జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలు పెట్టవద్దన్న తీర్పును సమీక్షించాలని కోరుతూ
న్యూఢిల్లీ: జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలు పెట్టవద్దన్న తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. నేడు తీర్పును వెలువరించనుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట 500 మీటర్ల లోపున మద్యం షాపుల్ని నిషేధించామని జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస ఎల్.నాగేశ్వర రావుల ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది.
మద్యం షాపులు తరలించమని కోరడమంటే రాష్ట్రాల మద్యం పాలసీని ప్రభావితం చేయడం కాదని, జాతీయ రహదారుల వెంట మద్యం దుకాణాల దూరానికి సంబంధించిన అంశం మాత్రమేనని ధర్మాసనం పేర్కొంది. జాతీయ రహదారులపై తాగి నడపడానికి స్వేచ్ఛ లేదని స్పష్టం చేసింది.