
సత్యవతి, వర్ష
కొండాపురం(వైఎస్సార్ జిల్లా): తల్లీ కూతురు అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని ఏటూరు గ్రామంలో చోటుచేసుకుంది. తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ జె.రవికుమార్ కథనం మేరకు ఏటూరులో వలంటీర్‌గా పనిచేస్తున్న సత్యవతి(26) ఆమె కుతురు వర్ష (6) ఈ నెల 6వతేదీన ప్రొద్దుటూరులోని డెంటల్ ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పి వెళ్లారు.
చదవండి: కిరాతక దుశ్చర్య.. కూరతో భోజనం పెట్టలేదని..
ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. దీంతో సత్యవతి సోదరుడు ఏసుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు. వీరిని ఎవరైనా గుర్తిస్తే ఎస్‌ఐ 91211 00615, సీఐ 91211 00611కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.