
నిందితులపై కేసు నమోదుకు కేసీఆర్ ఆదేశం
మెదక్ : మెదక్ జిల్లా రామక్కపేట అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. నిందితులపై వెంటనే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆయన శనివారం ఆదేశించారు. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం కింద రూ.25వేలు అందించాలని కేసీఆర్ ఎమ్మెల్యే రామలింగారెడ్డికి సూచించారు. ఈ ఘటనపై కేసీఆర్...రామలింగారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. రామక్కపేటలో నలుగురు దుండగులు తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.