9న మద్యం దుకాణాల టెండర్‌ నోటిఫికేషన్‌ | Tender Notification For Liquor Stores Would Be On 9th October In Telangana | Sakshi
Sakshi News home page

9న మద్యం దుకాణాల టెండర్‌ నోటిఫికేషన్‌

Published Tue, Oct 8 2019 4:31 AM | Last Updated on Tue, Oct 8 2019 4:31 AM

Tender Notification For Liquor Stores Would Be On 9th October In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణకు ఈ నెల 9న టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం నవంబర్‌ 1న కొత్త మద్యం దుకాణాల నిర్వహణకు ఈ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. దీని ప్రకారం ఈ నెల 9 నుంచి 16 వరకు కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 13వ తేదీ ఆదివారం దరఖాస్తులు తీసుకోరు. జిల్లా ఆబ్కారీ శాఖ కార్యాల యాలతోపాటు హైదరాబాద్, నాంపల్లిలోని ఆబ్కారీ కార్యాలయంలోని రెండో ఫ్లోర్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 18న డ్రా ద్వారా షాపులు కేటాయించనున్నారు. ఈ నెల 30లోపు కొత్త మద్యం దుకాణాల యజమానులకు లైసెన్స్‌లు అందజేసి నవంబర్‌ 1 నుంచి కొత్త యాజమాన్యాల ఆధ్వర్యంలో మద్యం విక్రయిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement