* 22న మద్యం దుకాణాల నోటిఫై
* దరఖాస్తు ఫీజు పెంపు
సాక్షి, హైదరాబాద్: నూతన మద్యం విధానం అమలు కోసం రాయల ఆంధ్రా బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటవనుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ చే సే వ్యాపారానికి ఆదాయపు పన్ను చెల్లించాలంటూ ఐటీ శాఖ నోటీసు జారీచేసిన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటుచేసే కార్పొరేషన్‌కు ఇది వర్తించకుండా చూడనున్నారు.
ప్రస్తుతమున్నవాటిల్లో పది శాతం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తుండగా మిగతా 90 శాతాన్ని ప్రైవేట్ వారికి అప్పగిస్తారు. వాటిని సోమవారం నోటిఫై చేయనున్నారు. అప్పటి నుంచి దరఖాస్తుల దాఖలుకు వారం గడువిస్తారు. లాటరీద్వారా మద్యం దుకాణాల్ని కేటాయిస్తారు. ఈసారి దరఖాస్తు ఫీజును పెంచనున్నారు. ఆయా దుకాణాల టర్నోవర్‌నుబట్టి ఫీజును ఒక శాతం లేదా ఒకటిన్నర శాతం చేయనున్నారు.
ప్రస్తుత దరఖాస్తు ఫీజు వల్ల ప్రభుత్వానికి రూ. 100 కోట్ల రాబడి వస్తుండగా... తాజా పెంపు వల్ల ఇది రూ. 500 కోట్లకు చేరుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నిర్వహించే దుకాణాల్లో ఒక్కో ఎక్సైజ్ కానిస్టేబుల్ చొప్పున నియమిస్తారు. మిగతా ఇద్దరు ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ విధానంలో నియమిస్తారు.
రాయల ఆంధ్రా బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటు
Published Sat, Jun 20 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM
Advertisement
Advertisement