మామూళ్ల అందుతున్నాయో కూడా స్పష్టం చేస్తున్నారు. ఎమ్మార్పీకి మించి అధిక ధరలకు విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జీవన్‌సింగ్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే జిల్లాలో ఎమ్మార్పీకే విక్రయాలు జరపే చర్యలకు మాత్రం ఉపక్రమించలేదు.
అధిక ధరలపై పత్రికల్లో కథనాలు వచ్చినా, ప్రజాప్రతినిధులు ఏకంగా ఈ శాఖ మంత్రికే ఫిర్యాదు చేసినా అధికారులు తీరు మాత్రం ఇసుమంతైనా మారలేదు. ప్రతీ నెలా భారీగా మామూళ్లు వస్తుండటంతో, ఎవరు ఎన్ని అడ్డంకులు చెప్పినా అధికారులు మాత్రం ‘ఎమ్మార్పీ’ అంశంలో ఒక్కమెట్టు కూడా వెనక్కు తగ్గడం లేదు.
జిల్లాలో అక్రమ ఆదాయం ఇలా..:
జిల్లా వ్యాప్తంగా 233 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కో దుకాణంలో రోజూ సగటున 650 బాటిళ్లు(బీరుతో కలిపి)విక్రయిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై 10-15 రూపాయల అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో దుకాణానికి రోజుకు 6,500-9,750 రూపాయల చొప్పున నెలకు 1,95-2.92లక్షల రూపాయల అదనపు ఆదాయం వస్తోంది. అంటే 233 దుకాణాల ద్వారా ప్రతీ నెలా 4.54 నుంచి 6.81కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తోంది. చూసేందుకు 10-15 రూపాయలు చిన్న మొత్తమైనా ఇది ప్రతీ నెలా ఏస్థాయిలో వసూలవుతుందో పై లెక్కలు చూస్తే ఇట్టే తెలుస్తుంది.
ఎక్సైజ్ అధికారులకు మామూళ్లు ఇలా..:
అధిక ధరలకు విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇచ్చినందుకు ప్రతీ నెలా మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారులకు 41 వేల రూపాయల మామూళ్లు ముట్టజెపుతున్నట్లు కొందరు వ్యాపారులు చెబుతున్నారు. ప్రతీ నెలా..ఎక్సైజ్‌స్టేషన్‌కు 30 వేలు, స్క్వాడ్‌కు 6వేలు, ఈఎస్‌కు 5వేలు రూపాయలు ఇవ్వాలని చెబుతున్నారు. వీరంతా కలిసి ఇందులో కొంత జిల్లాలో ఆశాఖ ఉన్నతాధికారికి ముట్టజెపుతున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా దుకాణం పరిధిలోని ట్రాఫిక్, సాధారణ పోలీసులకు 15-20 వేల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు.
దీంతో పాటు బార్ అండ్ రెస్టారెంట్ కూడా మామూళ్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. వీరు ఎక్సైజ్ స్టేషన్‌కు 15 వేలు, స్క్వాడ్‌కు 3 వేలు, ఈఎస్‌కు 3 వేల రూపాయలు ఇస్తున్నట్లు కొందరు బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. గల్లాపెట్టె నింపుకునేందుకు మద్యం వ్యాపారులు, మామూళ్ల కోసం ‘వయోలేషన్’ను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారుల దెబ్బకు మద్యం బాబుల జేబులు గల్లవుతున్నాయి. పైగా ‘న్యూయర్’ సందర్భంగా విక్రయాలకు మరింత స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 31 రాత్రి మరింత అధిక ధరలకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. డాబాల్లో మద్యం విక్రయాలకు అనుమతి లేదు. అయినా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. రేపు రాత్రి కోసం ఇప్పటికే చాలాడాబాల్లో మద్యం కేసులను నిల్వ ఉంచుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు కూడా వీరి ‘గ్రీన్‌సిగ్నల్’ ఇచ్చినట్లు రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు.
డీసీ జీవన్ సింగ్ ఏమన్నారంటే:
‘‘ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. ‘వయోలేషన్’ను ఎక్సైజ్ అధికారులే ప్రోత్సహిస్తున్నారనే అంశంపై మీటింగ్ నిర్వహించి ఆరా తీస్తా!’’
మత్తు వదలరా!
Published Tue, Dec 30 2014 3:31 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement