కుక్క.. గొర్రెపై దాడి చేసిందని..! | Attack On Mother And Daughter In Chittoor District | Sakshi
Sakshi News home page

కుక్క.. గొర్రెపై దాడి చేసిందని..!

Published Tue, Mar 9 2021 6:49 AM | Last Updated on Tue, Mar 9 2021 8:29 AM

Attack On Mother And Daughter In Chittoor District - Sakshi

బొబ్బలు రేగిన చేతిని చూపుతున్న ఈశ్వరమ్మ, పక్కనే ఆమె తల్లి 

మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా)‌: కుక్క గొర్రెపై దాడిచేసిందని ఆగ్రహించి తల్లి, కుమార్తెపై  దాడికి పాల్పడి చిత్రహింసకు గురి చేసిన సంఘటన కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. బాధితులు, ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసుల కథనం.. తెట్టుకు చెందిన ఉత్తన్న, యశోదమ్మగొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి ఇంటి ఆవరణలో ఉన్న కుక్క పొరుగింటి ఉప్ప ర ఓబులేష్, మునెమ్మల గొర్రెపై దాడి చేసిందని ఆదివారం అర్ధరాత్రి ఉత్తన్న, యశోదమ్మపై  దాడిచేశారు. వారి కుమార్తె ఈశ్వరమ్మ(26)ను చితకబాదారు.  తిరిగి ఉదయం మళ్లీ గొడవకు దిగి గంగమ్మ ఆలయం వద్ద బలవంతంగా వారి చేతిలో కర్పూరం వెలిగించారు. చేతులు కాలి అరుస్తున్నా వినకుండా తల్లి, కుమార్తె మీద తీటగింజరాకు పొడిచెల్లి, చేతిలో వేపాకు కొమ్మలు పెట్టి, నిజం చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేశారు.  బాధితులు ముదివేడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చదవండి:
వీడిన మిస్టరీ: భార్యను ముక్కలుగా నరికి.. 
బాలకృష్ణ గోబ్యాక్‌.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement