ప్రారంభానికి నోచుకోలేదు. గత కొద్దిరోజులుగా అధికారులు, కార్మిక నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండగ అనంతరం డిపోను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయమై నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావును వివరణ కోరగా హమాలీల నియామకం విషయంలో కొంత సమస్య ఉందని అది త్వరలోనే కొలిక్కి వస్తుందన్నారు. పండగ అనంతరం డిపోను ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. -
మద్యం దుకాణాలతోనే ప్రమాదాలు
వాటిని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరిన విపక్షాలు సాక్షి, హైదరాబాద్: ‘రోడ్డుకు ఇరువైపులా మద్యం దుకాణాలు ఉండటం ప్రమాదాలకు కారణం అవుతోంది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వాటిని తొలగించాలి’ అని విపక్ష సభ్యులు కోరారు. గురువారం శాసన మండలిలో జాతీయ రహదారులపై స్వల్పకాల చర్చ జరిగింది. దీనిపై బీజేపీ సభ్యులు రామచందర్‌రావు, ఎంఐఎం సభ్యులు జాప్రీ, కాంగ్రెస్ సభ్యులు రాజగోపాల్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వివరణ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఉన్న రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్న జాతీయ రహదారి 65 మీద చిట్యాల్, చౌకపల్లి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జీల నిర్మాణం చేపడతామన్నారు. హైదరాబాద్– శ్రీశైలం రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలని నివేదించామని తెలిపారు. హైదరాబాద్‌కు 50 కి.మీ దూరంలో 390 కి.మీల రింగ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నట్లు ప్రకటించారు. -
‘మద్యం’తర చిక్కులు
►సుప్రీంకోర్టు తీర్పుతో ఎక్సైజ్ శాఖలో కలవరం ►1,450 దుకాణాలు, 425 బార్లు మూసివేత! ►రాష్ట్ర ఖజానాకు రూ.6 కోట్ల గండి సాక్షి, హైదరాబాద్: మందుబాబులకు పెద్ద చిక్కు వచ్చిపడింది. నగర, మున్సిపాలిటీ, గ్రామాల గుండా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు మద్యం దుకాణాలు నిర్వహించ రాదని, అలాంటి దుకాణాలను మూడు నెలల్లోపు తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు సర్కారును కలవరపెడుతోంది. ఈ తీర్పు నేప«థ్యంలో రాష్ట్రంలో దాదాపు 1,450 మద్యం దుకాణాలు, 425 బార్లు మూతపడనున్నాయి. రహదారుల వెంట ఇప్పటికే అనుమతించిన మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాల లైసెన్స్‌ను వచ్చే ఏడాది మార్చి 30 లోపు రద్దు చేయాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని మొత్తం 2,143 మద్యం దుకాణాలు, 815 బారుషాపులకు కలిపి రెండేళ్ల కాలానికి లైసెన్స్ ఫీజు రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,752 కోట్లు సమకూరాయి. వ్యాపారులు మూడు నెలలకు ఒక వాయిదా చొప్పున లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఈ ఏడాది అక్టోబర్‌లోనే లైసెన్స్ రెన్యువల్ చేశారు. మిగిలిన మూడు వాయిదాల సొమ్ముకు వ్యాపారులు బ్యాంకు గ్యారంటీ ఇచ్చారు. కోర్టు తీర్పు నేపథ్యంలో వాయిదాలపై వ్యాపారులు, అధికారుల్లో కలవరం మొదలైంది. ఆదాయానికి గండి రోడ్డు పక్కనున్న దుకాణాలను తొలగిస్తే లైసెన్స్, ప్రివిలేజ్ ఫీజుతోపాటు మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. సుమారు రూ.850 కోట్ల లైసెన్స్ ఫీజు, రూ.350 కోట్ల ప్రివిలేజ్ ఫీజ్ పోతుంది. గత ఏడాది మద్యం విక్రయాలను పరిశీలిస్తే నెలకు రూ.1,100 కోట్ల విలువైన విక్రయాలు జరుగుతు న్నాయి. 75 శాతం దుకాణాలు మూత పడుతున్నాయి కాబట్టి ఈలెక్కన చూస్తే దాదాపు రూ.4,500 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు నిలిచిపోతాయి. మద్యం విక్రయాల్లో 70 శాతం డబ్బు వివిధ పన్నుల రూపంలో సర్కారు ఖజానాకు వచ్చి చేరుతుంది. తీర్పు నేపథ్యంలో అంతా కలిపి రూ. 6 వేల కోట్లకు పైగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అబ్కారీ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లో లైసెన్స్ ఫీజు దుకాణదారులకు వెనక్కి ఇవ్వకూడదని అధికారులు భావిస్తున్నారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం లైసెన్స్డ్ దుకాణాన్ని, బారుషాపును ఒక ప్రాంతం నుంచి అదే జిల్లాలోని వేరొక ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంది. కోర్టు తీర్పు పరిధిలోకి వచ్చే దుకాణదారులకు ఇవే నిబంధనలు అమలు చేసి వారి చేత బలవంతంగానైనా మద్యం దుకాణాలు నడిపించాలని ఎక్సైజ్ అధికారులు ఆలోచి స్తుండగా మద్యం వ్యాపారులు అందుకు విముఖంగా ఉన్నారు. -
అంకురం
ఆదర్శం రాజస్థాన్‌లోని భీల్వారా జిల్లాలో ఉన్న మారుమూల గ్రామం ధాపరా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఒకవేళ కాస్తో కూస్తో తెలిసిందంటే... ఆ చిన్న గ్రామంలో తిష్ట వేసిన అతి పెద్ద మద్యభూతం గురించే! ఈ ఊళ్లో పెద్దవాళ్లే కాదు... ఒక వయసు పిల్లలు కూడా రోజూ సాయంత్రం మద్యం సేవిస్తారు. విషాదం ఏమింటే ‘ఎనీటైమ్ మనీ’లాగా ‘ఎనీ టైమ్... ఎక్కడైనా మద్యం’ దొరకడం అనేది ఈ ఊరి ప్రత్యేకత. అక్రమంగా వెలసిన మద్యం దుకాణాలపై పోరాటానికి గతంలో కొంత ప్రయత్నమైతే జరిగిందికానీ... ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగే తయారైంది పరిస్థితి. నిజానికి ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు వస్తే... అక్రమంగానో, సక్రమంగానో ఎన్ని మద్యం దుకాణాలు వెలసినా అవి వెలవెలపోతాయి. అందుకే ఆ వైపు నుంచి నరుక్కు రావాలనుకుంది స్కూల్ ఆఫ్ డెమోక్రసీ (యస్‌ఎఫ్‌డీ) యస్‌ఎఫ్‌డీని ‘లోక్‌తంత్రశాల’ అని కూడా పిలుస్తారు. భీల్వారా జిల్లాలో ఉన్న ‘బది కా బదియ’ గ్రామంలో ఉన్న నాన్–ఫార్మల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈ యస్‌ఎఫ్‌డీ. వర్క్‌షాప్‌లు, ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు, ప్రదర్శనలు... మొదలైన వాటి ద్వారా విద్యార్థులకు ప్రజాస్వామిక విద్యను అందించే ప్రయత్నం చేస్తుంది యస్‌ఎఫ్‌డీ. ‘కమ్యూనిటీ లైబ్రరీ ప్రోగ్రాం’లో భాగంగా భీల్వారా జిల్లాలోని ఎన్నో గ్రామాల్లో గ్రంథాలయాల స్థాపనకు కృషి చేస్తుంది. ధాపరా గ్రామాన్ని పట్టి పీడిస్తున్న మద్యపాన సమస్య... ఆ గ్రామస్థుడు లాడోసింగ్‌కు బాధ కలిగించేది. తమ గ్రామసమస్యను ‘లోక్‌తంత్రశాల’ దృష్టికి తీసుకువచ్చాడు లాడో సింగ్. యస్‌ఎఫ్‌డీ ఊళ్లో గ్రంథాలయాన్ని స్థాపించింది. యస్‌ఎఫ్‌డీ వాలంటీర్లు ఈ గ్రంథాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ‘‘పిల్లలు, యువత కోసం ఈ గ్రంథాలయాన్ని మొదలుపెట్టాం. దీని వల్ల పుస్తక పఠనాభిలాష పెరగడమే కాదు...రకరకాల నైపుణ్యాలు పెరుగుతాయి’’ అంటున్నారు యస్‌ఎఫ్‌డీ తరపున పనిచేస్తున్న రెనీ జోసెఫ్. ఊరును ‘మద్యం సమస్య’ పట్టి పీడిస్తోంది. దీనికి ‘గ్రంథాలయం’ ఎలా పరిష్కారం చూపుతుంది? అనేది చాలామంది సందేహం. అయితే యస్‌ఎఫ్‌డీ పుణ్యమా అని తమ తీరిక సమయాన్ని గ్రంథాలయంలోనే గడుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీని ప్రభావం ఊరికే పోలేదు... గ్రామస్థుల ప్రవర్తన, అలవాట్లకు సంబంధించిన విషయాల్లో క్రమంగా మార్పు వస్తుంది. ఇది ఒక శుభసంకేతంగా యస్‌ఎఫ్‌డీ భావిస్తుంది. గ్రంథాలయానికే పరిమితమైపోలేదు యస్‌ఎఫ్‌డీ. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక ప్రజలతో గడుపుతూ... మద్యం వల్ల తలెత్తే దుష్పరిణామాల గురించి ప్రచారం నిర్వహిస్తుంది. ఈ గ్రంథాలయ ఆవరణలో ‘కథా పఠనం’ కూడా నిర్వహిస్తున్నారు. ఆ కథలు తమ గురించి తమ శక్తియుక్తుల గురించి తెలుసుకునేలా చేయడమే కాదు... ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకునేలా ఉపకరిస్తున్నాయి. ‘‘సాయంత్రం అయ్యేసరికి గ్రామస్థులు ఇక్కడకు చేరుకుంటారు. వార్తాపత్రికలు చదవడం అలవాటు చేసుకుంటున్నారు. తాము చదివిన విషయాల గురించి చర్చ తప్ప... ఇతర విషయాలను పట్టించుకోవడం లేదు’’ అంటుంది యస్‌ఎఫ్‌డీ కార్యకర్త అదితి. ‘విలేజ్ బుక్ ఫెయిర్’ ‘రూరల్ లిటరరీ ఫెస్టివల్’లు నిర్వహించడం ద్వారా... పిల్లలు, పెద్దల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉంది ఎస్ఎఫ్డీ. అంతమాత్రాన రాత్రికి రాత్రే మార్పు వస్తుందని కాదు. అదితి మాటల్లో చెప్పాలంటే... ‘‘మార్పుకు సమయం పట్టవచ్చు. కానీ కచ్చితంగా మార్పు చోటు చేసుకుంటుంది’’ కాలక్షేప సమయం శ్రుతి మించితే... చెడు అలవాటు చేరువవుతుంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టి... కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాదు, తమ గురించి తాము ఆలోచించుకొని కొత్తదారిలో పయనించడానికి ఉపకరించే కేంద్రంగా ఎస్ఎఫ్డీ గ్రంథాలయం రూపుదిద్దుకుంటోంది. -
ప్రమాద హేతువులు
ఇక వీటికి చెల్లు జిల్లాలో హైవేల పక్కన 39 మద్యం దుకాణాలు ఈ ఏడాది 266 ప్రమాదాలు, 82 మంది మృత్యువాత రహదారుల ప్రమాదాలపై స్పందించిన సుప్రీం కోర్టు వైన్స్‌లు తొలగించాలని ఆదేశాలు నిజామాబాద్ ౖక్రెం : రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో సగానికి పైగా మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్నవే ! ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న మద్యం దుకాణాలను వచ్చే సంవత్సరం మార్చి 31 తర్వాత అక్కడి నుంచి తొలగించాలంటూ ప్రభుత్వాలకు గట్టి ఆదేశాలు ఇచ్చింది. హైవేలకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించింది. రోడ్ల పక్కన నుంచి తొలగించని దుకాణాల లైసెన్స్‌లు రెన్యూవల్ చేయారాదని సూచించింది. జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులపై మొత్తం 39 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు జాతీయ, రాష్ట్ర రహదారులపై మొత్తం 266 ప్రమాద ఘటనలు చోటుచేసుకోగా, 82 మంది మృత్యువాత పడ్డారు. 263 మంది క్షతగాత్రులయ్యారు. ఇంటి పెద్ద మరణించడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తీవ్రంగా గాయాలపాలై మరి కొందరు అవిటివారయ్యారు. వీటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టక పోవటంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. 182 కిలో మీటర్లు 39 దుకాణాలు ... జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులు మొత్తం 182 కిలోమీటర్లు కలిగి ఉన్నాయి. ఈ రహదారులపై మొత్తం 39 మద్యం దుకాణాలు ఉండగా.. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక మద్యం దుకాణాం ఉన్నట్లు లెక్క. నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారి నం 44 పై చంద్రయన్‌పల్లి నుంచి సోన్ బ్రిడ్జి వరకు 65 కిలోమీటర్ల పరిధిలో 7 మద్యం దుకాణాలు, జాతీయ రహదారి 63 నిజామాబాద్ నగరంలోని రైల్వేకమాన్ నుంచి కమ్మర్పల్లి వరకు 55 కిలోమీటర్లు పరిధిలో 22 మద్యం దుకాణాలు ఉన్నాయి. రాష్ట్ర రహదారి నం.25 నగరంలోని తిలక్‌గార్డెన్ నుంచి నర్సి బ్రిడ్జి వరకు 41 కిలో మీటర్ల పరిధిలో 4 మద్యం దుకాణాలు ఉన్నాయి. సంగారెడ్డి నుంచి ఆదిలాబాద్ జిల్లా బైంసా మెదక్, బాన్సువాడ, వర్ని, బోధన్ రోడ్డును జాతీయ రహదారిగా ఇటీవల ప్రకటించారు. రాష్ట్ర రహదారి నం.6 వర్ని నుంచి బోధన్ వరకు 21 కిలోమీటర్ల పరిధిలో 6 మద్యం దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులు మినహా అన్ని రోడ్లపై ఇప్పటి వరకు 500 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా వీటిలో 179 మృతి చెందారు. 483 మంది గాయపడ్డారు. -
మద్యం వ్యాపారుల నయా ట్రెండ్
మందుబాబులకు కాంబో సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో గిరాకీ తగ్గిన మద్యం వ్యాపారులు సరికొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. రూ.500, వెయ్యి నోటుతో మద్యం దుకాణాలకు వస్తున్న వారిని ఆకర్షించేందుకు సరికొత్త కాంబో ఆఫర్‌ను అందిస్తున్నారు. ఉదాహరణకు రూ.500 నోటుతో వచ్చేవారికి అరసీసా ప్రీమియం బ్రాండు మందు (375ఎంఎల్), ఒక లీటరు వాటర్ బాటిల్, మరో లీటరు సోడా అందిస్తుండటం గమనార్హం. ఇక రూ.వెయ్యి నోటుతో వచ్చినవారికీ బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు. వీరికి ఫుల్బాటిల్తోపాటు రెండు లీటర్ల నీళ్ల బాటిల్, ఒక లీటరు సోడా, తినేందుకు స్నాక్స్ చేతిలో పెట్టడం గమనార్హం. మహానగరం పరిధిలో 500 మద్యం దుకాణాలు, 570 వరకు బార్లున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో వీటికి గిరాకీ ఇటీవల సుమారు 50 శాతం మేర పడిపోరుుంది. పలు దుకాణాల్లో క్రెడిట్, డెబిట్ కార్డులతో మద్యం సరఫరా చేస్తున్నారు. ఇక దినసరి కూలీలు, చిరుద్యోగులు కొనుగోలు చేసే చీప్‌లిక్కర్ గిరాకీ అమాంతం పడిపోయినట్లు పలువురు వ్యాపారులు చెబుతున్నారు. -
చుక్కలు చూపిన ఏటీఎంలు
-
చుక్కలు చూపిన ఏటీఎంలు
- ఎక్కడికెళ్లినా ‘నో క్యాష్’ బోర్డులు - అప్డేట్ కాని సాఫ్ట్వేర్.. కనిపించని రూ.2 వేల నోట్లు సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ‘ఔట్ ఆఫ్ సర్వీస్..’ ‘ఔట్ ఆఫ్ ఆర్డర్..’ ‘నో క్యాష్..’ ‘క్లోజ్డ్..’ రాష్ట్రంలో శుక్రవారం ఎక్కడ చూసినా ఏటీఎం కేంద్రాల వద్ద కనిపించిన బోర్డులివి! ఏటీఎంలు పనిచేయకపోవడంతో జనం నరకం చూశారు. అటు బ్యాంకులకు వెళ్తే బారులు.. ఇటు ఏటీఎంలకు వెళ్తే ‘నో క్యాష్’ బోర్డు లు చూసి తలలు పట్టుకున్నారు. వరుసగా మూడోరోజూ ‘నోటు’ కోసం అల్లాడారు. చిల్లర తిప్పలూ తప్పలేదు. హైదరాబాద్ తోపాటు కొన్ని పట్టణాల్లో అరకొరగా పని చేసిన ఏటీఎం కేంద్రాల్లో కేవలం రూ.100 నోట్లు మాత్రమే అందారుు. రూ.2 వేల నోటు జాడే కనిపించలేదు. జనం పోటెత్తడంతో అటు బ్యాంకులు కూడా చేతులెత్తేశారుు. ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.4 వేలు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉన్నా.. కరెన్సీ కొరతతో చాలాచోట్ల రూ.2 వేలు మాత్రమే చేతిలో పెట్టారుు. ఇక ఆసుపత్రుల్లో పాత నోట్లు చెల్లుతాయని కేం ద్రం స్పష్టంగా చెప్పినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ‘పాత నోట్లు చెల్లవు..’ అంటూ ఏకంగా బోర్డులు పెట్టేయడంతో రోగులు నానా అవస్థలు పడ్డారు. మొత్తమ్మీద ‘కరెన్సీ ఎమర్జెన్సీ’నుంచి రాష్ట్రం ఇంకా తేరుకో లేదు. ఆర్థిక కార్యకలాపాలు గాడినపడలేదు. చిరు వ్యాపారాల నుంచి బడా షాపింగ్‌మాల్స్ వరకు లావాదేవీలు స్తంభించిపోయారుు. హైదరాబాద్‌లో ఏటీఎంలు పనిచేయక పోవడంతో శుక్రవారం ఒక్కరోజే రూ.300 కోట్ల లావాదేవీలు నిలిచిపోయారుు. బ్యాంకులు కిటకిట నోట్ల మార్పిడి, నగదు డిపాజిట్ చేసేందుకు జనం పెద్దఎత్తున తరలిరావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకులు కిటకి టలాడారుు. నగదు మార్పిడి కేవలం రూ.4 వేల వరకే పరిమితం చేయడంతో అత్యవసర పనులు, వివాహలు వంటి శుభ కార్యాలు న్నవారు నానా అవస్థలు పడ్డారు. పోస్టాపీసుల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బ్యాంకులు, పోస్టా ఫీసుల వద్ద వందల సంఖ్యలో ప్రజలు క్యూ కట్టడంతో పలు చోట్ల తోపులాటలు చోటుచేసు కున్నారుు. డబ్బులు మార్చు కోవడానికి బ్యాంకుల్లో సహా యకులు లేకపోవడంతో దర ఖాస్తులు నింపడం రానివారు అనేక కష్టాలు పడుతున్నారు. నోట్ల మార్పిడికి వికారాబాద్ జిల్లాలో జనం అవస్థలు పడ్డారు. వికారా బాద్, తాండూరు, పరిగి, కొడంగల్ సెగ్మెంట్లలో బ్యాంకుల వద్ద ఉదయం నుంచే ప్రజలు క్యూ కట్టారు. చంటిపిల్లలతో వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొత్త నోట్ల పంపిణీ ప్రారంభించిన రెండు రోజులుకే సిద్దిపేట జిల్లాలో బ్యాంకులు చేతులెత్తేశారుు. కొన్ని బ్యాంకుల్లో గురువారానికే డబ్బు అరుు పోరుుంది. ఏటీఎంలలో చాలాచోట్ల వాటిలో డబ్బులే పెట్టలేదు. కరీంనగర్ జిల్లాలో కొన్ని బ్యాంకుల్లో కొత్త రూ.2 వేల నోటు అందిం చగా, చాలా బ్యాంకుల్లో రూ.100 నోట్లనే అందిస్తున్నారు. జిల్లాలో ఏటీఎంలు కూడా పని చేయలేదు. పోస్టాఫీసుల్లో ఖాతాలున్న నగదు జమ చేసినా.. కొత్త నోట్లు ఇంకా రాకపోవడంతో ఖాతాదారులకు ఇవ్వలేక పోతున్నారు. పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. బార్లు, మద్యం దుకాణాలు వెలవెల బార్లు, మద్యం దుకాణాలు మందుబాబుల తాకిడిలేక వెలవెలబోతున్నారుు. హైదరాబాద్‌లో అమ్మకాల్లో సుమారు 40-50 శాతం వరకు కోత పడిందని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్య ప్రాంతాల్లోని బార్లు, మద్యం దుకాణాల్లో క్రెడిట్, డెబిట్ కార్డులతో మద్యం సరఫరా చేస్తున్నారు. ధర తక్కువ ఉండే చీప్ లిక్కర్ అమ్మకాల్లో 60 శాతం మేర కోతపడినట్లు పేర్కొన్నారు. మహానగరం పరిధిలో 500 మద్యం దుకాణాలు, మరో 571 బార్లుండగా.. అందులో సగం దుకాణాలకు గిరాకీ లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రిలో రద్దీ.. తోపులాట నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సాయంత్రం వరకు ఏటీఎంలు పనిచేయలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్, మోటకొండూరుతోపాటు భువనగిరిలో పలుచోట్ల ఉదయం 11 గంటల నుంచి ఏటీఎంలు పనిచేశారుు. గుట్టలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద రద్దీ కారణంగా తోపులాట జరిగి అద్దాలు ధ్వంసమయ్యారుు. పోలీసులు కల్పించుకొని పరిస్థితిని చక్కదిద్దారు. అప్డేట్ కాని సాఫ్ట్వేర్ ఏటీఎం కేంద్రాలు పని చేయకపోవడానికి రెండు కారణాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. మిషన్లలో నింపేందుకు పూర్తి స్థారుులో కొత్త కరెన్సీ రాకపోవడం ఒకటి. ఏటీఎం మిషన్లకు రూ.2 వేల నోటు కొత్త. అందులోని సాఫ్ట్వేర్ కొత్త నోటును గుర్తిం చే లా ఇంకా అప్డేట్ కాలేదు. అప్డేట్ చేయకుండా నోట్లు నింపినా ఫలితం ఉండదని అధికారులు చెప్తున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రక్రియ నడుస్తోందని, పూర్తరుున తర్వాత ఏటీఎంలు పని చేస్తాయంటున్నారు. శనివారానికి సాఫ్ట్ వేర్‌ను అప్డేట్ చేస్తామని పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో 45 రకా ల ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులవి 7 వేల ఏటీఎంలు ఉన్నట్లు అం చనా. కరెన్సీ కొరత, సాఫ్ట్వేర్ సమస్యల వల్ల శుక్రవారం 300 కోట్ల లావాదేవీలు ఆగిపోయాయని అధి కారులు అంచనా వేస్తున్నారు. అమాయకులకు టోకరా ఖిల్లాఘనపురం: పెద్ద నోట్ల మార్పిడి కోసం గంటలపాటు నిలబడి సామాన్యులు అలిసిపోతుంటే.. ఇదే అదునుగా తీసుకుని మోసగాళ్లు చేతివాటం ప్రదర్శించారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురంలో శుక్రవారం రెండు బ్యాంకుల వద్ద జనాలను మోసగించి రూ.66 వేలతో మోసగాళ్లు పరారయ్యారు. ఘనపురం ఆంధ్రా బ్యాంక్ వద్ద నోట్లు మార్చుకునేందుకు జనాలు పెద్ద సంఖ్యలో వచ్చారు. షాపురానికి చెందిన శాంతన్న రూ.16,500, సాముల వెంకటేశ్ రూ.15,500తో బ్యాంక్‌కు వచ్చారు. చదువు రాకపోవడంతో ఓచర్ రారుుంచుకునేందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఆశ్రరుుంచారు. అతను ఓచర్ రాస్తానని నమ్మబలికి, నోట్లు లెక్కబెడుతానని రూ.32 వేలు తీసుకున్నాడు. తర్వాత వైట్ పేపర్ తెమ్మని శాంతన్నకు చెప్పాడు. అతను రాకపోవడంతో పిలుచుకొస్తానని చెప్పి ఆ దుండ గుడు జారుకున్నాడు. కొంతసేపటికి ఇద్దరు అతడి కోసం వెతికారు. కనిపించకపోవడంతో మోసపోయామని అర్థ మై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోళీపురం ఎస్బీహెచ్ లో నోట్లను మార్చుకునేందుకు సల్కెలాపురానికి చెందిన మాదాసు భద్రయ్య, నర్సమ్మ దంపతులు బ్యాంక్‌కు రాగా, భద్రయ్య క్యూలో నిల్చున్నాడు. ముందున్న వ్య క్తి భద్రయ్యతో మాట్లాడుతూ బ్యాంకు వద్ద ఇంతమందిమి లైన్ లో ఎండకు ఉన్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. పై అధికారులకు ఫోన్ చేస్తా ఓ రీచార్జ్ కార్డు తీసుకురమ్మని చెప్పాడు. తన లైను పోతుందని, తన డబ్బులు కూడా బ్యాంకులో వేయాలని కోరుతూ ఆ వ్యక్తికి భద్రయ్య రూ.34 వేల నగదు ఇచ్చి, కార్డు కోసం వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి సదరు వ్యక్తి పరారయ్యాడు. రెండ్రోజుల్లో పెళ్లి.. ఏం చేయాలి? ‘‘రెండ్రోజుల్లో నా కూతురు పెళ్లి ఉంది. నా దగ్గర రూ.1000, రూ.500 ఉన్నారుు. పెళ్లి సరుకులకు, ఏ పనికెళ్లినా పెద్ద నోట్లను వ్యాపారులు తిరస్కరిస్తున్నారు. నేనేం చేయాలి? బ్యాంకుకు వెళ్తే రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఉన్నత వర్గాలకంటే సామాన్యులే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. - మోడెం కొమరయ్య, గార్ల, మహబూబాబాద్ జిల్లా నోట్లు చెల్లక.. వైద్యం అందక పెద్ద నోట్లు చెల్లక.. చిల్లర లేక.. చివర కు వైద్యం అందక ఓ వృద్ధురాలు ఆందో ళనకు గురైంది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన శివ్వమ్మ తీవ్ర కడుపు నొప్పితో శుక్రవారం వెల్దుర్తిలోని ఓ ఆసుపత్రికి వచ్చింది. స్కానింగ్ చేరుుంచుకోవాలని డాక్టర్ చెప్పడంతో అక్కడికి వెళ్లింది. అక్కడ ఫీజు రూ.200కుగాను రూ.500 నోటిస్తే చెల్లదన్నారు. బ్యాంకుల్లో ఖాతా, గుర్తింపు కార్డు లేకపోవడంతో పెద్దనోటు చెల్లుబాటు కాక కడుపునొప్పితోనే ఇంటిముఖం పట్టింది. నేను బ్యాంకుల చుట్టూ ఎలా తిరగాలి ఈ నెల 20న డెలీవరీ కోసం డాక్టర్ సమయం ఇచ్చారు. ఆస్పత్రికి వెళ్తే రూ.500 నోట్లు తీసుకోవడం లేదు. నా వద్ద రూ.500 నోట్లు మాత్రమే ఉన్నారుు. బ్యాంకులో రోజు 4 వేలకు మించి డబ్బులు మార్పిడి చేయడం లేదు. ఎవరి అకౌంట్ ఉంటే వారే.. ఆధార్ కార్డుతో స్వయంగా వస్తేనే మార్పిడి చేస్తామంటున్నారు. కానీ.. నేను ఎటూ తిరగలేని పరిస్థితి ఉంది. - మమత, మంచిర్యాల -
వైన్... ఇక చౌక!
రాష్ట్రంలో వైన్‌పై వ్యాట్‌ను 150 శాతం నుంచి 70 శాతానికి తగ్గించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో విక్రయించే దేశీయ తయారీ వైన్ చౌకగా లభించనుంది. వైన్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను ప్రభుత్వం భారీగా తగ్గించింది. దేశంలో తయారయ్యే వైన్ మీద వాణిజ్య పన్నుల శాఖ 150 శాతం పన్ను విధిస్తుండగా, దానిని 70 శాతానికి తగ్గించింది. అలాగే వైన్ మీద ఎక్సైజ్ డ్యూటీ, దేశీయ తయారీ పన్నులను కూడా క్రమబద్ధీకరించింది. రూ. 2 వేల లోపు ధర గల కార్టన్ (కేసు) వైన్ ప్రాథమిక ధరపై 28% ఉన్న ఎక్సైజ్ డ్యూటీని ఏకంగా 90 శాతానికి పెంచింది. కాగా ఇప్పటి వరకు రూ. 2 వేలకు పైబడిన వైన్ కేసు ప్రాథమిక ధరపై 15% లేదా రూ. 560లలో గరిష్టంగా ఉన్న మొత్తాన్ని ఎక్సైజ్ డ్యూటీగా విధిస్తున్నారు. దానిని క్రమబద్ధీకరించి రూ. 2 వేల నుంచి రూ. 3 వేలు గల వైన్ కేసు ప్రాథమిక ధరపై 15% లేదా రూ.1,800లలో గరిష్ట మొత్తాన్ని ఎక్సైజ్ డ్యూటీగా విధించనున్నారు. ఇక రూ. 3వేల పైబడి ధర గల వైన్ కార్టన్ల ప్రాథమిక ధరలపై 10% పన్ను లేదా రూ. 450 లలో గరిష్ట మొత్తాన్ని పన్నుగా విధించనున్నారు. అంటే ఎక్కువగా విక్రయించే తక్కువ ధర గల వైన్ ఉత్పత్తులపై పన్నును పెంచిన ప్రభుత్వం అధిక ధర గల వైన్ తయారు చేసే కంపెనీలకు పన్ను తగ్గించింది. దీంతో వ్యాట్ సగానికి పైగా తగ్గినా సర్కార్ ఆదాయానికి ఢోకాలేని పరిస్థితి. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా దేశంలో పూర్తి ద్రాక్ష పండ్లతో తయారయ్యే వైన్ బాటిళ్ల ఎంఆర్పీ ధరలు 30 నుంచి 35% వరకు తగ్గనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ తెలిపారు. ఫోర్ట్‌ఫైడ్ వైన్ ధర సీసాకు రూ. 5 పెరుగుతాయని వివరించారు. -
21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మితే కేసులే!
రాష్ట్రంలోని అన్ని బార్లు, మద్యం దుకాణాలకు ఆబ్కారీ శాఖ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లో ఈనెల 1న కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు మద్యం సేవించి కారు నడపటం వల్ల జరిగిన ప్రమాదంలో ఓ చిన్నారి, మరో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆబ్కారీ శాఖ మేల్కొంది. 21 సంవత్సరాల వయస్సు లోపు వారికి మద్యం విక్రయించకూడదన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హాపీ అవర్స్ పేరుతో మద్యం, బీర్లపై ఆఫర్లు ఇచ్చే బార్లు, ఈవెంట్ నిర్వాహకులకు ఆబ్కారీ చట్టం సెక్షన్ 3 కింద నోటీసులు పంపించింది. 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేయడంతోపాటు ఆయా బార్ల లెసైన్సులను రద్దు చేయాలని కూడా నిర్ణయించింది. బుధవారం ఈ మేరకు అధికారులతో సమావేశమైన ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్.. ఎక్సైజ్ చట్టంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి 21 ఏళ్లలోపు వయస్సు వారికి మద్యం విక్రయం, మద్యం సేవించి వాహనాలు నడపటం వంటి అంశాలను పునస్సమీక్షించాలని నిర్ణయించారు. అలాగే తమిళ నాడు, కర్ణాటక, కేరళల్లో ఉన్న నిబంధనలు, చట్టాలను అధ్యయనం చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక నిఘా: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న కేసులు ఎక్కువగా జరుగుతుండటంపై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 522 బార్లు, పబ్బులపై తరచూ దాడులు జరపాలని నిర్ణయించారు. బార్లకు వచ్చే వారిపై అనుమానం వస్తే వయస్సు ధ్రువీక రించే పత్రాలను పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. బుధవారం 61 బార్లలో తనిఖీలు జరిపారు. ప్రతి రోజు తనిఖీలు కొనసాగాలని ఆదేశిస్తూ.. బాధ్యతను ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అప్పగించారు. 1968 ఎక్సైజ్ చట్టం సెక్షన్ 36 (ఎఫ్) ప్రకారం ఎక్సైజ్ అధికారులకు బ్రీత్ అనలైజర్లు అందించే అంశాన్ని సీరియస్‌గా పరిశీలించాలని ప్రతిపాదించారు. ప్రతి బార్, రెస్టారెంట్, పబ్బుల్లో సీసీటీవీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయించడంతోపాటు పోలీస్ శాఖ తరహాలో సెంట్రల్ మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేసే అంశంపైనా సమీక్షించారు. 15వ తేదీ సాయంత్రం 3 గంటలకు బార్లు, పబ్బులు, హోటళ్లు, రిసార్టుల యజమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, హెచ్చరికలు జారీ చేయనున్నారు. పోస్టర్లు విడుదల: 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించడం నేరమని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్న నినాదాలతో రూపొందించిన పోస్టర్లను ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ విడుదల చేశారు. ప్రతి మద్య విక్రయ కేంద్రం, బార్ల వద్ద వీటిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు రేడియోలు, టీవీల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. -
బాధ్యత లేదా!
సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మరో మారు మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని శుక్రవారం వ్యక్తం చేసింది. మద్యం బానిసల పునరావసం కోసం ప్రకటించిన హెల్ప్‌లైన్ నంబర్లకు స్వయంగా డైల్ చేసిన ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కౌల్ విస్మయానికి గురయ్యారు. ఆ నం బర్లు ప్రస్తుతం అందుబాటులో లేదని వచ్చిన సమాచారంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిల్లల అపహరణల అడ్డుకట్టకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. చెన్నైకు చెందిన న్యాయవాది ఇటీవల మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో మద్యం బానిసల సంఖ్య పెరుగుతున్నదని, ఆదాయాన్ని చూస్తున్నారేగానీ, ప్రజారోగ్యం గురించి పట్టించుకోవడం లేదని అందులో వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమ నిబంధనలకు విరుద్దంగా మద్యం దుకాణాలు ఉన్నాయని, మద్యం బానిసలకు పునరావస కల్పన చర్యలు తీసుకోవడం లేదని, మద్యం కారణంగా ఎదురయ్యే నష్టాలు, కష్టాల గురించి అవగాహన కల్పించడం లేదని అందులో వివరించారు. ఇందుకు తగ్గ కమిటీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించి ఉన్నదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌కిషన్ కౌల్, కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, అందుకు తగ్గ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయింది. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ బాలు హాజరై ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాదులు మద్యం, మత్తు బానిసలకు పునరావాసం కల్పించడం తదితర వాటి కోసం రెండు హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసి ఉన్నామని వివరించారు. ఇందులో ఒకటి సహాయం కోసం, మరొకటి వైద్య సేవల కోసం అని పేర్కొన్నారు. అలాగే, 10581 ఓ నంబరు, 104 మరో నంబరు అని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, ఆ నంబర్లు పని చేయడం లేదంటూ పిటిషనర్ కోర్టుకు సూచించారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్కోల్ స్వయంగా తన మొబైల్ తీసుకుని ఆ నంబర్లకు డైల్ చే సి విస్మయంలో పడ్డారు. స్పీకర్ ఆన్ చేసి మరీ అటు వైపుగా వచ్చిన ‘ఈ నంబర్ అందుబాటులో లేదు’ అన్న సమాధానాన్ని ప్రభుత్వం తరపు న్యాయవాదులకు విన్పించారు. ఈసందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ, బాధ్యత లేదా, ఇదేనా పని తీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వుల్ని పట్టించుకోరా..? అని అక్షింతలు వేశారు. ప్రభుత్వ తీరును చూస్తే ఆవేదన కల్గుతున్నదని వాఖ్యానించారు. రెండు వారాల్లోపు కమిటీ ఏర్పాటు పై చర్యలు తీసుకోవాలని, రెండు నెలల్లోపు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. తదుపరి నగరంలో పిల్లల అపహరణ కేసును పరిగణలోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వీధి పిల్లలు అపహరణకు గురి అవుతుంటే, ఇంత నిర్లక్ష్యమా అని నగర పోలీసు యంత్రాంగానికి తీవ్రంగానే అక్షింతలు వేశారు. -
ఆబ్కారీ శాఖలో కాసుల గలగల
రెండు నెలల్లోనే రూ. 2,391 కోట్ల ఆదాయం సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంవత్సరం ఆరంభమైన రెండు నెలల్లోనే ఆబ్కారీ శాఖ రికార్డు స్థాయి ఆదాయం సమకూర్చుకుంది. వేసవి కాలంలో పెరిగిన బీర్ల అమ్మకాలు, మద్యం దుకాణాల లెసైన్సు ఫీజు వాయిదాల మొత్తంతో పాటు డిస్టిలరీలు, బ్రూవరీల నుంచి ఎక్సైజ్ సుంకాల వసూళ్లతో రూ. 2,391. 17 కోట్ల రెవెన్యూ సాధించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బడ్జెట్ అంచనాల్లో ఆబ్కారీ శాఖకు నిర్దేశించిన మొత్తం కన్నా ఇది 6 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఆబ్కారీ శాఖ సాధించిన రూ. 2391. 17 కోట్ల రెవెన్యూ నుంచి ‘వ్యాట్ బై ఎక్సైజ్’ రూపంలో ప్రభుత్వ ఖజానాకు నేరుగా రూ. 1,540 కోట్లు చేరనుండగా, మిగతా మొత్తం వివిధ పద్దుల రూపంలో జమ కానుంది. వార్షిక లక్ష్యం రూ. 14,161 కోట్లు మద్యం అమ్మకాల ద్వారా 2016 -17 ఆర్థిక సంవత్సరానికి రూ. 14,161 కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఇది 2015-16 ఆర్థిక సంవత్సరం సాధించిన రెవెన్యూ మొత్తం రూ. 12,200.79 కన్నా సుమారు రూ. 2వేల కోట్లు అధికం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం తొలి నెల నుంచే ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి వసూళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో బడ్జెట్ అంచనాల లక్ష్యాని కన్నా 16 శాతం వృద్ధితో రూ. 969.29 కోట్లు రెవెన్యూ సాధించింది. ఇక మేలో రూ. 1,421 .86 కోట్లు సమకూరాయి. దీంతో రెండు నెలల్లోనే రూ. 2,391 కోట్లు వసూలయ్యాయి. మే నెలాఖరులోగా చెల్లించాల్సిన మద్యం దుకాణాల మూడో విడత లెసైన్సు ఫీజు వాయిదా కింద రూ. 498 కోట్లు సమకూరగా, బ్రూవరీలు, డిస్టిలరీల నుంచి ఎక్సైజ్ సుంకం కింద రెండు నెలల్లో రూ. 301 కోట్లు వసూలయింది. ఇతర మార్గాల ద్వారా మరో 14.44 కోట్లు ఎక్సైజ్ శాఖకు వచ్చి చేరింది. కాగా జూన్ నెలాఖరులోగా బార్ల లెసైన్సులను రెన్యువల్ చేయించుకోవలసి ఉంది. రాష్ట్రంలోని 804 బార్లు, 17 క్లబ్బులు, 9 పర్యాటక ప్రాంతాలోని బార్ల నుంచి లెసైన్సు ఫీజు వసూలు చేయాల్సి ఉంది. ఈ లెక్కన జూన్‌లో కూడా దాదాపు రూ. 1,400 కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉంది. -
బీరు పారుతోంది!
♦ 50 రోజుల్లో 5 కోట్ల లీటర్లు స్వాహా ♦ గత రెండున్నర నెలల్లో రూ. వెయ్యి కోట్ల విక్రయాలు ♦ రంగారెడ్డి జిల్లాలో ఏప్రిల్‌లో10 లక్షల కేసులు హాంఫట్ ♦ ఈ నెల వర్షాల వల్ల స్వల్పంగా తగ్గిన డిమాండ్ సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూలేని విధంగా ఈ వేసవిలో బీర్ల అమ్మకాలు రికార్డు సృష్టించాయి. ఏప్రిల్‌లో వేసవి ఎండలు మండిపోవడంతో మందుబాబులు చల్లని బీర్ల కోసం ఎగబడ్డారు. దీంతో రాష్ట్రంలో 50 రోజుల్లో ఏకంగా 5 కోట్ల లీటర్ల బీర్లను గుటకాయ స్వాహా చేశారు. ఏప్రిల్‌లో ఏకంగా 3.5 కోట్ల లీటర్ల బీర్లను తాగేసిన బీరుప్రియులు ఈ నెలలో ఇప్పటివరకు 1.5 కోట్ల లీటర్ల మేర బీర్లు లాగించేశారు. ఈ నెలలో అడపాదడపా వర్షాలు కురవడంతో బీర్ల డిమాండ్ కొంత తగ్గినప్పటికీ నెలాఖరుకల్లా మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. వేసవి బీర్ల అమ్మకాల్లో రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా టాప్‌లో నిలిచింది. ఐటీ కంపెనీలతోపాటు కార్పొరేట్ కంపెనీలు అధికంగా ఉండటంతో రంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలు, బార్లలో ఏప్రిల్‌లోనే 10 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. మేలోనూ బీర్ల విక్రయాల్లో దాదాపు అదే జోరు కొనసాగింది. 3 నెలల్లో 96 లక్షల కేసుల బీర్ల విక్రయాలు గతేడాది ఏప్రిల్‌లో 29.27 లక్షల కేసులు (ఒక కేసులో 7,800 ఎంఎల్) బీర్ల విక్రయాలు జరగ్గా ఈ సంవత్సరం ఏప్రిల్‌లో 44.9 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. మార్చి నుంచే రాష్ట్రంలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత పెరగడంతో మద్యం ప్రియులు కూడా బీర్లను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్, మే (19వ తేదీ వరకు)లలో 96 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. మార్చిలో 31 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరగ్గా మేలో 19 రోజుల్లో 20 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. ఈ రెండున్నర నెలల్లో జరిగిన విక్రయాల విలువ సుమారు రూ. 1,000 కోట్లు కావడం విశేషం. ఏప్రిల్‌లో భారీగా రెవెన్యూ బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరగడంతో ఏప్రిల్‌లో ఆబ్కారీ శాఖకు రూ. 1,217 కోట్ల రెవెన్యూ సమకూరింది. గతేడాది ఏప్రిల్‌లో రూ. 888.63 కోట్ల రెవెన్యూ రాగా ఈసారి దాదాపు రూ. 350 కోట్లు అదనంగా సమకూరింది. మేలో ఇప్పటివరకు రూ. 614 కోట్ల రెవెన్యూ వచ్చింది. రాష్ట్రంలోని 2,144 మద్యం దుకాణాల లెసైన్సుల మూడో విడత రెన్యూవల్స్‌కు గడువు దగ్గర పడడంతో ఈ నెలాఖరు వరకు టీఎస్‌బీసీఎల్ నుంచి విక్రయాలు ఉండవని ఓ అధికారి తెలిపారు. అయినా గతేడాది కన్నా వృద్ధిరేటు ఉంటుందని తెలిపారు. -
మందు..కౌన్సెలింగ్ ముందు..
♦ బార్లో అడుగుపెట్టినప్పట్నుంచే కౌన్సెలింగ్ షురూ ♦ మద్యం మోతాదు, జాగ్రత్తలను వివరించనున్న సిబ్బంది ♦ తాగి వాహనం నడపొద్దంటూ మందుషాపుల ముందు బ్యానర్లు ♦ మార్చి 23లోగా ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ శాఖ నోటీసులు సాక్షి, హైదరాబాద్ ‘సార్.. మీరిప్పటికే రెండు పెగ్గులు తాగారు? మీ శరీరం ఇంతకు మించి ఆల్కహాల్‌ను భరించ లేదు. ఇక ఆర్డర్ తీసుకోం..’ ‘మందు తాగిన తర్వాత మీరే డ్రైవింగ్ చేస్తారా? డ్రైవర్ ఎవరైనా ఉన్నారా? లేదంటే టాక్సీని ఏర్పాటు చేసుకోండి..’ ‘మీరే సొంతగా డ్రైవింగ్ చేస్తే బ్రీత్ ఎనలైజర్‌తో మీ ఆల్కహాలు మోతాదు పరీక్షించుకోండి..’ రాబోయే రోజుల్లో మద్యం విక్రయించే బార్లు, క్లబ్బులు, మద్యం దుకాణాల పర్మిట్ రూమ్‌లలో వినిపించబోయే మాటలివీ! మద్యం వ్యాపారులు తమ వద్దకు వచ్చే వినియోగదారుల పరిస్థితిని చూసి ఆర్డర్లు తీసుకునే పరిస్థితి రానుంది. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మార్చి నుంచే ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. వినియోగదారులకు ‘తల తిరిగేలా’ మద్యం సరఫరా చేయడాన్ని, తాగిన వ్యక్తి వాహనం నడపకుండా ప్రాథమిక దశలోనే అడ్డుకోవాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా బార్ల యజమానులకు కూడా బాధ్యతలను అప్పగించింది. మద్యం సేవించి వాహనం నడపకుండా బార్ లేదా క్లబ్ నుంచే తగిన కౌన్సెలింగ్ మొదలయేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మార్చి 23లోగా రాష్ట్రంలోని సుమారు 800 బార్లతోపాటు క్లబ్బులు, మద్యం దుకాణాల పర్మిట్ రూమ్‌లలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ నోటీసులు జారీ చేశారు. మార్చి 23 తర్వాత ఎక్సైజ్ శాఖ తనిఖీలు జరుపుతుందని అందులో పేర్కొంది. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయడంతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైతే మరిన్ని చర్యలు చేపట్టాలని అకున్ సబర్వాల్ యోచిస్తున్నారు. మధుశాలల్లో ఇవి తప్పనిసరి! రాష్ట్రవ్యాప్తంగా బార్లు, క్లబ్బులు, పర్మిట్ రూమ్‌ల వద్ద ‘మద్యం సేవించి వాహనం నడపకూడదు’ అని రాసిన బ్యానర్లు/ పోస్టర్లను తప్పకుండా ఏర్పాటు చేయాలి. ఇవి 2 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో ఉండాలి. మందు దుకాణాల పరిసరాల్లో కూడా ఇలాంటి పోస్టర్లను ఏర్పాటు చే యాలని మద్యం వ్యాపారులకు పంపిన ఆదేశాల్లో సబర్వాల్ పేర్కొన్నారు. బార్ లోపలికి వచ్చి టేబుల్ ముందు కూర్చోగానే టేబుల్‌పై ఏర్పాటు చేసే ఫ్లైయర్స్, ఇన్ఫో షీట్లపైన కూడా మద్యం సేవించి వాహనం నడపకూడదనే సమాచారాన్ని ముద్రించిన డిస్ప్లేలు ప్రదర్శించాలి. అలాగే ఆర్డర్ తీసుకునే సిబ్బంది.. మద్యం సేవించిన తర్వాత వాహనం నడిపే వ్యక్తి ఎవరో వినియోగదారుడి నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక గ్రూప్‌గా వచ్చిన వారిలో అందరూ మద్యం తీసుకొని ఉంటే.. టాక్సీని ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంగా తెలియజేయాలి. అప్పటికీ వినకపోతే యజమానికి విషయం తెలపాలి. బైక్‌పై వచ్చిన కస్టమర్లు మద్యం ఆర్డర్ చేసినప్పుడే తాగి వాహనం నడపొద్దని వివరించాలి. మధుశాలల్లో బ్రీత్ ఎనలైజర్‌ను ఏర్పాటు చేసి, కస్టమర్లు ఎంత మోతాదులో ఆల్కహాల్ తీసుకున్నారో తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే బ్రీత్ ఎనలైజర్ ఏర్పాటుపై ఎలాంటి బలవంతం లేదని సబర్వాల్ వివరించారు. -
అది టీడీపీ సంక్షేమ నిధి!
* ప్రత్యేక అభివృద్ధి నిధి అర్థం మార్చేసిన ముఖ్యమంత్రి * వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలున్న చోట్ల టీడీపీ ఇన్ఛార్జీల పేరుతో నిధులు * కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పేర్లను కూడా మార్చుతూ జీవోలు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట. ఇప్పటివరకూ మద్యం దుకాణాలు, ఇసుక రీచ్‌లను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టిన సర్కారు ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్)ని కూడా వారికే దోచిపెడుతోంది. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, మౌలిక సౌకర్యాల కోసం స్థానిక ఎమ్మెల్యే సిఫార్సుల మేరకు ఎస్డీఎఫ్ నుంచి నిధులు కేటాయించాల్సి ఉండగా నిబంధనలు కాలరాసి టీడీపీ నేతల పేరుతో కేటాయింపులు సాగిస్తోంది. ఎస్డీఎఫ్ను నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలందరికీ సమానంగా పంచాల్సి ఉండగా... ముఖ్యమంత్రి విచక్షణాధికారం అనే అంశాన్ని అడ్డుగా పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు నిధులు అందకుండా చేస్తున్నారు. ప్రతిపక్షం ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల టీడీపీ ఇన్‌ఛార్జిల పేరుతో నిధులు కేటాయిస్తూ... ప్రత్యేక అభివృద్ధి నిధిని టీడీపీ సంక్షేమ నిధిగా మార్చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జిలనే ఎమ్మెల్యేలుగా పేర్కొంటూ వారి పేరుతో ప్రణాళిక శాఖ జీవోలు సైతం జారీ చేసింది. ఎస్డీఎఫ్ నిధుల విడుదలలో ఇలా అడ్డగోలుగా జీవోలు జారీ చేయడం ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్టని అధికారులు, రాజకీయ పక్షాల నేతలు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలనూ మార్చేసిన సర్కారు టీడీపీవారైతే చాలు... ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యేగా పరిగణించాల్సిందే అనే ధోరణిలో ప్రభుత్వం ఉన్నట్లు ఎస్డీఎఫ్ నిధుల జారీ జీవోలను చూస్తే అర్థమవుతోంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజవకర్గానికి ఎమ్మెల్యేగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భూమా అఖిల ప్రియను ప్రజలు ఎన్నుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గంగుల ప్రభాకరరెడ్డినే ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పరిగణిస్తోంది. ఎమ్మెల్యే ప్రభాకరరెడ్డి సిఫార్సుల మేరకు నియోజకవర్గంలోని 59 పనులకు రూ.రెండు కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రణాళిక శాఖ గురువారం విడుదల చేసిన జీవో-698 ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. పాణ్యం ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఉండగా... ఈ నియోజకవర్గానికి మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ప్రతిపాదన మేరకు నాలుగు పనులకు రూ. రెండు కోట్లు మంజూరు చేసినట్లు ఇదే జీవోలో పేర్కొన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీకి చెందిన బుడ్డా రాజశేఖరరెడ్డిని ప్రజలు ఎన్నుకోగా... శిల్పా చక్రపాణిరెడ్డిని ఎమ్మెల్యేగా సర్కారు జీవో-657లో పేర్కొంది. ఆయన ప్రతిపాదనల మేరకు 54 పనులకు రూ. రెండు కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. వాస్తవంగా శిల్పా చక్రపాణిరెడ్డి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లాకు చెందిన డోన్‌కు బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి (వైఎస్సార్సీపీ) ఎమ్మెల్యేగా ఉండగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆయనను పక్కనపెట్టి నియోజవకర్గ టీడీపీ ఇన్‌ఛార్జి కేఈ ప్రతాప్ పేరుతో 86 పనులకు రూ. 2.10 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం గురువారం జీవో-695 జారీ చేసింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి ఈయన (కేఈ ప్రతాప్) సోదరుడు కావడం గమనార్హం. ఇలాగే పలు నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను పక్కనబెట్టి తెలుగుదేశం నియోజవర్గ ఇన్ఛార్జీల పేరుతో నిధులు విడుదల చేస్తూ ప్రజాస్వామ్య విలువలను గంగలో తొక్కేస్తోంది. గిరిజన ఉప ప్రణాళిక (టీఎస్పీ) కింద స్థానిక ఎమ్మెల్యేకు సంబంధ లేకుండా నిధులు కేటాయించడం నిబంధనలకు విరుద్ధం. కానీ టీడీపీ సర్కారు నిబంధనలను తుంగలో తొక్కి విశాఖపట్నం అరకు ఎమ్మెల్యే కె.సర్వేశ్వరరావు (వైఎస్సార్సీపీ)ని కాదని టీడీపీ ఇన్‌ఛార్జి సివేరి సోమ పేరుతో జీవో జారీ చేయడం గమనార్హం. విచక్షణ కోల్పోయిన విచక్షణాధికారం! అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్)ని ముఖ్యమంత్రి చంద్రబాబు విచక్షణారహితంగా వాడేస్తున్నారనడానికి స్వంత నియోజకవర్గానికి జరిపిన కేటాయింపులే నిదర్శనం. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని 194 తారు రోడ్డు పనులకు రూ. 136.13 కోట్లు మంజూరు చేస్తూ గత ఏడాది జులై రెండో తేదీన ప్రభుత్వం జీవో-363 జారీ చేసింది. తదుపరి ఇదే నియోజకవర్గంలోని 582 ఆవాసాల్లో సిమెంటు రోడ్డు పనులకు రూ. 137.37 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం గత ఏడాది జూన్ 29వ తేదీన జీవో-349 జారీ చేసింది. ఇలా ఒకే ఆర్థిక సంవత్సరంలో సీఎం సొంత నియోజకవర్గానికి ఎస్డీఎఫ్ నుంచి రూ. 273.50 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. సీఎం విచక్షణ మేరకు ఎస్డీఎఫ్ కేటాయింపులు అనే అంశాన్ని అడ్డుగా పెట్టుకుని ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గానికి అడ్డగోలుగా నిధులు కేటాయించుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనం. -
గుడుంబాపై ఉక్కుపాదం
మద్యం దుకాణాలను తనిఖీ చేసిన మంత్రి పద్మారావు ఏటూరునాగారం: తెలంగాణను గుడుంబా లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని.. ఇందులో భాగంగా గుడుంబాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిం దని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు అన్నారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారంలోని భాగ్యలక్ష్మి, సాయి తిరుమల వైన్స్‌లను ఆయన సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలో నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అధికారులకు ఎలాం టి సమాచారం ఇవ్వకుండా.. తన సొంత వాహనంలో ఇక్కడికి వచ్చినట్లు ఈ సందర్భం గా మంత్రి తెలిపారు. ముందుగా ఆయన భాగ్యలక్ష్మి వైన్స్‌లో తన సిబ్బందితో ఫుల్‌బాటిల్ మద్యం కొనుగోలు చేయించారు. ఎమ్మా ర్పీ కంటే రూ.5 ఎక్కువ తీసుకోవడంతో మంత్రి అక్కడి వెళ్లి పరిశీలించారు. మద్యం, బాటిళ్లు కాటన్లను తెరిచి పరిశీలించారు. భాగ్యలక్ష్మి బ్రాందీషాపు యజమానికి పాన్‌కార్డు లేకపోవడంతో అదనంగా 20 శాతం పన్ను పడుతుందని.. పాన్‌కార్డు లేకపోవడంతో శాఖ పరంగా స్టాకు ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వం లెసైన్స్‌లు ఇచ్చి 12 రోజులు అవుతున్నా.. ఇంకా ఆబ్కారీ నుంచి మద్యం కొనుగోలు చేయకుండా మండల కేంద్రంలోనే ఉన్నా.. సాయి తిరుమల మద్యం షాపు నుంచి మద్యం దిగుమతి చేసుకున్నట్లు తేలిందన్నారు. అక్కడ ఉన్న మద్యం కాటన్లను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా నడుస్తున్న భాగ్యలక్ష్మి బ్రాందీ షాపును మూసివేయించా రు. దీనికి మద్యం సరఫరా చేసిన సాయి తిరుమల దుకాణంపై కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. అలాగే, స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో 12 మంది సిబ్బంది ఉండగా, ఒక్క హెడ్‌కానిస్టేబుల్ మాత్రమే ఉండడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు డుమ్మా కొట్టిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అదృష్టం వరించింది..
- 27 దుకాణాలకు సింగిల్ దరఖాస్తులు - రాత్రి వరకు సాగిన లక్కీడ్రా - బినామీలతో టెండర్లు వేసిన వైనం - ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి - కలెక్టర్ జగన్మోహన్ ఆదిలాబాద్ క్రైం : ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూసిన వారిలో అదృష్టవంతులు ఎవరనేది వెల్లడైంది. జిల్లాలోని 158 మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్ల విజేతలను బుధవారం ప్రకటించారు. ఆదిలాబాద్‌లోని జనార్దన్‌రెడ్డి గార్డెన్స్‌లో మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. లక్కీ డ్రాను ప్రారంభించిన అనంతరం కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ మద్యం టెండర్ల ప్రక్రియల్లో ప్రభుత్వానికి సహకరించి ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని అన్నారు. టెండర్‌దారులు సిండికేట్, మామూళ్ల పద్ధతిని రూపుమాపి మద్యం దుకాణాల ద్వారా ఆదాయం సమకూర్చాలని చెప్పారు. జిల్లాలో కల్తీ విక్రయాలు జరగకుండా నిరోధించాలని పేర్కొన్నారు. కల్తీ కల్లు వల్ల ప్రజల ప్రాణాలకే ముప్పు ఉందని, దీనిపై అధికారులు దృష్టి సారించి కల్తీ కల్లు విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం సంయుక్త కలెక్టర్ సుందర్ అబ్నార్ టోకెన్ నెంబర్ తీసి మొదటి లక్కీ విజేతను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శివరాజ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు అనిత, శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా 62 దరఖాస్తులు వచ్చిన బెజ్జూర్ మద్యం దుకాణం లక్కీ డ్రాలో కాగజ్‌నగర్‌కు చెందిన బి.ప్రకాశ్‌కు దక్కింది. ఆదిలాబాద్ పట్టణంలో అత్యధికంగా దరఖాస్తులు వచ్చిన షాప్ నెంబర్-2ను సోనాలకు చెందిన సి.భోజారెడ్డి దక్కించుకున్నారు. ఈ దుకాణానికి 47 దరఖాస్తులు రాగా స్థానికేతరుడిని అదృష్టం వరించింది. పట్టణంలోని షాప్-1 అల్లూరి నాగార్జునరెడ్డి, షాప్-3 అల్లూరి రమేశ్‌రెడ్డి, షాప్-4 మనోహర్‌రావు, షాప్-5 కొరటాల రమేశ్, షాప్-6 మంజూల దక్కించుకున్నారు. బేలలోని షాప్-7 మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన నవీన్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. ఆదిలాబాద్ యూనిట్ పరిధిలో 8, మంచిర్యాల యూనిట్ పరిధిలో 19 సింగిల్ దరఖాస్తులు వచ్చాయి. దుకాణాలు దక్కించుకున్న వారి నుంచి 1/6 వంతుగా ఫీజు తీసుకున్నారు. బినామీల జోరు జిల్లా వ్యాప్తంగా 156 మద్యం దుకాణాలకు 1,541 దరఖాస్తులు వచ్చాయి. కొంతమంది వ్యాపారులు ఒక్కొక్కరు ఐదు నుంచి పది వరకు దరఖాస్తులు వేసినట్లు తెలుస్తోంది. బినామీ పేర్లపై టెండర్ వేసి దుకాణాలు దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో మద్యం దుకాణం దక్కించుకున్న వారే ఈసారి కూడా ఎలాగైనా దక్కించుకుకోవాలనే ఉద్దేశంతో తన అనుచరులతోపాటు, ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువులతో కూడా టెండర్ వేసినట్లు తెలుస్తోంది. కొంతమంది వ్యాపారులు ముందే సిండికేట్‌గా ఏర్పడి పది మంది కలిసి ఒకే దుకాణానికి దరఖాస్తు వేసుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ దుకాణానికి 20 దరఖాస్తులు రాగా అందులో బినామీ పేర్లతో వేసిన వ్యాపారులకు కాకుండా.. ఒకే ఒక్క దరఖాస్తు చేసుకున్న టెండర్‌దారుడికి దుకాణం దక్కినట్లు సమాచారం. అధికార పార్టీ నాయకులతోపాటు ఇతర పార్టీల రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు సిండికేట్ వ్యవహారానికి తెరలేపినట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాలు దక్కించుకున్న వారితో రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. -
దరఖాస్తుల నుంచే 154.94 కోట్లు
* రెండేళ్ల మద్యం పాలసీకి అనూహ్య స్పందన * మొత్తం షాపులు 2,216.. దరఖాస్తులు 30,987 * ఒక్క దరఖాస్తూ రాని దుకాణాలు 105 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండేళ్ల మద్యం విధానానికి భారీగా స్పందన వచ్చింది. మద్యం దుకాణాల కోసం వ్యాపారులు పెద్దఎత్తున పోటీపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మద్యం దుకాణాల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని మొత్తం 2,216 మద్యం షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయగా... 2,111 దుకాణాలకు 30,987 దరఖాస్తులు దాఖలయ్యాయి. హైదరాబాద్‌తో పాటు ఆరు జిల్లాల్లోని 105 దుకాణాల లెసైన్సుల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు. ఇక దరఖాస్తు ఫీజుల ద్వారా ఎక్సైజ్ శాఖకు రికార్డు స్థాయిలో రూ.154.94 కోట్ల ఆదాయం లభించింది. గత ఏడాది వచ్చిన రూ.53.56 కోట్లతో పోలిస్తే ఇది మూడింతలు కావడం గమనార్హం. మద్యం దుకాణాల కోసం ఖమ్మం జిల్లాలో వ్యాపారులు భారీగా పోటీపడ్డారు. ఈ జిల్లాలోని 148 దుకాణాలకోసం ఏకంగా 6,615 దరఖాస్తులు రావడం గమనార్హం. ఇక్కడ దరఖాస్తు ఫీజుతోనే ఎక్సైజ్ శాఖకు రూ.33.07 కోట్లు సమకూరాయి. ఇక అనేక జిల్లాల్లో మహిళల పేరుతో వందలాది దరఖాస్తులు దాఖలు కావడం గమనార్హం. జీహెచ్ఎంసీలో స్పందన అంతంతే! మద్యం దుకాణాలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్దగా స్పందన రాలేదు. ఇక్కడ ఏడాదికి లెసైన్సు ఫీజు రూ.1.08 కోట్లుగా నిర్ణయించిన నేపథ్యంలో వ్యాపారులు ఆసక్తి చూపలేదు. జీహెచ్ఎంసీ పరిధిలోని 503 దుకాణాలకుగాను 95 దుకాణాలకు దరఖాస్తులే రాలేదు. ఇందులో హైదరాబాద్ జిల్లా పరిధిలోని 212 మద్యం దుకాణాలకుగాను 160 షాపులకు 316 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 52 దుకాణాల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. అలాగే రంగారెడ్డి జిల్లాలో 390 దుకాణాలకు గాను 32 ఔట్లెట్ల కోసం దరఖాస్తులు రాలేదు. ఇవన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోవే. మెదక్ జిల్లాలోని పటాన్చెరు, రామచంద్రాపురం పరిధిలోని 11 దుకాణాల నిర్వహణకు ఎవరూ ముందుకు రాలేదు. ఇవికాకుండా నిజామాబాద్‌లో 5, వరంగల్‌లో మూడు, ఆదిలాబాద్ జిల్లాలో రెండు దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అయితే 2014-15 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 107 దుకాణాలకు లెసైన్సులు జారీకాలేదు.ఆఖరి రోజు 16 వేలు దరఖాస్తులకు వారం గడువు ఇచ్చినా... చివరి రోజునే భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో సగానికి పైగా అంటే 16,111 దరఖాస్తులు సోమవారమే వచ్చాయి. తద్వారా రూ.80.56 కోట్ల ఆదాయం ఒక్కరోజే సమకూరింది. మంగళవారం ఉదయం వరకు అధికారులు ఈ దరఖాస్తులను పరిశీలించి లెక్క తేల్చారు. కాగా, 23న అన్ని జిల్లాల్లో కలెక్టర్ల సమక్షంలో డ్రా తీసి లెసైన్సులు జారీ చేస్తామని, 105 దుకాణాలకు దరఖాస్తులు రాలేదని, వీటికి మళ్లీ నోటిఫికేషన్ జారీచేస్తామని, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. ఎవరూ ముందుకు రాకపోతే టీఎస్‌బీసీఎల్ ద్వారా దుకాణాలను నిర్వహిస్తామన్నారు. -
వామ్మో! మద్యం దుకాణమా?
♦ లిక్కర్ షాపుల ఏర్పాటుకు ముందుకు రాని వ్యాపారులు ♦ 20 శాతం పెరిగిన లెసైన్స్ ఫీజు, ప్రివిలేజ్ ట్యాక్స్‌తో వెనక్కు ♦ 2,216 మద్యం దుకాణాలకు గాను 1,393 షాపులకే దరఖాస్తులు ♦ హైదరాబాద్‌లోని 212 దుకాణాలలో కేవలం 24 షాపులకే దరఖాస్తులు ♦ రాష్ట్ర వ్యాప్తంగా 873 దుకాణాలకు రాని దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: లిక్కర్ మాఫియా పేరుతో రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని శాసించిన వారంతా ఇప్పుడు చల్లబడ్డారు. వేలం పాటలో రూ. కోట్లు వెచ్చించి మద్యం దుకాణం దక్కించుకున్న వ్యాపారులు.. ఇప్పుడు నిర్దేశించిన ధరకు కూడా దరఖాస్తు చేసుకోవడం లేదు. మద్యం వ్యాపారం నిర్వహించే వారికి ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలు, భారీగా పెరిగిన లెసైన్సు ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులకు తోడు ఎక్సైజ్, పోలీస్ శాఖల వేధింపులకు భయపడి మెల్లమెల్లగా మద్యం వ్యాపారం నుంచి పక్కకు తప్పుకొంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానం కింద రెండేళ్లకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు కోరితే స్పందన అంతంత మాత్రమే. వచ్చే సోమవారం దరఖాస్తుల దాఖలుకు చివరి రోజు అయినా రాష్ట్రంలో సగం దుకాణాలకూ దరఖాస్తులు రాలేదు. 873 దుకాణాలకు దరఖాస్తులు నిల్ 2015-16, 2016-17 ఆబ్కారీ సంవత్సరాల కోసం ప్రభుత్వం మద్యం విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 21లోపు రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాలకు (ఎ-4 షాపులకు) గాను వ్యాపారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కాగా శనివారం రాత్రి వరకు అందిన సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,537 దరఖాస్తులను విక్రయించిన ఎక్సైజ్ శాఖ రూ. 32.69 కోట్లు ఆర్జించింది. శనివారం రాత్రి వరకు 1,393 దుకాణాలకే దరఖాస్తులు అందాయి. ఇంకా 873 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌తో పాటు మారుమూల ప్రాంతాల్లోని దుకాణాలకు దరఖాస్తులు రావడం లేదు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 212 దుకాణాలకు గాను కేవలం 24 దుకాణాల కోసం 36 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ అధికారి తెలిపారు. గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రాంతంలో 276, మెదక్ జిల్లా పటాన్చెరు, రామచంద్రాపురంలో 15 దుకాణాలున్నాయి. వీటిలో గత సంవత్సరం 104 దుకాణాలను ఎవరూ తీసుకోలేదు. గ్రేటర్లో గత ఏడాది లెసైన్సు ఫీజు రూ. 90 లక్షల కన్నా ఈ ఏడాది రూ. 18 లక్షలు అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో దుకాణాల పట్ల వ్యాపారుల్లో నిరాసక్తత ఏర్పడింది. అదే సమయంలో హైవేలు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లోని దుకాణాలకు డిమాండ్ అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి 3 నుంచి 6 దరఖాస్తులు వస్తున్నట్లు సమాచారం. ఆది, సోమ వారాలు రెండు రోజులు దరఖాస్తులను స్వీకరిస్తారు. గతంలో మద్యం వ్యాపారం అంటే సిండికేట్‌గా సాగేది. ఎక్సైజ్, పోలీసు శాఖలకు మామూళ్లు ముట్టజెపుతూ ఎంఆర్పీని పక్కనబెట్టి ఇష్టారాజ్యంగా ధరలను నిర్ణయించి వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. లెసైన్సు ఫీజుకు ఏడు రెట్లు మద్యం విక్రయాలు జరిగితే ప్రివిలేజ్ ట్యాక్స్ రూపంలో సర్కార్‌కు పన్ను చెల్లించాల్సి రావడం, అక్రమ మద్యం (ఎన్డీపీఎల్) రవాణాపై నిఘా, నిర్దేశిత విక్రయ సమయాలు వెరసి మద్యం వ్యాపారులకు లాభాలు లేకుండా చేశాయి. దీనికితోడు ఈసారి 20 శాతం లెసైన్సు ఫీజు పెంచడం కూడా వ్యాపారుల నిరాసక్తతకు కారణమైంది. అధికారులకు కొత్త తంటా! మద్యం దుకాణాలకు దరఖాస్తులు రాకపోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా డిప్యూటీ కమిషనర్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు, సీఐలకు దుకాణాల బాధ్యతను అప్పగించారు. దరఖాస్తులు రాని దుకాణాలలో ప్రస్తుతం వ్యాపారం నిర్వహిస్తున్న వారికి సంబంధిత ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు ఫోన్లు చేసి, దరఖాస్తులు సబ్మిట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. -
వందకు మించలేదు!
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ పరిధిలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. నూతన విధానం ప్రకారం మహా నగరంలో 503 దుకాణాలకు ఈ నెల 14 నుంచి ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఐదు రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలకు అందిన దరఖాస్తుల సంఖ్య వందకు మించకపోవడం గమనార్హం. ఉదాహరణకు హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్లో 72 దుకాణాలు ఉండగా... శుక్రవారం వరకు గోల్కొండ, అమీర్‌పేట్ ప్రాంతాల్లోని రెండు దుకాణాలకు ఒక్కొక్కటే దాఖలైనట్లు తెలిసింది. గ్రేటర్ పరిధిలో మద్యం దుకాణం ఏర్పాటుకు రెండేళ్ల కాల పరిమితికి రూ.2.16 కోట్ల లెసైన్సు ఫీజు నిర్ణయించిన విషయం విదితమే. ఈ ఫీజు గతానికంటే 20 శాతం పెరగడంతో పాటు దరఖాస్తు రుసుమును రూ.50 వేలుగా నిర్ణయించారు. వీటితో పాటు నిర్ణీత పరిమితికి మించి అమ్మకాలు సాగితే ప్రివిలేజు ఫీజు భారీగా చెల్లించాల్సివస్తోంది. దీంతో గతంలో మాదిరిగా పోటీ అంతగా లేనట్లు తెలిసింది. దీంతో పూర్తి స్థాయిలో దుకాణాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉన్న వారే దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలిసింది. తుది గడువు ఈనెల 21తో ముగియనుండడంతో చివరి రెండు రోజులు దరఖాస్తులు వెల్లువెత్తుతాయని అధికారుల అంచనా. ఎవరూ తీసుకునేందుకు ముందుకు రాకపోతే.. మిగిలిపోయిన మద్యం దుకాణాలను బ్రీవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించే అవకాశాలున్నట్లు తెలిసింది. ఈనెల 23న డ్రా.. హైదరాబాద్ జిల్లా పరిధిలోని దుకాణాలకు ఈ నెల 23న 11 గంటలకు అంబర్‌పేట్‌లోని రాణా ప్రతాప్ పంక్షన్ హాలులో డ్రా నిర్వహించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఫారూఖీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని దుకాణాలకు అదే రోజున ఉదయం 11 గంటలకు నాగోలులోని అనంతుల రాంరెడ్డి గార్డెన్స్‌లో డ్రా నిర్వహించనున్నట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రాజశేఖర్‌రావు తెలిపారు. -
ఇక జాతరే !
- జిల్లాలో నేటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తులు - 21 వరకు స్వీకరణ - 23న కలెక్టర్ సమక్షంలో డ్రా - ఫీజుల రూపేణ రానున్న ఆదాయం రూ.65 లక్షలు - డిమాండ్ దుకాణాలపై బడా వ్యాపారుల కన్ను నిజామాబాద్ క్రైం : నూతన మద్యం విధానం నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో జిల్లాలో సోమవారం నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. కొత్త విధానం ప్రకారం రెండేళ్ల కాల పరిమితితో లెసైన్స్‌లు జారీ చేయనున్నారు. ఇప్పటి వరకు ఒక సంవత్సరం వరకే లెసైన్స్ ఇచ్చేవారు. కాలపరిమితి ముగియగానే మరో సంవత్సరానికి రెంటల్ చెల్లించుకుని లెసైన్స్ రెన్యూవల్ చేసేవారు. దాంతో వ్యాపారులకు రెంటల్ చెల్లించటం కష్టం అనిపించలేదు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఆరు శ్లాబుల్లో మద్యం దుకాణాలకు ప్రస్తుతమున్న లెసైన్సు ఫీజుకు ఆదనంగా 20 శాతం పెంచుతూ కొత్త ధర నిర్ణయించారు. రెండేళ్ల లెసైన్సు ఫీజుకు ఏడు రెట్లు మద్యం అమ్మకాలు చెల్లించాల్సి ఉంటుంది. ఏడు రెట్లు దాటితే ఆ తర్వాత అమ్మకాలపై 8 శాతం పన్ను చెల్లించాలి. దీంతో రెండు సంవత్సరాల రెంటల్ ఫీజు చెల్లించేందుకు మద్యం వ్యాపారులు వెనుకాడుతున్నారు. పెద్ద మొత్తంలో ఫీజు చెల్లించాల్సి రావడంతో ఇప్పుడున్న వ్యాపార భాగస్వాములతో పాటు కొత్తవారిని కలుపుకుని దుకాణాలు చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో మొత్తం 130 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందు లో నిజామాబాద్ యూనిట్ పరిధిలో 93, కామారెడ్డి యూ నిట్ పరిధిలో 37 దుకాణాలు ఉన్నాయి. నేటి నుంచి ఈనెల 21 వరకు దరఖాస్తులు విక్రయించనున్నారు. 23న కలెక్టర్ సమక్షంలో డ్రా తీసి దుకాణాలను కేటాయించనున్నారు. దరఖాస్తు ఫీజుతో పెద్ద మొత్తంలో ఆదాయం.. మద్యం అమ్మకాలలో ప్రభుత్వం సరికొత్త విధానం ప్రవేశపెట్టి భారీగా ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా చీప్ లిక్కర్‌ను గ్రామ గ్రామానా అందుబాటులో ఉంచేలా కసరత్తు చేసింది. అరుుతే రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత రావటంతో వెనక్కి తగ్గింది. దీంతో ఆదాయం సమకూర్చుకునేందుకు మరో ఆలోచన చేసింది. మద్యం పాలసీ పాత పద్ధతినే కొనసాగిస్తూ రెంటల్ లెసైన్స్ ఫీజు 20 శాతం, మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు ధర రూ.50 వేలకు పెంచింది. గతంలో దరఖాస్తు ఫీజు రూ.25 వేలు ఉండేది. జిల్లాలో మొత్తం 130 మద్యం దుకాణాలకు గాను దరఖాస్తు రూపేణా ఎక్సైజ్ శాఖకు రూ. 65 లక్షల ఆదాయం సమకూరనుంది. దరఖాస్తు చేసిన వారికి దుకాణం రాకున్నా ఈ ఫీజు తిరిగి ఇవ్వరు. దీంతో ఎన్ని ఎక్కువ దరఖాస్తులు వస్తే ప్రభుత్వానికి అంత ఆదాయం సమకూరనుంది. -
సర్కారు మద్యం వ్యాపారం!
టీఎస్‌బీసీఎల్ ద్వారా లిక్కర్ షాపుల నిర్వహణకు ప్రణాళికలు * పెరిగిన లెసైన్సు ఫీజుతో మద్యం వ్యాపారులు వెనకడగు వేస్తుండటం వల్లే.. * జీహెచ్ఎంసీ, వరంగల్, కరీంనగర్‌లలో ఎ-4 షాపుల ఫీజు అధికం * నేటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: మద్యం వ్యాపారాన్ని సొంతంగా నిర్వహించేందుకు ఎక్సైజ్‌శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రెండేళ్ల కాలానికి మద్యం దుకాణాలకు అనుమతిస్తూ లెసైన్సు ఫీజును 20 శాతం పెంచిన నేపథ్యంలో వ్యాపారులు నిర్వహణకు ముందుకు రానిచోట బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వ్యాపారం చేయాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 10 శాతం మద్యం దుకాణాలను అక్కడి ఎక్సైజ్‌శాఖ ఇప్పటికే నిర్వహిస్తున్న నేపథ్యంలో అవసరమైతే అదే ప్రయోగాన్ని రాష్ట్రంలో చేపట్టాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నూతన మద్యం పాలసీకి సంబంధించిన విధివిధానాలు విడుదల చేసినప్పుడే ఎవరూ దుకాణాలు తీసుకునేందుకు ముందుకు రాని చోట టీఎస్‌బీసీఎల్ పేరుతో ఎ-4 షాపులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ కూడా ధ్రువీకరించారు. జీహెచ్ఎంసీ, వరంగల్, కరీంనగర్‌లలో భారీగా పెరిగిన ఫీజు రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు ఉండగా ప్రభుత్వం వాటిని జనాభా ప్రాతిపదికన విభజించి ప్రస్తుతమున్న లెసైన్సు ఫీజులను 20 శాతం పెంచుతూ ఖరారు చేసింది. ఈ మొత్తాన్ని వ్యాపారులు ఆరు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 10 వేల లోపు జనాభా గల 679 దుకాణాలకు సంవత్సరానికి రూ. 39 లక్షల చొప్పున రెండేళ్లకు రూ. 78 లక్షలు చెల్లించాలి. అలాగే 10వేల నుంచి 50 వేల జనాభా ఉన్న 576 దుకాణాలలో ఒక్కో దానికి రూ. 81.60 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షలలోపు జనాభాగల 396 దుకాణాలకు రూ. కోటీ ఎనభై వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒకెత్తయితే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 22 దుకాణాలకు ఫీజు రెండేళ్లకు ఏకంగా రూ. 20 లక్షల చొప్పున పెరగగా, కొత్తగా గ్రేటర్ కార్పొరేషన్ అయిన వరంగల్ పరిధిలోని 40 దుకాణాలకు లెసైన్సు ఫీజును 1.63 కోట్లుగా నిర్ణయించారు. వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ కావడంతో గ్రామీణ పరిధిలోని మరో 3 దుకాణాలు కూడా ఇప్పుడు కార్పొరేషన్ పరిధికి చేరాయి. ఇక జీహెచ్ఎంసీలో రూ. 90 లక్షలు ఉన్న లెసైన్సు ఫీజును రెండేళ్లకు రూ. 2.16 కోట్లకు పెంచడం వ్యాపారులకు అశనిపాతం అయింది. నేటి నుంచి దరఖాస్తులు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్న రెండేళ్ల మద్యం పాలసీకి సంబంధించి సోమవారం నుంచి దరఖాస్తులను ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. రూ. 50 వేలు చెల్లించి దరఖాస్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 21వ తేదీ లోపు దరఖాస్తులను అందజేయాలి. 23న జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా తీస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోనున్న షాపులు జీహెచ్ఎంసీ పరిధిలో 503 మద్యం దుకాణాలు ఉండగా వీటికి 2014-15 సంవత్సరంలో లెసైన్సు ఫీజును రూ. 90 లక్షలుగా నిర్ణయించి దరఖాస్తులు కోరితే 103 దుకాణాలను ఎవరూ తీసుకోలేదు. రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ ప్రాంతంతోపాటు మెదక్ జిల్లా పటాన్చెరు, రామచంద్రాపురం జీహెచ్ఎంసీ పరిధిలోకి రాగా, గ్రేటర్ సరిహద్దు గీతకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు, మండల కేంద్రాలను కూడా గ్రేటర్ పరిధిలోకి తేవడమే ఇందుకు కారణం. మెదక్ జిల్లా పరిధిలోని పటాన్చెరు, రామచంద్రాపురం ప్రాంతాల్లోని 15 దుకాణాల్లో ఒక్క దుకాణాన్ని కూడా ఎవరూ తీసుకోలేదు. అలాగే హైదరాబాద్ సిటీ, రంగారెడ్డిలో కూడా అదే పరిస్థితి. వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ అయ్యాక జూలై నుంచి సెప్టెంబర్ వరకు లెసైన్సులను రెన్యూవల్ చేయించుకోవాలని ప్రభుత్వం కోరగా 8 షాపుల వ్యాపారులు వెనకడుగు వేశారు. అలా రాష్ట్రంలో మరో 50 దుకాణాలను మూన్నెళ్ల కాలానికి ఎవరూ తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో 20 శాతం లెసైన్సు ఫీజు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా దుకాణాలు మిగిలిపోయే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు కూడా ఒప్పుకుంటున్నారు. -
తలుపులు బార్లా..!
30 వేల జనాభాకో కొత్త బారు పాత విధానాలకు స్వస్తి చెప్పిన ఆబ్కారీ శాఖ దుకాణాల ప్రకారం కాకుండా జనాభా ప్రాతిపదికన.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నల్లగొండ : కొత్త బార్లు అనుమతికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాత విధానాలకు స్వస్తి చెప్పి బార్ల పాలసీలో మార్పులు చేసింది. నూతన పాలసీ ప్రకారం.. జిల్లాలో కొత్తగా 8 బార్లు ఏర్పాటు చేసుకునే అవకాశం వ్యాపారులకు లభించింది. గతంలో పట్టణాల్లో మద్యం దుకాణాలను అంచనా వేసి బార్లు అనుమతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో పట్టణాల్లో బార్ల సంఖ్య చాలా పరిమితంగా ఉంది. మద్యం దుకాణాలకు పోటీగా బార్లు అనుమతివ్వడం ద్వారా ఆ ప్రభావం దుకాణాలఅమ్మకాలపై పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకుని కొత్త బార్లుకు అనుమతి ఇచ్చేవారు కాదు. కానీ ప్రస్తుతం పాత పాలసీ రద్దు చేసి జనాభా ప్రాతిపదికన బార్లు ఏర్పాటు చేసుకోవచ్చుని అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 30 వేల జనాభా దాటిన ప్రాంతాల్లో కొత్తగా బార్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీ కోదాడలో, నగర పంచాయతీలు హుజూర్నగర్, దేవరకొండలలో బార్లు బార్లాగా తలుపులు తెరుచుకోనున్నాయి. పెరగనున్న బార్లు... జిల్లాలో ప్రస్తుతం బార్లు 21 ఉన్నాయి. మిర్యాలగూడ ఈఎస్ పరిధిలో 7, నల్లగొండ ఈఎస్ పరిధిలో 14 బార్లు ఉన్నాయి. మిర్యాలగూడ పరిధిలో కోదాడ మున్సిపాలిటీలో రెండు బార్లు, హుజూర్నగర్, దేవరకొండలో ఒక్కో బారు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఇక నల్లగొండ ఈఎస్ పరిధిలో భువ నగిరి, సూర్యాపేటలో ఇప్పటికే జనాభాకు మించి బార్లు ఉండడంతో కొత్త బార్లకు అవకాశం లేదు. కానీ నల్లగొండ మున్సిపాలిటీలో జనాభా 1.65 లక్షలు ఉన్నందున ఇక్కడ కొత్తగా మూడు బార్లు రానున్నాయి. దీంతో పట్టణంలో బార్లు సంఖ్య ఐదుకు చేరనుంది. జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం బార్లు సంఖ్య 29కి చేరనుంది. నిబంధనలు ఇవీ.. కొత్తగా బార్లు ఏర్పాటు చేయాలనుకునే వారి కి ఇప్పటికే రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉండాలి. ట్రేడ్ లెసైన్స్‌తో పాటుగా వరుసగా రెండేళ్ల పాటు వ్యాట్ చెల్లించినట్లు ఆధారాలు ఉండా లి. ఏడాది కాలపరిమితితో బార్లు అనుమతి ఇస్తారు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వ చ్చిన ట్లయితే డ్రా విధానం ద్వారానే లెసైన్స్ లు జారీ చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.5వేలు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో లెసై న్స్ఫీజు రూ.28లక్షలు నిర్ణయించారు. -
గుడుంబా అమ్ముతున్న గ్రామాలు @ 483
నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా ఏరులైపారుతున్న గుడుంబా లెక్కతేలింది. నాటుసారా జోలికి ఎవరూ వె ళ్లకుండా దాని స్థానంలో గ్రామాల్లో చీప్ లిక్కర్ దుకాణాలు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి కొద్ది రోజులుగా రాష్ట్రస్థాయిలో జరుగుతున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. అయితే గుడుంబా అమ్మకాలు జరిగే ప్రాంతాలు గుర్తించిన తర్వాతే ఎన్ని గ్రామాల్లో చీప్ లిక్కర్ దుకాణాలకు అనుమతివ్వాలనే అంశం ఆధారపడి ఉంది. దీంతో ఇటీవల జిల్లా ఎక్సైజ్‌శాఖ నాటుసారా అమ్మకాలు జోరుగా సాగే ప్రాంతాలను జల్లెడ పట్టింది. జిల్లా వ్యాప్తంగా 1178 గ్రామ పంచాయతీలు ఉండగా...నాటుసారా తయారయ్యే గ్రామాలు 483 ఉన్నట్లు గుర్తించారు. ఈ గ్రామాలను ఏ,బీ కేటగిరీలుగా విభజించారు. ‘ఏ’ కేటగిరిలో నాటుసారా తయారు చేస్తున్న గ్రామాలు, తండాలు 260 ఉండగా...సారా అత్యధికంగా అమ్ముడయ్యే గ్రామాలు, తండాలు కలిపి 483 ఉన్నాయి. ఈ గ్రామాల్లో నాటుసారా తయారీ అరికట్టడంతోపాటు, మద్యం వ్యాపారులు అక్రమంగా నడుపుతున్న బెల్టుదుకాణాల భరతం పట్టేందుకు ‘పీడీ యాక్ట్’ ప్రయోగించాలని ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే గడిచిన నాలుగు మాసాల్లో పోలీస్‌శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రామాలు, తండాల్లో మెరుపుదాడులు చేస్తున్నారు. పోలీస్ వర్సెస్ ఎక్సైజ్.... గ్రామాల్లో చీప్ లిక్కర్ దుకాణాలు తెరవాలంటే ముందుగా నాటుసారా తయారీ నిరోధించాలి. దీనిలో భాగంగానే జూలైలో ఖరారు కావాల్సిన మద్య పాలసీ మూడు నెలల వరకు వాయిదా వేశారు. వచ్చే నెలాఖరు నాటికి మూడు మాసాల గడువు పూర్తవుతుంది. అప్పటిలోగా బెల్లం అమ్మకాలు, నాటుసారా తయారీ, బెల్టుదుకాణాలను నామరూపం లేకుండా చేయాలని పోలీస్, ఎక్సైజ్ శాఖలకు ఆదేశాలు వచ్చాయి. గతానికి భిన్నంగా ప్రభుత్వం పోలీస్ శాఖకు సర్వాధికారాలు కట్టబెట్టింది. పోలీస్‌శాఖ దాడిచేసి పట్టుకున్న కేసులను గతంలో ఎక్సైజ్ శాఖకు అప్పగించడం జరిగేది. కానీ ఇప్పుడు అలా కాకుండా పోలీస్ శాఖకు కేసులు న మోదు చేసే అధికారాన్ని కల్పించారు. దీంతో పోలీస్ అధికారులు జిల్లా వ్యాప్తంగా మెరుపు దాడులు చేస్తుండటంతో దానికి దీటుగానే ఎక్సైజ్ శాఖ సైతం నాటుసారా తయారీ దారులపై కొరఢా ఝళిపిస్తోంది. దాడులు ఉధృతం.... వరుసగా మూడు, నాలుగు కేసులు నమోదైన వ్యక్తులు లేదా బెల్లం వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నారు. సారా తయారీ, విక్రయాలకు అడ్డుకట్టవేయడంలో విఫలమైతే సంబంధిత ఎక్సైజ్, పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేయమని సీఎం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దీంతో నాలుగు మాసాలుగా ఈ రెండు శాఖలు కూడా కంటి మీద కునుకు లేకుండా గ్రామాల్లో, తండాల్లో తరచూ దాడులు చేస్తున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు నాటుసారా 25,023 లీటర్లు పట్టుకుంటే ఈ ఏడాది అదేరోజుల్లో 30,046 లీటర్ల సారాను సీజ్ చేశారు. గతేడాది అరెస్టయిన వ్యక్తులు 1338 మంది కాగా..ఈ ఏడాది 1501 మందిని అరెస్టు చేశారు. నల్లబెల్ల అమ్మకాలు మాత్రం గతేడాది 15,915 కిలోలు సీజ్ చేయగా...ఈ ఏడాది కేవలం 5,875 కిలోల బెల్లాన్ని మాత్రమే సీజ్ చేశారు. ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఈ దాడులు ఓ రికార్డు సాధిస్తాయని అధికారులు చెప్పడం గమనార్హం. ‘ఏ’ కేటగిరిలో గ్రామాలు /తండాలు : 260 ‘బీ’ కేటగిరిలో గ్రామాలు /తండాలు : 223 ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై 31 వరకు నమోదైన గుడుంబా కేసులు సీజ్ చేసిన సారాయి (లీటర్లు) 30,046 ధ్వంసమైన బెల్లం పానకం (లీటర్లు) 12,47,810 సీజ్ చేసిన నల్లబెల్లం(కిలోలు) 5,875 నాటుసారా కేసులు 3,125 అరెస్టయిన వారి సంఖ్య 1,501 సీజ్ చేసిన వాహనాలు 109 -
బహిరంగ కిక్కు..!
జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఓ మద్యం దుకాణం ఓపెన్ బార్‌ను తలపించే విధంగా ఉంటుంది. కర్నూలు నాల్గో పట్టణ పోలీసు స్టేషన్ పక్కనే రెండు మద్యం దుకాణాలున్నాయి. దుకాణాలకు ముందు తడికలు అడ్డం కట్టి బహిరంగంగానే మద్యం తాపిస్తున్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని లాడ్జి దగ్గర మద్యం దుకాణం ఉంది. ఆ దుకాణం నుంచి లాడ్జిలో పనిచేసే బాయ్స్ భారీ మొత్తంలో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. అర్ధరాత్రి వేళ కూడా ఇక్కడ మద్యం దొరుకుతుంది. - రోడ్లపైనే మందుకొట్టుడు - బార్లను తలపిస్తున్న మద్యం దుకాణాలు - నిబంధనలు బేఖాతర్ - ఆరుబయటే గ్లాసుల మోత - చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు కర్నూలు: జాతీయ రహదారుల పక్కన మద్యం దుకాణాలు ఉండకూడదన్న నిబంధన ఉంది. కర్నూలు నగరంలోనే చెన్నమ్మ సర్కిల్ వద్ద రెండు దుకాణాలు, కృష్ణానగర్ ఐటీసీకి ఎదురుగా రెండు దుకాణాలు జాతీయ రహదారికి ఆనుకొని ఏర్పాటుచేశారు. సాయంత్రం అయితే చాలు. పెద్ద సంఖ్యలో మందు బాబులు ఆయా దుకాణాల వద్ద గుమికూడుతున్నారు. సర్వీసు రోడ్లను సైతం ఆక్రమించి వాహనాలు పార్క్ చేసి బహిరంగంగానే మద్యం సేవిస్తున్నారు. నగరంలోని పలు మద్యం దుకాణాల వద్ద మద్య సేవనం ఆరుబయటే జరుగుతోంది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.. ఇలాంటివి జిల్లాలో అనేకం ఉన్నాయి. జిల్లాలో 175ప్రైవేట్ దుకాణాలు, 19 ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. ప్రైవేట్ దుకాణదారులు ప్రభుత్వానికి రూ.2 లక్షలు చెల్లించి పర్మిట్ రూముకు అనుమతి తీసుకోవాల్సి ఉంది. అయితే 30కిపైగా దుకాణాల్లో ఇప్పటి వరకు పర్మిట్ రూములకు అనుమతి తీసుకోకుండానే మద్యం తాపిస్తున్నారు. ఐదు వేలలోపు జనాభా ఉన్న దుకాణాలకు పర్మిట్ రూము అవసరం లేదన్న నిబంధనను అడ్డం పెట్టుకొని ఎక్సైజ్ అధికారులు మామూళ్లు దండుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరహా నిబంధనల మేరకే సుంకేసుల, చిన్నటేకూరు గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాలకు పర్మిట్ రూములు లేకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. జోరుగా లూజు విక్రయాలు.. వైన్‌షాపుల్లో లూజు విక్రయాలు నిషేధం. అలాగే దుకాణం ఎదుట మద్యం తాగడం కూడా నిబంధనలకు విరుద్ధమే అనుమతి గదుల్లో మాత్రమే మద్యం సేవించడానికి అనుమతి ఉంటుంది. అయితే జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు ఈ నిబంధనలను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మద్యం దుకాణాల ఎదుటనే గుంపులుగా గుమికూడి మద్యం సేవిస్తున్నప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేదు. వైన్ షాపుల ముందు చికెన్ పకోడి బండ్లు, మటన్ కడ్డీలు (చీకులు), చేపలు తదితర తిను బండారాలను ఏర్పాటు చేసి బహిరంగంగానే మద్యం సేవిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. మీతో మీ ఎస్పీకి ఫిర్యాదుల వెల్లువ: ప్రజా సమస్యలపై ప్రతి సోమవారం నిర్వహించే మీతో మీ ఎస్పీ కార్యక్రమానికి బహిరంగ మద్యపానం విషయంపై భారీ ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతి వారం జిల్లా నలుమూలల నుంచి కనీసం 3,4 ఫిర్యాదులు బహిరంగ మద్యపానం, నాటుసారా వ్యాపారం పైనే ఫిర్యాదులు వస్తున్నాయి. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం తప్ప పరిష్కరించిన దాఖలాలు కనిపించడం లేదు. మద్యం దుకాణాల ముందు నడుచుకుంటూ వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని స్వయంగా మహిళలే ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే కరువయ్యారు. పోలీసు బాసు గట్టిగా ఆదేశించినపుడు మాత్రమే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై తూతూ మంత్రంగా దాడులు చేస్తున్నారు. మద్యం వ్యాపారుల నుంచి నెలవారి మామూళ్లు పంచుతున్నందునే అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైన్‌షాపుల ముందు రోడ్లపైన మద్యం తాగనివ్వకుండా ఎక్సైజ్‌శాఖ నియంత్రించాల్సి ఉంది. ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో దుకాణం వద్ద ఓపెన్ బార్‌ను తలపించే విధంగా మద్యపానం సేవిస్తున్నప్పటికీ అటువైపు కన్నెత్తి చూసే వారు కూడా కరువయ్యారు. క్షేత్రస్థాయి అధికారుల్లో చిత్తశుద్ధి లేనపుడు ఉన్నతాధికారులు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అవి అమలు కావు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన విషయంలోనూ పోలీసు బాసు కిందిస్థాయి అధికారులకు ఎన్నిసార్లు హెచ్చరించినా, సమావేశాల్లో గట్టిగా ఆదేశించినా ఫలితం కనిపించడం లేదు. -
ధరల కిక్కుకు.. ఇక చెక్!
‘మందు’స్తు వ్యూహం ! - మద్యం దుకాణాల్లో హేలోగ్రాఫిక్ మెషీన్లు తప్పనిసరి - బిల్లింగ్ విధానంలో మార్పులు - పది రోజుల్లో జిల్లాలో అమలు రాజమండ్రి రూరల్ : మద్యం దుకాణాల్లో అధిక ధరల విక్రయాలకు చెక్ పెట్టేందుకు ఆశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇకపై హేలోగ్రాఫిక్ తప్పనిసరి చేస్తూ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. బిల్లింగ్ విధానంలోనూ మార్పులు తేనున్నారు. అన్ని సక్రమంగా జరిగితే పదిరోజుల్లో జిల్లాలో ఈ నూతన ప్రక్రియను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యం విక్రయాలు సాగించకుండా సరికొత్త విధానాన్ని మద్యం దుకాణాల్లో ప్రవేశపెడుతున్నామని గతం నుంచీ అధికారులు చెబుతూ వస్తున్నారు. వాణిజ్యకేంద్రాల్లో ఉండే హేలోగ్రాఫిక్ బిల్లింగ్ సిస్టంను జిల్లాలోని మద్యంషాపుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. కానీ నేటీకీ ఆచరణలో పెట్టలేకపోయారు. ఈలోపు కొత్త మద్యం పాలసీ వచ్చింది. ఆగస్టు ఒకటి నుంచి శాశ్వత లెసైన్‌స మంజూరు చేయనున్నారు. అది కావాలంటే హేలోగ్రాఫిక్ విధానం మద్యం దుకాణాలలో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. 2015-17 ఎక్సైజ్ పాలసీతో జిల్లాలో 562 మద్యంషాపులకు జూన్ 22న కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో 57 షాపులను పూర్తిగా ప్రభుత్వం నిర్వహించనుంది. మిగతా 505 షాపులను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించగా, అందులో 458 షాపులు నడుస్తున్నాయి. మిగతా 47 షాపులకు ఎటువంటి దరఖాస్తులు రాలేదు. రెండేళ్ల కాలానికి ఇచ్చే ఈ లెసైన్‌స 2017 జూన్30 వరకు చెల్లుబాటులో ఉంటుంది. అయితే షాపులు దక్కించుకున్న వారికి తాత్కాలిక లెసైన్‌సలు మాత్రమే ఇచ్చారు. లాటరీ ముగిసిన 15 రోజుల్లోపు బ్యాంకు గ్యారంటీలు చెల్లించి పర్మినెంట్ లెసైన్‌సలు పొందాలని సూచించారు. కొంత మంది గ్యారంటీలు చెల్లించకపోవడంతో ఈనెలాఖరు వరకు గడువు పెంచారు. ఆగస్టు ఒకటిన శాశ్వత లెసైన్‌సలు మంజూరు చేయనున్నారు. ప్రతి ఒక్కరూ హోలోగ్రాఫిక్ సిస్టంను ఏర్పాటు చేయాల్సిందేన ని అధికారులు చెబుతున్నారు. హేలోగ్రామ్ ఏం చేస్తుంది.. మద్యం బాటిల్‌పై ఉండే హోలోగ్రామ్‌ను హేలోగ్రాఫిక్ పరికరం వద్ద ఉంచితే ఆటోమేటిక్‌గా దాని ధర కంప్యూటర్లో నమోదై బిల్లు వచ్చేస్తుంది. మద్యం ప్రియులు బిల్లు తీసుకుని దాని మేరకే సొమ్ము చెల్లిస్తారు. ఇప్పటికే ఈ పరికరాలు చాలా మద్యం దుకాణాలకు చేరాయి. ఈ ఏడాది ఎక్సైజ్ పాలసీలో కొత్త నిబంధనలు పెట్టారు. రెండేళ్ల కాలానికి సంబంధించి ఆదాయ పన్ను ధ్రువీకరణపత్రాలు సమర్పించాలని, వ్యాట్ పరిధిలో ఉంటే సంబంధిత పత్రం చెల్లించవచ్చన్నారు. వీటితో పాటే ఇప్పుడు హేలోగ్రాఫిక్ బిల్లింగ్ సిస్టంను తప్పనిసరి చేశామని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. దీనివల్ల మద్యం దుకాణాల అమ్మకాలు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయాలకు, బేవరేజస్ డిపోలకు, మద్యం కంపెనీలకు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. కనెక్టవిటీకి టైం పడుతుంది ఇప్పటికే మద్యం దుకాణాలలో హేలోగ్రాఫిక్ మెషీన్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే మద్యం దుకాణాల నుంచి మద్యం డిపోలకు, ఎక్సైజ్ కార్యాలయాలకు అనుసంధానం చేయాల్సి ఉంది. ఈసిస్టమ్ అంతా హైదరాబాద్ నుంచి కనెక్టవిటీ చేయాల్సి ఉంది. సుమారు పదిరోజుల వరకు టైం పట్టే అవకాశం ఉంది. - వివేకానందరె డ్డి, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్‌శాఖ -
మద్యం మాఫియా మహాదోపిడీ
జిల్లాలో అధికార పార్టీ లిక్కర్ సిండికేట్ వ్యవహారం మూడు ఫుల్‌బాటిళ్లు... ఆరు నిబ్బులుగా సాగిపోతోంది. అసలే పక్తూ మద్యం వ్యాపారులు...పైగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా.. దీంతో అడ్డూఅదుపు లేకుండా యథేచ్ఛగా మద్యం వ్యాపారంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. మొత్తం మద్యం దుకాణాలను గుప్పిటపట్టిన ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరిదీ. సిండికేట్‌గా ఏర్పడి దుకాణాల కేటాయింపులో చక్రం తిప్పారు. లెక్కకు మించి బెల్టు దుకాణాలు తెరిచారు. ఇప్పుడు మద్యం ధరలను ఎమ్మార్పీ కంటే పెంచేసి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఏకంగా నెలకు రూ.15కోట్లుపైగా కొల్లగొడుతున్నారు. - ధరల మాయాజాలం - ఎంఆర్పీ కంటే అధికంగా రేట్లు - అడ్డగోలుగా నెలకు రూ.15కోట్లు అవినీతి - ఇద్దరు ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యం అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఊళ్లు పంచుకున్న చందంగా జీవీఎంసీ, రూరల్ జిల్లాలను పంచేసుకున్నారు. నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి సిండికేట్‌లో జీవీఎంసీ పరిధిలో 169 దుకాణాల్లో వందకుపైగా దుకాణాలున్నాయి. తొలిసారి ఎన్నికైన మరో ప్రజాప్రతినిధి కుటుంబ సిండికేట్‌లో రూరల్ జిల్లాలో మద్యం దుకాణాలు ఉన్నాయి. 198 మద్యం దుకాణాల్లో 125 వరకు ఆ ప్రజాప్రతినిధి చెప్పిందే సాగుతోంది. వేలం నోటిఫికేషన్ నుంచే కథ నడిపి అంతా తాము అనుకున్నట్లు చేసుకోగలిగారు. వ్యూహాత్మకంగా దుకాణాలను గుప్పిట్లో పెట్టుకున్న ఆ ఇద్దరు తాజాగా అసలు కథకు తెరతీశారు. మద్యం గరిష్ట ధర(ఎంఆర్పీ) కంటే 10శాతం నుంచి 15శాతం వరకు ఎక్కువగా ధరలు పెంచేశారు. దుకాణాలన్నీ వారి చేతుల్లోనే ఉండటంతో వారు చెప్పిందే ధరగా మారింది. బీరు బాటిల్ మీద రూ.20 అధికంగా అమ్ముతున్నారు. బ్రాండ్లను బట్టి విస్కీ, రమ్ము, ఇతర మద్యాన్ని క్వార్టర్ బాటిల్మీద రూ.10, ఆఫ్బాటిల్ మీద రూ.15, ఫుల్‌బాటిల్ మీద రూ.25వరకు అధికంగా విక్రయిస్తున్నారు. ఇందులో ఏముందిలో అనుకుంటున్నారేమో!... చిన్న విషయమేమీ కాదు. జిల్లాలో అధికారికంగా 367 దుకాణాలున్నాయి. జిల్లాలో నెలకు రూ.110కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం నెలకు జీవీఎంసీ పరిధిలో రూ. 69కోట్లు, రూరల్ జిల్లాలో రూ.41కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఎంఆర్పీ కంటే ధరలు పెంచేయడంతో జీవీఎంసీ పరిధిలోనే నెలకు అక్రమంగా రూ.9కోట్లు వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. జిల్లా పరిధిలో నెలకు రూ.6కోట్ల వరకు అధికంగా గుంజుతున్నారు. ఆ లెక్కన నెలకు జిల్లాలో రూ.15కోట్లు అవినీతికి పాల్పడుతున్నారు. అంటే ఏడాదికి మద్యం విక్రయాల్లో రూ.180కోట్ల అవినీతి యథేచ్ఛగా సాగిపోతోంది. ఇదంతా అధికారిక మద్యం దుకాణాల్లో విక్రయాల్లో జరుగుతున్న అవినీతి. బెల్టు దుకాణాలకు వచ్చేసరికి మద్యం ధరలు మరింతగా పెరుగుతున్నాయి. చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ ఇష్టానుసారంగా ఎంఆర్పీ కంటే అధికంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు కిమ్మనడం లేదు. కనీసం అటువైపు చూడటమే లేదు. ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సిండికేట్‌ను నిర్వహిస్తుండటమే ఇందుకు కారణమన్నది బహిరంగ రహస్యమే. వారు చేసింది చూడటం... ఇచ్చింది తీసుకోవడం అన్న తీరుగా వ్యవహరిస్తోంది. -
కాలకూటం!
గ్రామంలో రెండు కల్లు దుకాణాల మధ్య ఉన్న పోటీ పేదల ప్రాణాల మీదికి వచ్చింది. కిక్కు ఎక్కువ ఇవ్వాలని ఒకరి కంటే ఒకరు పోటీగా కల్తీ కల్లు తయారు చేసి విక్రయించడంతో, అది తాగిన 30మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన గోపాల్పేట మండలం బండరావిపాకులలో చోటు చేసుకుంది. - గోపాల్పేట గ్రామంలోని రెండు కల్లు దుకాణాల్లో గురువారం సాయంత్రం డైజోఫామ్, సీహెచ్ ఎక్కువ మొత్తంలో కలిపి కల్లును విక్రయించారు. దీన్ని తాగిని కల్లు ప్రియులు కొద్దిసేపటికే నిద్రలోకి జారుకున్నారు. శుక్రవారం ఉదయం వరకు కూడా వారు స్పృహలోకి రాకపోవడంతో కుటుంబసభ్యులు గ్రామసర్పంచ్ రమాదేవి, ఆమె భర్త సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారు స్పందించి వెంటనే 108కు సమాచారం ఇచ్చి, బాధితులను నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎస్సై షాకీర్‌అహ్మద్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని రెండు కల్లు దుకాణాల్లో షాంపిళ్లను సేకరించి, దుకాణాలను సీజ్ చేశారు. అస్వస్థతకు గురైన 26మంది నాగర్‌కర్నూల్‌లో చికిత్స పొందుతుండగా, పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు వీరే.. బాల్‌రెడ్డి, బాలకిష్టమ్మ, నర్సింహ్మరెడ్డి, భాగ్యమ్మ, సుందరమ్మ, వెంకటమ్మ, లాలమ్మ, బాలమ్మ, తలారి లక్ష్మీదేవమ్మ, తెల్గు లక్ష్మీ, తలారి చెన్నమ్మ, నాగమ్మ, లింగమ్మ, రాములు, కిష్టమ్మ, మశమ్మ, నాగయ్య, సాంబశివుడు, సువర్ణ, లచ్చమ్మ, లింగమ్మ, నర్సింహ్మ, కొంకలపల్లి గ్రామానికి చెందిన మరికొందరు కల్తీ కల్లు తాగి అస్వస్తతకు గురయ్యారు. ఇందులో బాల్‌రెడ్డి, వెంకటమ్మ, లాలమ్మ, బాలమ్మల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. నాగర్‌కర్నూల్ ఈఎస్ జి.శ్రీనివాస్‌రెడ్డి, ఏఈఎస్ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ యుమునాధర్రావు ఆస్పత్రికి వెళ్లి ఘటన వివరాలను తెలుసుకున్నారు. మత్తు పదార్థాలు ఉన్నట్లు తేలితే కేసులు ఈ సంఘటనకు సంబంధించి ఎక్సైజ్ ఎస్ఐ షాకీర్అహ్మద్ను ‘సాక్షి’ వివరణ కోరగా రెండు కల్లు దుకాణాల్లో ఏ దుకాణంలో వీరి కల్లు తాగింది తెలియదని, రెండు దుకాణాల నుంచి షాంపిళ్లను సేకరించి ఎఫ్ఎస్ఎల్ కోసం హైదరాబాదుకు పంపినట్లు తెలిపారు. ఈ రిపోర్టులో డైజోఫామ్, అల్ఫాజోలం కలిపినట్లు వస్తే దుకాణాల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని, లెస్సైన్స్లు కూడా రద్దు చేస్తామని చెప్పారు. -
డబ్బే డబ్బు
- ఏడాదికి మద్యం ద్వారా రూ.155 కోట్ల ఆదాయం - షాపుల లెసైన్స్ ఫీజు ద్వారా రూ.107 కోట్లు - దరఖాస్తు ఫీజు ద్వారా రూ.35 కోట్లు - ప్రభుత్వం ఏర్పాటు చేసే షాపుల నుంచి రూ.13 కోట్లు - ప్రభుత్వ షాపుల్లో అమ్మకాలతో వచ్చేది అదనం - ఆగిపోయిన పది షాపులకు త్వరలో నోటిఫికేషన్ - అవి కూడా వస్తే మరింత ఆదాయం ఒంగోలు క్రైం: జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మద్యం షాపులపై వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆదాయమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన మద్యం పాలసీ మేరకు జిల్లాలో సోమవారం ఉదయానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఆదివారం రాత్రి ప్రారంభించిన టెండర్ల కార్యక్రమం సోమవారం ఉదయం 8 గంటల వరకు సాగింది. జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఒకేసారి టెండర్ల విధానాన్ని ప్రారంభించటంతో త్వరగా పూర్తయ్యాయి. లేకుంటే సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగేది. జిల్లాలో మొత్తం 289 మద్యం షాపులకుగాను 279 షాపులకు దరఖాస్తులు వచ్చాయి. మొత్తం మీద కేవలం 10 షాపులకు దరఖాస్తులు అసలు పడనేలేదు. అయితే టెండర్లు తీసి షాపుల కేటాయింపులు జరిగిన వరకు ఏడాదికి మద్యం షాపుల లెసైన్స్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి రూ.107 కోట్ల ఆదాయం రానుంది. ఈ మొత్తాన్ని లెసైన్స్‌దారులు ఆరు నెలల్లోపు షాపులకు కేటాయించిన లెసైన్స్ ఫీజును విడతల వారీగా ఎక్సైజ్ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే దరఖాస్తుల అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.35 కోట్లు జమ అయింది. ఇకపోతే జిల్లాలో ప్రభుత్వం తరఫున మొత్తం 32 మద్యం షాపులు నిర్వహించాల్సి ఉంది. ఇవి ఒంగోలు ఈఎస్ పరిధిలో 15, మార్కాపురం ఈఎస్ పరిధిలో 17 ఉన్నాయి. వీటన్నింటికి సాధారణంగా ప్రభుత్వం కేటాయించిన లెసైన్స్ ఫీజు ప్రకారం లెక్కలేస్తే మొత్తం రూ.13 కోట్ల ఆదాయం రానుంది. లెసైన్స్ ఫీజు కాకుండా ఏడాది పొడవునా మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం అదనం అన్న మాట. అమ్మకాల ద్వారా అదనంగా మరో ఏడెనిమిది కోట్లు ఆదాయం రావచ్చని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే దరఖాస్తులు రాకుండా ఆగిపోయిన పది మద్యం షాపులకు త్వరలో ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఆగిపోయిన వాటిలో ఒంగోలు ఈఎస్ పరిధిలో 7 షాపులు, మార్కాపురం ఈఎస్ పరిధిలో 3 షాపులు, చీరాల పరిధిలో ఆరు షాపులు ఉన్నాయి. వీటితో పాటు సింగరాయకొండ, జరుగుమల్లి మండలం చిర్రికూరపాడు, కనిగిరి మండలం పెదఅలవలపాడు, పర్చూరు మండలం నూతలపాడులో షాపులకు దరఖాస్తులు రాలేదు. వీటికి కొత్తగా దరఖాస్తులు వస్తే తిరిగి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరుగుతుంది. -
భారీఎత్తున దరఖాస్తులు
* 3,124 మద్యం దుకాణాలకు 65,174 దరఖాస్తులు * ఒక్క దరఖాస్తూ రానివి 354 షాపులు * దరఖాస్తుల రూపంలో రూ.224 కోట్ల ఆదాయం సాక్షి, హైదరాబాద్, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. భారీఎత్తున దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,478 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 3,124 మద్యం దుకాణాలకు 65,174 దరఖాస్తులు అందాయి. అయితే 354 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసినప్పటికీ.. ఆదివారం తెల్లవారుజాము వరకు కొన్ని జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు ఫీజు కింద రూ.224 కోట్ల ఆదాయం ఎక్సైజ్‌శాఖకు సమకూరింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించలేదు. దీనిపై ఎక్సైజ్ కమిషనర్ రాసిన లేఖకు ఎన్నికలసంఘం నుంచి సోమవారం వివరణ రానుంది. ఈ రెండు జిల్లాల్లోనూ నోటిఫికేషన్ జారీచేస్తే దరఖాస్తుల రూపంలో ఆదాయం రూ.250 కోట్లు దాటుతుందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. గతేడాది మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిశాక 743 షాపులకు ఒక్క దరఖాస్తూ రాలేదు. ఈ దఫా లెసైన్సు కాలపరిమితి రెండేళ్లు కావడంతో పోటీ ఎక్కువగానే ఉంది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు... రాష్ట్రంలో అన్ని జిల్లాలకంటే రాజధాని ప్రాంతమైన గుంటూరులో అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. 11,548 దరఖాస్తులు అధికారికంగా ప్రకటిస్తున్నా.. పెదకూరపాడు, సత్తెనపల్లి ప్రాంతాల్లో ఇంకా దరఖాస్తుల క్రోడీకరణ ప్రక్రియ పూర్తికానట్లు సమాచారం. దీంతో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. వైఎస్సార్ జిల్లాలో అత్యల్పంగా 190 దుకాణాలకు 2,161 దరఖాస్తులందాయి. ఒక్క దరఖాస్తు రాని దుకాణాలకు సోమవారం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస శ్రీ నరేష్ తెలిపారు. సింగిల్ దరఖాస్తులు వచ్చిన షాపులను దరఖాస్తు చేసినవారికే కేటాయిస్తామన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఆయా జిల్లాల్లో కలెక్టర్ల సమక్షంలో లాట్ల విధానంలో లాటరీ తీసి షాపులకు ప్రొవిజనల్ లెసైన్సు కేటాయించనున్నట్లు వివరించారు. -
ఎవరిని వరించేనో అదృష్టం
కడప అర్బన్ : మద్యం దుకాణాలు ఎవరికి దక్కుతాయో సోమవారం తేల నుంది. ఇందుకోసం దరఖాస్తుదారులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జిల్లా లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 2015-17 సంవత్సరాలకు గాను మొత్తం 269 షాపులను కేటాయించింది. వీటిలో 27 ప్రభుత్వ దుకాణాలు, 242 ప్రైవేటు దుకాణాలుగా నోటి ఫికేషన్లో పొందుపరిచారు. దరఖాస్తుల స్వీకరణ శని వారం రాత్రి వరకు కొనసాగింది. సోమవారం లాటరీ పద్ధతిలో మద్యం షాపుల లెసైన్స్‌లను కేటాయించనున్నారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎక్సైజ్ అధికారులు పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఆదివారం జెడ్పీ ఆవరణను పరి శీలించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ డి ప్యూటీ కమిషనర్ ప్రేమప్రసాద్, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కె.శ్రీనివాసాచారి, శంభుప్రసాద్, ఏఈఎస్ బాలక్రిష్ణన్, కడప ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్, ఒన్‌టౌన్ సీఐ కె.రమేష్, తమ సిబ్బందితో ఏర్పాట్లను పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్ ప్రేమ్‌ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని 242 ప్రయివేటు షాపులకు గాను 190 షాపులకు 2161 దరఖాస్తులు వ చ్చాయన్నారు. వీటికి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు ప్రక్రియ ప్రా రంభమవుతుందన్నారు. ఇందుకోసం పకడ్బందీగా చర్యలు చేపడతామన్నా రు. ఒన్‌టౌన్ సీఐ కె.రమేష్ మాట్లాడు తూ ఎక్సైజ్ టెండర్ల ప్రక్రియ కోసం 120 పోలీసు సిబ్బందితో బందోబస్తు విధులను నిర్వర్తిస్తామన్నారు. వీరి లో ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, పది మంది ఎస్ఐలు, సిబ్బంది పాల్గొంటారన్నారు. ♦ కడప జెడ్పీ ఆవరణలో నిర్వహించనున్న మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియలో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ♦ ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ ముగిసేంత వరకు ట్రాఫిక్ స్టేషన్ నుంచి జెడ్పీకి వచ్చే దారి, ఐటీఐ సర్కిల్ నుంచి జెడ్పీకి వచ్చే దారి, వైఎస్ గెస్ట్‌హౌస్ నుంచి జెడ్పీకి వ చ్చే దారిలో ఎలాంటి వాహనాలు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేస్తారు. ♦ ప్రతి దరఖాస్తుదారునికి ఎక్సైజ్ వారు ఇచ్చే గుర్తింపు పత్రం ఉంటేనే అనుమతించనున్నారు. 143 దుకాణాలకే లాటరీ.. ♦ జిల్లాలోని 242 ప్రయివేటు మద్యం షాపులకు గాను 190 షాపులకు 2161 దరఖాస్తులు వచ్చాయి. ♦ వీటిలో 47 మద్యం షాపులకు సింగిల్ దరఖాస్తు రావడంతో ఆయా దరఖాస్తుదారులకు షాపులను కేటాయిస్తారు. ♦ మిగిలిన 143 షాపులకు మాత్రమే లాటరీ పద్ధతి ద్వారా లెసైన్స్‌లను కేటాయించనున్నారు. ♦ 2161 దరఖాస్తుల ద్వారాప్రభుత్వాని కి రూ. 7.83 కోట్ల ఆదాయం వచ్చింది. ♦ షాపులకు రూ 76.36 కోట్లు ఆదా యం రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. -
కిక్కే...కిక్కు
- మద్యం షాపులకు వెల్లువెత్తిన దరఖాస్తులు - చివరిరోజు పోటెత్తిన వ్యాపారులు - నగర పరిధిలో షాపులకు యమగిరాకీ - ఏజెన్సీ షాపులకు స్పందన శూన్యం సాక్షి, విశాఖపట్నం: ఊహించని రీతిలో మద్యం షాపు లవేలం కాసుల వర్షం కురిపిస్తోంది. దరఖాస్తు చేసేందుకు చివరిరోజు కావడంతో శనివారం వ్యాపారులు క్యూకట్టారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని షాపుల కోసం పోటీపడిన వ్యాపారులు ఏజెన్సీ పరిధిలోని షాపుల వైపు కన్నెత్తి చూసేపరిస్థితి కన్పించడం లేదు. జిల్లాలో 406 మద్యం దుకాణాలుండగా, వీటిలో 39 షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించింది. మిగిలిన 367 షాపులకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఇందుకోసం స్థానిక శివాజీపాలెంలో ఉన్న సవేరా ఫంక్షన్‌హాలులో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. ఈ నెల 23వ తేదీన ప్రారంభం కాగా, తొలి మూడు రోజులు అంతంతమాత్రంగా ఉన్న స్పందన శుక్రవారం సాయంత్రానికి 134 షాపులకు 404 దరఖాస్తులు వచ్చాయి. 233 షాపులకు శుక్రవారం వరకు ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాలేదు. చివరి రోజైన శనివారం ఊహించని రీతిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఉదయం నుంచి మొదలైన తాకిడి అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం మేరకు సుమారు 315షాపుల కోసం 2,586 దరఖాస్తులు వచ్చాయి. మరో 500 మంది వరకు దరఖాస్తు చేసేందుకు ఎదురు చూస్తున్నారు. ఏజెన్సీపరిధిలో 25 షాపులతో పాటు గ్రామీణ జిల్లాలోని మరో 25 షాపులకు దరఖాస్తులు పడలేదని తెలుస్తోంది. సిటీ పరిధిలోని 62 షాపులతో పాటు జీవీ ఎంసీ పరిధిలోకి వచ్చిన పెందుర్తి, భీమిలి, గాజువాక, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లోని షాపులకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. ఈ షాపుల కోసం ఎక్కువగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. నగర పరిధిలోని జ్ఞానాపురం, ఓల్డ్ పోస్టాఫీస్, ఆర్టీసీ బస్టాండ్, ఎన్ఎడీ జంక్షన్ వంటి ప్రాంతాల్లోని మద్యం షాపులకు 50 నుంచి 100 వరకు దరఖాస్తులు పడినట్టు తెలుస్తోంది. ఒక్క జ్ఞానాపురం షాపుకే అత్యధికంగా 110 దరఖాస్తులు దాఖలైనట్టుగా చెబుతున్నారు. లెసైన్సింగ్ ఫీజుల రూపంలోనే సుమారు రూ.పాతికకోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశాలు కన్పిస్తన్నాయి. ఆదివారం ఉదయానికి గానీ ఏ షాపునకు ఎన్ని దరఖాస్తులు దాఖలయ్యాయి.ఏఏ షాపులకు దరఖాస్తులు పడలేదో చెప్పలేమని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. -
మద్యం షాపుల కోసం దరఖాస్తుల వెల్లువ
విజయనగరం రూరల్: జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. నూతన మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ నెల 22న ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లాలో 202 మద్యం దుకాణాల నిర్వహణకు (2015-17) ఎక్సైజ్ అధికారులు గజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొదటి మూడు రోజులు కేవలం ఒకటే దరఖాస్తు రాగా నాలుగో రోజు 340 వరకు వచ్చాయి. ఆఖరి రోజైన శనివారం 182 మద్యం దుకాణాలకు దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. కలెక్టరేట్ ఆడిటోరి యంలో నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణకు ఔత్సాహికులు అధిక సంఖలో హాజరై దరఖాస్తులు అందజేశారు. సాయంత్రం ఐదు గంటల వరకు సుమారు 160 దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఔత్సాహికులు అ దిక సంఖ్యలో ఉండడంతో జిల్లాలోని 182 దుకాణాలకు సు మారు రెండు వేల వరకు దరఖాస్తులు రావచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. 28న దరఖాస్తుల పరిశీలన, 29న లాటరీ నిర్వహించి 30 నుంచి దుకాణాలకు లెసైన్స్‌లు జారీ చేయడం జరుగుతుందని ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ పి.సురేంద్రప్రసాద్ తెలిపారు. అర్ధరాత్రి వరకు టెండర్ల ప్రక్రియ కొనసాగింది. అయితే పాటదారులు అధిక సంఖ్యలో రావడంతో తోపులాట జరిగింది. దరఖాస్తుల స్వీకరణలో ఎక్సైజ్ సూపరింటిండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు. ప్రభుత్వానికి 70 కోట్ల రూపాయల ఆదాయం లెసైన్స్ ఫీజు రూపంలో 2015-16 సంవత్సరానికి విజయనగరం డివిజన్లో ఉన్న 123 దుకాణాలకు సుమారు 43.77 కోట్ల రూపాయలు, పార్వతీపురం డివిజన్లోని 59 దుకాణాలకు 20.92 కోట్ల రూపాయల ఆదాయం లభించనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే దరఖాస్తుల చలానా రూపంలో సుమారు ఆరు కోట్ల రూపాయల ఆదాయం చేకూరుతుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది 202 దుకాణాలకు 1583 దరఖాస్తులు రాగా సుమారు ఐదు కోట్ల రూపాయల ఆదాయం లభించింది. 10 శాతం దుకాణాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించడంతో సుమారు ఏడు కోట్ల 60 లక్షల రూపాయల ఆదాయం ఎక్సైజ్ శాఖ కోల్పోయింది. అలాగే లెసైన్స్ ఫీజు ఐదు వేల లోపు జనాభా ఉన్న ప్రాంతంలో దుకాణ ఏర్పాటుకు రూ. 30 లక్షలు, 10 వేల లోపుంటే రూ. 34 లక్షలు, 25 వేల లోపుంటే రూ. 37 లక్షలు, 50 వేల లోపుంటే రూ. 40 లక్షలు, 3 లక్షల లోపుంటే రూ.45 లక్షలు, ఐదు లక్షల జనాభా ఉంటే రూ. 50 లక్షలు వసూలు చేయనున్నారు. ఐదు లక్షల పైబడి జనాభా ఉంటే 65 లక్షల రూపాయల ఫీజుగా నిర్ణయించారు. 20 చోట్ల ప్రభుత్వ దుకాణాలు జిల్లాలోని 202 దుకాణాల్లో 10 శాతం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. విజయనగరం డివిజన్ పరిధిలోని విజయనగరం సర్కిల్-1లో రెండు, సర్కిల్-2 లో ఒకటి, భోగాపురం సర్కిల్ పరిధిలోని భోగాపురం, పూసపాటిరేగ మండల కేంద్రాల్లో ఒక్కోటి, చీపురుపల్లి సర్కిల్ పరిధిలోని చీపురుపల్లి, గరివిడి మండల కేంద్రాల్లో ఒక్కక్కటి, నెల్లిమర్ల సర్కిల్ పరిధిలోని నెల్లిమర్ల మండల కేంద్రంలో ఒకటి, గజపతినగరం సర్కిల్ పరిధిలోని గజపతినగరం మండల కేంద్రంలో ఒకటి, బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామంలో ఒకటి, ఎస్.కోట సర్కిల్ పరిధిలోని ఎస్.కోట, కొత్తవలస మండల కేంద్రాల్లో ఒక్కొక్కటి, గంట్యాడ మండలం కొటారుబిల్లి జంక్షన్లో ఒక దుకాణం ఏర్పాటు చేయనున్నారు. అలాగే పార్వతీపురం డివిజన్లో బొబ్బిలి సర్కిల్ పరిధిలోని బొబ్బిలి, బలిజిపేట మండల కేంద్రాల్లో ఒక్కొక్కటి, తెర్లాం సర్కిల్ పరిధిలోని బాడంగి మండల కేంద్రంలో ఒకటి, సాలూరు సర్కిల్ పరిధిలోని సాలూరు మున్సిపాలిటీలో ఒకటి, రామభద్రాపురం మండల కేంద్రం లో ఒకటి ఏర్పాటు చేస్తారు. పార్వతీపురం సర్కిల్లో పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో ఒకటి, గరుగుబిల్ల మండలం ఉల్లిబద్రలో ఒక దుకాణం ఏర్పాటు చేయనున్నారు. -
రాష్ట్రంలో పారనున్న చీప్ లిక్కర్
వారంలోగా కర్ణాటక నుంచి రాష్ట్రానికి చవక మద్యం సాక్షి, హైదరాబాద్: నూతన మద్యం విధానం నేపథ్యంలో కొత్తగా రాష్ట్రంలో చీప్ లిక్కర్ పారనుంది. అయితే చీప్ లిక్కర్ కల్తీకి ఆస్కారం లేకుండా టెట్రా ప్యాకెట్లలో విక్రయించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు టెట్రా ప్యాకెట్లు తయారుచేసే యంత్ర పరికరం లేదు. రాష్ట్రంలోనే టెట్రా ప్యాకెట్లు తయారుచేయాలంటే కనీసం మూడు నెలలు పడుతుంది. ఈలోగా కర్ణాటకలో తయారుచేస్తున్న కంపెనీ.. టెట్రా ప్యాకెట్లలో చౌకమద్యం సరఫరాకు అంగీకరించిందని అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రప్రభుత్వం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తే సరిపోతుందన్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోగా టెట్రా ప్యాకెట్లలో చౌకమద్యం రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. ఒక్కో టెట్రా ప్యాకెట్ రూ.45 నుంచి రూ.50 వరకు ధర ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వమూ చౌకమద్యాన్ని అమల్లోకి తేనున్నందున ఆంధ్రప్రదేశ్‌లోనూ చౌకమద్యం తేవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పాయి. టెట్రా ప్యాకెట్లలో చౌకమద్యాన్ని అమల్లోకి తెస్తే కల్తీ మద్యం, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయాలను నిరోధించవచ్చనేది అధికారుల భావనగా ఉంది. ఇదిలాఉండగా ఒక్కో మద్యం దుకాణం తీసుకునే సరుకులో 25 శాతం మేరకు టెట్రా ప్యాకెట్లు ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. టెట్రా ప్యాకెట్లలో కల్తీకి అవకాశం లేనందున.. వాటిని తీసుకునేందుకు మద్యం దుకాణదారులు విముఖత వ్యక్తం చేస్తారనే భావనతోనే తప్పనిసరిగా 25 శాతం మేరకు తీసుకోవాలనే నిబంధన విధించినట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను ఏర్పాటుచేసి.. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా విక్రయాలు జరపనున్నందున ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బేవరెజెస్ కార్పొరేషన్‌ద్వారా 436 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్న విషయం తెలి సిందే. వీటిద్వారా వచ్చే ఆదాయంపై ఆదాయపు పన్ను భారం పడకుండా చర్యలకు ప్రభుత్వం నిర్ణయించింది. కాగా మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఆబ్కారీ కార్యాలయాలముందు దరఖాస్తుదారులు బారులు తీరారు. దరఖాస్తుల స్వీకరణ శనివారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అయితే భారీసంఖ్యలో దరఖాస్తుదారులు క్యూలో ఉండటంతో రాత్రి పొద్దుపోయే వరకు దరఖాస్తులు స్వీకరించారు. -
దరఖాస్తులు ఫుల్లు..
సాక్షి, గుంటూరు : జిల్లాలో నాలుగురోజులుగా జరుగుతున్న మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ చివరిరోజు శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళ, బుధవారాల్లో కేవలం 21 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అనూహ్యంగా శుక్ర, శని వారాల్లో రాజధాని ప్రాంతవాసులతోపాటు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాం తాల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. రద్దీ ఎక్కువగా ఉండడంతో అర్ధరాత్రి వరకు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాపారం అధికంగా ఉండే షాపులను ఎంచుకుని పోటీలు పడి దరఖాస్తులు చేస్తున్నారు. గుంటూరు నగరానికి చుట్టుపక్కల ఉన్న రాజధానిప్రాంతాలైన మంగళగిరి, పెదకూరపాడు, అమరావతి, ప్రత్తిపాడు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఉన్న షాపులకు దరఖాస్తులు అధికంగా వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రికి 241 షాపులకు 2,497 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రాజధాని ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణాలకు 50కు పైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో అత్యధికంగా దాచేపల్లి మండలం నడికుడి మద్యం దుకాణానికి శుక్రవారం రాత్రికే 109 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల గడువు ముగిసే సమయానికి ఈ షాపుకు 300కు పైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు వచ్చిన దరఖాస్తుల నుంచి ఎక్సైజ్ శాఖకు సుమారుగా రూ.8 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఇన్చార్జి డీసీ ఎం.ఆదిశేషు తెలిపారు. శనివారం దరఖాస్తుల గడువు ముగిసే సమయానికి గత ఏడాది కంటే అధికంగా 7వేల దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఎక్సైజ్ శాఖకు దరఖాస్తుల ద్వారా రూ.25 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. బారులు తీరిన దరఖాస్తు దారులు గుంటూరునగరంలోని మహిమ గార్డెన్స్‌లో జరుగుతున్న మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ల వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుండే దరఖాస్తు దారుల తాకిడితో క్యూలు కిటకిటలాడాయి. శనివారం అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. రాత్రి వరకు అందిన సమాచారం మేరకు అన్ని షాపులకు దరఖాస్తులు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రాజధానిప్రాంతంతోపాటు నరసరావుపేట డివిజన్లోని మద్యం దుకాణాలకు పోటీ ఎక్కువగా ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. నేడు దరఖాస్తుల పరిశీలన శనివారంతో దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో వచ్చిన దరఖాస్తులను ఆదివారం పరిశీలించనున్నారు. వీటిల్లో సక్రమంగా ఉన్నవాటిని గుర్తించి మిగతావి తిరస్కరిస్తారు. 29న నగరంలోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కలెక్టర్ కాంతిలాల్‌దండే ఆధ్వర్యంలో మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించనున్నారు. లాటరీలో మద్యం దుకాణాలు దక్కించుకున్నవారు లెసైన్సు ఫీజులో మూడో వంతు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జతచేసిన డీడీ రుసుముపోను మిగతా నగదు చెల్లిస్తే సరిపోతుంది. -
రాయల ఆంధ్రా బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటు
* 22న మద్యం దుకాణాల నోటిఫై * దరఖాస్తు ఫీజు పెంపు సాక్షి, హైదరాబాద్: నూతన మద్యం విధానం అమలు కోసం రాయల ఆంధ్రా బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటవనుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ చే సే వ్యాపారానికి ఆదాయపు పన్ను చెల్లించాలంటూ ఐటీ శాఖ నోటీసు జారీచేసిన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటుచేసే కార్పొరేషన్‌కు ఇది వర్తించకుండా చూడనున్నారు. ప్రస్తుతమున్నవాటిల్లో పది శాతం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తుండగా మిగతా 90 శాతాన్ని ప్రైవేట్ వారికి అప్పగిస్తారు. వాటిని సోమవారం నోటిఫై చేయనున్నారు. అప్పటి నుంచి దరఖాస్తుల దాఖలుకు వారం గడువిస్తారు. లాటరీద్వారా మద్యం దుకాణాల్ని కేటాయిస్తారు. ఈసారి దరఖాస్తు ఫీజును పెంచనున్నారు. ఆయా దుకాణాల టర్నోవర్‌నుబట్టి ఫీజును ఒక శాతం లేదా ఒకటిన్నర శాతం చేయనున్నారు. ప్రస్తుత దరఖాస్తు ఫీజు వల్ల ప్రభుత్వానికి రూ. 100 కోట్ల రాబడి వస్తుండగా... తాజా పెంపు వల్ల ఇది రూ. 500 కోట్లకు చేరుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నిర్వహించే దుకాణాల్లో ఒక్కో ఎక్సైజ్ కానిస్టేబుల్ చొప్పున నియమిస్తారు. మిగతా ఇద్దరు ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ విధానంలో నియమిస్తారు. -
రాష్ట్రంలో మద్య నిషేధం?
సాక్షి, చెన్నై: రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని అధికార పగ్గాలు లక్ష్యంగా రాష్ట్రంలో మద్యనిషేధం వైపుగా అన్నాడీఎంకే సర్కారు అడుగులు వేస్తున్నట్టుంది. దశల వారీగా నిషేధం అమల్లోకి తెచ్చే రీతిలో ప్రజల్ని మెప్పించేందుకు సిద్ధం అయింది. ఇందులో భాగంగా త్వరలో టాస్మాక్ మద్యం దుకాణాల పని వేళలు తగ్గబోతున్నాయి. ఇందుకు తగ్గ కసరత్తుల్లో అధికారులు నిమగ్నం అయ్యారు. రాష్ట్రంలో సుమారు ఏడు వేల మద్యం దుకాణాలు, ఆయా దుకాణాలకు అనుబంధంగా బార్లు ఉన్నాయి. అలాగే, స్టార్ హోటళ్లలోని బార్లకు ప్రభుత్వమే మద్యం సరఫరా చేస్తున్నది. మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏటా ఆదాయం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ ఆదాయం ఏడాదికి *25 వేలకోట్లు దాటింది. అదే సమయంలో ఈ మద్యం రక్కసి రూపంలో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తుందన్న విమర్శలు బయలు దేరాయి. అలాగే, పీఎంకే, ఎండీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, తమిళ మానిల కాంగ్రెస్‌లతో పాటు పలు పార్టీలు సంపూర్ణ మద్యనిషేధాన్ని అందుకుని పోరుబాట సాగిస్తున్నాయి. ఈ వ్యవహారంలో డిఎంకే మాత్రం ఆచీతూచి స్పందిస్తున్నది. రానున్న ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా సంపూర్ణ మద్య నిషేధం అమలు నినాదాన్ని అందుకుంటుందా అన్న ఎదురు చూపులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టడం లక్ష్యంగా దూసుకెళ్తోన్న అన్నాడీఎంకే సర్కారు తాము సైతం అన్నట్టుగా దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామన్న ప్రకటనను చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇందుకు తగ్గట్టుగా రాష్ర్టంలోని టాస్మాక్ మద్యం దుకాణాల పని వేళల్ని తగ్గించే కసరత్తులు ఆరంభం అయ్యాయి. తగ్గనున్న పనివేళలు : ప్రస్తుతం టాస్మాక్ మద్యం దుకాణాలు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తెరచి ఉంచుతున్నారు. ఈ పని వేళల్ని తగ్గించాలని ఓ వైపు అందులో పనిచేస్తున్న సిబ్బంది సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. దీనిని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నం అవుతోన్నది. పని వేళల్ని తగ్గించి కార్మికుల డిమాండ్లను పరిష్కరించినట్టుగా ఉండటంతో పాటుగా మద్య నిషేధం దశల వారీగా అమలు చేస్తామన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నది. శుక్రవారం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వర్గాలు టాస్మాక్ దుకాణాల పని వేళల తగ్గింపుపై సమీక్షించినట్టు సమాచారం. టాస్మాక్ కార్మిక సంఘాల ప్రతినిధులు, ఇతర సిబ్బందితో ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఉన్నారు. పని వేళల తగ్గింపు ద్వారా ఆదాయం ఏ మేరకు తగ్గ వచ్చు, ఆదాయాన్ని ప్రత్యామ్నాయంగా ఎలా భర్తీ చేయగలం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఉన్నారు. ఈ సమావేశం మేరకు మధ్యాహ్నం రెండు గంటలకు నుంచి రాత్రి పది గంటల వరకు టాస్మాక్ దుకాణాల పని వేళల్ని నిర్ణయించినట్టు సమాచారం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినానంతరం అధికార పూర్వకంగా పని వేళల తగ్గింపు ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు టాస్మాక్ వర్గాలు పేర్కొంటున్నాయి.