new alcohol policy
-
ఇప్పటివరకు 129.. ఇక 68
మహారాణిపేట(విశాఖ దక్షిణ): మద్యం నిషేధం దశల వారీగా అమలు చేయడానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే విక్రయాలతో పాటు టైమింగ్స్ కూడా తగ్గించింది. ఇక బార్లకు కూడా కళ్లెం వేయనుంది. నూతన బార్ పాలసీలో 2020 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రభు త్వం 40 శాతం బార్లు తగ్గించాలని ఇప్పటికే నిర్ణయించడంతో జిల్లా ఎ క్సైజ్ అధికారులు ఇప్పటికే ఆ ప్రకియ ప్రారంభించారు. ఎక్కడెక్కడ ఉంచాల్లో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే అమలు చేయడానికి సిద్ధమయ్యారు. డిసెంబర్‌తో లైసెన్స్‌లు పూర్తి.. ప్రస్తుతం నడుస్తున్న బార్ల లైసెన్సులు డిసెంబర్ 31తో రద్దు అవుతాయి. వాస్తవానికి ప్రస్తుత బార్ల లైసెన్సులు 2020 జూన్ ఆఖరి వరకు ఉన్నాయి. మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మిగిలిన రోజులకు సంబంధించి లైసెన్స్ ఫీజును ప్రభుత్వం బార్ యజమానులకు తిరిగి చెల్లిస్తుంది. ఇక 68 బార్లే.. ప్రస్తుతం జిల్లాలో 129 బార్లు ఉన్నా యి. ప్రభుత్వం 40 శాతం తగ్గించాలని ఆదేశాలు జారీ చేయడంతో 68 బార్లు మాత్రమే జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి విశాఖ నగర పరి«ధి(జీవీఎంసీ)లో 66 ,యలమంచలి,నర్సీపట్నం మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి ఏర్పాటు కానున్నాయి. ఫీజుల పెంపు మరో వైపు 2020 జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న బార్ల లైసెన్స్ ఫీజులు ప్రభుత్వం పెంచింది. 50 వేల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలో బార్ ఏర్పాటు చేయాలంటే రూ.25 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న మున్సిపాలిటీలో రూ.50 లక్షలు, 5 లక్షలకు పైగా ఉన్న జనాభా ఉన్న మున్సిపాలిటీ/నగర పాలక సంస్థలో బార్ ఏర్పాటు చేయాలంటే రూ.75 లక్షలు లైసెన్స్ ఫీజులు చెల్లించాలి. ఈ ప్రాతిపదికన విశాఖ నగర పరిధిలో బార్ ఏర్పాటు చేయాలంటే రూ.75 లక్షలుగా నిర్ణయించారు. ఆన్లైన్లో దరఖాస్తులు.. బార్ లైసెన్స్‌ల కోసం ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేయాల్సి వుంది. ఎక్సైజ్ శాఖ వెబ్సైట్ ద్వారా డిసెంబర్ 6లోగా (మధ్యాహ్నం మూడు గంటలు) ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంది. 7న డ్రా తీస్తారు. అలాగే ఒక కాపీని ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలి. అన్ని డాక్యుమెంట్లు,బార్ నడిపే ఇంటి యజమాని నుంచి లేఖ, ఇతర డాక్యుమెంట్లు తప్పని సరిగా సమర్పించాలి. మార్గదర్శకాలు రాగానే.. నూతన మద్యం పాలసీలో భాగంగా బార్ల తగ్గింపుపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీనిపై శుక్రవారం రాజపత్రం కూడ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని పక్కాగా అమలు చేసేందుకు సిబ్బందిని సమాయత్తం చేస్తున్నాం. ఏడాది పాటు బార్లు నడపడానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలి. బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలనుకున్న వారు రూ.10 లక్షల డీడీ సమర్పించాలి. బార్లు కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే డ్రా ద్వారా ఎంపిక చేస్తాం. -టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్, విశాఖపట్నం. -
వీళ్లు మామూలోళ్లు కాదు
సాక్షి, పాలకొల్లు(పశ్చిమగోదావరి) : రాష్ట్రంలో మద్యనిషేధం దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించడంతో పాటు దుకాణాల సంఖ్యను కూడా తగ్గించింది. ఇది కొందరు ఎక్సైజ్ అధికారులకు మింగుడు పడటం లేదు. గతంలో మద్యం దుకాణాలు, బార్ల నుంచి లక్షల్లో మామూళ్లు వీరికి అందేవి. ప్రస్తుతం మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుండటంతో వీరి ఆదాయానికి భారీగానే గండిపడింది. బార్ అండ్ రెస్టారెంట్లు మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తుండటంతో వీరిని మామూళ్ల కోసం పట్టిపీడిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో 20 బార్లు జిల్లాలో గతంలో 437 బ్రాందీ షాపులు, 20 బార్లు ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకారం 90 షా పులను తగ్గించి 347 షాపులను ఏర్పాటుచేసింది. 20 బార్లు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మామూళ్ల మత్తులో ఉన్న ఎక్సైజ్ అధికారుల చూపు బార్ అండ్ రెస్టారెంట్ యజమానులపై పడింది. జిల్లాలోని 20 బార్ అండ్ రెస్టారెంట్ యాజమానుల నుంచి నెలకు బార్ ఒక్కింటికీ రూ.30 వేల చొప్పున వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనిపై బార్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రైవేట్ బ్రాందీ షాపులు ఉండటం వలన బార్ల నుంచి మామూళ్లు ఎంతిస్తే అంతే తీసుకునేవారమని, ప్రస్తు తం ప్రభుత్వమే బ్రాందీ షాపులు నిర్వహించడం వలన ఎౖMð్సజ్ స్టేషన్‌కి ఆదాయం లేదని అధికారులు అంటున్నారని యజమానులు ఆరోపిస్తున్నారు. స్టేషన్‌కు ఆదాయం లేదనే సాకుతో ఒక్కో బార్ యజమాని నుంచి రూ.30 వేలు దండుకుంటున్నట్టు చెబుతున్నారు. సొమ్ములు ముట్టజెప్పకపోతే కేసుల పేరుతో వేధిస్తున్నారని అంటున్నారు. ప్రైవే ట్ యజమానుల చేతుల్లో బార్ అండ్ రెస్టారెంట్లు ఉండటంతో కొందరు ఎక్సైజ్ అధికారులు మామూళ్ల కోసం ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. బెడద తగ్గలేదు జిల్లాలో గతంలో బ్రాందీషాపులు, బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల నుంచి ఎక్సై జ్ అధికారులు ప్రతి నెలా లక్షలాది రూపాయలు మామూళ్లు కింద వసూలు చేసేవారు. ప్రస్తుతం ప్రభుత్వమే మద్యం షాపులు ఏర్పాటు చేయడంతో కొందరు ఎౖMð్సజ్ అధికారులు బార్ యజమానులపై పడుతున్నారు. నెలకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. – ఆర్.వెంకటపతి, బార్ అండ్ రెస్టారెంట్ యజమాని, ఏలూరు -
నిలువు దోపిడీ!
దశలవారీ మద్యపాన నిషేధంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో మద్యం అమ్మకాలు తగ్గడంతో రెస్టారెంట్స్ అండ్ బార్లకు వరంగా మారింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బార్ల యజమానులు నిబంధనలు తుంగల్లో తొక్కి దోపిడీకి తెరతీశారు. సాక్షి, విజయనగరం : నవరత్నాల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు నెలల పాలనలోనే దశలవారీ మద్య నిషేధానికి తెరతీశారు. జిల్లాలో విచ్చలవిడిగా ఉన్న బెల్టు దుకాణాలపై ఉక్కుపాదం మోపడంతో బెల్టు దుకాణాలు మూతపడ్డాయి. ప్రైవేటు మద్యం వ్యాపారుల చేతిలో ఉన్న మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. నూతన మద్యం విధానంతో జిల్లాలో 210 మద్యం దుకాణాలను 20 శాతం తగ్గించి 168కి పరిమితం చేశారు. దీంతో పాటు గతంలో ఉదయం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు సాగించి రెండు చేతులా సంపాదించేవారు. మద్యం అమ్మకాలు నియంత్రించడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాల నిర్వహణ మూడు గంటల సమయం తగ్గించారు. దీంతో రెస్టారెంట్ అండ్ బార్లుకు వరంగా మారింది. దీంతో నూతన మద్యం విధానం అమలుకాక ముందు రోజుకు ఒక్కో బార్లలో రూ.2 లక్షల వరకు విక్రయాలు జరిగితే ప్రస్తుతం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయాలు పెరగడం విశేషం. మందుబాబులకు ధరల ‘కిక్కు’ నూతన మద్యం విధానంతో జిల్లాలో మద్యం దుకాణాలు తగ్గడమే కాకుండా సమయానికే మూతపడటంతో మందుబాబులకు మద్యం దొరకడం కష్టమవుతుంది. దీంతోపాటు గతం లో మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూమ్‌లు ఉండటంతో మందుబాబులు అక్కడే మద్యం కొనుగోలు చేసి పర్మిట్ రూమ్‌ల్లో తాఫీగా తాగి వెళ్లేవారు. ప్రస్తుతం పర్మిట్ రూమ్‌లు తొలగించడంతో మందుబాబులకు తాగేందుకు స్థలం లేక బార్లను ఆశ్రయిస్తున్నారు. ఒకరికి మూడు బాటిళ్లు కంటే ఎక్కువ అమ్మకాలు చేయడంగాని, తీసుకువెళ్లడం చేయరాదని ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో జిల్లాలోని 28 బార్ అండ్ రెస్టారెంట్లు మందుబాబులకు అనుకూలంగా మారాయి. దీంతో బార్ల యజమానులు దోపిడీకి తెరలేపేశారు. ఉదయం 11 గంటలకు తెరుచుకుంటున్న బార్లు రాత్రి 1 గంట వరకు కొనసాగుతున్నాయి. రాత్రి 11 గంటలకే అమ్మకాలు బంద్ చేయాల్సిన బార్ల యజమానులు 12 వరకు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఎంఆర్పీపై ప్రభుత్వం పెంచిన ధరను కలిపి విక్రయించాల్సిన మద్యాన్ని విడి విక్రయాలు, మద్యం కల్తీతో పాటు అదనంగా ధర పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా సర్వీసు ట్యాక్స్ పేరిట బార్ల యజమానులు మందుబాబులకు షాకిస్తున్నారు. దీంతో బార్లకు వచ్చిన మందుబాబులకు ధరల బాదుడు చూసి కిక్కు దిగిపోతుంది. నిబంధనలు బేఖాతరు వాస్తవంగా బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలతో పాటు మందుబాబులకు తిండి లభ్యమవుతుంది. తిండి పదార్థాలు వండడానికి అన్ని సౌకర్యాలు బార్లలో ఉండాల్సిందే. జిల్లాలో 80 శాతానికి పైగా బార్లలో వంట చేయడానికి కావాల్సిన సౌకర్యాలు లేవు. అనేక బార్లలో బయట తిండి తెచ్చి విక్రయాలు సాగిస్తున్నారు. పర్యవేక్షణేది? నిబంధనలు అతిక్రమిస్తున్న బార్లపై గట్టి నిఘా, పర్యవేక్షించాల్సిన ఎక్సైజ్ అధికారులు బార్ల యజమానులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో పర్యవేక్షణ గాలికొదిలేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 80 శాతం పైగా బార్లలో నిబంధనలు అమలుకాకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
అంతలోనే ఎంత మార్పు!
సాక్షి, కోటబొమ్మాళి(శ్రీకాకుళం) : వేళాపాళా లేకుండా అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు... దుకాణాల్లోనే కాకుండా బెల్టుషాపుల్లో విచ్చలవిడి విక్రయాలు... అక్కడే మద్యపానం... మత్తులో చెలరేగే ఘర్షణలు... గొడవలు మరీ మితిమీరితే పోలీసులు జోక్యం చేసుకోవడాలు.. ఇవీ ఇంతవరకు కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో ప్రతి ఏటా కనిపించే అవాంఛనీయ దృశ్యాలు.. మందుబాబుల బెడదతో ఎటువంటి సంఘటనలు జరుగుతాయోనని అటు నిర్వాహకులు, ఇటు ఉత్సవాలకు వచ్చిన భక్తులు భయాందోళన చెందేవారు. అయితే ఈసారి మూడు రోజులుగా అమ్మవారి ఉత్సవాలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ప్రైవేటు మద్యం షాపులకు కళ్లెం వేసి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అమలుచేయడంతో ఒక్కసారిగా పరిస్థితిలో మార్పువచ్చింది. ఇ దిగో ఈ చిత్రం లో కనిపిస్తున్నట్టు ప్రభుత్వ దుకాణం వద్ద వినియోగదారులు క్యూలో నిలబడి క్రమశిక్షణగా మద్యం కొనుగోలు చేయడంతో.. ఇది కలా నిజమా అనిపించింది. కోటబొమ్మాళిలో ఉదయం 11 గంటలకు షాపు తెరిచేసరికి రెండు వరుసల్లో బారులు దీరి మద్యం కొనుగోలు చేశారు. వీరిని అదుపు చేసేందుకు ఎక్సైజ్, పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో అంతా ప్రశాంతంగా సాగిపోతోంది. ఈ మార్పుతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అపశ్రు తులు లేకుండా పండుగ సాగుతోందని నిర్వాహకులు సంబరపడుతున్నారు. -
రేపటి నుంచి నూతన మద్యం విధానం
సాక్షి, విజయనగరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో దశలవారీగా మద్య నిషేధ హామీ అమలుకు మరో 24 గంటల సమయమే ఉంది. రాష్ట్రంలో నూతన మద్యం విధానం మంగళవారం నుంచి అమలుకానుంది. ఇన్నాళ్లూ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నిర్వహించబడిన మద్యం దుకాణాలు అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించబడతాయి. మద్యం దుకాణాల నిర్వహణకు ఇప్పటికే టెండర్ల పద్ధతిలో దుకాణాలను అద్దెకు తీసుకుని వాటి నిర్వహణకు 168 మంది సూపర్వైజర్లు, 434 మంది సేల్స్మన్లను అధికారులు ఎంపిక చేశారు. మద్యం అమ్మకాలు తగ్గించడమే కాకుండా మందుబాబులకు మద్యం విరివిగా దొరకకుండా మద్యం దుకాణాలను 20 శాతం తగ్గించారు. దీంతో జిల్లాలో ఉన్న 210 మద్యం దుకాణాలు 168కి తగ్గిపోయాయి. బెల్టు దుకాణాలపై ఉక్కుపాదం గత ప్రభుత్వం మద్యాన్ని ఆదాయంగా భావించి విచ్చలవిడి మద్యం అమ్మకాలకు తెరతీసిన విషయం తెలిసిందే. అయితే మహిళల ఇబ్బందులను గమనించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే బెల్టుదుకాణాలపై ఉక్కుపాదం మోపారు. అలాగే ఎంఆర్పీకే మద్యం అమ్మేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే మద్యం దుకాణాల ఏర్పాటు, విధివిధానాలు, ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలను అధికారులకు వివరించారు. నూతన మద్యం విధానం సక్రమంగా అమలయ్యేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. నిల్వల తగ్గింపు ప్రైవేట్ మద్యం దుకాణాల నిర్వహణకు ఒక్కరోజే గడువు ఉండడంతో వ్యాపారులు మద్యం నిల్వలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారం రోజులుగా డిపో నుంచి మద్యం కొనుగోళ్లు తగ్గించి ఉన్న నిల్వల విక్రయిస్తున్నారు. మద్యం దుకాణాల్లో ఆఖరి రోజు వరకు మద్యం నిల్వలుంటే ఎక్సైజ్ అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో సోమవారం రాత్రికి అధికారులే నిల్వలను స్వాధీనం చేసకోనున్నారు. దీంతో వ్యాపారులు విక్రయాలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఏర్పాట్లు పూర్తి చేశాం.. జిల్లాలో 168 మద్యం దుకాణాల నిర్వహణకు షాపులను టెండర్ల ద్వారా తీసుకున్నాం. అలాగే సూపర్వైజర్లు, సేల్స్మన్లను నియమించాం. 13 ఎక్సైజ్స్టేషన్ల పరిధిలోని ఎక్సైజ్ అధికారులకు దుకాణాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తాం. పాత మద్యం విధానం ముగిసిపోనున్నందున రెండు రోజులుగా మద్యం సరఫరా నిలిపేశాం. సోమవారం రాత్రి గడువు ముగిసిన వెంటనే వ్యాపారులు నిల్వ ఉన్న సరుకును అధికారులకు అప్పగించాలి. లేనిపక్షంలో అధికారులే స్వాధీనం చేసుకుంటారు. – ఎస్వీవీఎన్ బాబ్జీరావు, అసిస్టెంట్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం -
880 మద్యం దుకాణాల తగ్గింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్టోబర్ నుంచి అమలుకానున్న కొత్త మద్యం విధానంలో ప్రస్తుతం నడుస్తున్న షాపుల్లో 880 తగ్గించి 3,500 మద్యం షాపుల్ని నిర్వహించాలని నిర్ణయించారు. దశల వారీగా మద్య నిషేధం అమల్లో భాగంగా మొదటి విడతలో 20 శాతం దుకాణాల్ని తగ్గించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,380 మద్యం షాపులున్నాయి. వీటిని ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌తో ఈ షాపులకు ఇచ్చిన లైసెన్సు రెన్యువల్ గడువు ముగుస్తుంది. అక్టోబర్ నుంచి అమల్లోకి తెచ్చే నూతన మద్యం పాలసీలో తగ్గించిన మేరకు 3,500 మద్యం షాపుల్ని ప్రభుత్వమే నిర్వహించేందుకు కసరత్తు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం చేతిలో దుకాణాలుండటం వల్ల మద్య నియంత్రణకు మార్గం సులువవుతుందని, నిబంధనల ఉల్లంఘనలు కూడా ఉండవన్నారు. అక్టోబర్ నాటికి రాష్ట్రంలో ఒక్క బెల్టు షాపు కూడా కనిపించకూడదని సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు, గుడికి, బడికి దగ్గర లేకుండా చూడాలన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మద్యం షాపుల్ని నిర్వహించాలని, మద్యాన్ని ప్రజలకు దూరం చేయడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. కాంట్రాక్టు విధానంలో కొత్తగా 15 వేల ఉద్యోగాలు ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా కాంట్రాక్టు విధానంలో కొత్తగా 15 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని, మద్యం దుకాణంలో సూపర్వైజర్, సేల్స్‌మెన్ పోస్టులు భర్తీ చేస్తామని అధికారులు వివరించారు. పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లతో పాటు స్థానికులకు 75 శాతం ఉద్యోగాల నిబంధన కచ్చితంగా అమలు చేయాలనే ప్రభుత్వ ప్రాధాన్యతను సీఎం అధికారులకు సూచించారు. సీఎం సమీక్షలో ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు, ఎక్సైజ్ కమిషనర్ ఎం.ఎం.నాయక్ తదితరులున్నారు. -
రాష్ట్ర రహదారులు డీనోటిఫై!
కొత్త మద్యం పాలసీపై ప్రతిపాదనలు సిద్ధం - సుప్రీం తీర్పు ప్రభావాన్ని తప్పించుకొనేలా మార్పులు - పాత మద్యం పాలసీకే ఏపీ ఎక్సైజ్ పాలసీలోని అంశాల జోడింపు - లైసెన్స్ ఫీజు మూడు శ్లాబులకు కుదింపు - గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దుకాణాలకు ఫీజు పెరిగే అవకాశం - గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో యథాతథం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. పాత మద్యం పాలసీకే కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేయడంతోపాటు.. ఏపీ ఎక్సైజ్ పాలసీలోని పలు అంశాలను జోడించి నూతన పాలసీని సిద్ధం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు జాతీయ రహదారులకే పరిమితమయ్యేలా చేసేందుకు.. రాష్ట్రస్థాయి రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా (ఎండీఆర్) డీనోటిఫై చేయాలని, పాత పాలసీ ప్రకారమే (100 మీటర్ల దూరంలోపు) దుకాణం లైసెన్స్‌లు కేటాయించాలని కొత్త పాలసీలో ప్రతిపాదించనున్నారు. ఇక పాత పాలసీలో 6 శ్లాబులుగా ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజును ఈ సారి మూడు శ్లాబులకు కుదించాలని నిర్ణయించారు. ఇందులో తొలి రెండు శ్లాబుల పరిధిలోకి వచ్చే గ్రామీణ, పట్టణ ప్రాంత దుకాణాలకు లైసెన్స్ ఫీజు పెంచాలని... చివరి శ్లాబ్ పరిధిలోకి వచ్చే గ్రేటర్ హైదరాబాద్‌లోని దుకాణాలకు రూ.1.4 కోట్లు ఉన్న ఫీజును యథాతథంగా కొనసాగించాలని ప్రతిపాదించారు. ఇక ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, లాటరీ పద్ధతిలో లైసెన్స్ కేటాయింపు, రెండు సంవత్సరాల లీజు కాలం వంటి నిబంధనలను కూడా ఉన్నది ఉన్నట్లుగా కొనసాగించనున్నారు. సుప్రీం తీర్పుతో జాప్యం రాష్ట్రంలో పాత ఎక్సైజ్ పాలసీ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. అక్టోబర్ ఒకటి నుంచి కొత్త పాలసీ అమల్లోకి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త పాలసీకి ఇప్పటికే తుది రూపు రావాల్సింది. కానీ జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలోపు మద్యం దుకాణాలు ఉండవద్దన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు ఉండగా.. ఇందులో 1,184 మద్యం దుకాణాలు సుప్రీంకోర్టు నిబంధన పరిధిలోకి వస్తున్నాయి. అధిక లైసెన్సు ఫీజు కారణంగా మరో 72 దుకాణాల లైసెన్స్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అంటే మిగిలేవి 960 దుకాణాలు మాత్రమే. అదే జరిగితే ఎక్సైజ్ రాబడి అమాంతం పడిపోతుంది. దీంతో సుప్రీంతీర్పుకు అనుగుణంగా పాలసీ రూపొందించాలా? లేక డీనోటిఫై సిఫారసును ప్రతిపాదించాలా? అన్నదానిపై ఎక్సైజ్ అధికారులు కొంతకాలం తర్జనభర్జన పడ్డారు. అయితే ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చింది. ఆ పాలసీలో అక్కడి రాష్ట్ర రహదారులను ఎండీఆర్ (మెయిన్ డిస్టిక్ రోడ్స్)గా పునః సమీక్షించారు. దీంతో తెలంగాణలోనూ రాష్ట్ర రహదారులను డీనోటిఫై చేసుకొని.. పాత పాలసీ ప్రకారం ప్రధాన రోడ్డుకు 100 మీటర్ల దూరంలోపు దుకాణం నిర్వహించరాదన్న నిబంధనను అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో సుప్రీం నిబంధనల పరిధి నుంచి 562 మద్యం దుకాణాలు బయటపడతాయి. ఇక జాతీయ రహదారుల పక్కన ఉన్న దుకాణాలను కూడా జిల్లా ప్రధాన రోడ్డు వైపునకు మార్చుకోవచ్చు. అయితే ఈ ప్రతిపాదనలు ఇంకా సమీక్ష దశలోనే ఉన్నాయి. వీటిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ పరిశీలిస్తున్నారు. అవసరమైన మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. -
కొత్త మద్యం పాలసీ రానుంది
⇒రాష్ట్ర బడ్జెట్లో స్పష్టం చేసిన మంత్రి ⇒మండల యూనిట్‌గా మద్యం అంగళ్లు ⇒పరిగణనలోకి సుప్రీం తీర్పు ⇒వచ్చే వారంలో నోటిఫికేషన్? కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చింది. బుధవారం అమరావతిలో జరిగిన రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో మంత్రి యనమల రామకృష్ణుడు దీనిపై ప్రకటన చేశారు. ఈ సమావేశాల్లోనే కొత్త మద్యం పాలసీ ప్రకటించనున్నట్లు తెలిపారు. దీంతో కొన్నాళ్లుగా సందిగ్ధంలో ఉన్న మద్యం విధి విధానాలపై సమాధానం లభించినట్లయ్యింది. చిత్తూరు (అర్బన్):జిల్లాలో తిరుపతి ఎక్సైజ్ పరిధిలో 212 మద్యం దుకాణాలు, చిత్తూరు ఎక్సైజ్ పరిధిలో 207 మద్యం దుకాణాలకు ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసింది. అయితే జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండడానికి వీల్లేదంటూ గత ఏడాది సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నెలాఖరులోపు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలని తీర్పునిచ్చింది. తమకు జూన్ వరకు గడువు ఇవ్వాలంటూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. రెండు రోజుల క్రితం సీఎం ఆదేశాలతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వచ్చే వారంలో దీనిపై అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఇదీ కొత్త పాలసీ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసే పాలసీలో 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను ఇతర ప్రాంతాల్లో జూన్ వరకు నిర్వహించుకోవడానికి అవకాశం ఇవ్వనుంది. దీనికి ఇప్పటి వరకు ఉన్న లైసెన్సు నిబంధనలే వర్తింప చేస్తారు. మిగిలిన దుకాణాలకు ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెట్టనున్న కొత్త పాలసీ అమలు చేస్తారు. ఇప్పటి వరకు మద్యం విక్రయదారులు కనిష్టంగా రూ.34 లక్షల నుంచి గరిష్టంగా రూ.45 లక్షలు చెల్లించి రెండేళ్లకు లైసెన్సులు తీసుకుంటున్నారు. కొత్త పాలసీలో దీన్ని రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో నిర్ణయించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పైగా మద్యం విక్రయాల్లో వ్యాపారులకు సగటున లభిస్తున్న 18 శాతం మార్జిన్‌ను కొత్త పాలసీలో 12 శాతానికి తగ్గించే అవకాశాలున్నాయి. ఇక మండలాన్ని, పట్టణాలను, కార్పొరేషన్లను ఓ యూనిట్‌గా పరిగణించి ఒక్కో మండలంలో నిర్ణీత దుకాణాలు నిబంధనలకు లోబడి పక్క పక్కనే పెట్టుకునే వెసులుబాటు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో 18 దుకాణాలుంటే వీటన్నింటిని కలిపి ఒకే వ్యక్తికి లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. మద్యం దుకాణాలతో పాటు బార్లకు సైతం ఏడేళ్ల తరువాత వచ్చే వారంలోనే కొత్త పాలసీ ప్రకటించనున్నారు. -
20% పెరిగిన లైసెన్సు ఫీజు
రెండేళ్ల కాలపరిమితితో కొత్త మద్యం విధానం ♦ 2,216 మద్యం దుకాణాలకు త్వరలో దరఖాస్తులు ♦ జనాభా ప్రాతిపదికన ఆరు శ్లాబుల్లో కేటాయింపు ♦ ఒకేసారి లేదా 6 వాయిదాల్లో చెల్లింపునకు అవకాశం ♦ టర్లో అత్యధికంగా 2.16 కోట్లు లెసైన్సు ఫీజు ♦ దరఖాస్తు ఫారం ధర రూ.50 వేలకు పెంపు ♦ పివిలేజి ఫీజు 8 శాతానికి తగ్గింపు ♦ 2015 అక్టోబర్ 1 నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకు ఇదే విధానం ♦ ఈనెల 14న దుకాణాలకు నోటిఫికేషన్, 21 వరకు దరఖాస్తుల స్వీకరణ, 23న డ్రా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2015-16, 2016- 17 సంవత్సరాలకు ఉద్దేశించిన ఈ విధానం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాలకు సంబంధించి లెసైన్సుల జారీ విధి విధానాలు, చేసిన మార్పులు, ఫీజుల నిర్ణయం తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం మూడు జీవోలు (163, 164, 165) విడుదలయ్యాయి. ఈనెల 14న నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తులను విక్రయించనున్నారు. 21వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి... 23న జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా తీసి దుకాణాలను కేటాయిస్తారు. ఒకేసారి 20 శాతం.. రెండేళ్ల కాలపరిమితితో మద్యం లెసైన్సులు జారీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... లెసైన్సు ఫీజును ఒక్కసారిగా 20 శాతం పెంచేసింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఆరు స్లాబుల్లో మద్యం దుకాణాలకు ప్రస్తుతమున్న లెసైన్సు ఫీజుకు అదనంగా 20 శాతం పెంచుతూ ఈ కొత్త ఫీజులను నిర్ణయించారు. రెండేళ్లకు ఏటా 10 శాతం పెంచాలని తొలుత భావించినా... వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒకేసారి పెంచారు. ఈ లెక్కన 10 వేల జనాభా ఉన్న గ్రామం, పట్టణం, నగర పంచాయతీల్లో లెసైన్సు ఫీజు రెండేళ్లకు రూ.78 లక్షలు కాగా... 20 లక్షలపైన జనాభా ఉన్న జీహెచ్ఎంసీలో లెసైన్సు ఫీజు రూ.2.16 కోట్లు. ఇక మద్యం అమ్మకాలు లెసైన్సు ఫీజు మొత్తం కన్నా ఏడు రెట్లు దాటితే ప్రస్తుతం అదనంగా 13.6 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా... కొత్త విధానంలో రెండేళ్లకుగాను 8 శాతంగా నిర్ణయించారు. అంటే రెండేళ్ల లెసైన్సు ఫీజుకు ఏడు రెట్లు మద్యం అమ్మకాలు దాటితే... తర్వాతి అమ్మకాలపై 8 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తు ఫారం వెలను రూ.25వేల నుంచి రూ.50వేలకు పెంచారు. ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వరు. మరిన్ని నిబంధనలు * టర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల సరిహద్దు గీతకు 5 కిలోమీటర్ల పరిధిలోని మద్యం దుకాణం లెసైన్సు ఫీజు కూడా ఆ కార్పొరేషన్ ధరకే కేటాయిస్తారు. ఉదాహరణకు జీహెచ్ఎంసీలో ఉప్పల్, కాప్రా వరకే కార్పొరేషన్ పరిధి. కానీ అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఘట్కేసర్లోని మద్యం దుకాణాలను కూడా జీహెచ్ఎంసీ ధరకే కేటాయిస్తారు. * మున్సిపాలిటీల సరిహద్దు నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లోని మద్యం దుకాణాలకు... నగర పంచాయతీల నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న గ్రామాలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. * లెసైన్సు ఫీజులను 20 శాతం పెంచిన నేపథ్యంలో మద్యం దుకాణాలను ఎవ రూ తీసుకునేందుకు ముందుకు రాకపోతే రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్/ ఏజెన్సీ ద్వారా ఆ ప్రాంతాల్లో మద్యం వ్యాపారం జరుపుతారు. * పతి ఎ-4 షాపులో హాలోగ్రాఫిక్ ఎక్సైజ్ లేబుల్స్ (హెచ్‌ఈఏఎల్)ను డీకోడ్ చేసే యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలి. * మద్యం సేవించడం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి ప్రజలను చైతన్యం చేయాలి. * గుడుంబాను అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం చర్యలు చేపట్టాలి. * గతంలో జూలై నుంచి ప్రారంభమయ్యే ఎక్సైజ్ సంవత్సరాన్ని.. ఇక నుంచి అక్టోబర్‌కు మారుస్తూ నిర్ణయం. * విద్యాసంస్థలు, దేవాలయాలు, ఆసుపత్రులకు 100 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలి. * హైవేలకు 50 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలి. * మద్యం దుకాణాలకు అనుబంధంగా ఏర్పాటు చేసే పర్మిట్ రూంల లెసైన్సు ఫీజు రెండేళ్లకు రూ.4లక్షలు. ఈ మొత్తాన్ని రెండు వాయిదాల్లో చెల్లించవచ్చు. * మద్యం దుకాణంలో బాటిళ్ల స్టోరేజ్ కోసం ప్రత్యేక ఎ-4(జీ) లెసైన్సుతో గోదాం ఏర్పాటు చేసుకోవచ్చు. -
ఖజానాకు కిక్కు..!
మద్యం ద్వారా భారీగా ఆదాయ సమీకరణకు సర్కారు పావులు * దుకాణాల లెసైన్సు ఫీజుల రూపంలోనే రూ. 2 వేల కోట్లు అంచనా * రూ. 12 వేల కోట్ల వార్షిక లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: మద్యం ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పావులు కదుపుతోంది. అక్టోబర్ నుంచి అమలులోకి రానున్న నూతన మద్యం విధానం ద్వారా అంచనాలకు మించి ఆదాయం పొందేందుకు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. గుడుంబాకు విరుగుడుగా చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టడం మొదలుకుని.. మండలాలను గంపగుత్తగా వ్యాపారులకు కట్టబెట్టడం, కొత్త బార్ లెసైన్సుల మంజూరు, కుటీర పరిశ్రమల్లా బీర్ల ఫ్యాక్టరీలకు అనుమతులు, జీహెచ్ఎంసీలో షాపింగ్‌మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో మద్యం విక్రయాలు, వైన్కేఫ్ల ఏర్పాటు వంటి ఆలోచనలన్నీ భారీ ఆదాయ సమీకరణలో భాగమేనని అధికార వర్గాలు సైతం ఒప్పుకుంటున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖకు రూ. 10,300 కోట్లు రాబడి రాగా, 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఆ లక్ష్యాన్ని రూ. 12 వేల కోట్లకు పెంచారు. కానీ, ఎక్సైజ్ శాఖ చేస్తున్న కసరత్తులు చూస్తుంటే రూ. 15 వేల కోట్ల రికార్డు ఆదాయం సమకూరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అధికారులు చెపుతున్నారు. లెసైన్సుల ద్వారానే రూ. 2 వేల కోట్లు 2014-15 ఆబ్కారీ సంవత్సరం(జూలై1 నుంచి జూన్ 30)లో ఎక్సైజ్ శాఖకు లెసైన్సు ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయం రూ. 900 కోట్లు. మద్యం వ్యాపారులు నిర్ధేశిత లెసైన్సు ఫీజుకు ఏడు రెట్లు మించి అమ్మకాలు జరిపితే సర్కారుకు చెల్లించే 13.6 శాతం ప్రివిలేజ్ ట్యాక్స్ రూపంలో అదనంగా రూ. 400 కోట్లు సమకూరాయి. కానీ, ఈసారి లెసైన్సు ఫీజు రూపంలోనే రూ. 2 వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తదనుగుణంగానే జీహెచ్ఎంసీ, మరో మూడు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పాటు మండలాల్లో ఏర్పాటు చేసే మద్యం దుకాణాల లెసైన్సు ఫీజును నిర్ణయించినట్లు సమాచారం. మండలం లెసైన్సుదారుడు గ్రామాల్లో కూడా బి-లెసైన్సు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా భారీగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. ఇక ధరఖాస్తు ఫారాలతో పాటు కొత్తగా బార్లకు అనుమతులు మంజూరు చేయడం, బీరు ప్లాంట్లు(మైక్రో బ్రేవరీలు), జీహెచ్ఎంసీలో మెట్రో సిటీ వాతావరణం కనిపించేలా వైన్కేఫ్లు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే ఆదాయం అదనం. ఆదాయం కోల్పోవడం వట్టిమాటే! గుడుంబాను నిర్మూలించేందుకు ప్రవేశపెడుతున్న చీప్‌లిక్కర్ ద్వారా ప్రభుత్వం ఆదాయం కోల్పోతుందన్న మంత్రుల మాటలకు సర్కార్ చేస్తున్న కసరత్తుకు పొంతన లేదు. చౌక మ ద్యం ప్రవేశపెట్టడం ద్వారా ప్రస్తుతం మార్కెట్లో రూ. 60కి విక్రయిస్తున్న 180 ఎంఎల్ చీప్‌లిక్కర్ ధర సగానికి తగ్గుతుంది. అదే సమయంలో చీప్‌లిక్కర్‌పై 70 శాతం నుంచి 90 శాతం వరకు వసూలు చేస్తున్న వ్యాట్(విలువ ఆధారిత పన్ను) 49 శాతానికి తగ్గనుంది. దీనినే సుమారు వెయ్యి కోట్ల నష్టంగా ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేస్తున్నారు. కానీ, గుడుంబాను సేవించే కస్టమర్లంతా చీప్‌లిక్కర్ వైపునకు మళ్లడం ద్వారా చౌక మద్యం అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. గ్రామాల్లో గుట్టుగా సాగే గుడుంబా విక్రయాలు, బెల్టుషాపులు ఇక అధికారిక దుకాణాలుగా మారనున్నాయి. తద్వారా అన్ని రకాల మద్యం గ్రామ పొలిమేరల్లోకి రావడంతో ‘చీప్’తో పాటు అన్ని రకాల మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతా యి. గుడుంబా అమ్మకాలే అనధికారికంగా రూ. 800 కోట్ల మేర ఉంటాయని సర్కార్ అంచనా వేసింది. ఈ మొత్తం ఇప్పుడు అధికారికంగా సర్కార్ ఖాతాలో చేరనుంది. వ్యాట్ తగ్గింపు ద్వారా కోల్పోయిన ఆదాయానికి రెండింతలు గ్రామాల్లో జరిగే వ్యాపారం ద్వారా సమకూరుతుందని అధికారులు లెక్కలు వేశారు. కోల్‌బెల్ట్, పరిశ్రమల ప్రాంతాలపై దృష్టి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి తెలంగాణలోని కోల్‌బెల్ట్ ప్రాంతంలో మద్యం వ్యాపారం అధికం. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న గోదావరి పరీవాహక ప్రాంత సింగరేణి కోల్‌బెల్ట్‌లో ఇప్పటి వరకు ఉన్న మద్యం విధానాన్ని మార్చాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ఒక్కటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో ఇక్కడ లెసైన్సు ఫీజు, మద్యం అమ్మకాలు వేరుగా ఉంటాయి. మిగతా మందమర్రి, బెల్లంపెల్లి, కొత్తగూడెం మున్సిపాలిటీలు కాగా శ్రీరాంపూర్, యైటింక్లైన్ కాలనీ, భూపాల్పల్లి వంటివి గ్రామీణ ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేక పాలసీని తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేసింది. అలాగే పరిశ్రమలు అధికంగా ఉన్న మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తోంది. -
అమ్మకాలపైనే ఆశలు!
-
అమ్మకాలపైనే ఆశలు!
సాక్షి, హైదరాబాద్: నూతన మద్యం విధానంతో ప్రభుత్వానికి వచ్చే రాబడి తగ్గిపోతుందా, పెరుగుతుందా..? అన్నదానిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. కొత్త విధానం ప్రకారం చీపెస్ట్ లిక్కర్‌ను రూ.15కు 90 ఎంఎల్ సీసా చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరలో అమ్మాలంటే మద్యంపై ఇప్పుడున్న వ్యాట్‌ను 49 శాతానికి తగ్గించాలని భావిస్తున్నారు. దీనివల్ల సర్కారుకు వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోతుంది. కానీ అతి తక్కువ ధరకు మద్యం వస్తుందనే ఉద్దేశంతో వినియోగం భారీగా పెరుగుతుందని.. తద్వారా మొత్తంగా వచ్చే ఆదాయం దాదాపు ప్రస్తుత స్థాయిలోనే ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చీపెస్ట్ లిక్కర్ అందుబాటులోకి వస్తే ఎక్కువ ధర ఉన్న మద్యం విక్రయాలు పడిపోతాయని, దానివల్ల ఎక్సైజ్‌పై వచ్చే వ్యాట్ ఆదాయం తగ్గుతుందనే భావన కూడా వ్యక్తమవుతోంది. మొత్తంగా కొత్త మద్యం విధానమంతా ‘అమ్మకాల’ చుట్టే తిరుగుతోంది. ప్రస్తుతం 90 ఎంఎల్ చీప్ లిక్కర్ రూ.30 ధరకు విక్రయిస్తున్నారు. వివిధ రకాల మద్యంపై కనిష్టంగా 70 శాతం నుంచి గరిష్టంగా 190 శాతం వరకు వ్యాట్ ఉంది. దీన్ని తగ్గించటంతో వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుందని ఆర్థిక శాఖ లెక్కలేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌పై వ్యాట్ ద్వారా రూ.8,291 కోట్లు రాబట్టాలని ప్రభుత్వం అంచనాలు వేసుకుంది. కానీ కొత్తగా వచ్చే చీపెస్ట్ లిక్కర్ కారణంగా వ్యాట్ ఆదాయం తగ్గిపోతుంది. కానీ ప్రస్తుతం రూ.60 చెల్లించి మద్యం కొనుగోలు చేస్తున్నవారు తక్కువ ధరకు వస్తుందని రెండు చీపెస్ట్ బాటిళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుం దని... వినియోగం పెరిగితే వ్యాట్ శాతం తగ్గినా ప్రమాదమేమీ లేదనే వాదన ఉంది. నష్టమని చెబుతున్న ఎక్సైజ్ శాఖ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చీప్‌లిక్కర్ 48 బాటిళ్లు (180 ఎంఎల్) ఉన్న పెట్టెపై రూ.1,885 పన్ను రూపంలో రాష్ట్ర ఖజానాలో జమవుతుంది. వ్యాట్ తగ్గింపు కారణంగా ఇది రూ.734కు తగ్గిపోతుంది. అంటే ఒక్కో పెట్టెపై రూ.1,151 ఆదాయం తగ్గిపోతుందని ఎక్సైజ్ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. కానీ వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం అమ్మకాలతో ముడిపడి ఉన్నందున దీని ప్రభావం రూ.200 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్యలో ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వ్యాట్, అమ్మకపు పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంచనా వేసిన స్థాయిలో ఉండడం లేదు. ప్రతి నెలా రూ.3,000 కోట్లు రావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ గత నాలుగు నెలల ఆదాయ గణాంకాలను చూస్తే ఒక్క జూలైలో గరిష్టంగా రూ.2,500 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త విధానంతో వచ్చే లాభనష్టాలను ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదించనుంది. లెసైన్సు ఫీజుతో లోటు భర్తీ.. వ్యాట్ ద్వారా తగ్గే ఆదాయాన్ని లెసైన్స్ ఫీజు, స్టేట్ ఎక్సైజ్ ద్వారా రాబట్టుకునే ప్రత్యామ్నాయాలను సైతం ప్రభుత్వం ఇప్పటికే పరిశీలించింది. దీనికి అనుగుణంగా కొత్త విధానానికి రూపకల్పన చేసింది. ప్రస్తుతమున్న మద్యం దుకాణాల లెసైన్సుల ద్వారా ప్రభుత్వానికి రూ.900 కోట్ల ఆదాయం వచ్చింది. నిర్దేశించిన కోటాకు మించి మద్యం అమ్మకాలు చేసినందుకు దుకాణాదారులు చెల్లించిన ఫీజు మరో రూ.420 కోట్లు ఖజానాలో జమ అయింది. మొత్తంగా ఆదాయం రూ.1,320 కోట్లకు మించింది. దీంతో ఈసారి లెసైన్సులకు నిర్దేశించే రుసుము అంతకంటే ఎక్కువగా ఉండాలని ప్రభుత్వం లెక్కలేసుకుంది. దీనిద్వారానే దాదాపు రూ.2,000 కోట్లు సంపాదించాలని భావిస్తోంది. వ్యాట్‌కు గండి పడినా... ఇలా ఆదాయం రాబట్టుకోవాలనేది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా రూ.3,916 కోట్ల రాబడిని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో తొలి నాలుగు నెలల్లో రూ.1,150 కోట్లు ఆదాయం వచ్చింది. దీంతో కొత్త మద్యం విధానం లాభసాటిగా ఉంటుందా, నష్టం వస్తుందా.. అని తేల్చలేకపోతోంది. అమ్మకాలతో ముడిపడి ఉన్నందున విక్రయాలు పెరిగితే, వ్యాట్ తగ్గించినా ఇబ్బందేమీ లేదని.. విక్రయాలు ఇప్పుడున్న స్థాయిలో ఉంటే ఆదాయం తగ్గిపోతుందని భావిస్తోంది. ఈ ఏడాది మద్యం విక్రయాల ఆదాయం.. ఏప్రిల్ ⇒ రూ.185 కోట్లు మే ⇒ రూ.190 కోట్లు జూన్ ⇒ రూ.525 కోట్లు జూలై ⇒ రూ.250 కోట్లు -
చౌక మద్యం ఉండాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: గుడుంబాను అరికట్టేందుకు చౌకమద్యం ఉండాలన్న నిర్ణయానికే ప్రభుత్వం కట్టుబడింది. రూ.15 కే 90 మిల్లీలీటర్ల మద్యం అందించేందుకు సిద్ధమైంది. ఆదాయం లేకున్నా, ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా ఉండేందుకు పల్లెల్లో చౌకమద్యం ఉండాల్సిందేనని ఉన్నతస్థాయి వర్గాలు చెప్పాయి. అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే నూతన మద్యం పాలసీపై సీఎం ఆమోదముద్ర వేశారు. 26 లోగా ఉత్తర్వులు ఇచ్చేలా, ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరో 60 బార్లు కొత్త మద్యం విధానంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. వైన్‌షాపులు, బార్లకు చెరో గంట సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వైన్‌షాపుల వేళల్ని ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు తెరిచి ఉంచనున్నారు. రాష్ట్రంలో అదనంగా 60 బార్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వనున్నారు. వైన్‌షాపుల పెంపునకు ‘నో’ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 2,216 మద్యం దుకాణాలను కొనసాగించాలని సర్కారు భావిస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో 1,500 పైచిలుకు ఉన్న మద్యం దుకాణాలకు మండలం యూనిట్‌గా లాటరీ పద్ధతిలో లెసైన్స్‌లు ఇస్తారు. దీంతో వైన్‌షాపులను పెంచాల్సిన అవసరం లేదని భావిస్తోంది. మండలం లెసైన్స్ పొందిన వ్యక్తి దాని పరిధి గ్రామాల్లో కూడా ఇకపై దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆదాయంపైనా దృష్టి ఆబ్కారీ శాఖ నుంచి ప్రస్తుతం లభిస్తున్న రూ.10 వేల కోట్లను ఈసారి మరో రెండు వేల కోట్లు అదనంగా రాబట్టాలని సర్కారు చూస్తోంది. మద్యం దుకాణాలకు దరఖాస్తు ఫీజు, మండలానికి ఒకటే ఏర్పాటు కానున్న వైన్‌షాపు లెసైన్స్‌కు భారీగా వడ్డించాలని నిర్ణయించింది. దరఖాస్తు ఫీజు 20 శాతం, లెసైన్స్ ఫీజు 15 శాతం పెంచాలని భావిస్తోంది. మండలంలో వైన్‌షాపుకు రూ.కోటి వరకు నిర్ణయించే అవకాశం ఉంది. -
పల్లెల్లోకి మద్యం మాఫియా..!
సాక్షి, హైదరాబాద్: మండలం యూనిట్‌గా మద్యం మాఫియా పల్లెల్లోకి ప్రవేశించేందుకు కొత్త మద్యం విధానం దారులు తెరుస్తోంది. 1993 వరకు ఉమ్మడి ఏపీలో కొనసాగిన సారా కాంట్రాక్టర్ల వ్యవస్థ పేరు మార్చుకొని గ్రామాలకు చొరబడబోతుంది. గుక్కెడు నీరు కూడా దొరకని పల్లెల్లో సైతం రాత్రి 10 గంటల వరకు మద్యం అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందుతోంది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఆబ్కారీ విధానం ముసాయిదాను పరిశీలిస్తే గుడుంబా నిర్మూలన కన్నా పల్లెలను మద్యం కాంట్రాక్టర్లకు అప్పగించి ఆదాయం పొందడమే సర్కారు లక్ష్యంగా కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. బార్‌ను మరిపించేలా అన్ని బ్రాండ్లూ..! ఎక్సైజ్ అధికారులతో నూతన మద్యం విధానంపై సమావేశమైన సందర్భంగా సీఎం ‘లాటరీ పద్ధతిలో మండలం లెసైన్సు పొందిన వారికి గ్రామాలలో చీప్ లిక్కర్ అమ్ముకునేందుకు పర్మిట్లు ఇవ్వాలి’ నిర్ణయించారు. కానీ మండలం లెసైన్సు పొందిన వ్యక్తి గ్రామాల్లో చీప్ లిక్కర్‌తో పాటు అన్ని రకాల ఐఎంఎల్ బ్రాండ్లు, బీర్లు విక్రయించుకునే వెసులుబాటు బి-లెసైన్స్ ద్వారా లభిస్తుందని ఎక్సైజ్ అధికారి ఒకరు తెలిపారు. ‘మద్యం దుకాణం గ్రామంలో తెరిచినప్పుడు చీప్ లిక్కర్ మాత్రమే అమ్మడం సాధ్యం కాదు. లెసైన్సుదారుడికి కూడా రూ.15 చీప్‌లిక్కర్‌తో గిట్టుబాటు కాదు’ అని ఆయన వివరించారు. కోట్ల పెట్టుబడి ‘సిండికేట్ల’కే సాధ్యం ఇప్పటివరకు మండలంలో మద్యం దుకాణం పొందాలంటే రూ. 32 లక్షల నుంచి 34 లక్షల వరకు పెట్టుబడి పెడితే సరిపోయేది. కానీ, కొత్త విధానం ప్రకారం... మండల కేంద్రంతో పాటు, మండలంలోని గ్రామాల్లో ఉన్న దుకాణాలకు లెసైన్స్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉండడంతో ఏడాదికి రూ. కోటిన్నరకు పైగా వెచ్చించాలి. ఇక డిపోల నుంచి మద్యం కొనుగోళ్లకు రోజూ లక్షల్లో వెచ్చించాల్సి ఉంటుంది. ఇది సాధారణ వ్యాపారం చేసుకునే వ్యక్తులకు అసాధ్యమనే విషయం ప్రభుత్వానికీ తెలుసు. అయితే, గంపగుత్త ఆదాయంపైనే దృష్టి పెట్టడంతో సిండికేట్లకే అప్పగించబోతోంది. జిల్లా నుంచి మండల స్థాయికి డిపోలు.. ఉమ్మడి రాష్ట్రంలో 1993 వరకు సారా కాంట్రాక్టర్ల వ్యవస్థ ఉండేది. 1983 వరకు జిల్లాకు ఓ సారా కాంట్రాక్టరు ఉండేవారు. వేలం ద్వారా ఆ జిల్లాలో వ్యాపారం మొత్తం అతడి ద్వారానే నడిచేది. 1983లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాక దానిని తాలూకా స్థాయికి విభజించారు. 1986-87లో సారా కాంట్రాక్టులు మండల స్థాయికి చేరాయి. ఇది సారాను నిషేధించిన 1993 వరకు కొనసాగింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలని నిర్ణయించిన మండలం యూనిట్‌గా మద్యం లెసైన్సుల జారీ కూడా సారా కాంట్రాక్టు విధానాన్నే స్ఫురణకు తెస్తోంది. అబ్కారీ శాఖ తుది మెరుగులు మద్యం పాలసీ ముసాయిదాకు సీఎం ఆమోదం తెలపడంతో మండల, పట్టణ, నగర, జీహెచ్ఎంసీ స్థాయిలో వేర్వేరు మద్యం విధానాలు రూపొందించే పనిలో ఎక్సైజ్ శాఖ నిమగ్నమైంది. రెండో శనివారం సెలవు దినమైనా ప్రభుత్వ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి(ఎక్సైజ్) అజయ్ మిశ్రా, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అబ్కారీ భవన్లో జిల్లాల అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, టీఎస్‌బీసీఎల్ ముఖ్య అధికారులు హాజరైన ఈ సమావేశంలో గత అమ్మకాల ఆధారంగా మండలాల్లో లెసైన్సు ఫీజులు, మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వార్డుల వారీగా మద్యం విధానం విభజన, జీహెచ్ఎంసీ ప్రత్యేక పాలసీకి సంబంధించి వివరాలు సేకరించారు. వారం రోజుల్లో క్షేత్రస్థాయి విధానాన్ని రూపొందించి, ముఖ్యమంత్రి ఆమోదంతో ప్రకటించాలని నిర్ణయించారు. -
మద్యంపై మహిళాగ్రహం
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్‌చేస్తూ మహిళా సంఘాల రాష్ట్ర ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సబ్ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. కార్యాలయం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలను పోలీసులు ఈడ్చుకెళ్లి వ్యానులో ఎక్కించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కొంతమందిని అరెస్ట్‌చేసి సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. - సబ్-కలెక్టరేట్ ముట్టడికి మహిళల యత్నం - పోలీసులు - మహిళల మధ్య తోపులాట, ఉద్రిక్తత విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ సోమవారం మహిళలు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. మహిళా సంఘాల రాష్ట్ర ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు కొద్దిసేపు రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేశారు. మద్యం అమ్మకాలపై నిప్పులు చెరుగుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, మహిళలకు మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వారిని అడ్డుకుని.. అరెస్ట్ చేసి సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఐద్వా), ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ఆదాయం కోసం ప్రజల జీవితాలను పణంగా పెడుతోందన్నారు. దశలవారీగా బెల్టుషాపులు రద్దు చేస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన చంద్రబాబు ఇప్పుడు మోసం చేశారని చెప్పారు. సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పెనుమత్స దుర్గాభవానీ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదాయం కోసం పండ్ల మాదిరిగా మద్యాన్ని టెట్రా ప్యాకెట్లలో విక్రయించేందుకు సిద్ధమవుతోందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యం టెండర్లను నిలుపుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న మహిళా సంఘాల నాయకులు కె.శ్రీదేవి, పంచదార్ల దుర్గాంబ, కాజా సరోజ, ఓర్సు భారతి, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగాభవానీతో పాటు పెద్దసంఖ్యలో మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. -
రాష్ట్రంలో పారనున్న చీప్ లిక్కర్
వారంలోగా కర్ణాటక నుంచి రాష్ట్రానికి చవక మద్యం సాక్షి, హైదరాబాద్: నూతన మద్యం విధానం నేపథ్యంలో కొత్తగా రాష్ట్రంలో చీప్ లిక్కర్ పారనుంది. అయితే చీప్ లిక్కర్ కల్తీకి ఆస్కారం లేకుండా టెట్రా ప్యాకెట్లలో విక్రయించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు టెట్రా ప్యాకెట్లు తయారుచేసే యంత్ర పరికరం లేదు. రాష్ట్రంలోనే టెట్రా ప్యాకెట్లు తయారుచేయాలంటే కనీసం మూడు నెలలు పడుతుంది. ఈలోగా కర్ణాటకలో తయారుచేస్తున్న కంపెనీ.. టెట్రా ప్యాకెట్లలో చౌకమద్యం సరఫరాకు అంగీకరించిందని అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రప్రభుత్వం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తే సరిపోతుందన్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోగా టెట్రా ప్యాకెట్లలో చౌకమద్యం రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. ఒక్కో టెట్రా ప్యాకెట్ రూ.45 నుంచి రూ.50 వరకు ధర ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వమూ చౌకమద్యాన్ని అమల్లోకి తేనున్నందున ఆంధ్రప్రదేశ్‌లోనూ చౌకమద్యం తేవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పాయి. టెట్రా ప్యాకెట్లలో చౌకమద్యాన్ని అమల్లోకి తెస్తే కల్తీ మద్యం, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయాలను నిరోధించవచ్చనేది అధికారుల భావనగా ఉంది. ఇదిలాఉండగా ఒక్కో మద్యం దుకాణం తీసుకునే సరుకులో 25 శాతం మేరకు టెట్రా ప్యాకెట్లు ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. టెట్రా ప్యాకెట్లలో కల్తీకి అవకాశం లేనందున.. వాటిని తీసుకునేందుకు మద్యం దుకాణదారులు విముఖత వ్యక్తం చేస్తారనే భావనతోనే తప్పనిసరిగా 25 శాతం మేరకు తీసుకోవాలనే నిబంధన విధించినట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను ఏర్పాటుచేసి.. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా విక్రయాలు జరపనున్నందున ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బేవరెజెస్ కార్పొరేషన్‌ద్వారా 436 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్న విషయం తెలి సిందే. వీటిద్వారా వచ్చే ఆదాయంపై ఆదాయపు పన్ను భారం పడకుండా చర్యలకు ప్రభుత్వం నిర్ణయించింది. కాగా మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఆబ్కారీ కార్యాలయాలముందు దరఖాస్తుదారులు బారులు తీరారు. దరఖాస్తుల స్వీకరణ శనివారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అయితే భారీసంఖ్యలో దరఖాస్తుదారులు క్యూలో ఉండటంతో రాత్రి పొద్దుపోయే వరకు దరఖాస్తులు స్వీకరించారు. -
ఏపీలో ఏరులై పారనున్న మద్యం
-
కోరుకుంటే మద్యం
4,380 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల * ఏడు శ్లాబుల్లో లెసైన్సు రుసుం వసూలు సాక్షి, హైదరాబాద్: గ్రామాలు, హైవేలు, షాపింగ్‌మాల్స్, హైపర్ మార్కెట్లు... ఒకటేమిటి, రాష్ట్రంలో ఇక ఎక్కడ కోరుకుంటే అక్కడ మద్యం దొరుకుతుంది. తాము అధికారంలోకి వస్తే బెల్టు షాపులను రద్దుచేసి, మద్యం ప్రవాహాన్ని కట్టడి చేస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని విస్మరించి టీడీపీ ప్రభుత్వం పల్లెపల్లెలోనూ మద్యం పారించేలా, ఇంటింటికీ మద్యం చేరేలా నూతన మద్యం విధానం ఖరారు చేసింది. రెండేళ్ల లెసైన్సు కాలపరిమితి (1 జూలై 2015 నుంచి 30 జూన్ 2017) రాష్ట్రంలోని 4,380 మద్యం షాపులకు దరఖాస్తులు కోరుతూ ఎక్సైజ్ శాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పది శాతం తగ్గకుండా మండలానికో ప్రభుత్వ దుకాణం నిర్వహించేందుకు నిర్ణయించింది. దీంతోపాటు షాపింగ్ మాల్స్, హైబ్రీడ్ హైపర్ మార్కెట్లలోనూ మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వనుంది. గతంలో ఐదు శ్లాబులుగా ఉండే విధానాన్ని ఈ దఫా ఏడు శ్లాబులుగా పెంచారు. జనాభా ప్రాతిపదికను కుదించి లెసైన్సు రుసుం పెంచారు. ఐదు వేల జనాభా లోపు ఉన్న (మైనర్, మేజరు పంచాయతీల్లో) ప్రాంతాలకు ఓ శ్లాబు కేటాయించి రూ.30 లక్షల లెసైన్సు రుసుం విధించారు. ఒక్క శ్లాబులో (50,001-3 లక్షల జనాభా) లెసైన్సు ఫీజు రూ.3 లక్షలు తగ్గించగా, 3,00,001-5 లక్షల జనాభా ఉన్న శ్లాబులో లెసైన్సు ఫీజు యథాతథంగా ఉంచారు. కార్పొరేషన్ పరిధిలో మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసేందుకు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాల్ని లాట్ల డ్రా విధానంలో కేటాయించనున్నారు. అయితే మద్యం నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ ప్రతి జిల్లాలో డీఅడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. హైవేల పక్కనా పారనున్న మద్యం... హైవేల పక్కన ఉన్న మద్యం షాపుల్ని తొలగించాలని రవాణా శాఖ సాగించిన లేఖలను ఎక్సైజ్ శాఖ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. 50 మీటర్ల దూరంలో షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఈ మేరకు నోటిఫై చేశారు. రహదారులపై మద్యం తాగి ప్రమాదాలు జరుగుతున్న శాతం నాలుగుశాతం మాత్రమేనని ప్రభుత్వం నిర్ధారించిందని ఎక్సైజ్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మూడు లెసైన్సు షాపుల మధ్య ఓ ప్రభుత్వ షాపు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నాటు సారా, కల్తీ మద్యం, లూజు విక్రయాలను నిరోధించేందుకు టెట్రా ప్యాక్ ద్వారా మద్యం విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దరఖాస్తు ఫీజులు.. నిబంధనలు... ♦ రూరల్ ఏరియా (బెల్ట్ ఏరియాతో సహా) రూ.30 వేలు చెల్లించాలి. ♦ మున్సిపాలిటీ/టౌన్లో రూ.40 వేలు, మున్సిపల్ కార్పొరేషన్లో రూ.50వేలు దరఖాస్తు రుసుం చెల్లించాలి. ♦ ప్రతి మద్యం సీసాపై బార్కోడ్ విధానం/హాలోగ్రాఫిక్ అడెసివ్ లేబుల్ విధానం అమల్లోకి తెచ్చే విధంగా షాపులో మెషినరీ ఏర్పాటు చేయాలి. ట్రాక్ అండ్ ట్రేస్ విధానం ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తున్నందున మద్యం షాపు విధిగా కంప్యూటర్, టూ డీ స్కానర్ తదితర సాంకేతిక పరికరాలు సమకూర్చుకోవాలి. ♦ తిరుపతి కార్పొరేషన్ పరిధిలో రైల్వేస్టేషన్ నుంచి అలిపిరివరకు (వయా ఆర్టీసీ బస్టాండ్, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్, విష్ణునివాసం, శ్రీనివాసం, ఎస్వీఆర్ఆర్ ఆస్పత్రి, స్విమ్స్) ఏ ఒక్క మద్యం షాపు అనుమతించరు. సిండికేట్లు ఏర్పడకుండా చర్యలు: కొల్లు నూతన మద్యం పాలసీ ప్రకారం సిండికేట్లు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. ఆయన సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మద్యం షాపులకు దరఖాస్తు చేసేవారు ఖచ్చితంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, రెండేళ్ల వ్యాట్ రిటర్న్స్ దరఖాస్తుతోపాటు జత చేయాలన్నారు. నేటి నుంచి (23వ తేదీ) ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తుల స్వీకరణకు గడువిస్తున్నట్లు తెలిపారు. 28న స్క్రూటినీ, 29న జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి 30న ప్రొవిజనల్ లెసైన్సులు ఇవ్వనున్నట్లు వివరించారు. బార్లకు నూతన విధానం రాష్ట్రంలో ఇప్పుడున్న బార్ల లెసైన్సులు రద్దుచేసి కొత్త విధానం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. బార్ల లెసైన్సుల రెన్యువల్ వచ్చే నెల 1వ తేదీ నుంచి చేయాల్సి ఉంది. ఆలోపు కొత్త విధానానికి సమయం సరిపోదని అధికారులు చెప్పారు. దీంతో గత ప్రభుత్వం లెసైన్సులు మంజూరు చేసినందున వాటిని రెన్యువల్ చేయకుండా మూడు నెలల పాటు పొడిగించి, ఆలోగా కొత్తవారికి బార్ల లెసైన్సుల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన నూతన మద్యం విధానంపై జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది శ్లాబులు.. జనాభా ప్రాతిపదిక లెసైన్సు ఫీజు 5 వేల లోపు రూ.30 లక్షలు 5,001-10 వేల లోపు రూ.34 లక్షలు 10,001-25 వేల లోపు రూ.37 లక్షలు 25,001-50 వేల లోపు రూ.40 లక్షలు 50,001-3 లక్షల లోపు రూ.45 లక్షలు 3,00,001-5 లక్షల లోపు రూ.50 లక్షలు 5 లక్షలు ఆపై రూ.65 లక్షలు -
రాయల ఆంధ్రా బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటు
* 22న మద్యం దుకాణాల నోటిఫై * దరఖాస్తు ఫీజు పెంపు సాక్షి, హైదరాబాద్: నూతన మద్యం విధానం అమలు కోసం రాయల ఆంధ్రా బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటవనుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ చే సే వ్యాపారానికి ఆదాయపు పన్ను చెల్లించాలంటూ ఐటీ శాఖ నోటీసు జారీచేసిన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటుచేసే కార్పొరేషన్‌కు ఇది వర్తించకుండా చూడనున్నారు. ప్రస్తుతమున్నవాటిల్లో పది శాతం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తుండగా మిగతా 90 శాతాన్ని ప్రైవేట్ వారికి అప్పగిస్తారు. వాటిని సోమవారం నోటిఫై చేయనున్నారు. అప్పటి నుంచి దరఖాస్తుల దాఖలుకు వారం గడువిస్తారు. లాటరీద్వారా మద్యం దుకాణాల్ని కేటాయిస్తారు. ఈసారి దరఖాస్తు ఫీజును పెంచనున్నారు. ఆయా దుకాణాల టర్నోవర్‌నుబట్టి ఫీజును ఒక శాతం లేదా ఒకటిన్నర శాతం చేయనున్నారు. ప్రస్తుత దరఖాస్తు ఫీజు వల్ల ప్రభుత్వానికి రూ. 100 కోట్ల రాబడి వస్తుండగా... తాజా పెంపు వల్ల ఇది రూ. 500 కోట్లకు చేరుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నిర్వహించే దుకాణాల్లో ఒక్కో ఎక్సైజ్ కానిస్టేబుల్ చొప్పున నియమిస్తారు. మిగతా ఇద్దరు ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ విధానంలో నియమిస్తారు. -
గుడుంబాకు చెక్!
* కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నివేదిక * వారంలోగా నూతన విధానం ప్రకటన సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నూతన మద్యం విధానంపై ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. మద్యం దుకాణాలను క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల ప్రాణాలకు హానిగా మారిన నాటుసారా(గుడుంబా)ను నిరోధించేందుకు తక్కువ ధర మద్యాన్ని (అఫర్డబుల్ లిక్కర్) ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు తాజాగా ఎక్సైజ్ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్ సీఎంన కలసి నివేదిక అందజేశారు. వివిధ రాష్ట్రాల్లో మద్యం విధానంపై ఎక్సైజ్ అధికారులు అధ్యయనం చేసి ఇచ్చిన నివేదికల ఆధారంగా కొత్త మద్యం విధానం ప్రతిపాదనలు తయారు చేశారు. దీనిపై సమగ్ర రిపోర్టును సీఎంకు ఆయన అందజేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఆమోదయోగ్యమైన మద్యం విధానాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారు. దుకాణాల పెంపు యోచనలో ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో ప్రస్తుతం 2,216 మద్యం దుకాణాలు (ఎ4 షాపులు) ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్, కార్పొరేషన్, మునిసిపాలిటీ, మండల కేంద్రం, గ్రామాల సమాహారం ప్రాతిపదికన ఆరు స్లాబుల్లో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో వ్యాపారులకు లెసైన్స్‌లు అందిస్తున్నారు. అయితే ఒక ైవె న్షాపు పరిధిలో ఉన్న గ్రామాలు, బస్తీల్లో బెల్టుషాపులు విచ్చలవిడిగా వెలిసి, ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఈ నేపథ్యంలో 10 వేల జనాభాకు ఒక వైన్‌షాపు ప్రాతిపదికన ఈసారి మద్యం దుకాణాలను పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.ఈ లెక్కన రాష్ట్రంలో దాదాపు 3,500 మద్యం దుకాణాలు తెరవాలన్నది ఎక్సైజ్ శాఖ ప్రణాళిక. లెసైన్స్ ఫీజు అధికంగా ఉన్నందున గ్రేటర్ పరిధిలోని 103 షాపులను వ్యాపారులెవరూ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో దుకాణాలను పెంచి లెసైన్స్ ఫీజును రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రత్యామ్నాయంగా చీపెస్ట్ లిక్కర్ ప్రస్తుతం వైన్‌షాపుల్లో కారు చౌక మద్యం పేరుతో రిటైలర్‌కు విక్రయిస్తున్న 180 మి.లీ. మద్యం కనీస ధర రూ.60, 90 మి.లీ. ధర రూ. 35గా ఉంది. ఇంత మొత్తాన్ని వెచ్చించలేని వారు రూ.20 లోపే లభించే గుడుంబా పాకెట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో పర్యటించిన కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ అక్కడ లభ్యమవుతున్న దేశీ దారూ మద్యంపై అద్యయనం చేసి, 20 రూపాయలకే 90 మి.లీ. చీపెస్ట్ లిక్కర్‌ను అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు వారం రోజుల్లో కొత్త మద్యం విధానాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. -
174 దుకాణాలు.. 850 దరఖాస్తులు..
ఆదిలాబాద్ క్రైం : కొత్త రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ ద్వారా మద్యం షాపులు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. ఈ ప్రక్రియ శనివారంతో ముగిసింది. జిల్లాలో 174 మ ద్యం దుకాణాలకు 850 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులకు లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఎలాగైనా మద్యం దుకణాలు దక్కించుకునేందుకు మద్యం వ్యాపారులు ఈసారి భారీగా పోటీ పడుతున్నారు. ఈనెల 23న జిల్లా కేంద్రంలోని పి.జనార్దన్‌రెడ్డి గార్డెన్లో కలెక్టర్ సమక్షంలో మద్యం దుకాణాలు లక్కీ డ్రా ద్వారా కేటాయించనుండడంతో వ్యాపారులు తమ అదృష్టాన్నే నమ్ముకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు దక్కించుకోవాలనే కుతుహాలంతో ఉన్నారు. మొదటి నుంచి మద్యం షాపులు నిర్వహిస్తున్నవారు ఈసారి కూడా వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే.. కొంత మంది సిండికేట్ ద్వారా మద్యం దుకాణాలు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ప్రస్తుతం దరఖాస్తులు గడు వు ముగిసినా షాపు కేటాయించిన తర్వాతైనా సిండికేట్ అయ్యేందుకు వెనకాడడం లేదు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది. చివరి రోజు బారులు.. ఈనెల 16 నుంచి మందకొడిగా సాగిన టెండర్ దరఖాస్తులు చివరి రోజు శనివారం ఊపందుకున్నాయి. జిల్లాలోని మంచిర్యాల యూనిట్ పరిధిలో 104 దుకాణాలు, ఆదిలాబాద్ యూనిట్ పరిధిలో 70 దుకాణాలు ఉన్నాయి. మొత్తం 174 దుకాణాలకు 850 దరఖాస్తులు వచ్చాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు దరఖాస్తుదారులు బారులు తీరారు. కలెక్టర్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్, మంచిర్యాల యూనిట్ పరిధిలోని స్టేషన్ల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తుదారులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ సిబ్బంది రాత్రి వరకూ వాటిని లెక్కపెట్టారు.