తల్లీకూతుళ్లపై అత్యాచారం
గుంటూరు: బట్టలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తున్న తల్లికూతురిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు వెల్లడిస్తే చంపేస్తామంటూ బెదిరించి... అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. అయితే సదరు వ్యక్తుల బెదిరింపులతో భయపడిన వారు మిన్నకుండిపోయారు. అయితే బంధువుల చోరవతో బాధితులు పొన్నూరు పోలీసులను ఆశ్రయించారు.
నిందితులు అదే గ్రామానికి చెందిన రమేష్, వినోద్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి పొన్నూరులో బట్టలు కొనుగోలు చేసి కట్టెంపూడి తిరిగి వస్తున్న క్రమంలో అత్యాచారానికి గురైయ్యారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.