వికారాబాద్: బషీరాబాద్ సమీపంలో కాగ్నా నది దాటుతూ ప్రమాదవశాత్తూ తల్లీకూతురు మృతిచెందారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం గొట్టికకుర్దుకు చెందిన తలారి శివమ్మ (65), ఆమె కుమార్తె కాశమ్మ (45) రెండు రోజుల కిందట బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి పయనమైన వారిద్దరూ కాగ్నా నది దాటుతూ ఈత రాక నీటిలో మునిగిపోయారు. స్థానికులు వారి మృతదేహాలను గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.