గోవా మద్యం విక్రయ ముఠా గుట్టురట్టు  | Goa liquor sales gang arrested in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

గోవా మద్యం విక్రయ ముఠా గుట్టురట్టు 

Published Wed, Mar 30 2022 3:51 AM | Last Updated on Wed, Mar 30 2022 3:51 AM

Goa liquor sales gang arrested in Andhra Pradesh - Sakshi

స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను చూపుతున్న ఎస్పీ విజయారావు, సెబ్‌ జేడీ శ్రీలక్ష్మి

నెల్లూరు (క్రైమ్‌): గోవా మద్యం బాటిళ్లకు ఏపీ మద్యం లేబుల్స్‌ను అతికించి.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న ముఠా గుట్టును నెల్లూరు సెబ్‌ అధికారులు రట్టు చేశారు. 8 మందిని అరెస్టు చేసి.. రూ.23 లక్షల విలువ చేసే గోవా మద్యాన్ని, ఓ కారు, నకిలీ లేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయారావు, సెబ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కె.శ్రీలక్ష్మితో కలిసి మంగళవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నెల్లూరు హరనాథపురంలో నివాసం ఉంటున్న చీమల విజయభాస్కర్‌రెడ్డి తన స్నేహితులతో కలిసి ఈ నెల 22న గోవా నుంచి తారు ట్యాంకర్‌లో భారీగా మద్యం సీసాలను నెల్లూరు నగరానికి తీసుకొచ్చారు.

బాటిళ్లకు గోవా లేబుల్స్‌ను తొలగించి ఏపీ మద్యం నకిలీ లేబుల్స్‌ను అతికించి అనంతసాగరం, చిలకలమర్రితో పాటు మరో రెండు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందటంతో సెబ్‌ అధికారులు ఈ నెల 28న మాగుంట లేఅవుట్‌లో వాహన తనిఖీలు నిర్వహించి, ఓ కారులో 793 క్వార్టర్‌ బాటిళ్ల గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దర్ని అరెస్ట్‌ చేశారు. విచారణలో వారిచ్చిన సమాచారం మేరకు నిందితుల ఇళ్లపై దాడులు నిర్వహించి 17,808 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8 మందిని అరెస్టు చేయగా.. మరో 6 మంది పరారీలో ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement