నల్లగొండ :కొత్త సంవత్సర వేడుకలు ఎక్సైజ్ శాఖకు భారీగా కలిసొచ్చింది. మద్యం ప్రియులు నూత న సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మద్యాన్ని ఏరులై పారించారు. డిసెంబర్ 31 అర్థరాత్రి వరకు మద్యం దుకాణాలు, బార్లు తెరిచి ఉంచడంతో మద్యం సంబ రాలు కోట్లకు పరుగులు తీశాయి. డిసెంబర్ 2013తో పోలిస్తే 2014 డిసెంబర్‌లో రూ.92 కోట్ల 64 లక్షల 75 వేల మద్యం అమ్మకాలు పెరిగాయి. అది కూడా డిసెం బర్ 31 నాడే 6 కోట్ల 48 లక్షలు ఒకేసారి పెరగటం విశేషం. అయితే సాధారణ రోజుల్లో మాత్రం మద్యం అమ్మకాలు రోజుకు రూ.4.50 కోట్లు ఉంటే డిసెంబర్ 31 నాడు మాత్రం అదనంగా రూ.కోటి 12 లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి.
జిల్లాలో 260 మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు 21 ఉన్నాయి. వీటి ద్వారా ఎక్సైజ్ శాఖకు డిసెంబర్ 2013 లో రూ. 77 కోట్ల 68 లక్షల 91 వేల ఆదాయం వస్తే, 2014 డిసెంబర్‌లో రూ.92 కోట్ల 64 లక్షల 75 వేల ఆదాయం వచ్చింది. మద్యం అమ్మకాల్లో బీర్లు 2013 డిసెంబర్‌లో 2,13,782 పెట్టెలు అమ్ముడుకాగా, 2014 డిసెంబర్‌లో 2,70,927 పెట్టెలు అమ్ముడైనాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి అన్ని కంపెనీల బీర్లు అందుబాటులో ఉండటంతో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. బీర్లకు దీటుగానే లిక్కర్ అమ్మకాలు కూడా జోరుగా సాగాయి. 2013తో పోలిస్తే 2014 లోనే లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. 2013 డిసెంబర్‌లో 1,39,100 పెట్టెలు అమ్ముడు కాగా 2014 డిసెంబర్‌లో 1,60,409 పెట్టెలు పెరిగాయి. నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ, రామన్నపేట, హుజూర్ నగర్, దేవరకొండ పట్టణాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి.
జిల్లాలో డిసెంబర్ 1 నుంచి 31 వతేదీ వరకు
జరిగిన లిక్కర్, బీర్ల అమ్మకాలు (స్టేషన్‌ల వారీగా)
2013 2014
స్టేషన్లు లిక్కర్ బీర్లు లిక్కర్ బీర్లు (పెట్టెలు)
నల్లగొండ 22,651 38,785 25,331 47,311
సూర్యాపేట 6,058 15,389 6,712 21,069
తుంగతుర్తి 11,044 22,756 12,657 25,773
నకిరేకల్ 5,762 9,451 5,579 11,158
చండూరు 5,562 7,913 6,141 9,361
భువనగిరి 16,595 16,185 20,660 26,436
రామన్నపేట 9,801 12,590 12,605 17,958
ఆలేరు 6,321 9,627 9,282 9,181
మోత్కూరు 4,562 6,271 6,000 9,817
మిర్యాలగూడ 13,061 22,726 14,597 28,607
హుజూర్‌నగర్ 9,938 12,661 10,470 15,444
కోదాడ 8,387 9,749 10,057 10,381
హాలియా 6,794 11,027 7,683 16,446
దేవరకొండ 9,280 12,942 9,464 17,307
నాంపల్లి 3,284 5,710 3,171 4,678
తెగ తాగేశారు..!
Published Fri, Jan 2 2015 2:50 AM | Last Updated on Thu, Jul 11 2019 8:44 PM
Advertisement
Advertisement