స్వాతంత్య్రయోధుడి ఆత్మహత్యాయత్నం | Freedom fighter commit to suicide | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్రయోధుడి ఆత్మహత్యాయత్నం

Published Thu, Jun 16 2016 1:24 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

స్వాతంత్య్రయోధుడి ఆత్మహత్యాయత్నం - Sakshi

స్వాతంత్య్రయోధుడి ఆత్మహత్యాయత్నం

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లో పూర్తి మద్య నిషేధం విధించాలంటూ ఓ స్వాతంత్య్ర సమరయోధుడు  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 97 ఏళ్ల చిమ్మాన్‌లాల్ జైన్ ఏడాదిగా మద్య నిషేధం కోసం పోరాడుతున్నారు. ‘మద్యం అమ్మకాలపై నిషేధం విధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయింది. కాబట్టి నిరసనగా కదిలే రైలు కింద పడి చనిపోదామని ప్లాట్‌ఫాంపైకొచ్చా.

పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. మళ్లీ అవకాశం వచ్చినపుడు తప్పకుండా ఆత్మహత్య చేసుకుంటాను’ అని జైన్ అన్నారు. గతంలోనూ మూడుసార్లు  జైన్ ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement