మాదాపూర్‌లో తల్లీకూతుళ్లు అదృశ్యం
Published Fri, Jul 21 2017 1:10 PM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM
హైదరాబాద్: మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో తల్లీకూతుళ్లు అదృశ్యమయ్యారు. మందాడ గంగ (27) ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవిస్తోంది. మాదాపూర్ సిద్దిఖ్‌నగర్‌లో ప్లాట్ నెం.195 లో నివాసం ఉంటోంది. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెద్దబొండపల్లికి ఈ నెల 11వ తేదీన తన కుమార్తె శిరీష(6)తో కలిసి వెళ్లింది. కానీ ఇప్పటివరకు తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆమె భర్త కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు.
Advertisement
Advertisement