ఎవరిని వరించేనో అదృష్టం
కడప అర్బన్ : మద్యం దుకాణాలు ఎవరికి దక్కుతాయో సోమవారం తేల నుంది. ఇందుకోసం దరఖాస్తుదారులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జిల్లా లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 2015-17 సంవత్సరాలకు గాను మొత్తం 269 షాపులను కేటాయించింది. వీటిలో 27 ప్రభుత్వ దుకాణాలు, 242 ప్రైవేటు దుకాణాలుగా నోటి ఫికేషన్‌లో పొందుపరిచారు. దరఖాస్తుల స్వీకరణ శని వారం రాత్రి వరకు కొనసాగింది. సోమవారం లాటరీ పద్ధతిలో మద్యం షాపుల లెసైన్స్‌లను కేటాయించనున్నారు.
ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎక్సైజ్ అధికారులు పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఆదివారం జెడ్పీ ఆవరణను పరి శీలించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ డి ప్యూటీ కమిషనర్ ప్రేమప్రసాద్, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కె.శ్రీనివాసాచారి, శంభుప్రసాద్, ఏఈఎస్ బాలక్రిష్ణన్, కడప ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్, ఒన్‌టౌన్ సీఐ కె.రమేష్, తమ సిబ్బందితో ఏర్పాట్లను పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్ ప్రేమ్‌ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని 242 ప్రయివేటు షాపులకు గాను 190 షాపులకు 2161 దరఖాస్తులు వ చ్చాయన్నారు.
వీటికి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు ప్రక్రియ ప్రా రంభమవుతుందన్నారు. ఇందుకోసం పకడ్బందీగా చర్యలు చేపడతామన్నా రు. ఒన్‌టౌన్ సీఐ కె.రమేష్ మాట్లాడు తూ ఎక్సైజ్ టెండర్ల ప్రక్రియ కోసం 120 పోలీసు సిబ్బందితో బందోబస్తు విధులను నిర్వర్తిస్తామన్నారు. వీరి లో ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, పది మంది ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొంటారన్నారు.
♦ కడప జెడ్పీ ఆవరణలో నిర్వహించనున్న మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియలో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
♦ ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ ముగిసేంత వరకు ట్రాఫిక్ స్టేషన్ నుంచి జెడ్పీకి వచ్చే దారి, ఐటీఐ సర్కిల్ నుంచి జెడ్పీకి వచ్చే దారి, వైఎస్ గెస్ట్‌హౌస్ నుంచి జెడ్పీకి వ చ్చే దారిలో ఎలాంటి వాహనాలు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేస్తారు.
♦ ప్రతి దరఖాస్తుదారునికి ఎక్సైజ్ వారు ఇచ్చే గుర్తింపు పత్రం ఉంటేనే అనుమతించనున్నారు.
143 దుకాణాలకే లాటరీ..
♦ జిల్లాలోని 242 ప్రయివేటు మద్యం షాపులకు గాను 190 షాపులకు 2161 దరఖాస్తులు వచ్చాయి.
♦ వీటిలో 47 మద్యం షాపులకు సింగిల్ దరఖాస్తు రావడంతో ఆయా దరఖాస్తుదారులకు షాపులను కేటాయిస్తారు.
♦ మిగిలిన 143 షాపులకు మాత్రమే లాటరీ పద్ధతి ద్వారా లెసైన్స్‌లను కేటాయించనున్నారు.
♦ 2161 దరఖాస్తుల ద్వారాప్రభుత్వాని కి రూ. 7.83 కోట్ల ఆదాయం వచ్చింది.
♦ షాపులకు రూ 76.36 కోట్లు ఆదా యం రానున్నట్లు అధికారులు అంచనా వేశారు.