Purandesvari
-
దేశాన్నే ఆశ్చర్యపరిచిన బాబు తెలివి తేటలు
-
చేతులు కాలాక ‘సిట్’!
సాక్షి, అమరావతి: ఎన్నికల హింసపై ఎన్నికల కమిషన్ (ఈసీ) వ్యవహరిస్తున్న తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది! రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాకాండకు ఏకైక కారణం రాజకీయ ఒత్తిళ్లతో పోలీస్ ఉన్నతాధికారులను ఈసీ ఏకపక్షంగా బదిలీ చేయడమే! ఆ స్థానంలో వచ్చిన అధికారులకు క్షేత్రస్థాయి పరిస్థితులపై సరైన అవగాహన లేకపోవడంతోపాటు పచ్చముఠాల ఆగడాలను ఉపేక్షించడం వల్ల భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో నష్ట నివారణ చర్యలకు దిగిన ఈసీ ఆదేశాల మేరకు హింసాత్మక ఘటనలపై విచారణకు శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటైంది. ఎస్ఐబీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 13 మంది పోలీసు అధికారులతో ఏర్పాటైన ‘సిట్’ రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై ‘సిట్’ దర్యాప్తు చేయనుంది. హింస చెలరేగడంలో పోలీసు అధికారుల పాత్రను కూడా ‘సిట్’ నిగ్గు తేల్చనుంది. ఆయా చోట్ల నమోదు చేసిన కేసులు, విచారణ తీరుతెన్నులపై పరిశీలించి వాస్తవాలు తేల్చాలని సిట్‌కు స్పష్టం చేసింది. అదనపు సెక్షన్లు, అవసరమైతే కొత్త ఎఫ్ఐఆర్ల నమోదును సూచించాలని పేర్కొంది. ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు సిట్ విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. అనుకూల అధికారుల అండతో..‘సిట్’ ఏర్పాటు చేసి నష్టనివారణ చర్యలకు దిగేలా పరిస్థితులు మారడానికి ఈసీ తీసుకున్న నిర్ణయాలే ముఖ్య కారణంగా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తిళ్లకు తలొగ్గి ఎడాపెడా పోలీస్ అధికారులను మార్చేసి, వారి సూచనల మేరకు ఈసీ నియామకాలు చేపట్టింది. అనుకూల అధికారుల అండ చూసుకుని పల్నాడు, రాయలసీమతో పాటు ఇతర ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి.వైఎస్సార్సీపీ నాయకులు, ఆ పార్టీకి ఓటు వేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. పరిస్థితులు చేయి దాటాక ఈసీ మేల్కొంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా అనంతపురం, పల్నాడు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. మూడు జిల్లాల్లో 12 మంది పోలీసులపై సస్పెన్షన్ కొరడా ఝుళిపించింది. ఈ క్రమంలో సిట్ ఏర్పాటైంది. మొత్తం వ్యవహారంలో ఈసీ తీరు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో చెలరేగిన హింస, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఈసీ పక్షపాత వైఖరి ఫలితమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు.ఒత్తిళ్లకు తలొగ్గి ఉదాశీనత..గత ఐదేళ్లుగా అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన అందించారు. ప్రజాదరణ కోల్పోయి దిక్కుతోచని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏం చేయాలో పాలుపోక దుష్ప్రచారాలతో పేట్రేగిపోయింది. ఎన్ని కుట్రలు చేసినా ప్రజాదరణ దక్కకపోవడంతో పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెద్ద ఎత్తున హింసకు చంద్రబాబు ప్రణాళిక రచించారు. ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పట్టున్న సమర్థులైన పోలీసు అధికారులు ఉంటే తమ పన్నాగాలు పనిచేయవని పసిగట్టి నిరాధాణ ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదులు చేశారు. పురందేశ్వరి సహకారంతో పల్నాడు, ప్రకాశం, తిరుపతి తదితర జిల్లాల్లో ఎవరిని నియమించాలో కూడా సూచిస్తూ ఏకంగా జాబితాను అందచేశారు. పచ్చముఠా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి డీజీపీ, నిఘా విభాగం ఇన్‌చార్జ్‌తో పాటు పలువురు డీఐజీ, ఎస్పీలను ఈసీ పక్కనపెట్టింది. టీడీపీతో సత్సంబంధాలున్న వారిని రాజకీయ ఒత్తిళ్లతో అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో నియమించింది. పల్నాడు ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్‌ను నియమించడమే ఇందుకు నిదర్శనం. ఈ అధికారి నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. ఈ పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీకి గట్టి పట్టు ఉంది. 2019లో ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు స్థానాలను పార్టీ స్వీప్ చేసింది. దీంతో అధికార పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా జరగకుండా నిలువరించేలా కృష్ణదేవరాయలు స్కెచ్ వేశారు. క్షేత్రస్థాయిలో తన సామాజికవర్గానికి చెందిన వారిని నియమించుకుని పల్నాడులో అరాచకానికి కృష్ణదేవరాయలు ముఖ్యకారణమయ్యారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చోద్యం చూసిన అధికారులు..అనుకూల అధికారి అండ చూసుకుని పల్నాడులోని నరసరావుపేట, మాచర్ల, గురజాల, కొత్త గణేశునిపాడులో టీడీపీ రౌడీ మూకలు రెచ్చిపోయాయి. పెట్రోలు బాంబులు, వేట కొడవళ్లు, బరిసెలు, బాకులు, ఇనుప రాడ్లతో స్వైర విహారం చేశాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, ఆ పార్టీకి ఓటు వేసినట్లు భావించిన వారిపై యథేచ్ఛగా దాడులకు తెగబడ్డాయి. ఇంత జరుగుతున్నా పల్నాడు ఎస్పీ బిందు మాధవ్‌తోపాటు ఆయన ఆధ్వర్యంలోని డీఎస్పీలు, సీఐలు చోద్యం చూశారు. టీడీపీ మూకల నుంచి తమకు, ప్రజలకు రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఫోన్లు చేసినా పోలీసులు పెడచెవిన పెట్టారు.సీమలో వివాదాస్పదంఅనంతపురం జిల్లాలో కొందరు పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. పోలింగ్‌కు ముందు ఈ జిల్లాకు అమిత్ బర్దర్‌ను ఎస్పీగా నియమించారు. తొలి నుంచి ఆయన టీడీపీకి కొమ్ముకాశారు. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనంలో రూ.2 కోట్లు లభ్యమైతే కేసు నమోదు చేయకుండా తాత్సారం చేయడం ఆయన పచ్చపాత వైఖరికి నిదర్శనం. ఎన్నికల రోజు తాడిపత్రిలో టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి, దీపక్‌రెడ్డి పోలింగ్ కేంద్రాల్లో చొరబడి అక్రమాలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసంపై టీడీపీ గూండాలు రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలను నియంత్రించడంలో ఎస్పీ విఫలమయ్యారు. మరోవైపు పోలీసులు పెద్దారెడ్డి నివాసంలోకి చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారు. వారి చర్యలు సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా ముందుగానే ధ్వంసం చేసిన ఫుటేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరుపతి జిల్లాలో చంద్రగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేసి ఆయన వాహన శ్రేణిలోని వాహనానికి నిప్పుపెట్టారు. ఇక్కడ కూడా అల్లర్లను కట్టడి చేయడంలో ఈసీ నియమించిన పోలీసు అధికారులు దారుణంగా విఫలమయ్యారు.13 మందితో ‘సిట్’సాక్షి, అమరావతి: ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై విచారణకు ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేసింది. ఎస్ఐబీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 13 మంది పోలీసు అధికారులతో ఏర్పాటైన ‘సిట్’ పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసపై విచారణ జరిపి రెండు రోజుల్లో ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో డీజీపీ ఆదేశించారు.‘సిట్’ సభ్యులు...1. రమాదేవి, ఎస్పీ, ఏసీబీ2. సౌమ్యలత, ఏఎస్పీ, ఏసీబీ3. రమణమూర్తి, డీఎస్పీ, ఏసీబీ, శ్రీకాకుళం4. పి.శ్రీనివాసులు, డీఎస్పీ, సీఐడీ5. వి.శ్రీనివాసరావు, డీఎస్పీ, ఏసీబీ, ఒంగోలు6. రవి మనోహరా చారి, డీఎస్పీ, ఏసీబీ, తిరుపతి7. వి.భూషణం, ఇన్స్పెక్టర్, గుంటూరు రేంజి8. కె.వెంకట్రావు, ఇన్స్పెక్టర్, ఇంటెలిజెన్స్, విశాఖ9. రామకృష్ణ, ఇన్స్పెక్టర్, ఏసీబీ10. జీఎల్ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్, ఏసీబీ11. మొయిన్, ఇన్స్పెక్టర్, పీటీసీ, ఒంగోలు12. ఎన్.ప్రభాకర్, ఇన్స్పెక్టర్, ఏసీబీ, అనంతపురం13. శివప్రసాద్, ఇన్స్పెక్టర్, ఏసీబీ -
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి
విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతున్నారని వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబు అండ్ కొ సంఘ విద్రోహులని మండిపడ్డారామె.బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎన్టీఆర్ వెన్నుపోటులో పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించింది. నేతి బీరకాయలో నెయ్యి లాంటిది పురందేశ్వరి మంచితనం. పురందేశ్వరి కూడా చంద్రబాబు లాంటి మనిషే. ఎఫ్ఐఆర్లో వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం ఏమిటి..?. వీరందరినీ చంద్రబాబు ఆడిస్తున్నారు. రాజకీయ నీచుడు చంద్రబాబు. చంద్రబాబు కంటే సీఎం జగన్ అధిక పెట్టుబడులు తీసుకొచ్చారు. ఏపీ అభివృద్ధిలో విశాఖ కీలకం. ఏం మాట్లాడాలో అర్ధంకాక బాబు ఇచ్చిన స్క్రిప్ట్ మోదీ చదివారు. సీఎం జగన్‌ను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి అంటే సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రావాలి. నేను రాష్ట్రం మొత్తం తిరిగాను. గీతం మూర్తి ఎన్టీఆర్ వెన్నుపోటులో కీలక పాత్ర పోషించిన దుర్మార్గుడు. గీతం భరత్‌ను ఓడించాలి. గీతం అంటేనే భూ కబ్జాలు. ఏయూను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతోనే గీతంను అభివృద్ధి చేశారు’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. -
తండ్రికి తిండి పెట్టని ఘనత పురందేశ్వరిది
సాక్షి ,అమరావతి: ఎన్టీఆర్ ఇంటికి పది అడుగుల దూరంలో ఉండికూడా ఆయనకు ఏనాడు ఒక్క ముద్ద కూడా అన్నం పెట్టని ఘనత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిదని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వయసు మీరిన సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుతో కలిసి అధికారాన్ని లాక్కున్న పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు చివరకు ఆయనను నిర్దాక్షిణ్యంగా కిందకు లాగి పడేశారని ధ్వజమెత్తారు. శత్రువుకు కూడా ఇలాంటి కూతుళ్లు పుట్టాలని ఎవరూ కోరుకోరని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రిగా చేసిందేమిటి! ఎనిమిదేళ్లపాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన పురందేశ్వరి డబ్బు వ్యామోహంతో వ్యవహరించడం తప్ప దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. మానవ వనరుల, వాణిజ్య శాఖల సహాయ మంత్రిగా ప్రజలకు పనికొచ్చే ఏ చిన్న పని కూడా ఆమె చేయలేదన్నారు. ఆమె దృష్టంతా పైరవీలు, సంపాదనపైనే పెట్టారని పేర్కొన్నారు. పురందేశ్వరి ఎప్పుడూ కులం, కుటుంబం చుట్టే రాజకీయాలు చేస్తారన్నారు. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఆమె ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే అని.. ఆమె అంతిమ లక్ష్యం కుల ఉద్ధరణేనని పేర్కొన్నారు. పురందేశ్వరికి సిద్ధాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజ హితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏవీ లేవని మండిపడ్డారు. పురందేశ్వరి ఒకసారి పోటీ చేసిన స్థానం నుంచి మళ్లీ బరిలోకి దిగరన్నారు. వైఎస్సార్ హవాలో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై బాపట్ల, విశాఖపట్నంలో బయటపడ్డారని, బీజేపీలో చేరాక రాజంపేట నుంచి పోటీ చేసి 1.75 లక్షల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. -
‘మద్యం’పై మాట్లాడే అర్హత పురందేశ్వరికి లేదు
పుత్తూరు రూరల్: మద్యం పాలసీపై మాట్లాడే అర్హత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి లేదని డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి అన్నారు. ఆదివారం తిరుపతి జిల్లా పుత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం తీసుకొస్తే.. ఆయన స్థాపించిన పార్టీని చంద్రబాబు లాక్కుని మద్య నిషేధం ఎత్తివేసినప్పుడు పురందేశ్వరి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పాలించిన 2014–19 కాలంలోనే ఏకంగా 7 డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. 2019లో ఏర్పడిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఒక్క డిస్టలరీకి గానీ, ఒక్క బ్రూవరీకి గాని అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. పీఎంకే డిస్టలరీ యనమల రామకృష్ణుడిదని, శ్రీకృష్ణ డిస్టలరీ ఆదికేశవులనాయుడిదని, స్పై డిస్టిలరీ ఎస్పీవై రెడ్డిదని, విశాఖ డిస్టిలరీ అయ్యన్నపాత్రుడిదని వివరించారు. ఇప్పుడున్న ప్రతి బ్రాండు చంద్రబాబు పాలనలో తీసుకొచ్చినవే అని, అందుకే వాటిని ‘సీ’ బ్రాండ్లు అంటున్నారని తెలిపారు. కేజీహెచ్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో నెలకు సుమారు 20 మంది పాడైన లివర్, పాంక్రియాస్ రోగులు అడ్మిట్ అవడమనేది పదేళ్లుగా జరుగుతున్న విషయమేనని స్పష్టం చేశారు. మద్యపానం చేస్తే లివర్ చెడిపోవచ్చు బ్రాండుతో సంబంధం లేకుండా మద్యాన్ని 8 నుంచి 10 ఏళ్ల పాటు తీసుకుంటే లివర్ చెడిపోవచ్చని మంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. దేశంలోనే మద్యం సేవించే వారి సంఖ్య 15 శాతానికి పెరిగిందని నిమ్హాన్స్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. చంద్రబాబు పాలనలో మద్య నిషేధాన్ని ఎత్తివేయడాన్ని సమర్థిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు రాశాయని గుర్తు చేశారు. చంద్రబాబు తన అనుచర గణానికి 4,378 మద్యం షాపులను కట్టబెట్టడమే కాకుండా, 43 వేల బెల్ట్ షాపులు పెట్టి మద్యపానాన్ని ఏరులై పారించారని గుర్తు చేశారు. అందుకే పురందేశ్వరి మద్యం పాట పాడుతోంది పురందేశ్వరి తన మరిది చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ను కాపాడేందుకే మద్యం పాట పాడుతున్నారని మంత్రి నారాయణస్వామి ఎద్దేవా చేశారు. పురందేశ్వరి బీజీపీ అధ్యక్షురాలా? టీడీపీ అధ్యక్షురాలా అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుతో కలిసి పురందేశ్వరి, ఆమె భర్త సైతం ఎన్టీఆర్ మృతికి కారకులయ్యారని, ఎన్టీఆర్ కూతురుగా చెప్పుకోవడానికి ఆమెకు అర్హత లేదని పేర్కొన్నారు. చంద్రబాబు ఆర్థిక నేరస్తుడని తొలిసారిగా చెప్పింది దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని.. ఆ తరువాత చెప్పింది పవన్‌కళ్యాణ్ అని గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్ట్ న్యాయపరంగానే జరిగిందని రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేక స్పందన రాలేదన్నారు. -
పురందేశ్వరి ‘సిండికేట్’ రాజకీయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యం సిండి‘కేట్ల’ను తరిమికొట్టారు. మద్యపాన నియంత్రణకు గట్టి చర్యలు చేపట్టారు. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను, అడుగడుగునా వెలసిన బెల్టు షాపులను తుదముట్టించి సిండికేట్ల నడుం విరగ్గొట్టారు. ఇప్పుడు మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. వాటి సంఖ్యను కూడా భారీగా తగ్గించింది. దీంతో రాష్ట్ర ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్య పరంగా పీల్చి పిప్పిచేస్తున్న మద్యం సిండికేట్లు కుదేలయ్యాయి. ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించి, మద్యం సిండికేట్ల ప్రయోజనాలే పరమార్థంగా పనిచేసే ఈ విపక్షాలు, పత్రికలకు ఈ పరిణామం కంటగింపుగా మారింది. తమకు ఆదాయాన్ని పంచే మద్యం సిండికేట్ల కోసం అవి రంగంలోకి దిగాయి. కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పైన దుష్ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో దుష్ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి. మద్యం సిండికేట్లకు కొమ్ముకాసిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి అరెస్టయ్యారు. దీంతో మద్యం సిండికేట్ల బాధ్యతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నెత్తిన ఎత్తుకున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా ఆమె మాటలు, చర్యలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన పురందేశ్వరి ఆ పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెడుతూ.. కుటుంబం, మద్యం సిండికేట్ల కోసం పనిచేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మద్యం దుకాణాలు, డిస్టిలరీల విషయంలో ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని రాజకీయ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో డిస్టిలరీలన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వాల్లో ఏర్పాటయినవే. 20 డిస్టిలరీల్లో 12 చంద్రబాబు సీఎంగా ఉండగా అనుమతిచ్చినవే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజారోగ్యం దృష్ట్యా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ వాస్తవాలను విస్మరించి, పురందేశ్వరి అసత్య ప్రచారానికి దిగారు. ఇది కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమేనన్నది సుస్పష్టం. బీజేపీ సిద్ధాంతానికి తిలోదకాలు నేషన్ ఫస్ట్–పార్టీ నెక్ట్స్–సెల్ఫ్ లాస్ట్ (దేశం తొలి ప్రాధాన్యత–పార్టీ మలి ప్రాధాన్యత–వ్యక్తిగత ప్రయోజనాలు ఆఖరు) అనేది బీజేపీ సిద్ధాంతం. కానీ, ఆ పార్టీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బీజేపీ సిద్ధాంతానికి తిలోదకాలిచ్చారు. పార్టీ కంటే సొంత కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చేలా ఆమె చర్యలు ఉన్నాయని బీజేపీ నేతల్లోనే చర్చ సాగుతోంది. ఆమె రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ ప్రయోజనాలకంటే కుటుంబ ప్రయోజనాల కోసమే కార్యక్రమాలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ మోదీకి, బీజేపీకి దగ్గరయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే పురందేశ్వరి ఎన్టీఆర్ నాణెం ముద్రణ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి, అ కార్యక్రమంలో చంద్రêబును, బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఆహ్వానించి, వారి మధ్య సయోధ్యకు ప్రయత్నించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్‌పైనా ఇదే తీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంపూర్ణ మద్య నిషేధం విధించడంతో మద్యం సిండికేట్లకు అడ్డుకట్ట పడింది. ఈ సిండికేట్లకు మద్దతుగా అప్పట్లో చంద్రబాబు తదితరులు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, ఆయన ప్రభుత్వాన్ని కూలదోశారు. ఆ వెంటనే చంద్రబాబు సీఎం పీఠమెక్కారు. సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచారు. మళ్లీ సిండికేట్ల రాజ్యం వచ్చింది. ఇబ్బడిముబ్బడిగా మద్యం దుకాణాలు వెలిశాయి. వీధికో బెల్టు షాపు వచ్చింది. వేయి తలల మద్య రక్కసి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని చిదిమేసింది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో, ఆ తర్వాత చంద్రబాబు పీఠాన్ని అధిష్టించడంలో దగ్గుబాటి పురందేశ్వరికి కూడా∙భాగస్వామ్యం ఉందని అప్పట్లో టీడీపీ వర్గాలే చెప్పాయి. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో ఆమె ఎక్కడా దానిని వ్యతిరేకించలేదని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వెన్నుపోటు రాజకీయం, సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడవడంలో చంద్రబాబుకు సహకరించిన కొన్ని పత్రికలే ఇప్పుడు రాష్ట్రంలో మద్యపాన నియంత్రణ చర్యలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వంపైనా అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఆ పత్రికల కథనాలను అనుసరిస్తూ పురందేశ్వరి ఇప్పుడు ఏకంగా సీఎం జగన్మోహన్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసే స్థాయికి వచ్చారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. చంద్రబాబు అవినీతిపై ప్రధాని మోదీ ఆరోపణలు చేసినా.. రాష్ట్రానికి 2014–19 మధ్య సీఎంగా పనిచేసిన చంద్రబాబు అవినీతిపై స్వయంగా ప్రధాని మోదీనే అనేక ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పట్లో వచ్చిన అనేక ఆరోపణల్లో ఒకటైన స్కిల్ స్కామ్‌లో సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేయగానే, ఆ అరెస్టును తప్పు పడుతూ టీడీపీ నాయకులకంటే ముందే పురందేశ్వరి సామాజిక మా«ధ్యమాల్లో ఖండించారు. రెండు రోజుల క్రితం లోకేశ్ ఢిల్లీలో అమిత్ షాను కలిస్తే.. ఆ భేటీ వివరాలు, ఫొటోలను కూడా లోకేశ్కంటే అరగంట ముందే పురందేశ్వరి ట్వీట్ చేశారు. ఇరువురి భేటీ వివరాలను పురందేశ్వరి సూచన మేరకు బీజేపీ రాష్ట్ర మీడియా విభాగం మీడియా ప్రతినిధులకూ వెంటనే తెలియజేసింది. అవినీతిపరుడని స్వయంగా ప్రధానే ఆరోపించిన చంద్రబాబు విషయంలో పురందేశ్వరి ఇలా వ్యవహరిస్తే బీజేపీ దెబ్బతినడం ఖాయమని ఆ పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బీజేపీని బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాల్సిన పురందేశ్వరి కీలక ఎన్నికల సమయంలో టీడీపీ ఆడే డ్రామాలో పావుగా మారారని, వచ్చిన అవకాశాలను కూడా∙చేజేతులా నిర్వీర్యం చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేతలు ధ్వజమెత్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలందరూ పూర్తి నైరాశ్యంలో ఉన్నారని, వారిలో కొందరు బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని పురందేశ్వరి వినియోగించుకోకపోగా, టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారా.. అనే అనుమానం కలిగేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. -
మద్యం విక్రయాలపై దుష్ప్రచారం
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ దక్షిణ)/ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): మద్యం విక్రయాల్లో చెల్లింపులు సక్రమంగా లేవంటూ ఒక చోట ప్రచారం.. మద్యం అమ్మకాల వల్లే ప్రజల ఆరోగ్యం చెడిపోతోందంటూ మరోచోట విమర్శలు.. ఇదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీరు. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారమే లక్ష్యంగా ఆమె విమర్శల తీరు ఉందని ఆపార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గురువారం నరసాపురంలో ఓ ప్రభుత్వం మద్యం దుకాణానికి వెళ్లి పురందేశ్వరి హడావుడి చేశారు. అక్కడ ఆమె చేసిన దు్రష్పచారాన్ని రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ గట్టిగా తిప్పికొట్టింది. నరసాపురం మద్యం దుకాణంలో రూ. లక్ష మద్యం అమ్మకాలు జరిగినా కౌంటర్లో కేవలం రూ. 700 బిల్లు మాత్రమే చూపిస్తున్నారని ఆమె అసత్య ఆరోపణలు చేశారు. అయితే ఆ మద్యం దుకాణంలో గురువారం రూ. 2,60,330 విలువైన మద్యాన్ని విక్రయించి ఆమేరకు ఖజానాకు జమ చేసినట్టు బెవరేజెస్ కార్పొరేషన్ ఆధారాలతో సహా శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పురందేశ్వరి నరసాపురంలోని ప్రభుత్వ మద్యం దుకాణానికి వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని ఆ రోజు ఎంత విలువైన మద్యాన్ని విక్రయించారని ప్రశ్నించారు.అందుకు ఆ సిబ్బంది రూ. లక్షకు పైగా మద్యాన్ని విక్రయించినట్టు తెలిపారు. ఆ దుకాణంలో అప్పటికి డిజిటల్ చెల్లింపులు రూ. 700 మేరకు జరిగాయి. అదే విషయాన్ని సిబ్బంది చెప్పారు. ఆ విషయాన్ని పురందేశ్వరి వక్రీకరిస్తూ రూ. లక్షకుపైగా మద్యం అమ్మినప్పటికీ కేవలం రూ. 700 మాత్రమే రికార్డుల్లో చూపిస్తున్నారని నిరాధార ఆరోపణలు చేశారు. ఆ మద్యం దుకాణంలో నగదు, డిజిటల్ చెల్లింపులు కలిపి గురువారం మొత్తం రూ. 2,60,330 విలువైన మద్యం విక్రయానికి సంబంధించి శనివారం చలానా తీయడం ద్వారా రాష్ట్ర బెవరేజస్న్ కార్పొరేషన్ ఆ మొత్తాన్ని ఖజానాలో జమ చేసింది. ఆ చలానా కాపీని కూడా మీడియాకు విడుదల చేసింది. దాంతో పురందేశ్వరి ఆరోపణలు కేవలం దు్రష్పచారమన్నది స్పష్టమైంది. కేజీహెచ్‌లో అబద్ధాలు ఇలా.. శనివారం విశాఖలో పర్యటించిన పురందేశ్వరి.. కేజీహెచ్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ వార్డును సందర్శించి లివర్ వ్యాధికి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం తాగడం వల్ల లివర్ పాడైపోయిందా అంటూ వారిని ఆమె ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉన్న రోగులతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఆమె తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి.. మద్యం తాగడం వల్ల 39 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు. 52 మంది వార్డులో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాగా, పురందేశ్వరి వ్యాఖ్యల్లో వాస్తవ పరిస్థితుల్ని వైద్యుల సమక్షంలో ‘సాక్షి’ పరిశీలన చేయగా.. ప్రభుత్వంపై విష ప్రచారం చేసేందుకు ఆమె మీడియాతో అబద్ధాలు మాట్లాడినట్లు స్పష్టమైంది. వార్డులో మొత్తం 52 పడకలున్నాయి. 36 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. కానీ.. పురందేశ్వరి మాత్రం 52 మంది ఉన్నారని 39 మంది పరిస్థితి విషమంగా ఉందని అబద్ధం చెప్పారు. వార్డులో కేవలం 30 మంది మాత్రమే లివర్ సమస్యతో బాధపడుతున్నారని.. ఏ ఒక్కరి పరిస్థితి విషమంగా లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఇందులో కొంతమంది ఆరోగ్యం కుదుట పడగా.. మరికొద్ది రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నారు. దీన్ని కూడా పురందేశ్వరి దవక్రీకరించి మీడియా ముందు తప్పుడు ప్రచారం చేశారు. ఉన్న రోగుల్లో చాలా మంది ఆహార నియమాలు పాటించకపోవడం, మసాలా, జంక్ ఫుడ్ అతిగా తినడం వల్ల అడ్మిట్ అయ్యారనీ.. ఐదుగురు మాత్రమే మద్యం బాధితులు ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేశారు. బీజేపీని నిందించడం సరికాదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్రంలోని బీజేపీని నిందించడం సరికాదని, ఆయన అరెస్టుతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబుపై నమోదైన కేసు రాష్ట్ర పరిధిలోని సీఐడీ విచారిస్తోందన్నారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ పొత్తు వ్యవహారంపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని మద్యం విక్రయాల్లో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని ఈ దోపిడీపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. -
పురందేశ్వరి ఫిరాయింపు సిగ్గుచేటు
అల్లిపురం : కేంద్రంలో మంత్రి పదవి అనుభవించిన పురందేశ్వరి పార్టీకి రాజీనామా చేసి మతతత్వ పార్టీలోకి మారడం సిగ్గుచేటని దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. పురందేశ్వరి పార్టీ ఫిరాయించడంతో మహిళలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గంటా శ్రీనివాసరావు గురించి మాట్లాడుతూ పదవుల కోసం ఎన్ని పార్టీలైనా ఫిరాయిస్తారని విమర్శించారు. ఇలాంటి ఫిరాయింపుదారులను ప్రజలు, పార్టీల కార్యకర్తలు తరిమికొట్టే రోజు వస్తుందని చెప్పారు. మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించినపుడే మహిళా దినోత్సవానికి సార్థకత ఏర్పడుతుందని చెప్పారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని అన్నారు. మహిళల ప్రగతికి దోహదం చేసేది కాంగ్రెస్ మాత్రమేనని నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి చెప్పారు. కార్యక్రమంలో మహిళా నేతలు విజయారెడ్డి, ప్రభాగౌడ్, సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సీన్ రివర్స్
* పీసీసీ నేత బొత్సకు భంగపాటు * పట్టించుకున్న నాయకులే కరువు *పురందేశ్వరికీ అదే అనుభవం *మర్నాడే ఎదురైన విభజన స్ట్రోక్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన ప్రభావం కాంగ్రెస్ నేతలకు మర్నాడే తెలిసొచ్చింది. కేంద్ర నిర్ణయంపై జనం నుంచే స్వపక్షీయుల నుంచీ వారికి ఛీత్కారం ఎదురయింది. సీమాంధ్ర కాంగ్రెస్ దయనీయస్థితికి శుక్రవారం నాటి సంఘటనే దర్పణం పట్టింది. శుక్రవారం నగరంలోనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పురందేశ్వరిలను కలిసేందుకు విశాఖ కాంగ్రెస్ నాయకులెవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. పీసీసీ అధ్యక్షుడు వస్తే కనీసం నలుగురైదుగురు శాసనసభ్యులు వచ్చి కలిసేవారు. జిల్లా స్థాయి నేతలు సైతం ఆయనను కలసి మాట్లాడాలంటే గంటో, రెండు గంటలో ఎదురుచూడాల్సివచ్చేది. శుక్రవారం సర్య్కూట్ హౌస్‌కు వచ్చిన ఆయన వచ్చిన కొద్దిమందితో కాలక్షేపం చేసి, విలేకరుల సమావేశంలో మాట్లాడి వెళ్లిపోయారు. పార్టీ శానససభ్యులు తలో పార్టీ దారి వెతుక్కోవడంతో ఆయనను కలసేందుకు శాసనసభ్యులెవ్వరూ రాలేదు. పురందేశ్వరిది అదే పరిస్ధితి. నిన్నటి వరకూ ఆమె కేంద్రమంత్రిగా ఉండడంతో పనుల కోసం, పైరవీల కోసం ఆమె ఇళ్ల, కార్యాలయాల వద్ద జనం గంటల తరబడి వేచి ఉండేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పురందేశ్వరి శుక్రవారం విశాఖలోనే ఇంటిలో అందుబాటులో ఉంటారంటూ ఆమె సహాయకులు నేతలు, కార్యర్తలకు ఫోన్లు చేసి, ఎస్ఎంఎస్లు పెట్టినా పెద్దగా స్పందన కనిపించలేదని తెలిసింది. ఇద్దరు మాజీ కార్పోరేటర్ల మినహా చెప్పుకోదగ్గ నేతలెవ్వరూ ఆమె ఇంటివద్ద శుక్రవారం కనిపింలేదు. పురందేశ్వరి కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ క్యాడర్ కూడా ఆమెను కలసేందుకు సందేహిస్తోంది. విభజన పరిణామాల తరువాత నేతల మాటలకు ఎవ్వరూ విలువివ్వకపోవడంతో వీరి వద్దకు పెద్దగా జనం వెళ్లడం లేదు. -
చిన్నమ్మ పర్యటనకు ఏర్పాట్లు చేసిందెవరు..?
పురందేశ్వరి వ్యవహారంపై వీడని వివాదం ఎంపీ వర్గం నేతలపై ఎమ్మెల్యే ఆగ్రహం సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజనకు అనుకూలంగా, సీమాంధ్ర హక్కుల పరిరక్షణ కోసం అంటూ విజయవాడలో కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు నిర్వహించిన సమావేశం వివాదం ఇంకా వీడటం లేదు. ఒకపక్క కేంద్ర మంత్రి వ్యాఖ్యలను తామంతా ఖండిస్తుంటే, ఎంపీ లగడపాటి రాజగోపాల్ వాటిని సమర్ధించడం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇరుకున పడేసింది. మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆమెపై అభాండాలు వేయటం మంచిది కాదని, తాను విశాఖపట్నం వెళ్లిన సందర్భంలో అక్కడ ప్రజలు కూడా ఇదే విధంగా వారి భయాలను వివరించారంటూ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కేంద్రమంత్రి పురందేశ్వరిని సమర్ధించిన సంగతి తెలిసిందే. అసలు పురందేశ్వరి పర్యటనకు ఏర్పాట్లు చేసిందెవరన్న అంశంపై కాంగ్రెస్‌పార్టీలో చర్చ నడుస్తోంది. ఎంపీ రాజగోపాల్‌కి అత్యంత సన్నిహితంగా ఉన్న వారే ముందుండి అన్ని ఏర్పాట్లు చేశారని సమాచారం. మరికొందరు నాయకులు కేంద్ర మంత్రితో టచ్‌లో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. శనివారం నాడు నగర ప్రధమ మేయర్ టి.వెంకటేశ్వరరావు సంతాపసభ సందర్భంగా ఒక నాయకుడిపై స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన చోటుచేసుకుంది. ‘మేం కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడాలి, మీరేమో ఏర్పాట్లు చేస్తారా?’ అంటూ ఎంపీ వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్‌పై సదరు ఎమ్మెల్యే బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తే కేంద్రమంత్రి పురందేశ్వరి పర్యటన ఎంపీ రాజగోపాల్‌కు తెలిసే జరిగినట్లుగా ఉందని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు నెలరోజుల తర్వాత నగరానికి వచ్చిన ఎంపీ రాజగోపాల్.. తనను కాంగ్రెస్ పార్టీ, నాయకులు నమ్మకపోయినా, ప్రజలంతా పూర్తిగా నమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు చూస్తుంటే ఎంపీ రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారని, అదే సమయంలో విజయవాడ నుంచే పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కనపడుతోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంపీకి తాము ఎలా అండగా నిలబడాలని ఆ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ నిలబడితే తర్వాత తమ పరిస్థితి ఏమిటని వారు వాపోతున్నారు. -
ఇట్లు.. మీ విధేయులు
=సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని గౌరవించాలంటున్న బాలరాజు =సీమాంధ్ర అభివృద్ధికి పోరాడాలంటున్న చిన్నమ్మ =తాజాగా ఇద్దరి నోటా విభజన ఆలాపన విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : ‘కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి బాల రాజుకు ప్రజాభీష్టం కంటే పార్టీ నిర్ణయమే శిరోధార్యమైంది. తాజాగా వీరిద్దరూ కొత్త పల్లవి అందుకున్నారు. విభజన జరిగిపోయిందంటూ ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారు. కాంగ్రె స్ వర్కింగ్ కమిటీ విభజన నిర్ణయం తీసుకోవడానికి ముందు బాలరాజు సమైక్య రాష్ట్రం కోసం త్యాగాలకు సిద్ధమని ప్రకటించారు. తీరా ప్రజలు పట్టుబట్టితే రాజీనామా చేసేదే లేదని మాట మార్చారు. గిట్టని వారు తనను విభజన వాదిగా దుష్ర్పచారం చేస్తున్నారంటూ తెగ బాధపడ్డారు. తన రాజీనామాతో విభజన ఆగదని, తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో ఓడించడానికి పదవిలో వుండక తప్పదని మరోసారి పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. బుధవారం ఆయన తన వాణి మరోసారి మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా వున్న వారు సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్ని గౌరవించాలనీ, రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర అభివృద్ధికి అవసరమైన అంశాలపై పోరాడాలని సెలవిచ్చారు. ఏజెన్సీలో ఇప్పటికీ గిరిజనులు సమైక్యాంధ్ర కోసం గట్టిగా పోరాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మంత్రి విభజన అనుకూల ప్రకటన చేయడం ద్వారా తనకు ప్రజల కంటే పార్టీయే ముఖ్యమనే విధంగా వ్యవహరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు సమైక్య వాదుల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్‌కు చెందిన పలువురు శాసనసభ్యులు, నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లు పార్టీ ఫిరాయిస్తారనే సంకేతాలు వున్నాయి. భవిష్యత్తులో పార్టీని చేతుల్లోకి తెచ్చుకునే వ్యూహంతోనే బాలరాజు అధిష్టాన విధేయుడిగా ముద్ర వేసుకునే పనిలో పడ్డారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చిన్నమ్మదీ అదే దారి విభజన జరక్కూడదని కోరుకుంటున్నానని ప్రకటించిన కేంద్ర మంత్రి పురందేశ్వరి సైతం బుధవారం విజయవాడలో విభజన అనంతర అంశాల గురించి మాట్లాడారు. రాష్ట్ర విభజనకు నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేశానని ఇటీవల ఆమె ప్రకటించారు. అయితే ఈ రాజీనామాలన్నీ డ్రామాలే అనే విషయం తేలిపోయిన పరంపరలో ‘‘ సీమాంధ్ర ప్రయోజనాల కోసం పోరాడాలి’’ అని పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఆమె మనసులోని మాటను చెప్పకనే చెప్పాయి. 2014లో విశాఖ పార్లమెంటు స్థానం నుంచే పోటీకి దిగుతానని మూడు రోజుల కిందట ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పురందేశ్వరి ప్రకటించారు. ఈ స్థానం నుంచి టికెట్ కోసం రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి పోటీ పడుతున్న తరుణంలో రాష్ట్ర విభజన అంశంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుండేట్లుగానే ఆమె వ్యవహరించారు. రాజకీయ ప్రయోజనం ఆశించే ఆమె పార్టీ పట్ల విధేయత చాటుకుంటున్నారనే అభిప్రాయాలు జనంలో వ్యక్తం అవుతున్నాయి. విశాఖ పార్లమెంటు స్థానం పరిధిలోనూ సమైక్య ఉద్యమం రగులుతూనే వున్న సమయంలో ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సొంత పార్టీ వర్గాల్లోనే కలవరం పుట్టించింది. చిన్నమ్మ కూడా విభజనకు జనాన్ని మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.