హైదరాబాద్: దాదాపు 30 ఏళ్ల క్రితం విడిపోయిన తల్లికూతుళ్లను నగరపోలీసులు గురువారం ఒక్కటి చేశారు. సౌదీ అరేబియా నుంచి తల్లి నజియా కోసం నగరానికి కూతురు ఫాతిమా నగరానికి వచ్చింది. తల్లి ఆచూకీకోసం నగర పోలీసులను ఆశ్రయించింది. ఆరు నెలల పాట ఫాతిమా తల్లి కోసం వెతికిన పోలీసులు ఎట్టకేలకు ఇద్దరిని కలిపారు. ప్రస్తుతం తల్లీకూతుళ్లిద్దరూ సౌత్ జోన్ డిసీపీ కార్యాలయంలో ఉన్నారు.