లెసైన్స్‌ల సత్యం బెట్టిదనిన..! | License issued by the delay would give the computer billing | Sakshi
Sakshi News home page

లెసైన్స్‌ల సత్యం బెట్టిదనిన..!

Published Sun, Sep 14 2014 4:17 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM

లెసైన్స్‌ల సత్యం బెట్టిదనిన..! - Sakshi

లెసైన్స్‌ల సత్యం బెట్టిదనిన..!

జిల్లాలో నడుస్తున్న మద్యం దుకాణాలు 388
వాటిలో లెసైన్స్‌లు ఇచ్చిన దుకాణాలు 30.. లేనివి 358
అయినా సిండికేట్ ద్వారా మద్యాన్ని ఏరులై పారుస్తున్న వైనం
కంప్యూటర్ బిల్లింగ్ ఇవ్వాల్సి వస్తుందనే లెసైన్స్‌ల జారీలో జాప్యం
 ‘‘ఆగస్టు ఒకటో తేదీ నుంచి హోలోగ్రామ్‌తో పాటు కంప్యూటరింగ్ బిల్లును ప్రతి మద్యం దుకాణంలో ఇవ్వాల్సిందే! లేదంటే ఒక్కబాటిల్ కూడా స్టాకు ఇచ్చే ప్రసక్తే లేదు.’’ ..జూలైలో ఎక్సైజ్ డీసీ సత్యప్రసాద్ అన్న మాటలు
సాక్షి, చిత్తూరు: ఆగస్టు పోయింది...సెప్టెంబరు నడుస్తోంది. మద్యం దుకాణాలకు సరుకు సరఫరా అవుతోంది. ఇంకో విషయమేమంటే జిల్లాలో నడుస్తున్న 388 మద్యం దుకాణాల్లో  లెసైన్స్‌లతో నడుస్తున్న దుకాణాలు కేవలం 30 మాత్రమే! తక్కినవన్నీ లెసైన్స్‌లు లేకుండా మద్యాన్ని ఏరులై పారి స్తున్నాయి. జిల్లాలో చిత్తూరు డివిజన్‌లో 192 దుకాణాలు ఉంటే అందులో 12 వాటికి మాత్రమే లెసైన్స్‌లు జారీ చేశారు. తిరుపతి డివిజన్‌లోని 196 షాపుల్లో 18 దుకాణాలకు లెసైన్స్‌లు ఇచ్చారు. తక్కినవన్నీ లెసైన్స్‌లు లేకుండా ఇష్టారాజ్యంగా నడుస్తున్నవే!
 
నిబంధనలు ఇవీ..

ప్రతీ మద్యం సీసాపై హోలోగ్రామ్ ఏర్పాటు చేయాలి. దానిపై ఒక సీరియల్ నెంబర్‌ను ముద్రిస్తారు. ఆ నెంబర్‌తో సీసాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తారు.
కొనుగోలుదారులకు సమాచారం ఇ చ్చేందుకు ఒక టోల్‌ఫ్రీ నెంబరు బాటిల్‌పై ఉంటుంది.  తాను కొన్న మద్యం సీసా గురించి తెలుసుకోవాలనుకునే కొనుగోలుదారుడు సీసాపై ఉన్న టోల్‌ఫ్రీ నెంబరుకు ఎస్‌ఎంఎస్ పంపితే చాలు.. క్షణాల్లో ఆ సీసా ఎప్పుడు? ఎక్కడ తయారు చేశారు? ఏ మద్యం గోదాము నుంచి వచ్చింది? ఏ దుకాణానికి అమ్మకం జరిగింది? అనే వివరాలు అతని ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తాయి.
అలాగే ప్రతి మద్యం దుకాణంలో ఆన్‌లైన్ కంప్యూటర్ బిల్లులు ఇచ్చేందుకు పరికరాలను ఏర్పా టు చేయాలి.
సూపర్‌మార్కెట్ తరహాలో కం ప్యూటర్ స్క్రాచ్ ద్వారా బిల్లువేసి, బిల్లు ప్రతిని కొనుగోలు దారుడికి అందజేయాలి. ఈ బిల్లు వివరాలు ఎప్పటికప్పు డు ఆన్‌లైన్‌లో ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి చేరుతుంటాయి.
 
నడుస్తున్నది ఇలా..
ప్రస్తుతం జిల్లాలోని ఏ మద్యం దుకాణంలో కూడా కంప్యూటర్ బిల్లు అ మలు కావడం లేదు. ఇది అమలైతే ప్రస్తుతం సిండికేట్ ద్వారా బాటిల్‌పై 5-15 రూపాయలు అధికంగా విక్రయించేందుకు అవకాశం ఉండదు. నకిలీ మద్యాన్ని కూడా విక్రయిం చేందుకు వీలు కాదు. ఇదే జరిగితే సిండికేట్ ద్వారా జిల్లావ్యాప్తంగా నెల కు వస్తున్న రూ.6.75 కోట్ల  అక్రమార్జనకు గండిపడుతుంది. దీంతో వీ రంతా కంప్యూటర్ బిల్లులకు సంబంధించిన మిషనరీలు కొనుగోలు చే సేందుకు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు.

కానీ అధికారులు మాత్రం కంప్యూటర్ బిల్లు మిషన్ 80-90వేల రూపాయలవుతుందని, అంత డబ్బు వె చ్చించి వాటిని కొనుగోలు చేసేం దుకు వ్యాపారులు విముఖత చూపుతున్నారని చెబుతున్నారు. సిండికేట్ ద్వారా ప్రతి నెలా 1.75లక్షల రూపాయలకు తక్కువ లేకుండా అక్రమార్జనతో జేబులు నింపుకుంటున్న మ ద్యం వ్యాపారులు 80 వెచ్చించడం పెద్ద లెక్కేం కాదు! కంప్యూటర్ బిల్లు లు ఇవ్వాల్సిందే లేదంటనే మద్యాన్ని సరఫరా చేయమని బీరాలు పలికిన ఆబ్కారీ అధికారులు ‘సిండికేట్’ చె ప్పినట్లు జీ..హుజూర్ అంటున్నారు. ఎందుకంటే వీరికి కూడా ప్రతినెలా ఠంఛనుగా మామూళ్లు ముట్టజెప్పుతున్నారు కాబట్టి వీరూ పట్టించుకోవడం లేదని ఓ ఎక్సైజ్ సీఐ ‘సాక్షి’తో తెలిపారు. దీంతో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం ఏరులై పా రుతోంది. మందుబాబుల జేబులు ఖాళీ అవుతున్నాయి. అయితే టోల్ ఫ్రీ నెంబరు మాత్రం పనిచేస్తోంది.
 
ఎక్సైజ్ డీసీ సత్యప్రసాద్ ఏమన్నారంటే..
లెసైన్స్‌ల విషయమై ఎక్సైజ్ డీసీ సత్యప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కో రగా ఇటీవలే జిల్లాలో 114 దుకాణాలకు ఇచ్చామన్నారు. ఇవి కూడా నా లుగు వారాల్లో కంప్యూటర్ బిల్లింగ్ మిషనరీని అమర్చుకుంటున్నామని లిఖితపూర్వక  హామీ ఇస్తే ఇచ్చామన్నారు. కంప్యూటర్ బిల్లింగ్ మిషన్ల సరఫరాలో జాప్యం జరుగుతోం దన్నారు. దీంతో జిల్లాకు రాలేదన్నా రు. దుకాణదారులతో హామీ ప త్రాలు తీసుకుని త్వరలోనే అందరికీ లెసైన్స్‌లు ఇస్తామని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement