మద్య నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మద్యం స్మగ్లింగ్ జరక్కుండా, నాటు సారా తయారీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.