పురందేశ్వరి ‘సిండికేట్‌’ రాజకీయం | Purandeshwari Syndicate Politics: andhra pradesh | Sakshi
Sakshi News home page

పురందేశ్వరి ‘సిండికేట్‌’ రాజకీయం

Published Sun, Oct 15 2023 3:56 AM | Last Updated on Sun, Oct 15 2023 10:42 AM

Purandeshwari Syndicate Politics: andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్యం సిండి‘కేట్ల’ను తరిమికొట్టారు. మద్యపాన నియంత్రణకు గట్టి చర్యలు చేపట్టారు. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను, అడుగడుగునా వెలసిన బెల్టు షాపు­లను తుదముట్టించి సిండికేట్ల నడుం విరగ్గొట్టారు. ఇప్పుడు మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహి­స్తోంది. వాటి సంఖ్యను కూడా భారీగా తగ్గించింది. దీంతో రాష్ట్ర ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్య పరంగా పీల్చి పిప్పిచేస్తున్న మద్యం సిండికేట్లు కుదేల­య్యా­యి.

ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించి, మద్యం సిండి­కేట్ల ప్రయోజనాలే పరమార్థంగా పనిచేసే ఈ విప­క్షాలు, పత్రికలకు ఈ పరిణామం కంటగింపుగా మారింది. తమకు ఆదాయాన్ని పంచే మద్యం సిండికేట్ల కోసం అవి రంగంలోకి దిగాయి. కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పైన దుష్ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో దుష్ప్ర­చారాన్ని తీవ్రతరం చేశాయి. మద్యం సిండికే­ట్లకు కొమ్ముకాసిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర­బాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి అరెస్ట­య్యారు.

దీంతో మద్యం సిండికేట్ల బాధ్యతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షు­రాలు దగ్గు­బాటి పురందేశ్వరి నెత్తిన ఎత్తుకు­న్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇందు­కు అనుగు­ణంగా ఆమె మాటలు, చర్యలు ఉన్నాయని విశ్లేష­కులు చెబుతున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన పురందే­శ్వరి ఆ పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెడుతూ.. కుటుంబం, మద్యం సిండికేట్‌ల కోసం పనిచేస్తున్నా­రని స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మద్యం దుకాణాలు, డిస్టిలరీల విషయంలో ప్రభు­త్వా­నికి, సీఎం వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా దుష్ప్ర­చారం చేస్తున్నారని రాజకీయ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో డిస్టిలరీలన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వాల్లో ఏర్పాటయినవే. 20 డిస్టిలరీల్లో 12 చంద్రబాబు సీఎంగా ఉండగా అను­మ­తిచ్చినవే. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజారోగ్యం దృష్ట్యా ఒక్క డిస్టిలరీకి కూడా అను­మతి ఇవ్వలేదు. ఈ వాస్తవాలను విస్మరించి, పురందేశ్వరి అసత్య ప్రచారానికి దిగారు. ఇది కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమేనన్నది సుస్పష్టం.

బీజేపీ సిద్ధాంతానికి తిలోదకాలు
నేషన్‌ ఫస్ట్‌–పార్టీ నెక్ట్స్‌–సెల్ఫ్‌ లాస్ట్‌ (దేశం తొలి ప్రాధాన్యత–పార్టీ మలి ప్రాధాన్యత–వ్యక్తిగత ప్రయోజనాలు ఆఖరు) అనేది బీజేపీ సిద్ధాంతం. కానీ, ఆ పార్టీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బీజేపీ సిద్ధాంతానికి తిలోదకా­లిచ్చారు. పార్టీ కంటే సొంత కుటుంబ ప్రయోజ­నాలకే ప్రాధా­న్యత ఇచ్చేలా ఆమె చర్యలు ఉన్నాయని బీజేపీ నేతల్లోనే చర్చ సాగుతోంది. ఆమె రాష్ట్ర పార్టీ బాధ్య­తలు చేపట్టిన తర్వాత పార్టీ ప్రయోజ­నా­లకంటే కుటుంబ ప్రయోజనాల కోసమే కార్యక్ర­మాలు చేస్తున్నా­రని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఒక­ప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కుటుంబ సభ్యు­లపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ మోదీకి, బీజేపీకి దగ్గరయ్యేందుకు తీవ్ర ప్రయ­త్నాలు చేస్తు­న్నారు. అదే పురందేశ్వరి ఎన్టీఆర్‌ నాణెం ముద్రణ పేరుతో ప్రత్యేక కార్యక్ర­మం చేపట్టి, అ కార్యక్రమంలో చంద్ర­êబును, బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఆహ్వానించి, వారి మధ్య సయోధ్యకు ప్రయత్నించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఎన్టీఆర్‌పైనా ఇదే తీరు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు ముఖ్య­మంత్రిగా ఉన్న సమయంలో సంపూర్ణ మద్య నిషేధం విధించడంతో మద్యం సిండికేట్లకు అడ్డుకట్ట పడింది. ఈ సిండికేట్లకు మద్దతుగా అప్పట్లో చంద్ర­బాబు తదితరులు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, ఆయన ప్రభుత్వాన్ని కూలదోశారు. ఆ వెంటనే చంద్ర­బాబు సీఎం పీఠమెక్కారు. సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచారు.

మళ్లీ సిండికేట్ల రాజ్యం వచ్చింది. ఇబ్బడిముబ్బడిగా మద్యం దుకా­ణాలు వెలిశాయి. వీధికో బెల్టు షాపు వచ్చింది. వేయి తలల మద్య రక్కసి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని చిదిమేసింది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో, ఆ తర్వాత చంద్రబాబు పీఠాన్ని అధిష్టించడంలో దగ్గుబాటి పురందేశ్వరికి కూడా∙భాగస్వామ్యం ఉందని అప్పట్లో టీడీపీ వర్గాలే చెప్పాయి. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో ఆమె ఎక్కడా దానిని వ్యతిరేకించలేదని ఆ వర్గాలు తెలి­పాయి.

ఈ వెన్నుపోటు రాజకీయం, సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడవ­డంలో చంద్రబాబుకు సహకరించిన కొన్ని పత్రికలే ఇప్పుడు రాష్ట్రంలో మద్యపాన నియంత్రణ చర్యలు చేపట్టిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపైనా అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఆ పత్రికల కథనాలను అనుసరిస్తూ పురందేశ్వరి ఇప్పుడు ఏకంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాజీ­నామా చేయాలని డిమాండ్‌ చేసే స్థాయికి వచ్చారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

చంద్రబాబు అవినీతిపై ప్రధాని మోదీ ఆరోపణలు చేసినా..
రాష్ట్రానికి 2014–19 మధ్య సీఎంగా పనిచేసిన చంద్రబాబు అవినీతిపై స్వయంగా ప్రధాని మోదీనే అనేక ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజె­క్టును చంద్రబాబు ఏటీఎంలా మార్చుకు­న్నా­­రని ప్రధాని అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పట్లో వచ్చిన అనేక ఆరోపణల్లో ఒక­టైన స్కిల్‌ స్కామ్‌లో సీఐడీ అధికారులు చంద్ర­బాబును అరెస్టు చేయగానే, ఆ అరెస్టును తప్పు పడుతూ టీడీపీ నాయకులకంటే ముందే పురందేశ్వరి సామాజిక మా«ధ్యమాల్లో ఖండించారు.

రెండు రోజుల క్రితం లోకేశ్‌ ఢిల్లీలో అమిత్‌ షాను కలిస్తే.. ఆ భేటీ వివరాలు, ఫొటోలను కూడా లోకేశ్‌కంటే అరగంట ముందే పురందేశ్వరి ట్వీట్‌ చేశారు. ఇరువురి భేటీ వివరాలను పురందేశ్వరి సూచన మేరకు బీజేపీ రాష్ట్ర మీడియా విభాగం మీడియా ప్రతినిధులకూ వెంటనే తెలియజేసింది. అవినీతిపరుడని స్వయంగా ప్రధానే ఆరోపించిన చంద్ర­బాబు విషయంలో పురందేశ్వరి ఇలా వ్యవహరిస్తే బీజేపీ దెబ్బతినడం ఖాయ­మని ఆ పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బీజేపీని బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాల్సిన పురందేశ్వరి కీలక ఎన్నికల సమయంలో టీడీపీ ఆడే డ్రామాలో పావుగా మారారని, వచ్చిన అవకాశాలను కూడా∙చేజేతులా నిర్వీర్యం చేస్తు­న్నా­రని ఆ పార్టీ సీనియర్‌ నేతలు ధ్వజ­మెత్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలందరూ పూర్తి నైరాశ్యంలో ఉన్నారని, వారిలో కొందరు బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని పురందేశ్వరి వినియోగించుకోకపోగా, టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారా.. అనే అనుమానం కలిగేలా  వ్యవహరిస్తున్నారని అంటున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement